Hari Kodukuto Nenu Naa Jeevitamlo కష్టం కౌగలించుకున్నా, అయిష్టం ఆలింగనం చేసుకున్నా, ఆడవారు అలసిపోకుండా పనిచేస్తూనే ఉండాలి సంసారంలో. సాగర తీరంలో అలల తాకిడితో తడిచిన కాళ్ళు కన్నా, సంసారంలో కన్నీటితో తడిచిని కళ్ళు ఎక్కువగా ఉంటాయి. గచ్చు నేల అయినా, గ్రానైట్ రాయితో ఉన్న ఫ్లోర్ అయిన, బాధపడకుండా ఉండని ఇల్లాలు ఉండదు అంటారు. కట్టుకున్నవారి సంతోషం కోసం, కన్నవారి ఆలనా పాలనా కోసం తాపత్రయపడతాము. అయితే అటువంటి సంసారంలో ఆడపిల్లకు ఎక్కువ వయస్సు రాకముందే, పెళ్లి చేసేస్తారు.. అలా చేసేస్తే, ఇలా సంసారంలో సెట్ అయిపోతారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అలంటి ఆలోచన ఉన్నవారిలో మా నాన్నగారు ఒక్కరు. ఇకా నా గురించి చెప్పాలంటే హరి కొడుకు నుండి ప్రారంభం చేయాలి. జల్సా సినిమా ప్రారంభ సన్నివేశంలో మహేష్ బాబు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ నిత్య తాగుబోతుగా మనకు కనబడతారు… అదే ఇన్స్పిరేషన్ లో హరి కొడుకు కూడా అంతే, అలాంటి వాడితో నా జీవితం ఎలా మొదలయ్యింది…?
ఒక పెద్ద ఊరిలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు 1990లలో నిర్మించుకున్న బిల్డింగ్‌లో, నివాసం ఉంటున్న ఆ ఇంటి యజమాని పేరు హరి. ఆ హరికి ఒక్కడే కొడుకు. అతని పేరు మధుబాబు…
తండ్రి కొడుకుతో మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు…. కాని కన్నకొడుకు కళ్ళు మూసి పడుకుని ఉన్నాడు… కొడుకు కునుకు తీస్తున్నా, హరి మాత్రం తను చెప్పదలుచుకున్న మంచి విషయాలు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు..
మొదటి మాటగా హరి ఇలా మాట్లాడుతూ… “గర్వం ఒక్కటి చాలు, జీవితంలో సర్వం కోల్పోడానికి….”
రెండవ మాటగా, “ఆకలితో ఉన్న క్రూర జంతువు కన్నా, అత్యాశతో ఉన్న మనిషి మరింత ప్రమాదకరం.” ఇంతలో అక్కడకు ఒక అమ్మాయి వచ్చింది… హరి మాటలు వింటుంది.
మూడవ మాట మాట్లాడుతూ “కాలంలో కర్మ కలసి వస్తుంది, కాబట్టి ఇప్పుడున్న స్థితి మారుతూ ఉంటుంది.”
ఆ అమ్మాయి హరి మాటలు వింటుంటే, హరి కొడుకు మాత్రం మత్తుగా నిద్రపోతున్నాడు…. అయినా హరి మాట్లాడుతూ ఉన్నాడు.
నాల్గవ మాట చెబుతూ “నమ్మకం ఉన్న బంధంలో మౌనం కూడా మాట్లాడుతుంది… నమ్మకం లేని బంధంలో ప్రవచనం కూడా నిస్సారం అయిపోతుంది.” హరి ఇంకా మాట్లాడుతున్నాడు…
హరి కొడుకు ని పెళ్లి చేసుకుంటాను అని నేనే మొదట చెప్తే ?
“జీవితంలో ఏదీ అంత సులభంగా లభించదు, కానీ కష్టపడితే అసాధ్యం అయితే కాదు.” అంటూ అక్కడకు వచ్చిన, ఆమెను చూసి, “ఎవరు నువ్వు?” అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె హరికి బదులిస్తూ “అతను మీ అబ్బాయా?” అని ఎదురు ప్రశ్నించింది. హరి ఆశ్చర్యంగా “అవును… నా కొడుకే, మంచి మైండుకెక్కదు, చెడుతో చెలిమి చేస్తాడు.” అని అన్నాడు. ఆమె వెంటనే హరితో “నీకొడుకుని నేను పెళ్లి చేసుకుంటాను” అని అన్నది… ఈసారి హరి ఉలిక్కిపడ్డాడు.
హరి ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, “ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడూ చూడలేదు.” అని అంటూండగా, “ఓహో, ఇంతకుముందు చూసి ఉంటే, ఒప్పుకుంటావా” అని ఇంకొక గొంతు వినబడింది… హరి ఆ గొంతు విన్నవైపుగా చూసాడు… అక్కడికొస్తున్నతనిని చూసి, హరి వెంటనే అతనిని “రా… రా… ఎన్నాళ్ళకు, నీ దర్శనం కలిగింది… ఈశ్వర్, ఎలా ఉన్నావ్?” అంటూ హరి ప్రశ్నలు కురిపించేస్తూ…. అక్కడే నిలబడ్డ ఆ అమ్మాయిని చూసాడు… అప్పుడు ఈశ్వర్… “ఈ అమ్మాయి, నా కూతురే, పేరు సురేఖ…. “ అన్నాడు… హరి ఆ ఇద్దరినీ లోపలకు ఆహ్వానించాడు….
ఆ బిల్డింగ్ లో హరి, ఈశ్వర్ కూర్చుని ఉన్నారు. మధుబాబు మత్తుగా పడుకుని ఉన్నాడు… సురేఖ అక్కడ నిలబడి ఉన్నది… ఇప్పుడు ఈశ్వర్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు.
“ఒరేయ్… హరి, ఏంట్రా?” అని అతని భుజంపై చేయి వేసి, “ఇంకా అలానే మాట్లాడుతున్నావు, ఈ కాలంలో కూడా ఇలాంటి మాటలు ఎవరు వింటారు? మంచి మాటలు రుచి చూసే లోపు, చెడుతో సంసారమే జరిగిపోద్ది, అలాంటి పరిస్థితులు లోకంలో ఉంటే, నీ మాటలు విని, వాటిని దృష్టిలో పెట్టుకుని నడుచుకునే ప్రవర్తన ఉంటే, వెంటనే వాడిని మ్యూజియంలో పెట్టేస్తారు, లేదా మాలోకంగా ముద్ర వేస్తారు. కాబట్టి నా మాట విని, ఇలా మాట్లాడడం మానేయ్…” అని ఈశ్వర్, హరితో అన్నాడు. ఈ సారి హరి మాట్లాడుతూ
హరి – ఈశ్వర్ స్నేహం మధుబాబు – సురేఖ జంటకు
“మంచి మాటలు వెంటనే విని మారిపోతారని, ఎవరూ మాట్లాడరు… మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇప్పుడు విన్న మంచి మాటలు, గుర్తుకు వస్తే, అప్పుడు నా గురించి ఆలోచన చేసినవారు ఉండేవారు.. లేదా ఉన్నారు… అని ఆ మనిషి మనసుకు భరోసా ఉంటుంది… అప్పుడు ఆ మనిషి మనసు తట్టుకోగలుగుతుంది, కాబట్టి మంచి మాట నిద్రపోయేవానికి కూడా ఓపికగా చెబుతాను” అని అన్నాడు. ఇక ఈశ్వర్ హరితో మాట్లాడడం కష్టం కాబట్టి, అసలు తను వచ్చిన విషయం గురించి చెప్పడానికి ఉద్యుక్తుడు అవుతూ….
“ఒరేయ్, హరిగా… నీకు గుర్తు ఉందా, మన చిన్నప్పుడు ఒక మాట అనుకున్నాం,” అని ఈశ్వర్ అనగానే “ఏమనుకున్నాం” అంటూ అడిగాడు హరి ఈశ్వర్ ని.. మరల ఈశ్వర్ మాట్లాడుతూ “అదేరా, మన ఇద్దరిలో ఒకరికి, ఆడపిల్ల, ఒకరికి మగపిల్లవాడు పుడితే? మనలో ఎవరు ఎలా ఉన్నా? ఎవరి ఏ స్థితిలో ఉన్నా? ఒకరు గొప్పగా జీవిస్తూ ఉన్నా, ఇంకొకరు హీనంగా జీవుస్తూ ఉన్నాసరే… మన పిల్లలకు మనం పెళ్లి చేయాలి, అని అనుకున్నాం. గుర్తు లేదా…” అని అన్నాడు. అప్పుడు హరి ఈశ్వర్ తో
స్నేహంలో మాటలు ఎప్పటికి – Hari Kodukuto Nenu Naa Jeevitamlo
“ఏంట్రా… బాబు, ఎప్పుడో మన చిన్నప్పుడు, మనం ఎదో మాట్లాడుకున్నాం, అప్పుడు మనకు తెలిసి, తెలియని జీవితం, అప్పటి మాటలు, ఇంకా సీరియస్ గా తీసుకున్నవా? ఆ మాటలు వదిలేయరా…” అని ఈశ్వర్ తో హరి అన్నాడు. ఈశ్వర్ సీరియస్ గా ముఖం పెట్టి, “నువ్వు మాటంటే మాటే, ఆ మాటకు నీవు కట్టుబడి ఉంటావు అని నా నమ్మకం..” అని అన్నాడు… ఆ మాటలు విన్న హరి శాంతంగా ఒక చిరునవ్వు నవ్వి, ఈశ్వరి తో హరి ఇలా మాట్లాడుతూ “మత్తుగా నిద్రిస్తున్న ఈ నా కొడుకు పేరు మధుబాబు కాని మందుబాబుగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మందు లేనిదే ముద్ద దిగదు, మత్తు దిగితే మాట్లాడడు. మత్తేక్కితే మత్తుగా నిద్రపోతాడు… చెడుతో చెలిమి చేయడానికి చూస్తూ ఉంటాడు… మంచి మాట అంటే ఆమడ దూరం అందుకే, మత్తులో ఉన్నప్పుడే ఎదో మాట్లాడేస్తూ ఉంటాను…” అని అన్నాడు… అప్పుడు ఈశ్వర్ మాట్లాడుతూ…
“ఒరేయ్, చెడు అలవాట్లు ఒంటరిగా ఉన్నప్పుడు వాటేసుకుంటే, జంటగా ఉన్నప్పుడు జతకట్టలేవు.. వారిద్దరికీ పెళ్లి చేసేస్తే, వాళ్ళ పాట్లు వారే పడతారు” అనడంతో, హరి సీరియస్ గా ముఖం పెట్టి,
“మాట పట్టుకుని వెళ్ళడానికి, ఏదైనా తెలియని ఊరి ప్రయాణమా? ఇది జీవిత ప్రయాణం.. ఎప్పుడో చిన్నప్పుడు మన మాట కోసం, మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తావా? భరించాలి కాబట్టి వీడిని భరిస్తున్నాను… వీడు మారతాడని కాదు.. ఒకవేళ వీడు మారినా, జీవితంలో ఏం సాధిస్తాడు? నేను మారాను? అనే ఓ మంచి విషయం తెలుసుకుంటాడు కానీ అప్పటికి ఎంత చెత్త విషయాల నుండి బయటపడ్డాడో తెలుసుకుని కుమిలిపోతాడు. కాబట్టి, నేను ఇప్పుడు మాట తప్పుతాను, ఆ పాపం మూటకట్టుకోవడానికి నేను సిద్దం కానీ నీ కూతురితో కాదు ఏ కూతురుతోనూ ఈ నా కొడుకుతో పెళ్లి చేయను.” అన్నాడు… హరి మాటలకు ఈశ్వర్ ఆశ్చర్యంగా హరితో ఇలా అంటున్నాడు…
“ఒరేయ్, నీవు కన్నతండ్రివా, కసాయివాడివా? వాడు నీ కొడుకు, ఈరోజు కాకపోతే, రేపు తెలుసుకుంటాడు. అంతేకానీ కొడుకుకు పెళ్లి చేయనని అనే హక్కు నీకు లేదు. ఇదిగో నా కూతురుకు ఇష్టం అయిన వాడినిచ్చి పెళ్ళిచేయడం నా ధర్మం, అలాగే నా స్నేహితుడుగా, నీవు నా కూతురు కోరికను మన్నించడం నీ ధర్మం. నీవే అంటావుగా, ధర్మముని పాటించడం ప్రధానమంటావు కదా?“ అని ఈశ్వర్ ఆగాడు…. హరి ఆలోచనలో పడ్డాడు… ఈశ్వర్ శాంతించాడు… సురేఖ వారిని చూస్తూ ఉన్నది.
మొత్తానికి ఇద్దరి మద్య ఉన్న స్నేహబంధం కారణంగా, మందుబాబు అయిన మధుబాబుకి సురేఖతో వివాహం చేసారు. కాని వివాహానికి హరి హాజరుకాలేదు. కారణం తెలిసిందే, కొడుకు అంటే ప్రేమ ఉన్నప్పటికీ అతని అలవాట్ల కారణంగా హరి తన కొడుకు వివాహానికి వెళ్ళలేదు.
హరి కొడుకుతో సురేఖ సంసారం
మధుబాబుతో వివాహం జరిగిన తర్వాత, కాపురానికి వచ్చింది. కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. హరి తన కోడలు సురేఖతో మాట్లాడుతూ, “చూడమ్మా, నీవు మీ నాన్నగారి మాటతో పెళ్లి చేసుకున్నావు, నా మాట మీద మీ నాన్నగారు ఈ పెళ్లి చేసాడు. మా మధ్య ఉన్న బంధం నీకు గుదిబండగా మారుతుందని ఊహించలేదు. వీడికి వీధుల వెంట తిరిగడానికి ఉన్న ఆసక్తి, ఇంట్లో పెళ్ళాంపై లేదు. ఏ వీధిలో ఏమి భాగోతం చేస్తున్నాడో? చూసి వస్తాను,” అంటూ బయటకు బయలుదేరాడు.
హరి ఇంటి నుండి ఇలా బయటకు వెళ్ళగానే, అలా మధువు సేవించిన, మధుబాబు ఇంట్లోకి వచ్చాడు. సురేఖ తూలుతున్న మధుబాబుని నడిపించుకుని, వారి గదిలోకి తీసుకువెళ్ళి మంచంపై పడుకోబెట్టింది. మధుబాబు మంచంపై పడగానే మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. ఈలోపు హరి ఇంటికి తిరిగి వచ్చాడు. “ఎమ్మా, వాడు వచ్చాడా?” అని అడిగాడు… సురేఖ వచ్చాడు అన్నట్టుగా తల ఊపింది. హరి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇలా కొన్ని రోజు గడిచాయి… రోజు సాయంత్రం అయ్యేసరికి కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళే హరి, హరి బయటకు వెళ్ళగానే మధువు సేవించిన మధుబాబు ఇంటికి రావడం… సురేఖ అతనిని పడుకోబెట్టడంతో రోజులు మధుబాబుకి మత్తుగా, హరికి దిగులుగా, సురేఖకు భారంగా గడిచిపోతున్నాయి.
ఒకరోజు మాత్రం ఇందుకు భిన్నంగా మధుబాబు బయటకు వెళ్ళకుండానే ప్రకృతి కట్టడి చేసింది. కారణం రాత్రి మొదలైన వాన ఉదయం నుండి మరలా రాత్రిదాకా కురుస్తూనే ఉన్నది… హరి టీవీ చూస్తున్నాడు. బయటకు వెళ్ళేదారి లేక ఇంట్లోనే ఇరుక్కుపోయిన మధుబాబు. వంటచేస్తున్న సురేఖ….
మధుబాబుగా మారనున్న మందుబాబు
రొజూలాగా గడవని ఆ రోజు మధుబాబుకి కొంచెం కష్టంగా అనిపించింది. ఆలోచనలో పడ్డాడు… ఏమిటి? ఈ మధ్య నీతులు చెప్పే నాన్న, సైలెంటుగా ఉన్నాడు. నిద్రపోతున్నా సరే, మాట్లాడే, నాన్న ఇప్పుడు, ఎదురుగా ఉన్నా మాట్లాడడం లేదు. అని ఆలోచన చేస్తూ ఉన్నాడు.. ఇంతలో సురేఖ వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు ప్లేటులో పెట్టి అతని ముందు పెట్టి, అక్కడి నుండి వెళ్లిపోయింది… అతని ఆలోచనలు సురేఖపైకి పోవడం మొదలయ్యాయి… పెళ్ళైన అప్పటి నుండి ఇప్పటిదాకా రొజూ, తాగుతూనే ఉన్నా, మందు త్రాగావద్దు అని ఎప్పుడు అనలేదు. అనుకుంటూ ఉన్నాడు. మధుబాబు బజ్జీలు తినేసరికి, సురేఖ మంచినీరు తీసుకువచ్చి, అతనికి ఇచ్చి మరలా వంటగదిలో వెళ్ళింది. మధుబాబు అక్కడి నుండి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. హరి ప్రక్కన మధుబాబు కూర్చున్నాడు. ప్రక్కనే కూర్చున్న మధుబాబుని చూస్తూ, హరి మాట్లాడుతూ “ఏమిటి, ఆలోచిస్తున్నావ్?” అని ప్రశ్నించాడు. వెంటనే “ఏమి లేదు” అన్నట్టుగా మధుబాబు తల అడ్డంగా ఊపాడు.
“ఏమిటి? పెళ్ళైన నాటి నుండి, నేటివరకు నీ భార్య నీతో మాట్లాడలేదు, ఇంకా త్రాగుడు మానమని అడగనూ లేదు. కారణం ఏమిటా? అని ఆలోచిస్తున్నవా?” అని హరి మరలా మధుబాబుని ప్రశ్నించాడు. ఈసారి మధుబాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు.
“చూడు, ఎవరైనా బంగారాన్ని సాన పెడతారు, ఎందుకంటే అది ఆభరణాలుగా మారతాయి కాబట్టి. రాళ్ళను పట్టించుకోరు. నువ్వు అలాంటివాడివే, కాబట్టి ఆమె నీతో మాట్లాడలేదని బాధపడకు…” అంటూ, హరి మధుబాబుని చూస్తున్నాడు. సురేఖ ఆ మాటలు వినిపడినా, విననట్టుగా తన పనిని చేసుకుంటుంది. మధుబాబు ఏమి మాట్లాడలేదు… హరి అక్కడి నుండి లేచి తనగదిలోకి వెళ్ళిపోయాడు. సురేఖ పని పూర్తీ చేసుకుని బెడ్ రూమ్‌లోకి వెళ్ళింది… మధుబాబు కూడా తిరిగి తన గదిలోకి వచ్చాడు. ఆమె మంచంపై పడుకుని ఉంది. అతను, ఆమె ప్రక్కనే కూర్చుని ఆమెతో మాట్లాడుతూ… “నా మీద నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాడు.
ఆమె అతనితో “మీరు చాలా మంచివారు” అని అన్నది. ఆ మాటతో మధుబాబు మాట్లాడకుండా పడుకున్నాడు.
మంచి మాట మనసుని తాకితే హరి కొడుకు మనసుని తాకిన మాట?
మరుసటి రోజుకు వాన తగ్గడంతో ప్రకృతి చాలా ప్రశాంతంగా మారిపోయింది…. ఎప్పుడు లేటుగా లేచే మధుబాబు ఆ రోజు సూర్యుడు రాకముందే లేచి, మార్నింగ్ వాకింగ్ మొదలు పెట్టాడు. పార్కులో వాకింగ్ చేస్తున్న మధుబాబుకు “ఒరేయ్…” అన్న పిలుపు వినపడడంతో అక్కడ ఆగాడు… పరిగెత్తుతూ వస్తున్న తన మిత్రుడు కనబడ్డాడు, మధుబాబుకి… “ఒరేయ్ ఏంట్రా?” అంటూ పార్కు చుట్టూ చూస్తున్నాడు.. అప్పుడు మధుబాబు తన మిత్రుడితో “ఏంట్రా, అలా చుట్టూ చూస్తున్నావు” అన్నాడు… “నేను వచ్చింది, మార్నింగ్ వాకింగ్ కా లేదా ఈవెనింగ్ వాకింగ్ గా ? ఏం అర్ధం కావడంలేదు” అన్నాడు.. వెంటనే మధుబాబు “ఏడిసావు లే… ఎక్ష్ట్రాలు చేయకు” అనడంతో అతను మధుబాబుతో “ఎప్పుడూ, మధుబాబుకు మందు ముఖ్యం కదా, మిగిలినవన్నీ మధుబాబుగారికి అనవసరం కదరా… ఇలా ఏకంగా బుద్దిమంతుడు వలె వాకింగ్ చేస్తుంటే..?” అని ఆగి మరలా అతను “ఏంట్రా? ఎదో ఆలోచిస్తున్నావ్?” అన్నాడు. అప్పుడు మధుబాబు తన మిత్రుడితో “నేను మంచివాడినా?” అన్నాడు. వెంటనే అతను “ఎవడ్రా, నిన్ను చెడ్డవాడు అన్నది, వాడిని…” అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే… మధుబాబు “ఎహే, నీ వెటకారం ఆపు,” అని విసుక్కున్నాడు.
అప్పుడు అతను “మధు మంచి వాడంటే, నీతో సహ, ఎవరు నమ్మరు. చూసావా నికే సందేహం వచ్చేసింది. మధుబాబు పేరు ప్రక్కన మంచి ట్యాగ్ లైన్స్ పెట్టుకోవచ్చు, ఈ మధుబాబుకు మాత్రం చెడు టాగ్స్ పెట్టుకోవచ్చు. ” అన్నాడు. ఈ సారి మధుబాబు సీరియస్ గా ముఖం పెట్టి “ఏరా.. నీ వాగుడు ఆపుతావా” అనడంతో అతను మౌనం వహించాడు. మధుబాబు తన మిత్రుడితో మాట్లాడుతూ “ఒరేయ్, నా భార్య ఈ మాట అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏం మాట్లాడకుండా, రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను.” అనడంతో మధుబాబు మిత్రుడు మాట్లాడుతూ “మధుబాబు, భర్తలో ఎంత చెడు గుణం ఉన్నా, పట్టించుకోకుండా ఉండేవారు చాలా తక్కువమంది ఉంటారు… ఎవరో అదృష్టవంతుడికే, ఆ అవకాశం ఉంటుంది. నీవు అదృష్టవంతుడివి… నాకు టైం అవుతుంది” అంటూ అక్కడి నుండి బయలుదేరాడు. మధుబాబు కూడా మార్నింగ్ వాకింగ్ ముగించాడు.
హరి కొడుకుతో సురేఖ మాటలు
సాయంకాలం వేళలో తాగకుండా, తిరిగి ఇంటికి వచ్చిన మధుబాబుని చూసిన వారు, మధుబాబుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. జోరుగా వర్షంపడుతూ ఉన్నప్పుడు, వెంటనే వాన ఆగిపోయి ఒక్కసారిగా ఎండవస్తే ఎలా ఉంటుందో? అలా ఉంది హరి ఇంటిలో హరికి మరియు అతని కోడలికి? అలా ఆ సాయంత్రం ఓ ఆశ్చర్యంగా గడిచిపోయి, రాత్రి అయ్యింది. మధుబాబు మంచంపై పడుకుని ఉన్నాడు… అక్కడికి సురేఖ వచ్చి, అతని ప్రక్కన పడుకుని ఉంది. మధుబాబు సురేఖను చూస్తూ “నేనెందుకు మంచివాడిని అనుకుంటున్నావు?” అని ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె అతనితో ఇలా అన్నది. “మా నాన్నగారు ఎప్పుడూ నాతో ఒక మాట చెబుతూ ఉంటారు. ఏమిటంటే? నీ చుట్టూ మంచివారే ఉంటారు, అని అందుకే మీరు మంచివారు అన్నది.” మధుబాబు మరలా ఆశ్చర్యపడుతూ “మీ నాన్నగారు చెప్పారని, నేను మంచివాడిని, అంతేనా?” అన్నాడు.
ఆమె మరలా మధుబాబుతో మాట్లాడుతూ “మంచివాళ్ళు ఎప్పుడూ, ఇతరులను బాధపెట్టరు, వారికి బాధ వస్తే, వారు మాత్రమే బాధపడతారు. వారి లోకంలో వారే ఉంటారు. మీరు అంతే, మీకేదో బాధ అనిపించింది. ఆ బాధను మీరే అనుభవిస్తున్నారు… మీ బాధ తీరిపొతే చాలు.” ఈ సారి మధుబాబు మరింత ఆశ్చర్యచకితుడయ్యాడు.
సశేషం – Hari Kodukuto Nenu Naa Jeevitamlo
రాజు మూర్ఖత్వం రాజ్యానికి ముప్పు


