నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?

నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి? నేను ఎవరికి ఓటు వేయాలి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? రాజకీయ కారణాలతో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎవరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశాలు ఏమిటి? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల వేళలో పరిశీలించారా?

ఐదేళ్లకు ఒక్కమారు ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగిన ఎన్నకలలో గెలిచిన రాజకీయ పార్టీ, ఐదేళ్ల కాలం పాటు ప్రజలను పరిపాలిస్తుంది. ఓటేశాకా అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికలలో చేసిన హామీలు అన్నింటిని నెరవేర్చిందా? ఈ ప్రశ్నను ప్రతిపక్షం పార్టీ ప్రశ్నిస్తే, అధికార పార్టీ బదులు ఇస్తుంది. అధికార పార్టీ ప్రజలలోకి తమ హామీల నిర్వహణ ఫలితాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది.

ప్రతిపక్ష పార్టీ రాబోయే ఐదేళ్ల తమ పాలన ఏవిధంగా ఉంటుందో? తెలియజేసే ప్రయత్నం చేస్తూ, ఎన్నికలలో అధికార పార్టీ చేసిన తప్పులను ఎండగడుతూ ప్రచారం చేస్తుంటే, మీడియా అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల ప్రచారం మరియు నాయకులపై విశ్లేషణాత్మక కధనాలు ప్రచురితం చేస్తుంది. ఈవిధంగా ఎన్నికల కోలాహాలం జరుగుతుంటే, నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?

ఎవరికి ఓటు వేయాలి? అంటే అభివృద్ది చేసిన రాజకీయ పార్టీకి ఓటు వేయాలి. ఆపార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ఓటేయాలి అంటారు. ఎందుకు అంటే సమాజం అభివృద్ది చెందితే, అందులో ఉన్న మనము అభివృద్ది చెందుతాము. కాబట్టి వ్యవస్థను సక్రమంగా నడిపించే లేదా నడిపించిన నాయకుడు లేదా ఆ నాయకుడుని అనుసరించే నాయకులకు ఓటు వేయాలి.

నేను ఎందుకు ఓటు వేయాలి?

ఓటు వేయకపోతే, నీ ఓటు వృధా అయినట్టే, ఓటు వేస్తే, గడిచిన ప్రభుత్వ పాలనపై నీవు తీర్పు చెప్పినవాడివి. నీలాగా ఓటేసిన అనేకమంది ఓటర్ల తీర్పు రేపటి సమాజాన్ని పాలించే, రాజకీయ పార్టీని గెలిపిస్తాయి. కాబట్టి ఓటు ఎందుకు వేయాలో? తెలుసుకుని ఓటు వేయాలి. ఓటు ఎవరికి వేయాలో? మీడియాలోని ప్రముఖ సామాజిక వేత్తల విశ్లేషణ మరియు సామాజికంగా సాధించిన ప్రగతిని, ప్రాంతీయ సమస్యలను తీర్చిన నాయకులను అందరినీ దృష్టిలో ఉంచుకుని రేపటి సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే రాజకీయ నాయకుడిని అనుసరించి ఓటు వేసే విధంగా ఆలోచన చేయాలి.

ఎన్నికలు జరుగుతున్న వేళ అందరి మదిలో ఏ పార్టీ గెలుస్తుంది? అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీడియా కూడా ఎన్నికల వేళల్లో ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉంది? ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ వస్తుందనే ప్రచారం చేసుకుంటూ పోతాయి. కాబట్టి ఎన్నికల వేళలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం మరియు నాయకులు చెబుతున్న మాటల్లో ఉన్న వాస్తవం ఏమిటి? గుర్తెరిగి రేపటి సామాజిక శ్రేయస్సున కాంక్షించి ఓటు వేయాలి అంటారు.

నేనెందుకు ఓటు వేయాలి అంటే, రేపటి తరం భవిష్యత్తుకు నేటి నీ ఓటు కీలకం కావునా నీవు ఓటు వేయాలి.

రాజకీయ కారణాలు వలన రాజకీయ పార్టీలలోని నాయకులు మారుతూ ఉంటారు. సీటు కోసం పార్టీ అధినేత వద్దకు వెళితే, ఓటు కోసం ఓటరు వద్దకు ప్రాంతపు నాయకులు వస్తారు. అప్పుడు ఎవరికి ఓటు వేయాలి?

తను నివసిస్తున్న ప్రాంతం అభివృద్ది

మన ప్రాంతపు భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని అభివృద్ది చేసే ప్రణాళికతో వచ్చే నాయకుడికి ఓటు వేయాలి. కానీ తాత్కాలిక వ్యక్తిగత ప్రయోజనం ఆశ చూపే నాయకులకు కాదని అంటారు.

తను నివసిస్తున్న ప్రాంతం అభివృద్దిని పోటీ చేసే నాయకుడు కాంక్షించాలి. ఓటు వేసే ఓటరు కూడా కోరుకోవాలి. ప్రాంతపు అభివృద్దికి ప్రణాళికతో లోకల్ లీడర్ ఉండాలి. లోకల్ ఓటరు తన లొకాల్టీ డవలప్మెంట్ కోసం చూడాలి.

పోటీ చేసేవారు తమ రాజకీయ ప్రయోజనాలతో పోటీ చేస్తున్న ప్రాంతపు అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని పని చేయడానికి ప్రణాళిక ఉంటే, ఆ ప్రణాళిక అమలు చేయగల నాయకునికి ఓటరు ఓటేసి గెలిపించుకోవాలి. తద్వారా ఆ ప్రాంతపు అభివృద్ది జరుగుతుంది.

నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?

ముఖ్యంగా రేపటి తరం కోసం దార్శినికత గల నాయకుడిని ఎంచుకోవడం కోసం ఓటు వేయాలి. మంచి భవిష్యత్తు కోసం శ్రమించే నాయకునికి ఓటు వేసి, రేపటి సామాజిక శ్రేయస్సును కోరుకోవడానికి నేడు నీ ఓటు కీలకం. కావునా ఓటరు ఓటు వేయాలి. ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర

సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

భారత ఎన్నికల సంఘం గురించి

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?