బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది.

ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే ఉంటాడు, కానీ అతని మనసు గతంలో అమెరికా వెళ్ళి ఉంటే, అక్కడికి క్షణాల్లో వెళ్ళినట్టు ఊహించగలదు. అంత శక్తివంతమైన మనసు, అందోళనకు గురైతే దానికి దిక్కుతోచదు.

కోవిడ్ 19 వైరస్ కారణంగా మన జాగ్రత్త కోసం మనం ఇంటికే పరిమితం అవుతున్నాం. అయితే మనం జాగ్రత్తగా ఉన్న మన మనసు ఎలా ఉంటుంది? ఇదే ప్రధానం. ఈ కరోనా కాలంలో మనపై మన పరిశీలన అవసరం అంటే మనసును పరిశీలించడం అంటారు.

మనకు గొప్ప విజయం దక్కిందంటే, మన మనసు అంత ఏకాగ్రతతో ఉన్నట్టు అంటారు. దానికి అంత ధృఢసంకల్పం ఉంటేనే, అది కదలకుండా మన విజయంలో కీలక పాత్ర పోషించగలదని అంటారు.

అదే మనసు కంగారు పడితే, అప్పటికి పడిన శ్రమంతా వృదా కూడా చేయగలదని అంటారు. కంగారు, ఆందోళన మనసు చెందకుండా ఉండాలి అంటారు.

ఇక కరోనా వలన ఇంటికే పరిమితం అయిన మనం సామాజిక దూరం కూడా పాటించడం అంటే ఇంచుమించు ఒంటరిగా ఉండాల్సిన స్థితి. అలా ఒంటరిగా ఉండగలిగితేనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని అంటారు.

ఒంటరితనం అంటే కానీ పని.. ఏదో ఒక పనిచేస్తూ ఉండడం శ్రేయష్కరం.. అయితే ఎంత పనిచేసినా ఇంట్లో అన్నిరోజుల పని ఉండకపోవచ్చును. కాలక్షేపం కోసం మనకు సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సినిమాలు చూడగలం.. కానీ ఇతర న్యూస్ అయినా ఏమైనా కరోనా న్యూస్ ఉంటాయి.

మనం కరోనా న్యూస్ చూస్తే కరోనా గురించిన ఆలోచనే కలగవచ్చును. ఏదైనా ఎక్కువగా ఆలోచన చేయడం మంచిది కాదు. ఏదైనా మనకు నష్టం కలిగిస్తుందంటే అందుకు తగిన జాగ్రత్తలు శ్రద్ధగా పాటించాలి. కానీ ఆలోచన పెంచుకోకూడదు.

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు. బుక్ రీడింగ్ వలన విషయ పరిజ్ఙానం పెరుగుతుంది.

ప్రభుత్వం సూచించిన నిబంధనలు మనం కరెక్టుగా పాటిస్తే చాలు.. ఇక కాలక్షేపం కోసం మనం ఇంట్లోనే ఉండడం ప్రధమం.

కాలక్షేపం కోసం బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగ్ వలన విషయ పరిజ్ఙానం పెరుగుతుంది. అయితే ఈ బుక్స్ లో రకరకాలు ఉంటాయి.

పిల్లల కోసం కధలు, కావ్యాలు, కవులు, చరిత్ర తదితర పుస్తకాలు ఉంటాయి. స్ఫూర్తి కోసం వివిధ నాయకుల జీవిత చరిత్రల తెలుగు బుక్స్ కూడా ఉంటాయి. అయితే ఈ కరోనా కాలంలో పిల్లలకు స్ఫూర్తినిచ్చేవారి బుక్స్ చదివించడం మేలు అంటారు.

ఎందుకంటే కొంతమంది జీవితాలలో వారు ఎదుర్కొన్న కష్టాలు అసామాన్యంగా ఉంటాయి. అటువంటి కష్టాలను మన కష్టంలో ఉన్నప్పుడు చదివితే, అప్పుడు మన కష్టాలు తక్కువగా అనిపించవచ్చును. మనసు తేలికపడే అవకాశం ఉంటుంది. తేలిక పడిన మనసు ఆందోళనను తగ్గించుకుని, ప్రశాంతంగా ఉండగలుగుతుందని అంటారు.

జీవిత చరిత్రల బుక్స్ మనకు ఓదార్పుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా స్ఫూర్తినిచ్చే రచనలు కూడా మనకు మరింత మేలును చేకూరుస్తాయని అంటారు.

స్వామి వివేకానంద రచనలు మనసులో మంచి స్ఫూర్తిని నింపగలవు అంటారు. కష్టకాలంలో మహానుభావుల రచనలు మనలో మరింత ధైర్యం నింపుతాయి.