శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం
కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి ఇస్తాడు. పరమశివుడు ఆ ఫలమును పార్వతికి ఇస్తాడు. పార్వతి మాత ఆయొక్క జ్ఙానఫలమును, తమ పిల్లలకు ఇవ్వడానికి నిశ్చయిస్తుంది. అయితే ఆదిదంపతుల కుమారులు ఇరువురు, ఆఫలము తమకు కావాలని అంటారు. అప్పుడు ఆ ఫలమును చెరిసగం చేసుకుని స్వీకరించమని, పార్వతిమాత సెలవిస్తుండగా, పరమశివుడు మాతకు మాటకు అడ్డుపడి, వలదు..వలదు… ఆఫలమును ఎవరో ఒకరే భుజించవలసి ఉంటుంది, అని పలుకుతాడు. అప్పుడు మాత పార్వతిదేవి, మహాదేవునితో ”మీరే పరిష్కారం చెప్పమనగా..” అప్పుడు శంకరుడు ”ఎవరైతే…ముల్లోకములకు ప్రదక్షిణ చేసి, ముందుగా కైలాసం వస్తారో…వారికే, ఈ జ్ఙాన ఫలము” అంటూ సమాధానం చెబుతాడు.

వెంటనే కుమారస్వామి..ఇప్పుడే ముల్లోకములకు ప్రదక్షిణ చేసి వచ్చెదనని కైలాసం నుండి బయలుదేరతాడు. అయితే వినాయకుడు కైలాసంలోనే ఉండి, మాతాపితలకు ప్రదక్షిణ చేస్తే, ముల్లోకములకు ప్రదక్షిణ చేసినట్టే, అని భావించి, విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి, ఆఫలమును స్వీకరిస్తాడు. అయితే ముల్లోకములను చుట్టి తిరిగి కైలాసం వచ్చిన కుమారస్వామి, విషయం తెలుసుకుని, ఆగ్రహంతో మరలా కైలాసం వదిలి వెళతాడు. కైలాసం వీడి వెళుతున్న కుమారస్వామిని ఆపడానికి, ఆది దంపతులు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయినను వినక వెనుదిరగకుండా వెళుతున్న కుమారస్వామిని, ఆపడానికి ఒక అవ్వ ప్రయత్నిస్తుంది. కానీ విఫలం అవుతుంది. ఇక అప్పుడు జగన్నాత పార్వతిదేవి, కుమారస్వామి దగ్గరకు వచ్చి శివమహిమను తెలిపే, శివలీలలను చెప్పడం ప్రారంభిస్తుంది.

పాండ్యరాజు అంత:పురంలో తన రాణితో ఇష్టాగోష్టిలో ఉండగా అతనికి ఒక సందేహం వస్తుంది. స్త్రీకేశముల సువాసనను సహజంగా కలిగి ఉంటాయా? అనే సందేహం కలుగుతుంది. దానికి రాణి దగ్గర కూడా సమాధానం లేకపోయేసరికి, ఇదే విషయంలో సందేహం తీర్చినవారికి వేయిబంగారు నాణెముల నజరానతో కూడిన ప్రకటన తన పాండ్యరాజ్యంలో చేయిస్తాడు. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

రాజ్యంలో ప్రకటించబడిన బహుమతికై ఆశతో ఎదురుచూసిన ధర్మి అనే ఒక పేద బ్రాహ్మణునికి, దేవాలయంలో శివుడే మారువేశంలో వచ్చి, ఆ సందేహ నివృత్తి కవితను ఇచ్చి వెళతాడు. దానితో ఆ పేద బ్రాహ్మణుడు ఆ కవితను తీసుకుని, పాండ్యరాజు గారి సభకు బయలుదేరతాడు. అక్కడ సభలో ఎవరూ ఆ సందేహ నివృత్తిని చేయగలిగేవారు లేకపోవడంతో రాజుగారు ఆశ్చర్యపడతారు. అప్పుడే శివానుగ్రహి అయిన ధర్మి బ్రాహ్మణుడు ఆ సభలోకి ప్రవేశిస్తాడు. ధర్మి తనకు శివుడు అందించిన తాళపత్రంలోని కవితను పాండ్యరాజుగారికి చదివి వినిపిస్తాడు. ఆ కవితకు మెచ్చినరాజు, ధర్మికి బహుమానం అందజేయబోతుండగా, అక్కడి ఆస్థాన పండితుడు అయిన నక్కీరుడు, ధర్మితో ఆ కవితను నీవే వ్రాశావా? అందులో దోషముంది అని చెబుతాడు. ఇక చేసేది లేక ధర్మి సభనుండి నిరాశతో నిష్క్రమించి, దేవాలయమునకు చేరి దు:ఖిస్తూ కూర్చుంటాడు. అక్కడకు మరలా వచ్చిన శివుడు సభలో జరిగిన విషయం చెప్పమని ధర్మిని ప్రశ్నిస్తాడు. ధర్మి నీవు వ్రాసిన కవితలో దోషముంది అని సభలో చెప్పినట్టుగా శివునితో చెబుతాడు. దానికి బదులుగా శివుడు అలా చెప్పినవారిని నాకు చూపించమని, ధర్మిని రాజుగారి సభకు తీసుకువెళతాడు. రాజుగారి సభలో నక్కీరుడు, పరమశివునితో కూడా మీరు కవితలో భావదోషముందని, ఆరోపిస్తాడు. ఆగ్రహించిన పరమశివుడు తన త్రినేత్రంతో నక్కీరుని దగ్ధం చేస్తాడు. తరువాయి రాజుగారి ప్రార్ధనతో పరమశివుడు, నక్కీరుడిని పునర్జీవునిగా చేస్తాడు. తరువాత ధర్మికి వేయి బంగారు నాణేములు బహుమతిగా లభిస్తాయి. ఇక్కడ ధర్మికి బంగారు నాణేములు, నక్కీరునికి పాండిత్యపరీక్ష రెండూ ఒకేసారి చేయడం శివలీలగా పార్వతి మాత కుమారస్వామికి వివరిస్తుంది.

ఇంకా శివుని లీలలు గురించి కుమారస్వామితో మాట్లాడుతున్న పార్వతి మాత, తనను కూడా మహాదేవుని ఏవిధంగా పరీక్షించిందీ…ఆ వివరం కూడా చెప్పనారంభిస్తుంది.

లోకమాత అయిన దాక్షాయినికి, తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఙం గురించి తెలియవస్తుంది. ఆ యొక్క యాగమునకు వెళ్లాలని నిశ్చయించుకున్న దాక్షాయినిదేవి, పరమశివుని తన కోరికను తెలియజేస్తుంది. అప్పుడు మహాదేవుడు వలదని, నీవు నీపుట్టింటి మమకారంతో ఇప్పుడు దక్షుని యజ్ఙమునకు వెళ్లినచో అవమానం పొందుతావు అని వారిస్తాడు. కానీ జగన్మాత మహాదేవునితో వాదించి, శివుని అంగీకారం అడుగుతుంది. అప్పుడు పరమశివుడు విధి లోకమాతతో కూడా ఆడుకుంటుంది అని అనుకుంటూ, వెళ్లమని దాక్షాయినికి అనుజ్ఙ ఇస్తాడు. అప్పుడు లోకమాత దక్షయజ్ఙానికి బయలుదేరుతుంది.

నిరీశ్వర యాగానికి పరమశివుని పిలవకుండా చేయడం వలదని, మంత్రి సలహా ఇస్తాడు. అయినను దక్షుడు వినకుండా నిరీశ్వర యాగమునకు చేయడానికి పూనుకుంటాడు. అక్కడకు వచ్చిన జగన్మాత, తనకు తండ్రి అయిన దక్షునికి నచ్చజెప్పబోతుంది. కానీ దానికి దక్షుడు నిరాకరిస్తాడు. అవమాన భారంతో దాక్షాయిని మరలా కైలాసం చేరి, శివుని చేరుతుంది. కైలాసంలో శివునికి, పార్వతికి వాదం పెరిగి యుద్దమునకు దారి తీస్తుంది. ఆ యుద్ద ఫలితంగా శక్తి అయిన దాక్షాయిని దేహం దగ్గమవుతుంది. (గమనిక: దాక్షాయిని శరీరత్యాగం గురించి, పురాణ ప్రవక్తల మాటలు ప్రకారం అయితే దాక్షాయిని, దక్షయజ్ఙంలోనే ఆత్మార్పణం చేసుకున్నట్టుగా చెబుతారు.) తర్వాత దేవతల ప్రార్ధన మేరకు పార్వతిదేవిగా జగన్మాతకు తిరిగి శివుని చేరుతుంది. ఈ గాధను కూడా శ్రద్దగా ఆలకించిన కుమారస్వామికి ఇంకా మహాదేవి మరో శివలీల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

బెస్తనాయకుడి కూతురుగా పుట్టిన లోకపావని గంగా అను నామంతో యుక్తవయస్సులో ఉండగా తనతోటివారితో సముద్రపు ఒడ్డున ఆటాలాడుకుంటూ ఉంటుంది. అక్కడికి శివుడు కూడా ఒక బెస్తవాని రూపంలో వచ్చి, గంగను అల్లరి చేసి వెళతాడు. తర్వాత సముద్రంలోకి వెళ్లిన బెస్తవారు, అందరూ తిరిగి వెనుకకు రాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే సాగరంలో ఉన్న తిమింగళం, సముద్రంలోకి వచ్చిన బెస్తవారిని తినేస్తూ ఉంటుంది.

దానితో బెస్త నాయకుడు సాగరంలో తిమింగళాన్ని చంపినవానికే, నాకూతురు గంగను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు.బెస్తనాయకుడు కూతురు అయిన గంగ అక్కడి ఉన్న ధైర్యవంతులతో కూడి, సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరుతుంది. కానీ అక్కడికి బెస్తవాని వేషంలో వచ్చిన శివుడు తానే సముద్రంలోకి బయలుదేరతాడు. సముద్రంలో తిమింగళం బెస్తవాని వేషంలో ఉన్న శివునితో పోరాడి మరణిస్తుంది. అలా మరణించిన తిమింగళంతో బెస్తవాడు ఒడ్డుకు చేరతాడు. అలా బెస్తవారి వేషంలో ఉన్న పార్వతి, పరమేశ్వరులు ఒక్కటవుతారు. ఈ గాధను కూడా ఆలకించిన షణ్ముఖునికి, అమ్మ పార్వతిమాత ఇంకా ఒక అహంకారి సంగీత విద్వాంసుని విషయంలో శివలీలను వివరించడం ప్రారంభిస్తుంది.

హేమనాధ భాగవతులు పేరుగాంచిన గొప్ప సంగీత విద్వాంసుడు. సరస్వతీ కటాక్షం పొందిన హేమనాధ భాగవతులు ఎన్నో సత్కారాలు అందుకున్న పిదప, అతను పాండ్యారాజ్యానికి చేరతాడు. అక్కడ హేమనాధ భాగవతులకు, పాండ్యరాజే స్వయంగా స్వాగతం పలుకుతాడు. అహంకారం హెచ్చిన హేమనాధ భాగవతులు, తనకు స్వాగతం పలికిన పాండ్యరాజుతో చాలా గర్వంగా మట్లాడి, సభాప్రవేశం చేస్తాడు. సభలో హేమనాధుడు చేసిన గానకచేరికి, రాజు సంతోషించి, స్వయంగా హేమనాధుని దగ్గరకు వచ్చి, చాలా వినయంతో బహుమతులు సమర్పిస్తాడు. అయితే అహంకరించి ఉన్న హేమనాధుడు, నేను చాలా గొప్పవాడిని, నన్ను ఎవరైనా మీ సభలో ఓడించినచో, నేను పాండ్యరాజ్యానికి మొత్తం నాసంపదను దారాదత్తం చేస్తానని, లేకపోతే పాండ్యరాజ్యం మొత్తం నామాటకు దారాదత్తం కావాలని సవాలు చేస్తాడు. ఇంకా నేను గెలిచాక పాండ్యరాజ్యంలో ఎవరూ పాటలు పాడరాదని కూడా పలుకుతాడు.

పోటికి సమ్మతించిన పాండ్యరాజు, పోటిని రేపు నిర్వహిస్తానని చెప్పి, హేమనాధుడికి అతిధి గృహంలో ఆతిధ్యం స్వీకరించమని చెబుతాడు. అటు తరువాయి తన ఆస్థాన పండితులను ”మీలో హేమనాధునితో పోటిపడేవారు ఎవరు?” అని అడుగుతాడు. కానీ వారిలో ఎవరూ ముందుకు రారు. పాండ్యరాజు సంకటంలో పడతాడు. అయితే పాండ్యరాజుకు మంత్రి ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే..”అహంకారం ఉన్న వ్యక్తికి, అనుగ్రహం ఉన్న వ్యక్తి చేతిలో ఓటమి తప్పదు” కాబట్టి దైవానుగ్రహం భాణబట్ట అనే సాధారణ గాయకుడిని తీసుకువచ్చి పోటిలో నిలబెడదాం అని చెబుతాడు. దానికి పాండ్యరాజు అంగీకరిస్తాడు. భాణబట్టుని, పాండ్యరాజు హేమనాధునితో పోటిపడవలసినదిగా ఆజ్ఙాపిస్తాడు. ఆయొక్క రాజాజ్ఙతో భాణబట్ట పరమశివుని ఆలయానికి వెళ్లి, నాకేమిటి ఈ పరీక్ష అంటూ శివుని వేడుకుంటూ, శివలింగం దగ్గరే పడి ఉంటాడు.

అప్పుడు శివుడు ఒక కట్టెలమ్ముకునేవాని వేషం ధరించి, ఆ నగరంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన పరమశివుడు (కట్టెలవాని వేషంలో) హేమనాధుడు విశ్రమించిన అతిధిగృహం దగ్గర ఉన్న ఒక మండపంపై కూర్చుని అద్భుతమైన గానం చేస్తాడు. ఆ గానం విన్న హేమనాధుడు బయటకు వచ్చి, ఆ అద్భుతగానం చేసిందెవరని వెతుకుతాడు. అక్కడే ఉన్న కట్టెలవానిని, ఇప్పుడు అద్భుతగానం చేసిందెవరని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, హేమనాధునితో నిద్రపట్టక నేనే ఏదో ఒక కూత కూశానని చెబుతాడు. దానికి ఆశ్చర్యపడిన హేమనాధుడు, నీవు ఈ పాట ఎవరిదగ్గర నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, బాణబట్టు పేరు చెబుతాడు. దానితో దిమ్మతిరిగిన హేమనాధుడికి తన ఎంత అహంకరించినది..ఆలోచన చేసుకుంటాడు. తనతో పోటీపడబోయే శిష్యుని గానం ఇంత గొప్పగా ఉంటే, మరి ఆ బాణబట్టు గానం ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఊహించిన హేమనాధుడు ఊరి విడిచి వెళ్లిపోతాడు. వెళ్లేముందు, తన సంగీతం అంతా పాండ్యరాజ్యానికి ధారదత్తం చేస్తున్నట్టు వ్రాసిన తాళపత్రం కట్టెలవాని చేతికి ఇస్తాడు. ఆ పత్రాన్ని శివుడు శివాలయంలో ఉన్న బాణబట్టుకు అందజేసి, శివలింగంలోకి చేరతాడు. ఇలా లోకమాత కుమారస్వామికి శివలీలలు వివరించి, కుమారస్వామి మనసుని శాంతింపజేస్తుంది. శివుడు వినాయకునితో కలసి, కుమారస్వామి, పార్వతిమాత ఉన్న కొండకు వస్తారు.

ఏకొండపై కుమారస్వామికి లోకమాత శివలీలు వివరించిందో…ఆకొండే పళనిగా ప్రసిద్ది చెందుతుందని వరమిస్తారు. సినిమా సుఖాంతం అవుతుంది.

సాదారణంగా శివుని లీలలు గురించి వింటే, మాములు మనిషి మనసు శాంతిని పొందుతుంది. ఇక సాక్షత్తు మహాదేవుని కుమారుడు అయిన కుమారస్వామి మనసు ఇంకెంత శాంతిని పొంది ఉంటుంది. అంత శాంతిని పొందిన కుమారస్వామి వెలిసిన కొండ పళని కొండ. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ధన్యవాదాలు, తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి