దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన పాత చిత్రాల్లో దక్షయజ్ఞం ఒక మంచి చిత్రం. ‘దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా’.

పౌరాణిక గాధలలో సందేశం మిళితమై సందేశం కోసం సన్నివేశాలు సంఘటనలతో కూడిన గాధలు ఉంటాయి. అలా పార్వతి పరమేశ్వరుల గురించి చెప్పబడినప్పుడు తరుచూ తగిలే గాధ దక్షయజ్ఞం గాధ! పార్వతి మాత గతజన్మ వృత్తాంతం కావడం ఆ జన్మలోను ఈ జన్మలోను శివుడు మరు జన్మ లేకుండా పార్వతి మాతకు నాధుడై ఉండడం ఈ దక్షయజ్ఞం పౌరాణిక గాధ మనసులో భక్తిని ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలాగే దక్షయజ్ఞం గురించి పురాణ ఫలశ్రుతి ఉంటే, ఈ పౌరాణిక ద్వారా సాక్ష్యాత్తు త్రిమూర్తుల అండ ఉన్నా అహంకరిస్తే ఏస్థితికి ఎటువంటి వారైనా ఎలా పతనం చెందుతారో తెలియబడుతుంది. అటువంటి దక్షయజ్ఞం దైవ చరితను వెండితెరకు ఎక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వారు కడారు నాగభూషణం, కన్నాంబ. భక్తీ, మనోబలాన్ని, పుణ్యాన్ని పెంచే దైవగాధ తెలుగు తెరపై ప్రేక్షకులకు చిరపరిచయమే.

త్రిమూర్తుల అనుగ్రహం కలిగిన దక్షుడు శాపానుగ్రహాలు ఇవ్వడం

భూలోకమున ప్రాజాపత్యం పెరగడానికి బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో దక్షుడు ప్రధానంగా ప్రఖ్యాతి గడించి, గర్వంతో అందరికి శాపానుగ్రహాలు ఇట్టే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తనతో వాదం ఆడినందులకు కన్నా కుమారులకు సైతం పామరులు కమ్మని, తన కుమారులకు సన్యాస బోధ చేసారని ఆరోపిస్తూ నారద మహర్షికి శాపాలు అనుగ్రహిస్తాడు. ఇలా ఉండే దక్షప్రజాపతికి దత్త పుత్రికలు రోహిణి మొదలైన వారితో27మందితో బాటు, తన వరపుత్రిక అయిన సతిదేవి ఉంటారు.. వారిలో రోహిణి చంద్రుడుని వరిస్తే, ఆమె అభీష్టం మేరకు చంద్రుడికి కబురు పెట్టి రోహిణి అభీష్టం గురించి చెబుతాడు, దక్షుడు. అలాగే బ్రహ్మ అజ్ఞామేరకు దత్త పుత్రికలందరికి పతి ఒక్కడే ఉండాలి, కాబట్టి నీకు సమ్మతమైతే నా దత్త పుత్రికలందరిని నీకిచ్చి వివాహం చేస్తానని అంటాడు. అందుకు అంగీకరించిన చంద్రుడితో 27మంది దత్త పుత్రికలకు వివాహం జరిపిస్తారు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ఆ వివాహనికి విచ్చేసిన త్రిమూర్తులలో శివుడు దక్షుడు కోరిక మేర అతిథిగా దక్షుని నివాసంలోనే ఉంటాడు. అక్కడ సతిదేవి శివుడికి పరిచర్యలు చేస్తుంది. శివుని కోసమే పుట్టిన అమ్మ, శివుని ఆరాధనలోనే ఉంటుంది. ఇప్పుడు శివుని వివాహమాడ తలుస్తుంది.
చంద్రుడిని పరిణయమాడిన 27మంది దత్త పుత్రికలలో రోహిణి మినహా అందరూ సంతోషంగా ఉండరు. కారణం చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఆదరిస్తూ ఆమెతోనే ఉంటాడు. ఈ కారణం గ్రహించిన నారదుని సూచనా మేరకు, మిగిలిన దత్త పుత్రికలు 26గురు తమ తండ్రి దక్షునితో మొరపెట్టుకుంటారు. దక్షుడు చంద్రుడిని పిలిచి, భార్యలందరినీ సమంగా చూడకపోవడం తప్పు అని చెప్పబోతే, చంద్రుడు తన సంసారం గురించి మాట్లాడడం మర్యాద కాదు అని బదులు ఇవ్వడంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాదిగ్రస్తుడుగా ఉండమని శాపానుగ్రహం ఇస్తాడు.
వెంటనే చంద్రుడు పరమశివుడుతో మొరపెట్టుకుంటే చంద్రుడుని తన సమక్షంలో ఉండమని, అలాగే దక్షుని శాపం కూడా నిష్ప్రయోజనం కాకుండా పదిహేనురోజులు క్షయిస్తూ, పదిహేనురోజు వృద్ది పొందుతూ ఉండమని అనుగ్రహిస్తాడు. అలా పరమేశ్వరుడు అనుగ్రహం వలననే చంద్రుడు అమావాస్య నుండి పెరుగుతూ, పౌర్ణమి నుండి తగ్గుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన దక్షుడు తన మాట మన్నిస్తానని మాట ఇచ్చిన పరమశివుడు, తన శాపానికి మార్పు చేసి చంద్రుడిని అనుగ్రహించడం నచ్చక పరమశివుడిపైన ద్వేషభావం పెంచుకుంటాడు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

సతీదేవిని వివాహమాడిన పరమశివుడు

అహంకారంతో వరగర్వంతో ఉండే దక్షుడుకి పరమశివుడుపై ఆగ్రహం రావడంతో తన వరపుత్రిక అయిన సతీదేవికి వివాహం చేయదలచి, సతీదేవి ఇష్టాన్ని ప్రక్కన పెట్టి స్వయంవరం ప్రకటిస్తాడు. సతీదేవి స్వయంవరం విషయం నారద మహర్షి ద్వారా తెలుసుకుని పరమశివుడు, సతీదేవి మనోభిష్టం నెరవేర్చాలని పరమశివుడు భావిస్తాడు. స్వయంవరం సభలో సతీదేవి విగ్రహరూపంలో ఉన్న పరమశివుడు పూలమాల వేసి వరిస్తుంది. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై సతీదేవితో అంతర్ధానం అవుతారు.

ఈ సంఘటనతో దక్షుడి అహంకారం పరమశివుడుపై పూర్తీ ద్వేషభావంతో నిండిపోతుంది. ఇక మహర్షులు లోకాల శ్రేయస్సు కోసం తలపెట్టిన యజ్ఞంలోకి అందరితో బాటు దక్షుడిని ఆహ్వానిస్తారు. ఆ యాగానికి విచ్చేసిన దేవతలు త్రిమూర్తులతో సహా అక్కడే ఆసీనులై ఉంటారు. యాగానికి వస్తున్న దక్షుడుని చూసి అందరూ గౌరవంతో లేచి నిలబడితే త్రిమూర్తులు అందరికన్నా పెద్దవారు కాబట్టి ఆసీనులై ఉంటారు. అయితే దక్షుడు పరమశివుడిని చూసి అల్లుడు మామని గౌరవించక పోవడం ఏమిటి అని అంటాడు. అందులకు పరమశివుడు సభలలో బాంధవ్యాలకు తావుండదు. నే త్రిమూర్తులలో ఒక్కరిగా ఇక్కడ ఉన్నాను అంటాడు. అయిన అహంకారి అయిన దక్షుడు పరమశివుడిని దూషిస్తాడు. ఇక సభలో శాపానుగ్రహాలు వస్తాయి.

దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగం

సభలో తనకు పరాభవం జరిగింది, నా అల్లుడు నన్ను గౌరవించలేదు అని భావించిన దక్షుడు, శివుడుపై ఇంకా ద్వేషంతో రగిలిపోతాడు. తత్ఫలితంగా నిరీశ్వర యాగం తలపెడతాడు, అంటే శివుడు లేని యజ్ఞం చేయ నిశ్చయిస్తాడు. వరబలం మెండుగా ఉన్న దక్షుడంటే మహర్షులకు, దేవతలకు హడలు, ఆ భయంతో ఈ నిరీశ్వర యాగానికి వారు దక్షుడితో చేరతారు. బాంధవ్య దృష్టితో చూసి ఆది శక్తిని, శక్తి ఆధారమైన శివాన్ని కాదనడం దక్షుడు అహంకారం ఏ స్థితికి చేర్చిందో ఇక్కడ ప్రస్పుటం అవుతుంది. ఆది దంపతులని ద్వేషించడంలోనే దక్షుడు పతనం చెందాడు, అయితే ఫలితం కనబడే సంఘటన మాత్రం అతడు తలపెట్టిన నిరీశ్వర యాగం స్థలం. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

జగదంబ అయిన సతీదేవి తనతండ్రి తలపెట్టిన యాగం చూడాలని పరమశివుని ప్రార్ధిస్తుంది. అయితే పరమశివుడు సతీదేవితో దక్షుడి ద్వేషభావన గురించి అప్పుడు చెప్పి, సతీదేవిని వెళ్ళవద్దని వారిస్తాడు. పుట్టింటిపై మమకారంతో అందులోను తనతోబుట్టువులు కూడా ఆ యాగానికి వెళ్ళారని తెలియడంతో అమ్మమనసు అమ్మదగ్గరికి వెళ్ళాలనే నిశ్చయించుకోవడంతో పరమశివుడు శివపరివారంతో సతీదేవిని దక్షయజ్ఞానికి పంపిస్తాడు. యాగానికి వచ్చిన సతీదేవిని యాగశాలలో ఎవరు పలకరించారు, తండ్రి ముఖం చాటేస్తాడు. భర్తమాట కాదని వచ్చినందులకు నాకు తగిన శాస్తి జరిగినది, అని తలచిన అమ్మ అగ్నిలో ఆత్మత్యాగం చేస్తుంది.

విషయం పరివారం ద్వారా విన్న శివుడు ప్రళయ రుద్రుడై నాట్యం చేసి, తన జటాజుటం నుండి వీరభద్రుడిని సృష్టిచేసి దక్షయజ్ఞం నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు దక్షయజ్ఞంలో భీబత్సం సృష్టిస్తాడు. దక్షుడి తలతెగి అగ్నికి ఆహుతి అవుతుంది. అయితే మహా ప్రతివ్రత అయిన దక్షుడి భార్య వైరిని ప్రార్ధనతో త్రిమూర్తులు ప్రత్యక్ష్యమై దక్షుడికి మేక తలను పెడతారు. అలాగే దక్షయజ్ఞం నిర్విఘ్నంగా జరిగేల ఆశీర్విదిస్తారు. అయితే జగదంబ మాత్రం దక్షుడి కుమార్తె మరలా పునర్జీవిగా రావడానికి ఇష్టపడని కారణంగా అమ్మ అదృశ్యంగానే ఉంటుంది. దక్షయజ్ఞం చలనచిత్రం ముగుస్తుంది. ఎంతటి శక్తిమంతులైనా సరే ఆహంకరిస్తే, గర్వంతో ఇతరులను నొప్పిస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో, ఎందరి జీవితాలు తలక్రిందులు అవుతాయో ఈ దక్షయజ్ఞం చిత్రం ద్వారా కనబడుతుంది. దక్షుడి అహంకారం సాక్ష్యాత్తు పరమశివుడు భార్య జగదంబ జీవితాన్నే మార్చేసింది. అలాగే అల్లుడు చంద్రుడు జీవితంపై తీవ్రప్రభావం చూపించింది. దక్షుడితో బంధుత్వం ఏర్పడిన కారణంగా పరమశివుడే నిందింపబడ్డాడు. ఇలా అహంకారి దక్షుడితో సంభందం కలిగిన అందరూ ప్రభావితులైనారు. అయితే దేవతా శక్తికి ప్రకృతి మార్పులతో మొదలువుతుంది కాబట్టి అవన్నీ లోకకళ్యాణం కోసం ఉపయోగపడ్డాయి. “దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ధన్యవాదాలు
తెలుగురీడ్స్