కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020

కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది…

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి.

పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది…

ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ ఈ2020 సంవత్సరం మాత్రం అందరికీ కష్టాలనే తీసుకువచ్చింది..

రోటీన్ కు భిన్నమైన పరిస్థితిని ప్రకృతి తీసుకువచ్చింది. 2020సం.లో అరుదైన స్థితిని ప్రపంచంలోని ప్రజలంతా ఎదుర్కొన్నారు. 2020ఆరంభమే ఆందోళనలనకు తావిస్తు ఇయర్ స్టార్ట్ అయ్యింది.

చైనాలో పుట్టిన వైరస్ ఎక్కడ ఎవరి ద్వారా ఏ ప్రాంతానికి, ఎవరెవరికి సోకి ప్రాకుతుందేమోననే ఆలోచన మాత్రం అందరిలోనూ వచ్చింది.

పదవతరగతి పాస్ కావాలనే తపనతో విద్యార్ధి సంవత్సరం ప్రారంభిస్తే, అది ఎలా గడిచిందో పదవ తరగతి పరీక్షా ఫలితాలొచ్చాకే ఆలోచిస్తాడు. అలా అందరికీ కరోనా రాకుండా, కరోనా సోకకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా ఎలా గడుస్తుంది? ఇది ఆలోచన కావచ్చును. భయం కావచ్చును. ఆందోళన కావచ్చును..

సంవత్సరం ఆరంభంలో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగానే ఇయర్ మద్యలో కరోనా వ్యాప్తి చెందింది. కొన్ని చోట్ల ఆందోళనకరంగానూ కొన్ని చోట్ల భయావాహ పరిస్థితులలోనూ కాలం సాగింది. అయితే కొన్ని రోజుల పాటు ప్రజలనందరిని ఇంటికే పరిమతం చేసిందీ…కరోనా.

బిజికి భిన్నంగా కొద్దిరోజులు

మనిషి ఎప్పుడూ బిజి…బిజిగా ఉండే వ్యక్తులు ఖాళీగా ఇంటికే పరిమితం అయ్యారు. సేవలోనో, వ్యాపారంలోనో, సంస్థలోనో…. ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ లక్ష్యంవైపు బిజిగా సాగే కాలం కరోనా కారణంగా బిజికి భిన్నంగా కొద్దిరోజులు బ్రతకాల్సిన స్థితి ఈ 2020సంవత్సరం తీసుకువచ్చింది…

ఆర్ధికపరంగా తప్పించితే మరొక కోణంలో కూడా కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ మరొక మేలును తీసుకువచ్చింది. అదే ప్రకృతిలో కాలుష్యం తగ్గడం… అంతా ఇంటికే పరిమితం కావడంతో వాహన వినియోగం తగ్గింది… వెహికల్స్ వాడకపోవడం వలన వాయుకాలుష్యం తగ్గింది. ఎక్కడా ట్రాఫిక్ లేకపోవడంతో ప్రకృతి సమతుల్యత పెరిగిందీ2020 సంవత్సరంలోనే….

ఇలా మనకీ2020 సంవత్సరంలో ఎక్కువగా ఆర్ధిక నష్టం జరిగింది. ప్రకృతి పరంగా కాలుష్య నివారణ జరిగింది. బిజి లైఫ్ నుండి కొంతకాలం తీరికగా బంధుమిత్రులతో మాట్లాడే అవకాశం అందరికీ వచ్చింది. జాగ్రత్త లేనివారికి 2020 జాగ్రత్తపై పరాకు చెప్పింది.

కరోనా ఆలోచనతోనే కొత్త సంవత్సరం ప్రారంభం…. కొత్త కరోనా ఆలోచనతో ఈ సంవత్సరం ముగింపు అయితే టీకా సిద్దమనే సంతోషకరమైన ఆలోచన మనకు బలం…

రివ్యూ2020 నుండి గుడ్ విజన్ తో 2021 కొత్త సంవత్సరంలోకి వెళ్లడమే మనకు మనోబలం. అనేక మార్పులకు 2020నాంది అయ్యింది. మార్పులు మొదలైనాయి… అవకాశాలు కొందరికి పోవచ్చును. కొందరికి రావచ్చును.

మనకు ఉన్న స్కిల్స్ ఉపయోగించి మంచి దృష్టికోణంతో ఆలోచన చేయగలిగితే 2021 సంవత్సరం అద్భుతాలకు నాంది కాగలదు…. పాఠం నేర్పిన 2020కు గుడ్ బై చెబుతూ…. 2021 వెల్కమ్ చెబుదాం….

మనకు కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో ప్రారంభం కావడానికి డిసెంబర్ 31 సెలబ్రేషన్ వస్తుంది… అన్ని మరిచి మిత్రులతో గడిపే కాలం మనకు మరింత బలాన్ని అందిస్తుంది.

ఆత్మీయుల మద్య ఆనందంగా గడిపే కాలంగా, డిసెంబర్ 31నైట్ సంతోషంతో 2020సంవత్సరానికి గుడ్ బై చెబుతూ… 2021 కొత్త సంవత్సరానికి… స్వాగతం పలుకుదాం…

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

తెలుగురీడ్స్.కామ్ హోమ్