లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

Ubuntu OS లోని Libre Office Writer లో ఫైల్ మెను గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో తెలుగులో చూద్దాం… లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి……

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

New (న్యూ)

ఈ New కమాండ్ కొత్త లిబ్రె ఆఫీసు రైటర్ ఫైల్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. గమనించవలసిన విషయం… మనం లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, కొత్తగా ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి పేరు పెట్టి సేవ్ చేసుకుంటే, అందులోనే వర్కు ప్రారంభించవచ్చును.

Open (ఓ)

Open కమాండ్ ద్వారా లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్లో గతంలో సేవ్ చేయబడిన ఫైల్స్ తిరిగి ఓపెన్ చేయవచ్చును. మీరు ఎప్పుడు లిబ్రె ఆఫీసు అప్లికేషన్ ఓపెన్ చేసిన ముందుగా అన్ టైటిల్డ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. మీరు డైరెక్టుగా సేవ్ చేసిన ఫైలును ఓపెన్ చేస్తే, మీరు సేవ్ చేసిన డేటా కలిగిన ఫైల్ లిబ్రె ఆఫీసు రైటల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. Open కమాండ్ ద్వారా సిస్టంలో బ్రౌజ్ చేసి, గతంలో ఫైల్స్ ఎక్సిస్ చేయవచ్చును.

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను
లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను Open Remote…(ఓపెన్ రిమోట్)

మీ Ubuntu సిస్టంకు ఇంటర్నెట్ కనెక్టు అయ్యి ఉంటే, మీరు ఆన్ లైన్లో డాక్యుమెంట్ సేవ్ చేయవచ్చును. ఆన్ లైన్ నుండి డాక్యుమెంట్ ఓపెన్ చేయవచ్చును. మీరు క్రియేట్ చేసిన లిబ్రె ఆఫీసు డాక్యుమెంట్ గూగుల్ డ్రైవ్ లాంటి ఆన్ లైన్ స్టోరేజులలో సేవ్ చేయవచ్చును. మరలా ఎక్కడైనా మీరు మీ మెయిల్ ఐడి, పాస్ వర్డు ద్వారా ఏక్సిస్ చేయవచ్చును. ఈ Open Remote… కమాండ్ ద్వారా డాక్యుమెంట్ ఏ Ubuntu system ద్వారా ఓపెన్ చేయవచ్చును.

Recent Documents (రీసెంట్ డాక్యుమెం)

ప్రస్తుతమునకు ముందు లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ద్వారా సేవ్ చేయబడిన ఫైల్స్ మరలా తిరిగి రీసెంట్ డాక్యుమెంట్స్ కమాండ్ ద్వారా వెంటనే ఓపెన్ చేయవచ్చును. సాదారణంగా గతంలో ఫైల్స్ ఓపెన్ చేయాలంటే, Open షార్ట్ కట్ బ్రౌజ్ చేయాలి. కానీ రీసెంట్ డాక్యుమెంట్ వలన లిమిటెడ్ సీరియల్ వైజుగా కొన్ని డాక్యుమెంట్లు వెంటనే ఓపెన్ చేయవచ్చును.

Close ()

ఉపయోగిస్తున్న ప్రస్తుత లిబ్రె ఆఫీసు రైటర్ ఫైలును క్లోజ్ చేయడానికి ఈ Close కమాండ్ ఉపయోగిస్తారు.

Wizards (విజార్డ్)

బిజినెస్ లెటర్స్, పర్సనల్ లెటర్స్, బయోడేటా, లీవ్ లెటర్ వంటి డాక్యుమెంటివి ముందుగా డిజైన్ చేసిన టెంప్లేట్స్ ద్వారా క్రియేట్ చేయవచ్చును. ఈ Wizards కమాండ్ టెంప్లేట్ సేవ్ చేసుకోవడానికి ఉపయోపడుతుంది.

Templates (టెంప్లేట్)

Wizards ఫైల్ ద్వారా క్రియేట్ చేసిన టెంప్లేట్, ఈ Templates కమాండ్ ద్వారా తిరిగి ఓపెన్ చేయవచ్చును. ఇతర అంశములలో గల డిఫాల్ట్ టెంప్లేట్స్ ఓపెన్ చేసి, ఉపయోగించవచ్చును.

Reload (రీలోడ్)

ఈ Reload కమాండ్ రిడూ లాంటిది. ప్రస్తుతం పనిచేస్తున్న ఫైల్ ఇంతకుముందు సేవ్ చేసిన వరకు, తిరిగి రిలోడ్ చేయడానికి ఈ Reload కమాండ్ ఉపయోగపడుతుంది. అంటే పొరపాటున ఏదైన కంటెంట్ డిలిట్ చేస్తే, రిలోడ్ చేయగానే, అంతకుముందు సేవ్ చేయబడిన పొజిషన్లో ఫైల్ రిలోడ్ అవుతుంది. సేవ్ చేయబడని డేటా లాస్ అవుతారు.

Versions (వెర్షన్స్)

Versions కమాండ్ ద్వారా ప్రస్తుత డాక్యుమెంటును వెర్షన్ వైజ్ సేవ్ చేసుకుని, ముందు వెర్షన్, ప్రస్తుత వెర్షన్ పోలిక చూసుకుని వర్కు చేసుకోవచ్చును.

Save ()

ఈ Save కమాండ్ ఉపయోగించకుంటే, కంప్యూటర్ అప్లికేషన్లో మనం చేసిన ఏపని అయినా తాత్కిలికంగా కనబడుతుంది. కానీ మరలా తిరిగి పొందలేము. మీరు లిబ్రె ఆఫీసు రైటర్ వర్కు చేస్తున్న ఫైలును, ఏదైనా పేరుతో కంప్యూటర్ స్టోరేజులో సేవ్ చేస్తేనే, తిరిగి అదే పేరుతో మరలా అదే డాక్యుమెంటును ఉపయోగించగలరు.

Save Remote… (సేవ్ )

Save మాదిరిగానే Save Remote… కమాండ్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ Save Remote… కమాండును ఆన్ లైన్ స్టోరేజులో ఫైల్ ను సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Save Remote… కమాండ్ ద్వారా మీరు గూగుల్ డ్రైవ్, ఒన్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజులో మీరు డైటా ఏదైనా పేరుతో ఫైల్ ను సేవ్ చేయవచ్చును.

Save As (సేవ్ యాజ్)

ప్రస్తుత లిబ్రె ఆఫీసు రైటర్ డాక్యుమెంట్ ఫైలును, మరొక కాఫీగా తీసుకుని వర్కు చేయడానికి Save As కమాండ్ ఉపయోగపడుతుంది. మీరు ఉపయోగిస్తున్న లిబ్రె ఆఫీసులో ఏదైనా ప్రయోగాత్మకంగా కొత్తగా ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రస్తుత డాక్యుమెంట్ ఫైలును అలాగే సేవ్ చేసి, దానిని మరలా మరొకపేరుతో సేవ్ చేయడం ద్వారా…. ప్రస్తుత డాక్యుమెంట్ ఫైలుకు డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు డూప్లికేట్ ఫైలు ప్రయోగత్మాకంగా వర్కుని కొనసాగించవచ్చును.

Save All (సేవ్ ఆల్)

ఈ కమాండ్ Saves all ద్వారా modified LibreOffice documents ఒకేసారి సేవ్ చేయవచ్చును.

మరొక పోస్టులో మరింతగా లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి…..