ఏ.పి.లో రాజకీయ పార్టీలు

ఏ.పి.లో రాజకీయ పార్టీలు

ఏ.పి.లో రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీలు మద్య ప్రధాన పోటి ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఉంటే, తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చురుకు పాల్గొంటున్నారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP),

ఈ పార్టీని స్థాపించిన జగన్మోహన రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయన తండ్రి స్వర్గస్థులయ్యాక, ఈయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని స్థాపించారు. ఈ పార్టీ 2014 ఎన్నికలలో పోటీ చేసి అధికారం అందుకోలేకపోయింది. కానీ 2019 అత్యధిక సీట్లు గెలుచుకుని అధికార పార్టీగా కొనసాగుతుంది.

తెలుగుదేశం పార్టీ(TDP)

సినీనటుడు నందమూరి తారకరామారావు ఈ పార్టీని స్థాపించారు. ఈయన పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే, తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేసుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ అధినేతగా నందమూరి తారక రామారావు మూడుమార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండుమార్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగితే, మూడవ మారు మాత్రం ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇంకా పార్టీని కూడా కోల్పోయారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ(TDP) అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయాక తెలుగుదేశం పార్టీ(TDP) తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ(TDP) పార్టీ ఓటమి పాలయ్యింది.

జనసేన పార్టీ

సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. కొన్ని కారణాంతరాల చేత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2014 లో కొత్త పార్టీని ప్రకటించారు. జనసేన పార్టీగా ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం, బిజెపి పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసి, కేవలం ఒక్క సీటుని మాత్రమే గెలిచింది. ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో అధికార లక్ష్యంతో పోటీ చేయడానికి సిద్దపడుతుంది.

జాతీయ పార్టీలు కాంగ్రెస్ – బిజెపి పార్టీలు.

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ కలసి ఉన్నరోజులలో జాతీయ పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ మూడు పార్టీలు ప్రధానంగా పోటీపడుతుంటే, తెలుగు రాష్ట్రాలు విడిపోయాక మాత్రం రాజకీయ పార్టీలు ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణలో టిఆర్ఎస్ మాత్రమే కనబడుతుంటే, బిజెపి బలమైన పోటీదారుగా కనబడుతుంది. కాంగ్రెస్ పూర్వవైభవం కోసం పాటుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి, టిడిపి ప్రధానంగా ఉంటే, మూడో స్థానంలో జనసేన పార్టీ కనబడుతుంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రస్తుత పరిస్థితులలో తెలుగురాష్ట్రాలలో బిజెపి బలపడడానికి ప్రయత్నిస్తుంటే, తెలంగాణలో వేగంగా విస్తరిస్తుంది. ఏపిలో జనసేనతో కలసినట్టుగా ఉంది.

ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే ఏపిలో బలంగా ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో కూడా ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు

తెలుగురీడ్స్

2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?

తెలుగు వ్యాసాలు వివిధ విద్యా విషయాలు