జ్ఙాన బోధ గీత అయితే

జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు.

అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు.

మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు.

జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా ఉన్నాయి.

రాముని చేత బోధించిన జ్ఙానమును రామగీతగా చెబుతారు. శివుడు చేత చెప్పబడిన జ్ఙానమును శివగీతగా చెబుతారు. ఇంకా మనకు ఉద్దవగీత, గురుగీత, అష్టావక్ర గీత, రమణ గీత, యతీంద్రగీత, సత్యగీత అంటూ వివిధ జ్ఙాన బోధలు ఉన్నాయి.

జ్ఙాన బోధ గీత అయితే
జ్ఙాన బోధ గీత అయితే

రాముడు చెప్పినా, శివుడు చెప్పినా జ్ఙానమొక్కటే, అదే ఆత్మజ్ఙానముగా చెబుతారు. సృష్టి క్రమము, సృష్టికి మూలపురుషుడు, ప్రకృతి గురించి తెలియజేస్తూ జీవ పుట్టుకను ప్రస్తావిస్తుంది.

జీవమునకు ఆధారం ఆత్మ అయితే, జీవి చావు పుట్టుకలకు మనసు మూలం అవుతుంది. ఆత్మ ఆధారంగానే పనిచేసే మనసు, జీవి ఇంద్రియాలను శాసిస్తూ ఉంటుంది. కనబడని మనసు తన చేష్టితముల చేత, తన భావ ప్రకటన చేత జీవికి గుర్తింపు తీసుకువస్తుంది.

జీవిని ప్రభావితం చేసే మనసు కనబడదు, కానీ దాని ప్రభావం చేతనే జీవి కర్మను చేస్తూ ఉంటాడు. అటువంటి మనసును దానిచేత దాని ఉనికిని కనుగొనడానికి ప్రయత్నిస్తే, అది మాయమై, దానికి ఆధారమైన ఆత్మ దర్శనం కాగలదని అంటారు.

మనసు చాలా శక్తివంతమైనది

మాయచేత ప్రభావితం అవుతూ, జీవిని మాయలో కొట్టుకునేటట్టుగా ప్రవర్తనను చూపే మనసు చాలా శక్తివంతమైనది. మాయ చేత అదీ మనిషిని మాయ చేస్తూ ఉంటుంది. మనసు చేతనే మనసుపై అధికారం పొందాలని అంటారు.

అలాంటి శక్తివంతమైన మనస్తత్వం గురించి కూడా గీతలందు మనకు కనబడుతుంది. ఇలా జీవిత పరమార్ధమును మనిషి తెలుసుకోవాలంటే, గీతలు చదవడం వలన ప్రయోజనం కలుగుతుందంటారు.

గీతా పఠనం చేయాలనే ఆకాంక్ష పుట్టడం అంటే అదీ చాలా అదృష్టమైన విషయం అంటారు.

జీవి పుట్టుటకు కారణం కర్మ అయితే, అటువంటి పుట్టుక, మరణాలను శాసించే శక్తి ఏది? ఈ ప్రశ్నకు శాస్త్రీయ సమాధానాలు చాలవు. జీవి స్వానుభావం చేతనే కనుగొనాలని చెబుతారు.

మనసుకు మూలమైన ఆత్మను తెలుసుకోవడమే మానవ జీవన పరమార్ధం అంటారు. అటువంటి ఆత్మదర్శనమునకు మార్గములను శాస్త్రీయంగా చెప్పబడి ఉంటాయి.

ఆత్మదర్శనము వ్యక్తి తనకుతానుగానే ఎరుకలోకి సాధన చేత తెచ్చుకోవాలని అంటారు. పుట్టిన ప్రతి జీవి మరణమును ఎదుర్కొనక తప్పదు.

మనిషికి మరణం వచ్చేలోపులో ఆ మనిషి శరీరం పడడం కన్నా ముందే, మనసు మాయం అయ్యి, ఆత్మదర్శనం కావాలని అంటారు.

మనసులో ఏర్పడుతున్న విషయ జ్ఙాపకాలను తొలగించుకుంటూ, గత కాలపు జ్ఙాపకాలను కూడా తొలగించడం సాధన చేయాలని చెబుతారు.

మనసులోని విషయ వాసనలు తొలిగితే, వచ్చే జ్ఙానంతో ఆత్మదర్శనం కాగలదనే అంటారు.

మాయకు లోనవుతూ, మనిషిని మాయకు గురిచేసే మనసు తనపై తానే పోరాటం చేయడమంటే అది వింత విషయమే. మనసు సాయంతోనే మనసును జయించగలం.

మనసును జయిస్తేనే, ఇంద్రియాలను అదుపు చేయగలం. ఇలా మనసును జయించాలంటే, తత్వం తెలిసిన సజ్జన సాంగత్యం కావాలంటారు.

బుక్ రీడింగ్ కూడా ఒక మిత్రుడు లాంటి వాడే అయితే, గీతాసారం కలిగిన బుక్స్ ఒక మంచి మిత్రుడులాంటివాడే….

వివిధ రకాల గీతా పుస్తకాల లింకులు ఫ్రీపిడిఎఫ్ తెలుగు బుక్స్ క్రింది బటన్ల రూపంలో ఉన్నాయి. వాటిపై టచ్ / క్లిక్ చేసి ఉచితంగా చదవవచ్చును.

తెలుగురీడ్స్ గత కాలపు పోస్టులు చదవడానికి ఈ క్రింది బటన్లపై టచ్ లేక క్లిక్ చేయండి.