పుకారు షికారు చేస్తే మనసు బేజారు

పుకారు షికారు చేస్తే మనసు బేజారు అవుతుంది. ఎందుకంటే పుకారు ఈవిధంగా… ‘గొప్పది కోల్పోయినట్టుగానో లేక ఏదో అయిపోతుందనో’ ఆందోళననే మిగుల్చును. కాబట్టి పుకారు షికారు చేస్తే మనసులో అందోళన వచ్చే అవకాశం ఎక్కువ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

లోకంలో వాస్తవం ఒక్కసారిగా వస్తే, ఆపై పుకారు మాటలు ఉంటాయి. విపత్తు వాస్తవం అయితే, ఒక్కసారిగా ఊరటనిచ్చేవిగానూ లేక ఒక్కసారిగా ఆందోళన కలిగించేవిగానూ పుకారు మాటలు ఉంటాయి. పుకారు వద్దు వాస్తవం ముద్దు..

వద్దు పుకార్లను పట్టించుకోవదు.. వాస్తవంపై వెటకారం వస్తే సహించవద్దు. గుండె నిబ్బరం కలవారు ఆందోళన కలిగించే విషయం తట్టుకోగలరు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆందోళకరమైన మాటలు ఇబ్బందికరమే…

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మనసునైనా బాధించకూడదనేది పండితుల మాట. అలాంటప్పుడు అనారోగ్యంతోనో ఆందోళతోనో ఉండేవారికి పుకారు మాటలు ఎందుకు చేరాలి? అసలు పుకారు మాటలు ఎందుకు పుట్టాలి?

ఈ ప్రశ్న పుకారు మాటలు పుట్టించేవారు పట్టించుకోకపోవచ్చును. కానీ పుకారు మాటలను పంచుకునేవారు ఆలోచన చేయాలి. పుకారు వద్దు వాస్తవం ముద్దు..

ఏదైనా పుకారు మాట అప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా ఉండవచ్చును. లేకపోతే అప్పటికప్పుడు భయపెట్టేదిగా ఉండవచ్చును. ఈ రెండు పనులు విజ్ఙులు, నాయకులు చేయరు.

సాధారణంగా ఆకట్టుకునే దానిపై ఆంక్షలు పెడతారు. ఆందోళన ఎక్కువగా ఉంటే, దాని ఫలిత ప్రభావం గురించి సవివరంగా అవగాహన కలిగించేవిధంగా చెబుతారు. కానీ ఒక్కసారిగా ఆందోళన పెరిగేలాగా విజ్ఙులు కానీ, నాయకులు కానీ అధికారులు కానీ ప్రచారం చేయరు.

పుకారు షికారు చేస్తే అవి మనం షేర్ చేయడం కూడా కారణం కాగలదు

ఆసక్తికరమైన విషయాలను తనవారికి తెలియజేయాలనే కాంక్షకొద్ది, కొంతమంది సోషల్ మీడియాలో వివిధ పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. అయితే అవి వినోదాత్మకమైనవి అయితే ఫరవాలేదు.. కానీ విపత్తులు ఉన్నప్పుడు, ప్రజలు ఆందోళనలోనూ, అయోమయ్యంలోనూ ఉన్నప్పుడు మాత్రం ఈవిధమైన సోషల్ షేరింగ్ సరైన విధానం కాదు.

మనం మనకు తెలియకుండానే షేర్ చేసే పోస్టులలో పుకారు ఉండవచ్చును. వాస్తవం కూడా ఉండవచ్చును. పుకారు అయితే అది మనద్వారా కూడా జరిగే పొరపాటు అవుతంది. ఒక్కోసారి పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సామాజిక సమస్యలు కఠినంగా మారినప్పుడు మాత్రం సోషల్ షేరింగ్ చేసేటప్పుడు ఆయా పోస్టులను సరిచూసుకోవాలి.

ముఖ్యంగా పోస్టులు మీకు ఫేస్ బుక్ లో కనబడితే, వాటిని స్నేహితులు లేదా మీ స్నేహితుల స్నేహితులు లేదా మీ స్నేహితుల స్నేహితుల స్నేహితులు కారణం కావచ్చును. కాబట్టి మీకు కనిపించే పోస్టును షేర్ చేసినవారి ప్రొఫైల్ మీకు కనబడితే వెంటనే ప్రొఫైల్ చూడండి. ఆ ప్రొఫైలో టైంలైన్లో అప్పటికే షేర్ చేయబడిన పోస్టులు గతంలో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయో లేదో సరిచూడండి. అప్పుడు మీకు అది పుకారా లేక వాస్తవమా అనేది తేలిపోతుంది.

ఒకవేళ పోస్ట్ షేర్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ మీకు కానరాకపోతే మీరు ఆపోస్టు తాలుకూ న్యూస్ ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్లలో వెతకండి. లేకపోతే మీ ఆన్ లైన్ స్నేహితులతో చాట్ చేసి చర్చించండి. అంతేకానీ పుకారు వాస్తవం అనుకుని షేర్ చేయకండి. సినిమా కధలను ఒక మనిషి సృష్టిస్తాడు. సినిమాలో కొన్ని విషయాలు వాస్తవ దూరంగానే ఉంటాయి కానీ మనసుకు నచ్చుతాయి. అలాగే పుకార్లుకూడాను…

వాట్సప్ లో మీకు ఏదైనా ఆకట్టుకునే న్యూస్ వచ్చినా న్యూస్ వెబ్ సైటులో చూడండి. లేకపోతే గూగుల్ సెర్చ్ లో చూడండి. ముందుగా పుకారా లేకా న్యూసా? ప్రచారమా? సరిచూసుకోండి…

పుకారు షికారు చేస్తే ఎవరి మనసు ఎలా స్పందిస్తుందో చెప్పలేం.. కొందరు ఆరోగ్యంగానే ఉన్నా ఆందోళనకు అధికంగా గురయ్యే మానసిక సమస్య ఉంటే వారి స్పందన ప్రమాదకరమే… కొందరు అనారోగ్యంతో ఉంటే వారికి ఇలాంటి పుకార్లు ఇబ్బంది కరమే… ఇక విపత్తులు లోకంలో రాజ్యమేలుతున్నప్పుడు పుకార్లు మరింత ప్రమాదకరం.. కాబట్టి పుకార్లు షికారు చేయనివ్వకుండా అడ్డుపడండి.