కధ కదిలే మనసును నిలుపుతుంది

కధ కదిలే మనసును నిలుపుతుంది, కధ నిలిచిన మనసులొ మరొక ఆలోచనను సృష్టిస్తుంది. అల్లరి చేసే మనసును ఆసక్తికరమైన కధ కట్టిపడేస్తుంది. కధ చెప్పేవారిని బట్టి కధ మనసును ఆకట్టుకుంటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

కధ కంచికి మనం ఇంటికి అని కధ ముగించాక చెబుతారు. అంటే కధ వినేసమయంలో మనం మన పరిస్థితిని కూడా మరిచి కధలో లీనం అవుతాము. కధలు వినడం చిన్ననాటి నుండే ఆరంభం అవుతుంది. కధలో కనబడని పాత్రలను మనసు చూడగలడం కధలో ఉండే గొప్ప విషయం.

అయితే ఊహాలలోనే ఉంటే మాత్రం జీవితం చరిత్రలేని ఓ కధగానే ఉండి పోతుంది. కధలో కదిలే పాత్రలతో మమేకం అయిన మనసు, ఏదో ఒక పాత్రపై మోహం పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి అవకాశం దీర్ఘకాలికంగా సాగే కధల వలన కలుగుతుంది. ఒక సీరియల్ లాగా సాగే కధలో ఏదో ఒక పాత్రపై మనసు అభిమానం పెంచుకుంటుంది.

యుక్తవయస్సు వారు అయితే, తమకు జోడిగా అటువంటి పాత్రను ఊహించే అవకాశం కూడా ఉంటుంది. అయితే అటువంటి కధానాయకుడు, కధానాయకి కోసం కలలు కనకూడదు. అలాంటి వారి తారసపడితే సంతోషించాలి. మనకోసమే వస్తే ఆనందించాలి. కానీ తాపత్రయపడితే, భంగపడ్డ మనసు దు:ఖపడుతుంది.

కధా కాలక్షేపం చిన్ననాటి నుండి అలవాటు అవుతంది. అయితే ఒక వయస్సుకు వచ్చాక మాత్రం కధలపై ఆసక్తి ఉంటుంది. అయితే అది ఆరోగ్యకరమైన ఆసక్తి కావాలి. కధల నుండి నీతి సారం గ్రహించేతీరులో ఆలోచన కొనసాగాలి. అప్పుడు కధ వలన మనకు మేలు జరుగుతుంది. కధ అయినా సీరియల్ అయినా సినిమా అయినా మనకు వినోదం ఇస్తూ మనకు మేలు చేసేదిగా ఉండాలి. కానీ మనల్ని వాటికి వ్యసనపరులుగా మార్చేవిధంగా ఉండరాదు.

నీతి కధల వలన ఎప్పుడూ మేలు జరుగుతుంది. ఎందుకంటే వాటిలో అనవసరమైన కల్పన ఉండకపోవచ్చును. ముఖ్యంగా భారతంలోని నీతి కధలు అయితే మనకు అసాంతం నీతినే బోధిస్తాయి. నీతి కధలు ఏం చేయకూడదో? తెలియజేస్తునే ఉంటాయి.

ఫాంటసీ కధలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఏదో ఒక పాత్రను ఆధారంగా కధ సాగుతుంది. వాస్తవం నుండి పూర్తి భిన్నంగా ఫాంటసీ కధలు ఉంటాయి. ఈ కధలలో కధానాయుకుడు, కధానాయకి ఊహించిన విధంగా సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరోచిత పోరాటాలు చేయడం, ఆసాధ్యమైన విషయాలను సాధించడం వంటికి ఎక్కువగా కల్పన చేయబడి ఉంటాయి. ఫాంటసీ కేవలం వినోదం కోసమే ఉపయోగపడతాయి.

సామాజిక స్మృతిని తెలియజేస్తూ, సమాజంలోని అసమానతలను అంతర్లీనంగా తెలియజేసే కల్పిత కధలు, భిన్నమైన వ్యక్తిత్వములను పరిచయం చేస్తాయి. ఇవి ఎక్కువగా దీర్ఘకాలికంగానే సాగుతాయి.

కధలు మనకు ఊహాత్మక శక్తిని పెంచుతాయి. అయితే అవసరంమేరకు కధల నుండి నీతిని గ్రహిస్తే, కధల వలన బహు మేలు మనకు జరుగుతుంది. కధ కదిలే మనసును నిలుపుతుంది . కదలని మనసును కదిలిస్తుంది, కొత్త ఆలోచనల వైపుకు… కధ మనసుకు ఆకట్టుకుంటుంది. ఊహాశక్తిని పెంచుతుంది….