వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

సంక్రాంతికి సినిమా సందడి, సినీ ప్రియులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య తెలుగు మూవీస్. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు. విడుదల కాబోతున్న రెండు తెలుగు కొత్త సినిమాలు ఎలా ఉంటాయి? అభిమానుల అంచనాలు అందుకుని రెండు విజయం సాధిస్తాయా? విశేషం ఏమిటంటే రెండు సినిమాలకు నిర్మాణ బ్యానర్ ఒక్కటే, ఇద్దరి హీరోల సరసన నటించిన హీరోయిన్ కూడా ఒక్కరే.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తెలుగు కొత్త సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ సినిమా పక్కా కమర్షియన్ సినిమా అని చెబుతున్నారు. ఊర మాస్ సినిమా ప్రచారం పొందుతుంది.

నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు కొత్త సినిమా వీరసింహారెడ్డి కూడా సంక్రాంతి బరిలో విడుదల కావడానికి సిద్దమయ్యింది. ఈ సినిమాకు కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థే నిర్మాణ సంస్థం. ఇందులో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా బాలకృష్ణ సరసన నటించింది. ఈ సినిమా కూడా గతంలో సంచలనాలు సృష్టించిన సమరసింహారెడ్డి, నరసింహనాయడు రేంజిలో ఉంటుందని ప్రచారంలో ఉంది.

వాల్తేరు వీరయ్యకు దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని, అలాగే వీరసింహారెడ్డి సినిమా దర్శకుడు కూడా బాలకృష్ణ వీరాభిమానే…. వారు ప్రేక్షకులుగా ధియేటర్లలో తమ తమ హీరోల సినిమాలను అభిమానంతో వీక్షించినవారే… ఇప్పుడు వారే తమ హీరోని ఎలివేట్ చేయడం ఈ సినిమాలలో విశేషం.

ఈ సంక్రాంతికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య సినిమాలలో ఏది బాగుంటుంది? రెండు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయా? ఇదే సినిమా అభిమానులలో ఆసక్తి… రెండు మాస్ సినిమాలే. రెండు సినిమాలలో పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు సినిమా స్టామినా ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఎటువంటి సంచనాలకు తెరతీస్తాయో చూడాలి.

తెలుగురీడ్స్

తెలుగువ్యాసాలు

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు
దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

పేదలకు దానం చేయటంవల్ల మనం
తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ