లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం

ఒక వేళ ఎవరైనా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకారం పుట్టిన రోజులు ప్రతి యేడాది జరుపుకోవచ్చును.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఈరోజు లీప్ డే, నాలుగు సంవత్సరాలలో పావు రోజు కలిపి నాలుగు సంవత్సరాలకొకసారి వచ్చే లీపు సంవత్సరంలో పూర్తి రోజుగా వస్తుంది. అదే ఫిబ్రవరి 29.

మనకు కొత్త దశాబ్దం ప్రారంభం సంవత్సరంలోనే లీపుడే వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 29, 2020.

ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీనాడు పుట్టి ఉంటే, ఆ రోజు ఘడియల ప్రకారం తెలుగు పంచాంగం చూసి, ప్రతిసంవత్సరం ఆ పంచాంగం ప్రకారం పుట్టిన రోజు జరుపుకోవచ్చును.

మీరు తెలుగుజాతకం అంటూ ఆన్ లైన్ ప్రాధమిక జాతక రిపోర్టును అందించే వెబ్ సైటు ఈ క్రింది బటనకు లింక్ చేయబడి ఉంది. దానిపై క్లిక్ చేసి, మీరు ఆ వెబ్ సైటులోకి ఎంటర్ కావచ్చును.

పై బటన్ పై టచ్ క్లిక్ చేసి మీరు ఆ ఉచిత జాతకం వెబ్ సైటులోకి వెళ్ళి మీ పుట్టిన సమయం, తేదీ, పేరు, ప్రాంతం ఎంటర్ చేయండి.

అప్పుడు మీకు వచ్చే పంచాంగంలో వారం పేరు, తిధి, పక్షం, మాసం కనబడతాయి. తిధి, పక్షం, మాసం ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి తెలుగు పంచాంగం ప్రకారం మీపుట్టిన రోజు జరుపుకోవచ్చును.

లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం

పై చిత్రంలో గమనించండి. ఈ రోజు లీపు డే, అయితే ఈ రోజు ఈ సమయం తెలుగు పంచాంగంలో ఎంటర్ చేస్తే, వచ్చిన తెలుగు పంచాంగం.

పై చిత్రంలో తెలుగు మాసం ఫాల్గుణ మాసంగా ఉంది. తిధి షష్ఠి తిదిగా ఉంది. పక్షం శుక్లపక్షంగా ఉంది. ఇప్పుడు వీరు వచ్చే సంవత్సరం పుట్టిన రోజు జరుపుకోవాలంటే తెలుగు పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్లపక్షంలోని షష్టీ తిధి రోజున జరుపుకోవచ్చును.

తెలుగువారు తెలుగు పంచాంగం ప్రకారం పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిదని చెబుతారు. ఆరోజు సంతోషంగా ఉంటూ, పెద్దల ఆశీస్సుల అందుకోవడం మేలు. ఇలా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకాం పుట్టిన రోజు జరుపుకోవచ్చును.