AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా?

AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా? ఇది ఈ రోజుల్లో ఎక్కువమందిలో ఎదుగుతున్న ప్రశ్న, ఎందుకంటే AI అందరికి అందుబాటులో ఉంది. అయితే ఈ “AI వస్తే మన ఉద్యోగాలు పోతాయా?” ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. కానీ ఒక విషయం మాత్రం అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే AI కూడా మనషులు చేసిందే, అది కాకపోతే ఆటోమేషన్ సిస్టం కాబట్టి…. AI వల్ల కొందరికి ఉద్యోగాలు పోవచ్చు… కానీ కొత్త అవకాశాలు వస్తాయి…మొత్తానికి AI jobs పోగొట్టేదికాదు… […]
ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు – భవిష్యత్ విజయానికి మార్గదర్శి

ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు – భవిష్యత్ విజయానికి మార్గదర్శి అవుతుంది. సరిగా సద్వినియోగం చేసుకుంటే విద్యలో వేగంగా ముందుకుసాగవచ్చు…. ఈ విద్య అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరిచయం ప్రపంచం చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ కాలంలో, విద్య కూడా మార్పులు చెందుతుంది. గతంలో పుస్తకాలలోనే లభించే విద్య, ఇప్పుడు సాంకేతికతతో కలసి ఒక కొత్త దిశలో పయనిస్తోంది. ఈ మార్పునే “ఆధునిక విద్య” (Modern Education) అని అంటాము. ఇది కేవలం జ్ఞానం అందించడం […]
వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా

వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా ఒకమంచి వ్యాసం రాయడానికి ఒక పద్ధతి (writing process) ఉంటుంది. ఒక విషయం గురించి మన ఆలోచనలు, అభిప్రాయాలు, వివరాల్ని సరళంగా, ఓ క్రమపద్ధతిలో అక్షర రూపంలో అందించే ప్రక్రియ. ఇప్పుడు వ్యాసం ఎలా రాయాలి? ఆ ప్రక్రియ ఏమిటి చూద్దాం! వ్యాస ప్రక్రియలో విషయం (Topic) ఎంపిక ఈ విషయం గురించి రాయదలచామో, దేనిపై స్పష్టత ఉండాలి. ఎక్కువగా సామజిక ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శ్రేయస్కరమైన […]
ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది. ఓ చిన్న కధ. జీవితంలో ఫస్ట్ ఫెయిల్యూర్ అంటే మన ప్రయత్నం ఎంతవరకు చేసామో? అది మనకు పరిచయం అవ్వడం మాత్రమే. kadha vinadaniki ee krindi play button click cheyandi. ఆడియో కధ కోసం ఈ క్రింది ప్లే బటన్ క్లిక్ చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం. ఆకాశంలో సూర్యుబింబం నారింజ రంగులో మెరిసిపోతుంది. లుంబిని పార్క్ జనంలో కళకళలాడుతుంది. ఆ పార్కులో ఒక పక్కగా ఉన్న చిన్న […]
బయట ఆటలు ఆడండి
ఈ రోజులలో స్మార్ట్ ఫోన్, టాబ్స్ వచ్చాకా, పిజికల్ గేమ్స్ తగ్గి, డిజిటల్ గేమ్స్ కు బాగా అలవాటు పడుతున్నారు. ఇది ఏ మాత్రం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. మనకు ఆటలంటే ఇష్టం లేకపోయినా, పిజికల్ ఆటలు ప్రతివారు రోజూ కొంత సమయం ఆటలు ఆడాలి. అప్పుడే శరీరం ధృడంగా మారుతుంది. మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యంగా సెట్టిల్, క్రికెట్, కబడ్డీ వంటి ఆటలు ఆడడం చేయాలి… ఆటలు ఆడడం వలన మనసులో […]
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి మనకు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెంపొందించుకోవడం, పఠన శక్తిని పెంచుకోవడం, మంచి అలవాట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆసక్తి లేకపోయినా, రోజుకు కనీసం 30 నిమిషాలు కథలు లేదా జ్ఞానపరమైన పుస్తకాలు చదవాలి. అందువలన మనసుకు ఊహాశక్తి పెరుగుతుంది. ఇంకా మాతృభాషలో, భాషా పరిజ్ఞానం పెంచుతుంది. చరిత్ర పుస్తకాలూ చదవడం వలన, గతంలో సమాజం ఎలా ఉన్నది? ఇప్పుడు మనం చూస్తున్న సమాజం ఎలా ఉంది? భవిష్యత్తులో సమాజం […]
కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి
విద్యను నేర్చుకోవడానికి స్కూల్ కు వెళ్తున్నాం… అక్కడచెప్పే పాఠాలు కాకుండా, ఇంకా మీకు ఏమిటి ఇష్టం అయితే, మన మనసుకు ఒక ఇష్టం ఉంటుంది. సాహిత్య పుస్తకాలు చదవడం, కధలు రాయడం, మ్యూజిక్, పాడడం, డాన్స్, డ్రాయింగ్, ఏదైనా ఆటలో అమితమైన ఆసక్తి, పరిశోధన… ఇలా ఎదో ఒక అంశంలో మనసుకు ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు. మనసుకు ఏదైతే ఇష్టమో, దానిపై మీరు దృష్టి పెడితే, ఆ విషయం మీకు త్వరగా వస్తుంది. పుస్తకాలు చదివే ఆసక్తి […]
ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి.
సెలవులు రాగానే ఆనందం ఇష్టారీతిన ఉండడం వలన సెలవులు అని ఆనందించేలోపు కాలం గడిచిపోతుంది. కాని సెలవులలో కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుని, ఆ విధంగా రోజుని నడిపిస్తూ ఉంటే, మీకు సమయపాలన(Time Punctuality) వస్తుంది. సమయపాలన(Time Punctuality) వ్యక్తి జీవితంలో చాలా చాలా ప్రధానమైనది. కాబట్టి వేసవి సెలవులలో కూడా మీకు, ఒక సింపుల్ టైమ్‌టేబుల్ ఉండాలి — చదువు, ఆట, విశ్రాంతి అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి. […]
మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది
10వ తరగతి ఫలితాలు (10th Class Results) మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది! పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటే… జీవితం అంతా ముగిసిపోయిందని అనిపించిందా? అలా అనిపించడం ఖచ్చితంగా తప్పు అని తెలుసుకోండి. ఎందుకంటే: పరీక్ష(Exam) అంటే? ఒక నిర్దిష్ట సమయంలో ఒక విద్యార్ధి తనకు ఇవ్వబడిన ప్రశ్నాపత్రాని(Question Paper)కి జవాబులు రాయడం… మీరు ప్రశ్నలు (Questions) ఎంత ఖచ్చితంగా సమాధానాలు రాసారు? దానిని బట్టే మార్కులు వస్తాయి… పరీక్షలు(Exams) వ్రాసిన తర్వాత, ఏ […]
వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం

వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం ముందుగా నిద్రలేవడం అలవాటు కావాలి. how to use summer holidays వేసవి సెలవులు కేవలం ఆటపాటలకే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జీవితంలో కాలం చాలా విలువైనది… వృధా చేస్తే, అది తిరిగి రాదు. కనుక కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే, అవి బంగారు రోజులుగా భవిష్యత్తులో గుర్తుకువస్తాయి. లేదంటే ఆ రోజులు అంటూ ఎవరినో నిందిస్తూ నిట్టుర్చే రోజులుగా భవిష్యత్తులో […]
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు. అది విద్యార్ధి తెలుసుకున్న విషయ పరిజ్ఞానానికి పరిక్ష, తనకు తెలిసినది తను సరిగ్గా పరీక్షా పేపర్లో రాయగలగడమే…. కేవలం ఒక్క పరీక్షలో ఫెయిల్ అయితే కాదు తర్వాతి పరిక్షలలో ఎలా సిద్దం అవ్వాలనే ఆలోచన ప్రధానం. చిన్న కధ : పరిక్షల ఫలితం రవి చాలా తెలివైన బాలుడు, అతను బాగా చదివేవాడు కానీ ఎవరైనా విమర్శిస్తే, విశ్వాసం లోపిస్తుంది. ఆ విధంగా విశ్వాసం […]
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది” చంద్రయ్య ఒక రైతు. ఒక రోజు అతను బ్యాంక్ నుండి కొంత డబ్బు విత్ డ్రా చేసుకుని, ఒక చిన్న బ్యాగులో డబ్బు మరియు డాకుమెంట్స్ పెట్టుకుని బస్ స్టాండ్ కు వెళ్తున్నాడు. బస్ స్టాండ్ చేరుకునే సరికి అతనికి ఒక్కసారిగా గమనమైంది — బ్యాగ్ మారిపోయింది! అతని గుండె ఒక్కసారిగా గుబులు కొట్టింది.“అయ్యో! నా బ్యాగ్ మారిపోయింది!” అని అతను తీవ్రంగా ఆందోళన చెందాడు. ఏం చేయాలో తెలియక, […]
చిన్న కథ: ఓర్పు విలువ
ఒక చిన్న కథ: ఓర్పు విలువ ఒక చిన్న గ్రామంలో ఓర్పు తక్కువ ఉన్నసోము అనే బాలుడుకి పెద్ద ఆశలు ఉండేవి, పని ప్రారంభానికి ముందే, ఆ పని ఫలితం గురించి ఆలోచనలు, బలమైన కోరికలు ఎక్కువ. ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని ఆశపడేవాడు. ఒకసారి అతను తన తండ్రి విత్తనాలు నాటడానికి పొలానికి వెళుతుంటే, సోము కూడా తండ్రిని అనుసరించాడు. సోము తన తండ్రితో, “నాన్నా, ఇవి ఎప్పుడు మొలకెత్తుతాయి?”తండ్రి నవ్వుతూ “కొన్ని […]
మీ అభిమాన నాయకుడు లేదా నాయకురాలి

మీ అభిమాన నాయకుడు లేదా నాయకురాలి గురించి చెప్పడానికి, ముందుగా వారి గురించి మీకు ఏమి తెలుసో చెక్ చేసుకోవాలి. వారు మీ దృష్టిలో పడడానికి కారణం ఏమిటి? అంటే ఏదైనా పుస్తకంలో చదివారా? ఏవైనా ప్రసంగాలు విన్నారా? వారిలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి? వారి జీవిత విశేషాలు ఏమిటి? వారు సమాజానికి చేసిన సేవలు ఏమిటి? వారు సమాజంలో ఏవిధంగా నాయకుడుగా మారారు. వారిలో మీకు నచ్చిన నాయకత్వ లక్షణం ఏమిటి? వంటి కోణాలలో […]
నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం

నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం గురించి తెలుపుతూ తెలుగులో వ్యాసం. వ్యక్తికి విజ్ఞానం ముఖ్యం అయితే, జీవితంలో లక్ష్యానికి కావలసిన జ్ఞానం పుస్తకాలు, పాఠాలలో లభిస్తుంది. అక్షరజ్ఞానం ఉన్న మనిషి జీవితంలో పుస్తకాలకు ప్రత్యెక స్థానం ఉంటుంది. ఇంకా కొందరికి మనసులో నాటుకుపోయిన పాఠాలు కూడా ఉంటాయి. చదువుకున్న పాఠాలు మనకు జ్ఞానం అందిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు మనఃశాంతిని ప్రసాదిస్తాయి. ప్రతిఒక్కరికీ తనకు ఇష్టమైన పుస్తకం ఉంటుంది. గుర్తు ఉండే పాఠం […]
అనుమానం పెనుభూతం – మనసును బాధతో మెలిపెట్టే భావన
అనుమానం పెనుభూతం – మనసును బాధతో మెలిపెట్టే భావన పెద్దలు చెప్పిన పెద్ద మాట, మనిషి జీవితంలో భావోద్వేగాలు చాలా ఉంటాయి, అవి చాలా ముఖ్యమైనవి. కొన్ని మనకు బలం అయితే, కొన్ని మనకు బలహీనత. అలాంటి బలహీనత భావనలలో “అనుమానం” ఒకటి. అందుకే పెద్దలు “అనుమానం పెనుభూతం” అని అంటారు. అంటే, చిన్నగా మొదలైన అనుమానం తర్వాత పెద్ద సమస్యగా మారి జీవితాలనే ప్రభావితం చేస్తుంది. అనుమానం ఒక చిన్న సందేహమే అనుకుంటే, పొరపాటు… మొదట్లో […]
విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం

విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం (వ్యాసం) తెలుగురీడ్స్. విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం నేటి యుగంలో విజ్ఞాన శాస్త్రం లేకుండా మనవ మనుగడ అసాధ్యం కానీ దాని ప్రభావం రెండు రకాలుగా మనపై ఉంటుంది. మానవ మనుగడలో విజ్ఞాన శాస్త్రం అనేది మానవ అభివృద్ధికి మూల స్తంభం. మనిషికి అవసరమైన విషయాలను మరింత సులబతరంగా మార్చుకోవడంలో మనిషికి విజ్ఞాన శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది జ్ఞానాన్ని విశ్లేషించే విధానమే కాదు, జీవితాన్ని మారుస్తూ, సమాజాన్ని […]
స్మార్ట్ ఫోన్ వరమా? లేక శాపమా? వివరించండి?

స్మార్ట్ ఫోన్ వరమా? ఎలా? స్మార్ట్ ఫోన్ శాపమా? ఎలా? అది ఒక విజ్ఞాన విషయ శోధనకు గొప్ప పరికరం అతిగా వాడటం వలన శాపమే అవుతుంది. ప్రపంచం అంతా అరచేతిలో చూపిస్తుంది. అనవసర విషయాలపై ఆసక్తి పెరిగితే, జీవన లక్ష్యం దెబ్బతింటుంది. ఆన్ లైన్ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. ఆన్ లైన్ వలన వ్యక్తిగత భద్రతకు భంగం కలగవచ్చు ఎంతోమందికి డిజిటల్ అవకాశాలను స్మార్ట్ ఫోన్ వలన కలుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడడం అంత […]
నా గురువు గురించి నేను

నా గురువు గురించి నేను చెప్పగలగడం, అంటే అది మా గురువుగారి అనుగ్రహమే కారణం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ రాయడానికి నా గురువు ప్రధమ కారణం. అక్షరాభ్యాసం దగ్గర నుండి నేను గురువుల దగ్గర విద్యను అభ్యసించాను. కానీ నాకు నేను సొంతంగా అలోచించి ఈ ఆర్టికల్ రాయగలుగుతున్నాను అంటే అది గురువుగారి అనుగ్రహం నాపై ఉండడమే… ఇలా మా గురువుగారు పిల్లలను చాలామందిని తీర్చిదిద్దారు అని మా స్కూల్ నందు ఇతర ఉపాధ్యాయులు […]
తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది

తెలుగురీడ్స్ డాట్ కామ్ ఆర్టికల్: తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది. ఈ ఆర్టికల్ వినడానికి క్రింది బటన్ టచ్ / క్లిక్ చేయండి. స్మార్ట్ ఫోన్ పిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది… ఇప్పుడు ఓటు హక్కు ఉన్న, కుటుంబ సభ్యులందరి దగ్గరా, స్మార్ట్ ఫోన్ తప్పనసరి అయ్యింది. అందువలన తల్లి దగ్గరా స్మార్ట్ ఫోన్, తండ్రి దగ్గరా స్మార్ట్ ఫోన్… ఇలా అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉండడం వలన వచ్చే ప్రధాన […]
చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా?
చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా? లేక శాకాహారుల కోవలోకి వస్తాయా? మీరు గమనించారా? ఏదైనా తీపి పదార్ధం క్రింద పడితే, వెంటనే చీమలు చేరతాయి. బెల్లం, పంచదార, మిఠాయిలు, జీడిపప్పు… తదితర తీపి పదార్ధాలను చీమలు తింటాయి. ఇంకా కొన్ని రకాల చీమలు అయితే మొక్కల ఆకులను, పండ్లను తింటూ ఉంటాయి. కొన్ని రకాల చీమలు చిన్న పురుగులను, కీటకాలను తింటూ ఉంటాయి. కొన్ని చీమలు విత్తనాలు వంటి వాటిని కూడా తింటాయి. ఈ విధంగా చుస్తే, […]
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? జీవితంలో విజయం సాధించాలని, ప్రతివారూ కోరుకుంటారు. కానీ, అందుకు కేవలం ఆలోచనలు మాత్రమే ఉండటం సరిపోదు. లక్ష్యం సాధించడానికి కృషి చేయడానికి, ఆ కృషిలో పట్టుదల ఉండేలా ఉండటానికి అవసరమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలను, మన వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు, కార్యాలను నిర్దేశిత పద్ధతిలో చేయడం, అడ్డంకులను అధిగమించడం. ఒక నిర్దిష్ట విధానంలో […]
ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే
శీర్షిక: సంఘంలో ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే బలం, విడి విడిగా ఉంటే, సంఘం బలహీనతగా మారుతుంది. అలాగే ఒక ఊరు కూడా… పచ్చని పొలాలతో, నదీ ప్రవాహంలో ప్రక్కనే ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మనపల్లెగూడెం. ఆ గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. గ్రామస్తులు, వారి వారి ఆచారాలు, మతాలు మరియు భాషలలో విభిన్నమైనప్పటికీ, ఆ ఊరితో కలసిపోయారు. ఊరిలో కొత్తవారు / ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని […]
స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ
శీర్షిక: “స్వాతంత్ర్య పోరాటం: ఒక వర్గ చర్చ” స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ ఒక పాఠశాలలో బుధవారం ఉదయం వేళలో, 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంతో సందడిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిస్టరీ క్లాస్ ప్రత్యేకంగా ఉంటుంది. వారి ఉపాధ్యాయుడు, శ్రీ రామకృష్ణ శాస్త్రి చాలా చక్కగా చరిత్ర గురించి పిల్లలకు వివరించి చెబుతారు. అయితే ఈరోజు సబ్జెక్టు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై పాఠం, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరగా ఉండే అంశం. మిస్టర్ రామకృష్ణ శాస్త్రి […]
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి పోస్తుంది. ఈ కధలో నిత్య కధానాయిక, ఆమె చేసిన సాహసం ఏమిటి? ఈ కధలో… ఒకానొక కాలంలో, పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో, నిత్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాల దయగలది, ఆసక్తిగలది మరియు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాలను కలిగి ఉండాలని కలలు కనేది. ఒకరోజు మధ్యాహ్మ వేళలో, ఊరి అంచున ఆడుకుంటూ ఉండగా, ఆమె ఇంతకు ముందెన్నడూ గమనించని దారి ఆమెకు కనిపించింది. […]
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన […]
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం […]
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా […]
సన్మాన పత్రం ఇన్ తెలుగు
సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి… ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో […]
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ, […]
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు. విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం […]
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు. ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ, […]
మహా భారతంలో ధర్మరాజు గురించి
మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు ధర్మరాజు గొప్పవాడు? ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి […]
రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం
పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే […]
Telugu Basic Words English Meaning
Telugu Basic Words English Meaning కొన్ని తెలుగు ప్రాధమిక పదాలు… నేను (Nēnu) – I నాకు (Naku) – For me నువ్వు (Nuvvu) – You (informal) మీరు (Mīru) – You (formal) అతను (Atanu) – He ఆమె (Āme) – She అది (Adi) – It వాళ్లు (Vāḷḷu) – They ఇది (Idi) – This అది (Adi) – That ఎవరు (Evaru) – […]
నేటి నీ కృషి రేపటికి నీకు
నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది. అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే, […]
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, 1891 నుండి 1956 వరకు జీవించిన ప్రముఖ భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సంఘ సంస్కర్త. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారతదేశ రాజ్యంగముని రచించినవారిలో ముఖ్యులు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు. సామాజిక న్యాయం కోసం నిబంధనలను చేర్చేలా రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో గణనీయమైన కృషి చేశారు. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు. 1950లో అమల్లోకి వచ్చిన […]
నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?
నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి? నేను ఎవరికి ఓటు వేయాలి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? రాజకీయ కారణాలతో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎవరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశాలు ఏమిటి? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల వేళలో పరిశీలించారా? ఐదేళ్లకు ఒక్కమారు ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగిన ఎన్నకలలో గెలిచిన రాజకీయ పార్టీ, ఐదేళ్ల కాలం పాటు ప్రజలను […]
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము. భారత స్వాతంత్ర్యం వచ్చాక, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ప్రజల తీర్పును గౌరవించిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అదుకు తగినట్టుగా తమ వంతు పాత్రను పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు విభిన్నంగా తీర్పులు చెప్పిన సందర్భములు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం అందించిన పార్టీకి, ప్రాంతీయంగా ఓటమి తప్పలేదు. అలా ఓటరు ఏవిధంగా తమ తీర్పును చెప్పినా భారతదేశంలో రాజకీయ […]
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఇదే ప్రధానాంశంగా ఉంటుందని అంటారు. సాదారణంగా ప్రజలు ఒక రాజకీయ పార్టీని చూసి ఓట్లేసేది, తమ ప్రాంతము లేదా తమ సామాజిక వర్గము అభివృద్ది చెందుతుందని ఆశించి ఓటు వేస్తారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన అభివృద్దే, ఎన్నికల వేళలో ప్రజలపై ప్రభావం చూపే అంశంగా మారుతుంది. అధికార పార్టీ పాలన చేత […]
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర, సమాజాన్ని శాసించేగలిగే స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలో లేదా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా, సదరు రాజకీయ పార్టీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ విధానలే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమాజంపై ప్రభావం చూపుతాయి. ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం చూపగలదు. అలాగే ప్రతపక్షంలో ఉన్న ఇతర చిన్న […]
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? సమాజంలో జరుగుతున్న విశేషాలను, సమాజంలో జరుగుతున్న పరిణామాలను, సమాజంలోని అధికార, ప్రతిపక్ష నేతల నిర్ణయాలను, సమాజంలో వస్తున్న మీడియా వార్తలను నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, తమ అభిప్రాయాలను సమాజంలోని ప్రజలకు తెలియజేయడానికి ఉత్సాహం చూపించే వారిని సామాజిక విశ్లేషకుడు అంటారు. వీరు ఎక్కువగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని పరిశీలించి, తమ అభిప్రాయలను తెలియజేస్తూ ఉంటారు. వీరు ఏ పార్టీని సమర్ధించడం ఉండదు. వీరు ప్రజల కోసం […]
విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?
విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు? విజయం అంటే పోటీలో గెలుపుని విజయంగా చెబుతారు. ఇద్దరు లేక ఎక్కువమంది పాల్గొన్న పోటీలలో పోటీదారులు సాధించే ఫలితాన్ని విజయం అంటారు. అలా విజయం పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. విజయము వివిధ సందర్భాలలో అప్రటితంగా కూడా ఉంటుంది. అంటే వ్యక్తి తన మనసుపై తాను సాధించిన పట్టుని కూడా విజయముగానే వర్ణిస్తారు కానీ అది అతని అంతర్లీనంగానే ఉంటుంది. కానీ సహజంగా పోటీలలో పాల్గొని అందులో పొందే […]
రైతుల కష్టాలు గురించి 10 lines
రైతుల కష్టాలు గురించి 10 lines. సమాజంలో రైతు బ్రతుకు తెరువు భారంగా మారుతుందని మీడియాలో వార్తలు వింటూనో, చూస్తూనో ఉంటాము. వ్యవసాయం చేసిన రైతు కష్టం, సాటి రైతుకే ఎరుక అంటారు. నేడు అనేక రకాలుగా వ్యవసాయం చేసే రైతు కష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టం అవుతుంది. ఎలా చెప్పగలం అంటే… రోజూ వార్తలలో రైతు కష్టాల గురించిన వార్తలు వినడమే కాదు, సమాజంలో వస్తున్న సినిమాలలో కూడా రైతు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. రైతు […]
వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి
వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది? వాస్తవం వార్త రూపంలో ప్రజలకు చేరేలోపు, అవాస్తవం పుకారువలె ఓటరు మనసులోకి చొచ్చుకుపోతుంది అంటారు. వాస్తవం ఏమిటి? అవాస్తవం ఏమిటి? రాజకీయ పరంగా రాజకీయ నాయకుల మాటలు ఎన్నికల ముందు ఎలా ఉంటున్నాయి? ఎన్నికల తరువాత ఎలా ఉంటున్నాయి? ఎన్నికల ముందు సరైన ఆలోచన చేస్తే, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం అందరి భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తుందని అంటారు. కావునా ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన […]
చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి!
చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి! గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, చర్యలు ఇంకా వాటి పరిణామాల అధ్యయనం మరియు విశేషాల గురించి చరిత్ర మనకు తెలియజేస్తుంది. జరిగిన గొప్ప గొప్ప కార్యాలు, వాటిని సాధించిన ఘనుల గురించి చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. సమాజంపై విశేషంగా ప్రభావం చూపిన వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, చర్యల గురించి, ప్రకృతి పరిణామాలు, వాటికి గల కారణాలు, ప్రోత్సహించినవారి గురించి చరిత్ర తెలిపుతుంది. ఒక్కసారి జరిగిన విషయం, దాని వ్యాప్తి మరియు […]
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి. ఈ శీర్షికతో వ్యాసం! నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కావునా నేడు విద్యార్ధి నేర్చుకునే నైపుణ్యాలు, రేపటి భవిష్యత్తుకు పునాది. కాబట్టి విద్యార్ధి దశలోనే బలమైన పునాది ఉంటే, అది వారి అభివృద్దికి మరియు దేశాభివృద్దికి తోడ్పడుతుంది. ప్రపంచంలోఅనేక రంగాలు, వాటిలో అనేక కొత్త ఆవిష్కరణలు ఉంటున్నాయి. ఇంకా ఉంటాయి. ఆయా రంగాలలో మరింత అభివృద్ధిని సాధించడానికి ఇప్పటి నుండే ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోటిపడి […]
సామాజిక మార్పును ప్రభావితం చేసే అంశాలను వివరించండి
సామాజిక మార్పును ప్రభావితం చేసే అంశాలను వివరించండి. సామాజిక మార్పును ప్రభావితం చేసే అంశాలు అనేకం. సమాజంలో మార్పును తీసుకురావడం అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. వివిధ కారకాలచే ప్రభావితమవుతుంది. ధనం ఇదం మూలం జగత్ అంటారు. లోకంలో అన్నింటికీ మూలం డబ్బు అంటూ ఉంటారు. ఎందుకు డబ్బు అంతటి ప్రభావం అంటే, డబ్బు చెల్లించి వస్తువును తీసుకోవచ్చును. డబ్బులు చెల్లించి, సేవలను పొందవచ్చును. ప్రయాణాలు చేయవచ్చును. వినోదం పొందవచ్చును. ఈ సమాజంలో వ్యక్తి యొక్క పలు […]
సమాజంలో పేదరికానికి అంతర్లీన కారణం
సమాజంలో పేదరికానికి అంతర్లీన కారణం. మన సమాజంలో పేదరికానికి బహుళ అంతర్లీన కారణాలు ఉన్నాయి, మరియు ఇది వివిధ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ కారకాలచే ప్రభావితమయ్యే సంక్లిష్టమైన సమస్య. మన సమాజంలో పేదరికానికి దోహదపడే కొన్ని ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి: విద్య లేకపోవడం: భారతీయ జనాభాలో గణనీయమైన శాతం నిరక్షరాస్యులు లేదా పరిమిత విద్య ఉంది. ఇది ఉపాధి అవకాశాలు లేకపోవటానికి దారితీస్తుంది, ఇది పేదరికాన్ని తగ్గించలేదు. ఆదాయ అసమానత: భారతదేశంలో ధనవంతులు మరియు […]
పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు?
పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు? మనకు తెలియకుండానే మనం పరిశీలన చేసిన విషయాలను మనకు చేతివాటం పనులుగా అలవాటు అయి ఉంటాయి. కావునా పరిశీలన ప్రతి ఒక్కరూ చేస్తారని చెప్పవచ్చును. అయితే అప్పటికే అలవాటు అయిన పనులే కాకుండా జీవితంలో ఇంకా సాధించవలసిన లక్ష్యానికి మరింత పరిశీలనావశ్యకత ఉంటుందని అంటారు. కావునా పరిశీలనా దృష్టిని పెంచుకోవడం వలన, అది జీవితంలో ఎదుగదలకు తోడ్పడుతుంది. పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు? రోజువారీ జీవితంలో, […]
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? గొప్పవారిగా ఎదగాలి అనేది ఒక గొప్ప ప్రయత్నంగా చెబుతారు. ప్రయత్నం అంటే ఉద్యోగం అని కూడా అంటారు. అలా మనకొక సామెత కూడా ఉంది. ఉద్యోగం పురుష లక్షణం. ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఎదగాలి అనుకోవడం గొప్ప ఆలోచనగా చెబుతారు. కానీ దానిని సాధించడమే జీవితంలో విజయం సాధించినట్టుగా చెబుతారు. ఇందుకు సాధన మరియు నిబద్ధత జీవన ప్రయాణం చేయాలి. ఆదర్శంతమైన జీవితం గురించి తెలుసుకోవాలి. సమాజానికి […]
లీడర్ అంటే ఎలా ఉండాలి
లీడర్ అంటే ఎలా ఉండాలి ? ఈ ప్రశ్నకు ముందు లీడర్షిప్ క్వాలిటీస్ ఏమిటి? లీడర్షిప్ అంటే ఏమిటి? చూద్దాం. ఈ లీడర్ మనకు స్కూల్ నుండి పరిచయం అవుతారు. మొదటిగా క్లాస్ లీడర్ నుండి మనకు మార్గదర్శకంగా ఉంటామంటూ ముందుకు వస్తూ ఉంటారు. సమాజంలో లీడర్ అంటే ఏమిటి? ఎప్పుడూ ఆశావాదంతో వుండాలి (పాజిటివ్). మొదటిగా చిన్న లక్ష్యాలు నిర్ధేశించుకోవాలి. ఆ తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకోవడాని ప్రణాళిక రచించాలి. తన గ్రూపులో సభ్యుల ప్రతిభను […]
నియోజకవర్గం అంటే ఏమిటి
నియోజకవర్గం అంటే ఏమిటి కేంద్ర, రాష్ట్ర విభాగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు చేత ఒకరిని ఎన్నుకోవడానికి విభజించబడిన నిర్ధిష్ట ప్రాంతాలు లోక్ సభ లేదా అసెంబ్లి నియోజకవర్గాలు అంటారు. ఒక లోకసభ నియోజకవర్గం పరిధిలో కొన్ని అసెంబ్లి నియోజకవర్గాలు కూడా కలిపి ఉంటాయి. అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో కొన్ని మండలాలు కలిపి ఉంటాయి. ఎంపి లోక్ సభ నియోజకవర్గమునకు ప్రాతినిద్యం వహిస్తే, ఎంఎల్ఏ అసెంబ్లి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. తెలుగులో వ్యాసాలు అవతారం అర్థం […]
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు
ఒక నాయకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం లేదా సంస్థపై బాధ్యత వహించే లేదా అధికారం కలిగి ఉన్న వ్యక్తిని అనవచ్చును లేదా అది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో ముందంజలో ఉన్న దేశాన్ని లేదా సంస్థను నడిపించే వ్యక్తిని నాయకుడు అనవచ్చును. నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు కొన్ని… సమర్థవంతమైన నాయకులతో అనేక లక్షణాలు ఉన్నాయి. కొన్ని నాయకత్వ లక్షణాలు: దృష్టి: సంస్థ లేదా సమూహానికి భవిష్యత్తు దిశను స్పష్టంగా చెప్పగల దృష్టి […]
అప్పులు తీరాలంటే ఏం చేయాలి?
అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు ఎంత ఉన్నాయో? లెక్క వేయాలి. ఏ పద్దతిలో ఆదాయం వస్తుందో, దానిని బట్టి అప్పులు తీర్చడానికి ఆలోచన చేయాలి. బిజినెస్ మ్యాన్ అయితే, ఎక్కువ మొత్తం, తక్కువ వడ్డీకి తీసుకుని వచ్చి, ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న చిన్న, చిన్న అప్పులు తీర్చేసి, పెద్ద అప్పు నెలవారీ చెల్లించడానికి చూస్తాయి. అయితే ఎంత మొత్తం అప్పుచేసినా, అది నెలవారీ వచ్చే ఆదాయంలో నలభై శాతానికి మించకుండా చూసుకోవాలి. రుణాన్ని క్లియర్ చేయడానికి […]
పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో
పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో క్లుప్తంగా…. పుస్తక రచన ప్రక్రియలో రచయిత నుండి రచయితకు చాలా తేడా ఉంటుంది, అయితే చాలా మంది రచయితలు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. పుస్తక రచన ప్రక్రియ యొక్క సాధారణ రూపురేఖలు కొన్ని క్లుప్తంగా: బుక్ రైటింగ్ ఐడియా జనరేషన్: రచయితకు పుస్తకం కోసం ఆలోచన వచ్చే ప్రారంభ దశ ఇది. ఇది కథ ఆలోచన, అంశం లేదా పాత్ర కావచ్చు. పుస్తకం వ్రాయాలి అనే ఆలోచనకు, సాధన […]
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం […]
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. […]
నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి!
నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! వ్యక్తి జీవనోపాధి కొరకు పలు మార్గములు అనుసరిస్తారు. అందులో ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మొదలైనవి. చేతి వృత్తుల పనులకు డిమాండ్ ఉన్నంతకాలం, ఆయా వృత్తులవారికి తగినంత ఆదాయం ఉంటుంది. ఏదైనా ఒక సంస్థంలో పనిచేస్తూ నెలవారీ జీతం ఇచ్చే ఉద్యోగాలు, రోజువారీ జీతం చెల్లించే ఉద్యోగాలు ఉంటాయి. సమాజంలో వ్యక్తి జీవనోపాధి కోసం తగు ఉద్యోగం లేకపోవడం నిరుద్యోగం చెబుతారు. ఒక ప్రాంతంలో ఏ పని లేకుండా ఎక్కువమంది ఉండడం […]
నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు
నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు తెలుపుతూ తెలుగులో వ్యాసం. నదులు నీటి ప్రవాహంతో ఉంటాయి. కొన్ని నదులు కాలంలో కురిసే వర్షముల ఆధారంగా నీటిని కలిగి ఉంటాయి. కొన్ని నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఎక్కువగా నదులు పర్వతాలలో పుడతాయి. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి. శిఖరముల నుండి క్రిందికి జారే నీరు అంతా నేలపై ప్రవహించడానికి తగినంత ప్రవాహం పర్వత ప్రాంతాల నుండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవాహంతో ఉండే […]
దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం
దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే… మొదటి పరిశోధనకు మరింత పరిశోధన చేసి, దానిని మరింత సౌలభ్యం అభివృద్ది చేయడానికి లోకంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. విజ్ఙాన శాస్త్రం విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి విశ్వ రహస్యాలు సైతం గోచరిస్తాయని అంటారు. […]
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు తగిన ఫలితం పొందగలడు. అలాగే ఆరోగ్యవంతుడు మాత్రమే, తనకు ప్రీతికరమైన ఆహార పదార్దములు స్వీకరించగలడు. వాటిని జీర్ణం చేసుకోగలడు. అటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి జీవనం సాఫీగా కొనసాగుతుంది. అదే అనారోగ్యంగా ఉండే మనిషికి […]
పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు
పుస్తకం అంటే జ్ఙానం తెలియజేస్తుంది. వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పనిని గురించి కానీ, ఏదైనా పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాల వలన తెలియజేయబడుతూ ఉంటాయి. వస్తువు ఎప్పుడు పుట్టింది? ఆ వస్తువుని ఎవరు కనిపెట్టారు? ఆ వస్తువు ఎలా అభివృద్ది చేయబడింది? ఒక వస్తువుని కనిపెట్టిన వారి నేపథ్యం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఒక పుస్తకం వలన తెలియబడతాయి. ఇదే మాదిరి వ్యక్తి గురించి కూడా ఉంటుంది. అలాగే చరిత్ర గురించి […]
స్వాతంత్ర దినోత్సవం గురించి స్పీచ్
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఆకాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిని ప్రతి స్వాతంత్ర్య సమరయోధునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పురుషులతో బాటు స్త్రీలు కూడా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ దేశభక్తిని తెలియజేశారు. ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితం నేటి […]
పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో
పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో నాలుగు మంచి మాటలు వినాలి అంటారు. ఈ రోజు ఒక మంచి మాట వినడం ఒక అలవాటు చేసుకోవాలి అంటారు. చెడు చెప్పకుండానే చేరువవుతుంది కానీ మంచి చెప్పగ చెప్పగా వింటారని అంటారు. కాబట్టి మంచి మాటలు వినడం వలన మంచి పనిని చేయడానికి మనసు సంసిద్దమవుతుందని అంటారు. అనుభవజ్ఙులు అనగా పెద్దలు చెప్పే మాటలలో మంచి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటుందని అంటారు. అందుకని పెద్దలు చెప్పిన మంచి […]
నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు
నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు…. నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి. ప్రధాన ఉద్ధేశ్యాన్ని నినాదాలు తెలియజేస్తాయి. నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు – నినాదం గురించి వివరణ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అలా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువమంది సతమతం […]
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి! సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యంలో కొంతమంది దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశారు. అయితే వారికి పెద్ద ఆటంకం వచ్చింది. అదే సముద్రం. సముద్రం దాటితే, సీతమ్మ జాడ కనిపెట్టే అవకాశం ఉంది. అయితే అంత పెద్ద సముద్రం దాటి వెళ్లేవారు ఎవరు? హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి వానరలు సముద్రం దగ్గరకొచ్చి, సముద్రం దాటడానికి తమ తమ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటున్నారు. అందులో ఉన్న హనుమంతుడు మాత్రం […]
బంధాలు బలపడడానికి ఏం చేయాలి?
బంధాలు బలపడడానికి ఏం చేయాలి? అక్రమ సంబంధాలను లోకం పసి గడుతుంది. అక్రమ సంబంధాల వలన జరిగిన నష్టానికి తగిన శిక్షను చట్టాలు కూడా అమలు చేస్తాయి. దీని వలన అక్రమ సంబంధం తాత్కాలికమే ఇంకా లోకం వారిని పరువును తీసేస్తుంది. ఇక సక్రమంగా ఏర్పడిన బంధాలు జీవిత కాలం కొనసాగడానికి ఏం చేయాలి? బంధాలు బలపడడానికి ఏం చేయాలి? జీవితం చాలా విలువైనది! అందరికీ తెలిసిన విలువైన మాట కూడా ఇదే! అందరూ అశ్రద్ధ చేసే […]
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది… రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు చక్కటి మార్గం ఉంటుంది. కొత్తతరం వారు లేకుండా కేవలం పాతతరం వారితోనే రాజకీయాలు సాగితే, సామాజిక భవిష్యత్తు మారుతున్న కాలాన్ని అనుసరించలేకపోవచ్చును. మారుతున్న కాలాన్ని బట్టి నిర్ణయాధికారం లేకపోతే, సామాజిక భవిష్యత్తు ఎలా ఉంటుందో […]
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక […]
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ… విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే సాధనలో, ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్సు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ రషాయినిక చర్యలు జరుగుతూ ఉంటాయి. […]
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం కూడా ఏర్పడవచ్చును. కావునా పిల్లలను తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ…. లేకపోతే ఏడుస్తూ… నిద్రిస్తూ… లేకపోతే ఆడడం… అవగాహన తక్కువ చేష్టలు ఎక్కువ…. నిద్ర ఎక్కువ.. ఇలా బాల్యంలో చిన్న […]
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం అంటారు. అవగాహన లేకపోతే, మాట్లాడటంలో కూడా తడబాటు ఉంటుంది. అవగాహన లేకపోతే వినడంలో కూడా ఆసక్తి ఉండదు. అవగాహన లేకపోతే ఆందోళనతో కూడిన ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. కావునా ఏదైనా అవసరం అయిన విషయంలో అవగాహనా రాహిత్యం ఉండరాదని అంటారు. జీవితంలో ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం ప్రయాణం గురించి అవగాహన లేనివారు ఇంకొకరిని అనుసరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే విద్యార్ధికి సబ్జెక్టులో అవగాహన లేకపోతే, స్వయంగా పరీక్షలు విజయవంతం చేయలేడు. […]
పాలితులు పాలకులను అనుసరించడం సహజం
పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు పాలితులు. కుటుంబంలో పాలితులు పాలకులను అనుసరించడం సహజం కొన్ని విషయాలలో కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, అలాగే […]
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల స్వీయ నిర్ణయం మేరకు వారికి వారే మిత్రుల మద్య వివాహం చేసుకునే స్థితికి పరిస్థితలు మారాయి అంటారు. సమాజంలో నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? స్త్రీ పురుషులు వివాహం విషయంలో ప్రవర్తించే తీరును […]
స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు
స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు. సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. మన సభ్య సమాజంలో వివిధ సంప్రదాయలు, వివిధ ఆచారాలు పాటించేవారు ఉంటారు. ఏ సంప్రదాయమైనా, అందంగా అలంకరించుకోవడం అంటే […]
స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం
స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి? స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి ఉండడం వలన వ్యాసాలు ఎలా ఉంటాయో? వ్యాసం యొక్క క్రమం గురించి ఆలోచన మనసులో ఉంటుంది. అదే పుస్తక రచన చేయాలంటే, అందుకు తగిన విషయ వివరణ గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్వీయ […]
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి… ఏదో సినిమా డైలాగులాగా… ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరు వినరో? ఇలా ప్రశ్నలు పుడుతునే ఉంటాయి… ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. మనిషికి ప్రధానమైన ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి. ప్రతి మనిషికి తప్పనిసరిగా […]
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడనట్టుగానే చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా […]
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు పూనుకుంటారు? సాధన చేసే సమయంలో వారికి సహాయపడినవారికి తిరిగి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు. […]
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు కొన్ని ప్రత్యేకతలు కూడా చెబుతారు. పగటిసమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని, భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతిపాదించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన […]
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు. వాక్కు అంటే మాట అంటారు. వాక్కు చాలా విలువైనది. మాటలే కదా అని మాట్లాడేస్తే, ఆ మాటలు వింటున్నవారు ప్రభావితం అవుతారు. వాక్ + దానం = వాగ్దానం అంటారు. అంటే మాట వలన ఒక వ్యక్తి సాయం పొందగలడు. ఒక నాయకుడు వాక్కు వలన, ఆ ప్రాంతం ప్రభావితం అవుతుంది. కాబట్టి వాక్కు చాలా చాలా విలువను పెంచుతుంది. అదే వాక్కులో తేడా ఉంటే, వాక్కు వలననే […]
సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం
సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం. వ్యక్తి మరొకరిపై ఆధారపడడం అంటే, ఆ వ్యక్తి మరొకరికి భారంగా ఉన్నట్టే, అలా కాకుండా తన సంపాదనపై తాను జీవిస్తుంటే మాత్రం తనే మరొకరికి సాయపడగలడు. కావునా వ్యక్తి తన సంపాదనపైనే ఆధారపడేవిధంగా జీవించాలి అంటారు. దానికే ఓ విలువ లభిస్తుందని అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి ఉండడం సహజం అయితే ఒక వయస్సుకొచ్చేసరికి తన కంటూ ఒక సంపాదన మార్గం ఉండాలి. అప్పుడే వ్యక్తిగా […]
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం… అంటే శాశ్వమైనది ఏమిటి? మనిషి మరణించాక కూడా ఆ మనిషి గురించి మాట్లాడించగలిగేది అతని కీర్తి అంటారు. జీవించి ఉండగా మనిషి చేసిన కృషి మరియు ఆ మనిషికి గల మంచిపేరు అతనికి సమాజంలో ఒక కీర్తి ఏర్పడుతుంది. ఆ యొక్క కీర్తి వలన అతను మరణించినను అతని జ్ఙాపకాలు సమాజంలో మిగిలి ఉంటాయి. కాబట్టి కీర్తి ముందు పదవులు, సంపదలు, శరీరాలు శాశ్వతం కాదు అంటారు. అయితే […]
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అలాంటి బాల్యదశలో విన్న మంచి విషయాలపై ఆలోచనలు పెంచుకుంటే, మంచి మనిషిగా ఎదుగుదల […]
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు. సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, […]
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా… లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి […]
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే…. ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది […]
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక […]
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన […]
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్ […]
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది. ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి […]
మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి? మంచి స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇన్ని ప్రశ్నలు సమాధానం ఒక్కటే వస్తుంది. మంచిగా ప్రవర్తించు, మంచి స్నేహితుడుగా మారు, నీవే మంచి స్నేహితుడుగా ఉండడం వలన నీ వలన మరొక మంచి స్నేహితుడు మరొకరికి లభిస్తాడు. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉందని గుర్తెరిగినవారు తీసుకోవడం కన్నా […]
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు. మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని […]
పేదలకు దానం చేయటంవల్ల మనం
పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ, ఆ మాటలను మీ మిత్రునికి లేఖ వ్రాయండి. ప్రియ మిత్రమా! నేను క్షేమం! నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తూ…. నేను ఒక మంచి విషయం గురించి ఈ లేఖ ద్వారా నీకు తెలియజేయదలిచాను. బహుశా ఇది నీకు కూడా తెలిసి ఉండవచ్చును. కానీ నా దృష్టి కోణం నుండి ఈ అంశం గురించి ప్రస్తావిస్తాను. మన పెద్దలకు ఉండి మనకు చదవు […]
మంధర పాత్ర స్వభావం చూస్తే
శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో […]
వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో
నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. […]
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు […]
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి. స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరమైన సేవలు నగరములలో ఎక్కువగా లభిస్తాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరములలో ఎక్కువ. నగరములలో వ్యాపార, వాణిజ్యములు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి […]
