Category Archives: Bhakti Bhavamu

Bhakti Bhavamu Subhakankshalu భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం, చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో, భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం. చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.తెలుగు భజన పాటలు వింటూ దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు రామనామము రమ్యమైనది శ్రీరామనవమి నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు. భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది. 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం

భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది… వాంఛలు వస్తూ ఉంటాయి… కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు. భక్తి వచ్చుటకు అవకాశం ఏర్పడదు.

విషయవాంఛలయందు మమేకం కాకుండా ఉండలేరని అంటారు. ఎందుకంటే విషయవాంఛలు మనసుకు అంతగా అలావాటు అయి ఉంటాయి. కావునా మనసు మార్గం భక్తిమార్గం కావాడానికి సమయం పడుతుందని అంటారు. కోరికతో తహతహలాడే తనువు కోరిక తీర్చుకోవడంలో తలమునకలవుతుంది. కోరిక తీరిన తర్వాత మరలా కోరికతో తనువు తయారు అవుతుంది… మనసు పడే తపన తనువుతో తీరుతుంది….

మనసు తృప్తికి తనువు సాయపడితే, వ్యక్తి తనువు తరించాలంటే మనసులో భక్తి ఉండాలి. మోహంలో ఉన్నప్పుడు మనసు మాట వినదు. మోహంవీడిన మనసు విజ్ఙానం వైపు వెళుతుంది. కా

తనువు వలన సుఖమెరిగే మనసుకు తనువును ఉపయోగించుకోవడంలో చూపే చొరవ తనువును నియమాలకు కట్టడి చేయడంలో మాత్రం వెనుకాడుతుంది. కానీ దానికి ప్రయత్నం చేస్తే మాత్రం క్రమశిక్షణ మనసుకు అలవాటు అవుతుంది. క్రమశిక్షణతో మనసు తననుతాను నియంత్రించుకుంటుంది.

ఇంతటి శక్తివంతమైన మనసులో భక్తి వచ్చుటకు సద్భక్తి కలిగిన బుక్స్ రీడ్ చేయడం ఒక మార్గం అయితే, భక్తి కలిగిన వారితో స్నేహం మరీ మంచిదని అంటారు. ఇంకా సులభంగా మనసులో భక్తి వచ్చుటకు భక్తి భావనతో మంచి మాటలు వింటూ ఉండడం అని కూడా అంటారు.

అలా భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం వలన మనసులో భక్తి భావన బలపడుతుంది. భక్తి విషయాలు చదవాలనే ఆసక్తి, వినాలనే తాపత్రయం పెరుగుతాయి.

ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం

ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి తిధిన తలంపులన్నీ భగవంతుడి కోసం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణీ పుట్టక తప్పదు. జీవనయాత్రలో ఎన్నో పుట్టుకలు, మరెన్నో మరణాలు అయితే జనన మరణ సమయాలలో తీవ్రమైన బాధను భరించవలసి ఉంటుంది. జీవి యాత్రలో మరణం లేని దశకు చేరే అవకాశం మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఉంటే, అది ఏకాదశి తిధి రోజున సార్ధకం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటారు.

ఏకాదశి తిధి సరైన పద్దతిలో ఆచరిస్తూ శ్రద్దాసక్తులన్నీ భగవంతుడి కోసమే అయితే, ఆ భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని అంటారు. దశమి రోజు ఒంటిపూట భోజనం, ఏకాదశి తిధి రోజు నిరాహారం, ద్వాదశి తిధిలో భుజించడం…. ఇలా ఏకాదశి నియమాలు చెబుతారు.

https://www.youtube.com/watch?v=bTGka9A4t90

దేవతలంతా విష్ణుమూర్తితో కలిసి భూలోకంలో వైష్ణవ దేవాలయాలలో ఉండేతిధి ముక్కోటి ఏకాదశి తిధి అంటారు. ఈ తిధి రోజు ఉత్తర ద్వార దర్శనం మోక్షప్రదాయకం అంటారు.

శ్రీమహావిష్ణువు ఇష్టమైన తిధి ఏకాదశి తిధి… అందులో ముక్కోటి ఏకాదశి తిధి అంటే మనందరికీ మరింత ప్రీతికరం… ఈ రోజు విష్ణుభగవానుడిని తలవని హిందువు ఉండడు.

ఆ భాగవత ప్రియుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి గుర్తు చేసుకోని హిందువు ఉండడు. దేవదేవుడు ఇచ్చిన జ్ఙానంతో ఆదేవదేవుడిని చేరే మార్గంలో శుభకరమైన తిధులు మనకు బాగా ఉపయోగపడతాయి. అలా మనకు ముక్కోటి ఏకాదశి తిధి అత్యంత పవిత్రమైనది.

https://www.youtube.com/watch?v=7IOr61etsmo
https://www.youtube.com/watch?v=LVK-jcp06iI
ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం
https://www.youtube.com/watch?v=Yo0qrCLHpVk

సకల జీవ రాశులలో మనిషి ప్రత్యేకమైన జీవి. ఎందుకంటే కర్మ చేసే అధికారం ఉంటుంది. అందుకు అవసరమైన జ్ఙానం ఉంటుంది. అందుకు అవసరమైన వనరులు కుటుంబ స్థితిని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. మనోబలం కోసం పెద్దల ప్రవచనాలు తోడుగా ఉంటాయి…

మనిషిగా పుట్టి మహనీయుడుగా మారితే సమాజం గుర్తు పెట్టుకుంటుంది…. అది కర్మఫలితం.

ముక్కోటి ఏకాదశి మనసు నిత్యమూ భగవన్నామస్మరణ చేయడమే

మానవ జన్మ సార్ధకం చేసుకోవడం అంటే, మోక్షం సంపాదించడమేనని అంటారు. అటువంటి మోక్షం సాధించాలంటే, నమ్మి భగవంతుడిని మనసులో నింపేసుకోవడమేనని అంటారు. మనసు నిత్యమూ భగవన్నామస్మరణ చేయడమే కీలకమని చెబుతూ ఉంటారు.

భగవన్నామస్మరణకు అలవాటు పడిన మనసు పరమపవిత్రమైన తిధులలో కూడా భగవన్నామస్మరణ చేస్తుంది. అలా పరమపవిత్రమైన ముక్కోటి ఏకాదశి తిధిన భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం మనకు శ్రేయస్సును అందిస్తుందని అంటారు.

సర్వవిషయములలోనూ భగవద్దర్శణం చేయగలగడం గొప్ప విషయంగా చెప్పబడుతుంది.

భగవధ్యాస పెంచుకోవాలంటే, ఆ భగవంతుడి అనుగ్రహం కావాలి. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే భక్తి మార్గంలో మనసు నిలబడుతుందని అంటారు. అటువంటి భక్తిమార్గంలో మనసు ఎల్లవేళలా నిలబడడానికి భగవంతుడి అనుగ్రహం సంపాదించడంలో ఏకాదశి తిధి బాగా ఉపయోగపడుతుందని అంటారు. ఇక ముక్కోటి ఏకాదశి తిధి అయితే మోక్షాన్నే అందిస్తుందని అంటారు.

పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి తలంపులన్నీ ఆ దేవదేవుడిని గురించే

మనసు ఆలోచనలతో కూడి ఉంటుంది. కోరికల కారణంగా కావచ్చును. ఆశల కోసం తాపత్రయం వలన కావచ్చును. కర్తవ్య నిర్వహణలో భాగంగా భాద్యతల వలన కావచ్చును… మనసు ఆలోచనల ప్రవాహాంలో ఉంటుంది… ఆ ఆలోచనల నుండి మనసును మళ్ళించి, ఒకే చోట స్థిరపరచడం వలన మనసు మరింత శక్తివంతం అవుతుందని అంటారు. అలా ఏకీకృత దృష్టితో ఉండే మనసు ఎంతకాలం ఏకాగ్రతతో ఉంటుందో, అంతటి శక్తిని పొందగలదని అంటారు.

పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి తలంపులన్నీ ఆ దేవదేవుడిని గురించే
పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి తలంపులన్నీ ఆ దేవదేవుడిని గురించే

అలా మనసును ఒక చోట కేంద్రీకృతం చేయడం కృతకృత్యులు కావడానికి పెద్దలు భక్తి మార్గమే శ్రేయష్కరం అని అంటారు. ఎందుకంటే ఒక వస్తువుకు మార్పు చెందే గుణం ఉంటుంది. అలాగే చాలా విషయాలు ఒకదాని ముందు ఒకటి వస్తూ పోతూ ఉంటాయి… కానీ ఎప్పటికీ ఉండే ఏకతత్వంగా ఉండే ఆ శక్తిని దేవదేవుడి భగవంతుడిగా తలంపులోకి తెచ్చుకుంటే, వాడు ఎప్పటికీ ఉండేవాడని శాస్త్రములు చెబుతున్నాయి.

మన మనసును మనం స్వాధీనపరచుకుంటూ, దానిని భగవంతుడి పాదలపై పెట్టడమే శ్రేయష్కరం అయితే, కొందరు ఆ మనసుపై నియంత్రణ కూడా ఆ భగవంతుడికే వదిలి, అన్నింటా భగవంతుడినే దర్శించి తరించారని పెద్దలంటారు.

జీవన ప్రయాణంలో మనసు విషయాలవైపు వెళుతూ విషయ లౌల్యం పొందుతూ ఉంటే

మన మనసు మనలోనే ఉంటూ అనేక విషయాలను తరచి చూస్తుంది. ఒక్కసారి తరిచి చూసిన విషయంపై అది మక్కువ పెంచుకుంటే, అదే విషయాన్ని మరలా కోరుకుంటూ ఉంటుంది…. అలా మనసు కోరుకునే విషయాలలో భగవన్నామ స్మరణ చేర్చేయడమే తెలివైన పని అంటారు.

మనలో ఉండే మనసుకు కొన్ని విషయాలు అంటే ఆసక్తి ఉంటుంది. కొన్ని విషయాలపట్ల నిరాసక్తత ఉంటుంది. కొన్ని విషయాలు అంటే అమితమైన ఇష్టముంటుంది… అమితమైన ఇష్టమును నెరవేర్చేముందు భగవంతుడిని గురించి తలంపులు గుర్తు చేసుకోవడం ద్వారా మనసును మెల్లమెల్లగా భగవంతుడివైపు తిప్పవచ్చును అని అంటారు.

ఇంకా పదే పదే భగవంతుడి గురించిన ప్రవచనాలు వినడం ద్వారా భగవంతుడిపై ఆలోచనలను మనసులో సృష్టించవచ్చును. భగవంతుడి గురించిన తలంపులు తలచుకోవడానికి ప్రవచనాలు మనకు బాగా ఉపయోగపడతాయి.

సోమవారం వచ్చిందంటే శివుడు గురించి వినడం, మంగళవారం వచ్చిందంటే ఆంజనేయుడి గురించి వినడం, బుధవారం వచ్చిందంటే శ్రీరాముడి గురించి వినడం, గురువారం వచ్చిందంటే దక్షిణామూర్తి గురించిన ప్రవచనాలు వినడం, శుక్రవారం వచ్చిందంటే దుర్గమ్మతల్లి గురించి వినడం, శనివారం వచ్చిందంటే శ్రీవేంకటేశ్వరస్వామి గురించి వినడం, ఆదివారం వస్తే సూర్యభగవానుడి గురించి వినడం… ఇంకా పండుగలలో ఆయా దేవతల గురించి పెద్దల మాటలు వినడం… ఇలా వినడమనే తపస్సున చేయడం ద్వారా భగవంతుడి తలంపులు మనసులో పెంచుకోవచ్చును.

మనసును విషయలౌల్యం నుండి భగవంతుడు అనే బలమైన భావనతో నింపేసుకోవడం భక్తిలో ప్రధానమని అంటారు.

మరిన్ని పోస్టుల లింకులు

మహా భారతంలోని పర్వాలు పేర్లు

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన..

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.

ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

మన మహనీయుడు వేమన యోగి

పివి నరసింహారావు మన మహనీయుడు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం.

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది

తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం…

చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే విధంగా పూర్వపు దీపాల వరుస ప్రకృతికి మేలు చేయడానికే అన్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మన పండుగలలోనే ఆరోగ్యకరమైన ఆచారం మనకు అలవాటు చేశారు. ఉన్నంతలో చుట్టూ ఉన్న పరిసరాలలో తైల దీపాలను వెలిగించడం శ్రేయష్కరమైన కార్యముగా చెబుతారు.

దీపాల వరుసలుగా దీపాలను వెలిగిస్తూ, అగ్నిని ఆరాధించడంతో బాటు దైవరాధన చేయడంతో మనసులో సరికొత్త ఉత్తేజం వస్తుందని పెద్దల విశ్వాసం. ఆ యొక్క విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన మన పెద్దలకు కృతజ్ఙతలు తెలియజేయాలి. లేకపోతే ఈ దీపావళి మనకు ఎలా అలవాటు అవుతుంది. వారు చేయబట్టి వారి నుండి మనకు ఈ దీపావళి పండుగ ఒక అలవాటుగా వచ్చేసింది. అందుకు మన పూర్వికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.

దీపావళి అమావాస్య రోజున చిమ్మ చీకటిగా

దీపావళి అమావాస్య రోజున చిమ్మ చీకటిగా ఉంటుంది. అలాగే అజ్ఙానం ఉన్న మనసు చుట్టూ కూడా మాయ ఉంటుందని అంటారు. అటువంటి మాయ మనసు నుండి పోవాలంటే, జ్ఙానదీపం వెలగాలని అంటారు. అలాంటి జ్ఙానదీప సాధనకు దీపావళి పర్వదినాన దీపాలను వెలిగించి దైవారాధన చేయడంతో మనలో సాధనకు పునాది పడుతుంది. దీపావళి పండుగ రోజ నాటి నుండి కార్తీక మాస పర్యంతము నిత్య దీపారాధన వలన మన మనసుకు మేలు జరుగుతుందనేది పెద్దల భావన. అటువంటి భావన బలపరుస్తూ వచ్చిన మన పెద్దలకు ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేయాలి.

మన భక్తి జ్ఙాన తత్వం ఎవరో చెబితే తెలుసుకునే స్థితిలో మనం ఉండేలాగా లేము మనము. మన పెద్దల దయ వలన మనకు భక్తి జ్ఙానం మనకు మన ఆచారంలోనే మనకు ఒక అలవాటుగా వచ్చేసింది. కాబట్టి కొత్తగా నేర్చుకోవలసినది ఏముంది? మన కుటుంబంలో మన పూర్వికులు చేసిన దైవారాధననే మనము చేస్తున్నాము…. చేస్తాము. అలా మనకు మన భక్తి జ్ఙానమును ఆచారములో మనకు ఒక అలవాటుగా అందించేసిన మన పూర్వికులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఙతలు.

దీపావళి రోజున ఇంటి గుమ్మంలోనే దీపాలను వెలిగించడం మాత్రమే కాదు మన మనసులో గూడు కట్టుకుని ఉండే ఆజ్ఙానమును జ్ఙానదీపంతో తరిమివేసే సాధనకు పూనుకోవడం చేయాలని పెద్దలంటారు.

అటువంటి పరమ పవిత్రమైన దీపారాధన మీ ఇంటిల్లిపాది జీవితపర్యంతము చేయగలిగే శక్తి, అష్టైశ్వర్యాలు ఆ యొక్క లక్ష్మీదేవి మీకు కలుగజేయాలని ప్రార్ధిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం.

భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానంగా మనసులో మెదలాలి అంటారు.

భక్తి అంటే కొందరు భగవంతుడిపై తదేక దృష్టితో ఉండే బలమైన భావన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడి కోసం పడే తపన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడికి నచ్చినట్టు సమాజంలో నడుచుకోవడం అంటారు… ఎవరు ఏమన్నా అందులో మూలం భగవంతుడే కావడం విశేషం.

అంటే భగవంతుడు గురించి తెలుసుకోవడం భక్తి అయితే భగవంతుడిని గురించీ తెలియజేయడం భక్తి అయితే భగవంతుడిని చేరడం ముక్తి అయితే…. అందుకు ప్రయత్నించడం ప్రధానం అంటారు.

భగవంతుడి గురించి తెలుసుకోవడానికి… భగవంతుడు అనేవాడి గురించి ఆలోచన మనసులో మెదలాలి అంటారు. అనేక రూపాలలో కనబడుతూ ఒక్కడైనా ఈశ్వరుని తెలుసుకోవాలనే తలంపు తలవాలని అంటారు.

మనిషి మనసులో భక్తికి భావము మూలము అయితే భగవంతుడి గురించిన ఆలోచనలు కలిగి ఉండడం చాలా అవసరం అంటారు.

అనేక ఆలోచనలు అనేక విషయాలు వలన ఏర్పడుతూ ఉంటాయి. అనేక విషయాలు చుట్టూ చేరడానికి ప్రధానంగా వ్యక్తి చుట్టూ ఉండే పరిస్థితులు, వ్యక్తులు కారణంగా కనబడతారు.

కొన్నిసార్లు దుఖం కొన్నిసార్లు సంతోషం కలిగిస్తూ కాలం సాగుతూ ఉంటుంది. అటువంటి కాలంలో మనుగడ సాగించే మనిషి మనసు కలత చెందడం సహజంగా జరుగుతూ ఉంటే, ఆ కలతకు కారణంగా ఇతరులను భావించే, వారితో విభేదించినప్పుడు జీవనం మరింత జటిలంగా మారుతుంది.

అలా కాలంలో కలిగే కష్టానికి కారణంగా ఎవరినో నిందిస్తూ జీవితం జటిలంగా మార్చుకోకుండా కనబడని భగవంతుడిని ఏదో ఒక రూపంలో కొలుస్తూ ఉండడం వలన ఆ భగవంతుడే మరల మరొక రూపంలో మనసుకు స్వాంతన కలిగించగలడని భావిస్తారు.

భావనా మాత్రం చేత భగవంతుడిని చేరవచ్చనే నమ్మకం బలంగా ఉంటే, అదే బలం సమస్యాత్మక జీవనంలో కూడా ఉపయోగపడవచ్చని అంటారు.

గతకాలపు భక్తులను గమనిస్తే, వారి నమ్మకమే వారిని భగవంతుడివైపు నడిచేలా చేసిందనే భావన ఏర్పడుతుంది.

తెలుగు భక్తి

నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే

నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు.

అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం.

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు.

అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.

స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు అంతే, స్వీయ పరిశీలనకు కూడా ఆలంబన భక్తి అంటారు.

ఎందుకంటే ముందు మనసు లోకంలో ఉండే విషయాల గురించి ఆలోచన చేయడం భాగా అలవాటు అయ్యి, అటువంటి ఆలోచనలతో స్వీయ పరిశీలనకు ఆస్కారం లేకుండా చేసుకుంటుంది.

బహుశా అందుకేనోమో భగవానుడు వివిధ రూపాలలో అవతరించి లోకరీతిలో భక్తుడి మనసులోకి వెళ్ళేవిధంగా కనబడతాడేమో?

మనసు ముందుగా తనపై తన పరిశీలన చేయడానికి అంగీకరించదు… కాబట్టి ఒక జడ్జి మనసులోకి రావాలి. ఆత్మ స్వరూపుడైన ఈశ్వరుని మనసులో జడ్జిగా నియమించుకుంటే, స్వీయ పరిశీలనకు మనసుకు మార్గం లభిస్తుందని అంటారు.

భగవంతుడు ముందు మనసులోకి వచ్చాడనే ఎరుకను మనసు కలిగి ఉంటే, తన లోపల ఒకరికి జవాబుదారీ అనే ఆలోచన మనసు చేయగలదు.

కానీ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు… ఇప్పుడు అది కాదు ముఖ్యం అనుకుంటే, భగవంతుడు లోపలే ఉన్నాడనే ఎరుక మనసు కలిగి ఉండదు.

ఒకసారి భగవంతుడు మనసులోనే ఉన్నాడు. మనసుకు ఆధారమైన అత్మే భగవానుడు… అని గ్రహిస్తే, మనసు తాను చేస్తున్న కర్మలలో విచక్షణ కోల్పోదు అని అంటారు.

చేస్తున్న కర్మలకు ఒకడు అధికారి లోపాలే ఉన్నాడనే భావన, మనసుని తప్పు చేయనివ్వదని అంటారు.

అలా జడ్జిగా మనసులో ఉన్న భగవానుడు, మనసుని శుద్ది చేయడం మొదలైతే చిత్తశుద్ది ఏర్పడి, మనసు నిర్మలం కావడానికి కారణం కాగలదని అంటారు.

నిర్మల భక్తి అంతే ఏమిటో అని ఆలోచన చేస్తూ, కాలం వృధా చేయడం కంటే, ఆత్మస్వరూపుడైన భగవానుడిని ఇష్టదేవత రూపంలో నిత్యస్మరణ శ్రేయష్కారం అంటారు.

మనసు శాంతిగా ఆలోచన చేయడానికి అలవాటుపడితే, ప్రశాంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటారు.

ప్రశాంతమైన ఆలోచనలు కలిగిన మనసు నిర్మల మనస్తత్వంతో మనగలగుతుంది. ప్రశాంతమైన ఆలోచన పరమాత్మ స్వరూపం గురించిన ఆలోచన మనసుతోనే ఉంటుందని అంటారు..

ఏది ఏమిటి అను తెలుసుకునే ఆలోచన సందేహాలకు తావు ఇస్తూ ఉంటే, ఒక్కడు ఉన్నాడు. వాడు అధికారి అనే ఆలోచన మనసును సరి అయిన దారిలో పెట్టవచ్చని అంటారు.

తెలుగు భక్తి

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది

భక్తి భావన బలపడడంలో ప్రధాన పత్రం చిత్తం పోషిస్తే, అటువంటి చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిదిగా ఉంటుంది.

వ్యక్తి జీవితం యొక్క భక్తి మార్గములో మనసు చాలా ప్రధానమైనది. అది ఎటు తిరిగితే, జీవనగతి అటే ఉంటుంది.

అటువంటి మనసుపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి.

ఒక వ్యవస్థలో వ్యక్తి చుట్టూ పరిసరాల నుండి చేరే ప్రాపంచిక విషయాలు మనసుకు అలవాటుగా మారతాయి.

జీవనంలో వ్యక్తి మనసులోకి ప్రవేశించిన అనేక విషయాల్లో కొన్నింటిపై మనసు మమకారం పెంచుకుంటుంది.

అలా మనసులో మమకారం పెరగడంలో ప్రధాన పాత్ర పోషించేది చిత్తం అంటారు.

చిత్తం మనసు యొక్క భావనలలో పొందిన అనుభవాలను జ్నప్తికి తెస్తుందని అంటారు.

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది. అంటే ఆన్ లైన్ హిస్టరీకి సంబంధించిన అంశాలలోనే మనం ఆన్ లైన్లోకి వెళ్ళిన ప్రతిసారి విషయాలు కనబడుతూ ఉంటాయి.

మన ఫోనులో జోడించబడిన ఉన్న మెయిల్ ఐడి ఆధారంగా మన ఫోనులో ఆన్ లైన్ సెర్చ్ హిస్టరీ సేకరించబడుతూ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఎక్కడ ఓపెన్ చేసిన ఆ హిస్టరీకి సంబంధించిన విషయాలే కనబడుతూ ఉంటాయి.

యూట్యూబ్ ఖాతాకు జిమెయిల్ ఆధారంగా యూట్యూబ్ వీడియో హిస్టరీ కూడా ఆన్ లైన్లో సేవ్ అవుతుంది.

మరొక పరికరంలో జిమెయిల్ ఖాతా ఓపెన్ చేస్తే, మన ఫోనులో కనబడే వీడియోలే కనబడతాయి. గతంలో చూసిన అంశాలలో వీడియోలు కనబడుతూ ఉంటాయి.

యూట్యూబ్ కానీ ఫేస్ బుక్ కానీ గతంలో లైక్ చేసినవి లేక వాచ్ చేసినవి… ఆయా అంశాలలో పాపులర్ థింగ్స్ మనకు చూపుతూ ఉంటాయి… అలా చూపడానికి ప్రధాన ఆధారం ఆన్లైన్ హిస్టరీ.

అటువంటి ఆన్లైన్ హిస్టరీ డిలీట్ చేయాలంటే జిమెయిల్ ఖాతా అడ్మిన్ సెటింగ్స్ లో హిస్టరీ డిలీట్ చేయాలి….

అలాగే చిత్తము యొక్క చరిత్రను రూపుమాపలంటే ఆత్మ అనే అడ్మిన్ దగ్గర మనసు నిలబడాలి.

మనసు అటువంటి ఆత్మ దగ్గర నిలబడడానికి భక్తి ఒక మంచి మార్గం అని సులభమైన మార్గమని అంటారు.

ముఖ్యంగా చిత్తశుద్దికి భక్తిమార్గం మేలైన మార్గంగా పెద్దలు చెబుతూ ఉంటారు.

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది.

రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది.

సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది.

శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది.

పశువులకు కూడా భక్తి ఉంటుందని… పశువులు కూడా భగవంతుడి అనుగ్రహం పొందగలవని గజేంద్రమోక్షం తెలియజేస్తుంది.

త్రాగు నీటిని పాడు చేస్తూ, అమాయకులైన ప్రజలను భక్షిస్తే, భగవంతుడు శిక్షిస్తాడని కాళీయమర్ధనం తెలియజేస్తూ ఉంటుంది.

భగవంతుడి లీలలను చూపుతూ భగవంతుడిపై ఆరాధన పెంచే క్రమంలో భాగవతం ఒక తీపి పదార్ధం వంటిది అంటారు.

మనసుకు బాగా నచ్చిన విషయంలో, అది బాగా స్పందిస్తుందని మనోవేత్తలు చెబుతారు. అలా మనసుకు బాగా నచ్చే విధంగా భగవంతుడు గురించి చెప్పడమే శాస్త్రం పని అయితే, అది భాగవతములో పుష్కలంగా ఉందని అంటారు.

కృష్ణుడి అల్లరిలో అద్బుతమైన లీలలు మనసుని కట్టిపాడేస్తాయి.

ఎంత నియమ నిష్ఠలతో ఉన్నా, మనసు చెడిపోవడానికి ఒక్క క్షణం చాలని అజామిలోపాఖ్యానం తెలియజేస్తుంది.

ప్రతిరోజూ భగవంతుడి కధలు వినాలనే సూచన పరీక్షత్తు కధ తెలియజేస్తుంది..

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని….

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటాడు…

కానీ ఒక్కటే అనే భావం బలపడడానికి మాత్రం మనసే కదలాలని అంటారు.

శివుడు – లయకారుడు

విష్ణువు – స్థితికారుడు

బ్రహ్మ – సృష్టికర్త

తమోగుణం

రజోగుణం

సత్వగుణం

శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

విష్ణువు స్థితికారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

బ్రహ్మ సృష్టికర్త కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

అంటే త్రిమూర్తులకు మూలం పరబ్రహ్మమని అంటారు.

అలాగే త్రిమూర్తులకు భార్యలు

శివుడుకి భార్య పార్వతి, విష్ణువుకి భార్య లక్ష్మి, బ్రహ్మకు భార్య సరస్వతి.

ముగ్గురమ్మలకు మూలం పరబ్రహ్మమనే అంటారు.

ఎలా చెప్పినా ఏం చెప్పిన ఈ త్రిమూర్తి తత్వం ప్రధానంగా ప్రస్తావిస్తూ భగవంతుడి లీలలు, సుగుణాలు గురించి చెబుతూ ఉంటారు.

సృష్టి ప్రారంభం బ్రహ్మ చేస్తే, బ్రహ్మకు మూలం విష్ణువు అని వైష్ణవులు, శివుడు అని శైవులు అంటూ ఉంటారు. అందుకు తగినట్టుగానే పురాణాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే ఏనాడో ప్రారంభం అయిన సృష్టిలో మనం ఎప్పటివారమో మనకూ తెలియదు….

ప్రారబ్దం వలన పుట్టుక ఉంటే, ఆ ప్రారాబ్దానికి కారణం ఏనాటిదో ఈనాడు తెలియడం కష్టమే కానీ ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం చేయడమే శ్రేయస్కరం అని పెద్దలు అంటూ ఉంటారు.

ఏనాడో ఓనాడు పుణ్యకర్మ, ఎప్పుడో ఒకప్పుడు పాపకర్మ ఈజన్మలో ప్రారబ్ధం అయితే, అప్పటి పాపపుణ్యాలు భగవంతుడికి వదిలి ఇప్పటి కర్తవ్య నిర్వహణకు మనసుని ప్రిపేర్ చేయడానికి భక్తిమార్గం ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.

త్రిమూర్తులలో త్రిమూర్తి తత్వం ఉంటుంది. ఒకరిలో ఒక తత్వమే చూడడం అవివేకం అంటారు. ముగ్గురికి ఒకరే యజమాని అయినప్పుడు… ఒకరిలో మూడు తత్వాలు ఉంటాయనేది పెద్దల సూచన.

విష్ణువు ఒక మనిషిగా పుడితే, ఆ మనిషికి కోపం వస్తే, చెడుని శిక్షించే క్రమలో లయకారుడు అయితే, అదే సమయంలో శిష్టరక్షణ చేసే స్థితికారుడుగా కూడా… సృష్టికి స్థితికి లయకి ఒకదానికొకటి అవినాభావ సంభందం ఉన్నప్పుడూ… త్రిమూర్తులు, ముగ్గురమ్మలు ఒక్కటే అవుతారు.

ఎక్కువ ఆలోచనలు గందరగోళం అయితే ఒకే ఆలోచన సాధనకు సాకారం అవుతుంది.

భిన్నాభిప్రాయాలు గల మనసులో శాంతి తక్కువ అయితే, ఏకాభిప్రాయం ఉండే మనిషిలో అశాంతి తక్కువ!

అలాంటి మనసుకు బలాన్నిచ్చే భక్తిలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉండడం కన్నా ఏకాభిప్రాయంతో సాగడమే ఎవరికివారు శ్రేయస్కులుగా మారతారు.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఈ కోణంలో భక్తిభావనలు మనసుకు మేలు చేస్తాయని పండితుల ఉవాచ.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటే, మనసు మాత్రం తనలో ఉండే భిన్నాభిప్రాయాలతో ఏకాభిప్రాయం సాధించాలని చెబుతారు.

అందుకు పురాణశ్రవణం, పురాణపఠనం, సద్విచారణ సాయపడతాయని అంటారు.

తెలుసుకుంటే సాధించాలనే తపన ఉండే మనసుకు పురాణాలు పరమర్ధాన్ని అందిస్తాయని చెబుతారు.

తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన

తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన మంచి ఫలితం ఇస్తుందని అంటారు. స్కూల్ కు వెళ్ళే బాలబాలికలను తెల్లవారు జామునే చాడువుకోమన్నట్టుగా…

స్కూల్ కు వెళ్ళే ఒక పిల్లవాడు ఎంత శ్రద్ద పెడితే, అన్ని మార్కులు పరిక్షలలో సాధించగలడు. అటువంటి పిల్లవానికి ఏకాగ్రత కోసం తెల్లవారు జాములో చదువుకోమని పెద్దలు చెప్పేవారు.

అంటే భగవంతుడి విషయంలో కూడా స్కూల్ పిల్లవాని వలె భక్తునికి శ్రద్ద అవసరం అనుకుంటా…

అందుకే స్కూల్ పిల్లవానిని చాడువుకోమన్నట్టుగా తెల్లవారుజామునే భగవంతుడిని ప్రశాంత చిత్తంతో ప్రార్ధన చేయమంటారు.

అవును శ్రద్ధ వలననే ఒక పిల్లవాడు పుస్తకంలోని విషయం గ్రహిస్తున్నాడు. విషయసారం గ్రహింఛి కొత్త విషయం కనుగోనడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అలాగే భక్తుడు కూడా భగవంతుడిపై శ్రద్ద పెడితే, భగవతత్వం మనసులోకి వచ్చేస్తుందేమో?

మరి భగవంతుడిపై శ్రద్ద పెట్టె ఆసక్తి మనసులో కలగాలంటే, దానికి ఆలంబన కోసం పురాణ పుస్తకాలూ చదవడం లేక పురాణ ప్రవచనాలు వినడం చేయమంటారు.

పురాణాలు చదవకపోయినా ప్రతిరోజు ఈశ్వరుని పూజ చేస్తూ ఉండాలని అంటారు.

కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తూ, ఆ సాయం ఈశ్వరునికి అర్పించేవారు ఉంటారు.

ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూడడం ప్రధానమని అంటారు.

ఈశ్వర సంభందంగా జీవనం సాగించేవారిని ఆ ఈశ్వరుడే రక్షణ చేస్తాడని అంటారు. అయితే ఈశ్వరుడు చిత్తశుద్దిని చూస్తాడని చెబుతారు.

ఈ చిత్తశుద్ది ఉంటే, మనిషి మహనీయుడు అని అంటారు.

అటువంటి చిత్తశుద్ది కలగాలంటే ప్రశాంతమైన చిత్తం కలిగి ఉండాలి.

ప్రశాంతమైన చిత్తం కదిలే మనసులో కన్న, ఒక చోట దృష్టి సారించే మనసులో ఎక్కువగా ఉంటుందని అంటారు.

అలా మనసు ఒక చోట దృష్టి కేంద్రీకృతం చేయాలంటే, దానికి ఎంతో ఇష్టం అయితేనే దృష్టి పెడుతుందని అంటారు.

అలా మనసు ఒక చోట కేంద్రీకృతం అయ్యేలాగా దృష్టి పెట్టడానికి పూజ పునాదిగా చెబుతారు.

సంసారం సాగించేవారికి పూజ ప్రధానం అంటారు.

సంసారం సమస్యలను తెస్తుంది, సుఖదుఖాలను తీసుకువస్తుంది… వాటిని దాటి మనసుని ఏకీకృతం చేయడం చాలా కష్టమంటారు… అలాగే అది అసాద్యమేమి కాదని కూడా అంటారు.

చిత్తశుద్దితో పూజ చేయడానికి సాదారణ పూజ ప్రశాంత చిత్తంతో తెల్లవారు జామున ప్రారంభించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతూ ఉంటారు.

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు. వ్యక్తి పుట్టుకకు ప్రయోజనం భగవంతుడిని చేరడమే అయితే, అందుకు తొమ్మిది భక్తి మార్గాలను పెద్దలు చెబుతూ ఉంటారు.

తొమ్మిది భక్తి మార్గాలలో దేనిని భక్తితో శ్రద్దతో ఆచరించినా తరించవచ్చు అని అంటారు.

శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు నారదుడు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఐతీహ్యం.

శ్రవణం

శ్రవణము అనగా వినడము… అంటే భగవంతుని గూర్చి చెప్పబడిన గాధలు వినడం. ఇంకా భగవంతుడి గురించిన ప్రవచనాలు వినడం. ఇంకా భగవంతుని భక్తుల గురించి వినడం. భగవంతుడి లీలలు గురించి వినడం. ఏదైనా భగవంతుని గురించి శ్రద్ధాభక్తులతో వినడం శ్రవణభక్తి అంటారు.

ధర్మరాజు, జనమేజేయుడు, పరిక్షత్తు వంటి వారు భగవంతుడి గురించి విని తరించారని పెద్దలు చెబుతారు.

వినడానికి ఇప్పుడు భగవంతుడి కీర్తనలు, పాటలు, కధలు, ప్రవచనలు అన్నీ కూడా ఆడియో రూపంలో అందుబాటులో ఉంటున్నాయి…

కీర్తనం

కీర్తనము అంటే గొప్పగా చెప్పుట… భగవంతుడి గొప్పతనం గురించి చెప్పుట. సుగుణాలను కీర్తిస్తూ ఉండడం. సుగుణాలపై ఆరాధన భావంతో మనసును భగవంతుడిపైనే లగ్నం చేయడం. నిత్యం భగవంతుడి సుగుణాలను మనసులో తలుస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉండడం వలన మనసు భగవంతుడిపై సులభంగా లగ్నం అవుతుందని అంటారు. పూర్వం భక్తులు చేసిన కీర్తనలు భగవంతుడి యొక్క గొప్ప సుగుణాలను తెలియజేస్తూ ఉంటాయి. వాటిని మనసులో మననం చేసుకుంటూ, భగవంతుడి సంకీర్తనలు పాడుతూ ఉండడం…

త్యాగరాజు, అన్నమయ్య వంటి భక్తులు భగవంతుడిని కీర్తించి తరించారు.

స్మరణం

స్మరణ అంటే తలచుకొనుట. సాదారణంగా ఒక్కోసారి దూరంగా ఉండే, స్నేహితుడిని గుర్తు చేసుకుంటాం. అలాంగే దూరంగా ఉండే బంధువును గుర్తు చేసుకుంటాం. ఏదో ఒక బందం దూరంగా ఉన్నప్పుడూ, గుర్తుకు వచ్చిన ప్రతిసారి వారిని తలచుకుంటూ ఉంటాం… జీవిత భాగస్వామి అయితే దగ్గరగా వచ్చేవరకు తలుస్తూ ఉంటాం… అంతవరకు ఏ పనిలోనూ భాగస్వామి ప్రతిరూపం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. అదే తరహాలో భగవంతుడిని తలుచుకోవడం గురించి కూడా స్మరణ భక్తిగా నవ విధ భక్తిలో చెబుతారు.

భాగవన్నామ స్మరణ చేస్తూ నారదుడు ముల్లోకాలు సంచారం చేస్తూ ఉంటాడు. భగవంతుడి లీలలు వింటూ ఉంటే, స్మరించే స్థాయికి మనసు చేరుకుంటుందని అంటారు.

పాదసేవనం

సేవించడం…. భగవంతుడికి సేవలు చేయడం. ఒక గుడిలో రుసుము చెల్లించి సేవలు చేయడమే కాకుండా, స్వహస్తలతో భగవంతుడి సేవలో పాల్గొనడమని చెబుతారు. ఒక పండుగకు ముందు గుడిని శుభ్రపరుస్తూ ఉంటే, అందులో పాలుపంచుకోవడం. భగవంతుడి పల్లకి మోయడం… శరీరమును భగవంతుడి సేవకు వినియోగించడం వలన భగవంతుడి అనుగ్రహం సులభం అంటారు.

అర్చనం

అర్చన భగవంతుడిని పూజించడం. దూప, దీపా నైవేద్యాలతో భగవంతుడిని పూజించడం. సనాతనధర్మంలో శాస్త్రం సూచించిన మాదిరిగా భగవంతుడికి పూజ ద్రవ్యాలు మనసు పెట్టి సమర్పించడం…. మానసికంగా భగవంతుడికి పూజ చేయగలిగే స్థాయి వచ్చే వరకు పూజా ద్రవ్యములతో భగవంతుడిని నిత్యం పూజించడం… మనసులో పూజా మెదులుతూ ఉంటే, మనసు భగవంతుడి పాదాల వద్దే ఉండడం… పూజలో పరమావధి అంటారు. భగవంతుడిని విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ పూజా ధ్రవ్యములతో పూజ చేస్తూ ఉంటారు.

వందనం.

వందనం భగవంతుడి ముందు వినయంగా ఉండడం. వినయంతో నిత్యం భగవంతుడికి వందనం చేయడం. శిరస్సు వంచి పెద్దలకు గౌరవభావంతో వందనం చేసినట్టు, నిత్యం భగవంతుడి రూపానికి మనసులో వందనం సమర్పిస్తూ, బౌతిక దర్శనంలో భగవంతుడి పాదాలకు నమస్కరిస్తూ ఉండడం అంటారు.

ప్రహ్లాదుడు నిత్యం అన్నింటా శ్రీహరి దర్శిస్తూ, అంతటా నమస్కార భావంతోనే ఉండేవాడు.

దాస్యం

దాస్యం చేయడం కూడా సేవ చేయడం లాంటిదే. అయితే దాస్యంలో ఫలితం ఆశించకుండా యజమానికి లొంగి పని చేస్తాం. అలాగే భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, భగవంతుడిని ఆరాదిస్తూ ఉండడం.

భగవంతుడికి తనంతట తానుగా దాసుడిగా మారిన హనుమ. అలాగే లక్ష్మణుడు కూడా ఈశ్వరుని వెంటే నిలిచాడు.

సఖ్యం

సఖ్యంగా ఉండడం అంటే స్నేహం చేయడం. ఒక మంచి స్నేహితుడితో ఎలా నడుచుకుంటామో అలాగే భగవంతుడితో స్నేహభావం పెరిగే విధంగా ప్రయత్నం చేయడం. పాండవులు ఈశ్వరునితో సఖ్యతతో ఉండి, నిరంతరం రక్షింపబడ్డారు…. చివరికి తరించారు.

ఆత్మనివేదనం

ఆత్మనివేదనం తనను ఈశ్వరుడికి అర్పించివేయడమే. ఆత్మను ఈశ్వరుడికి అర్పించడంలో బలి చక్రవర్తిని ఉదాహరణగా చెబుతారు.

నేటి రోజులలో స్మరణ చేయడం సులభం… భగవంతుడి గూర్చి చెప్పబడిన ప్రవచనాలు, పాటలు, కీర్తనలు వింటూ ఉండడం వలన మనసు భగవంతుడిపై లగ్నం కాగలదని అంటారు.

భగవంతుడి వైపు మరలిన మనసు భగవంతుడిని స్మరించడం మొదలు పెడుతుంది.

భాగవతం, రామాయణం, మహా భారతం వంటి పురాణ ప్రవచనాలు వినడం అలవాటు అయితే, అది శ్రేయస్కరమని అంటారు.

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

తెలుగు భజన పాటలు వింటూ

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

భక్తి భావనలు

తెలుగురీడ్స్

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

తెలుగులో వ్యాసాలు

తెలుగులో పిల్లల పేర్లు అచ్చ తెలుగులో బాబు పేర్లు

తెలుగులో శుభాకాంక్షలు కొట్స్

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు. తగు నియమాల వలన మనసులో దైవంపై భక్తి శ్రద్దలు పెరుగుతాయని చెబుతారు.

దేవాలయం అంటే భక్తులను అనుగ్రహించడానికి దైవము కొలువుతీరిన క్షేత్రం. ఆ క్షేత్రం పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన పరమాత్మ భక్తుల కోరికలు తీర్చడానికి కొలువైన పరమ పావన దైవనివాసం. అంతరి పరమపుణ్య ప్రదమైన దేవాలయములో దైవ దర్శనమునకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిభందనలు చెబుతారు.

గుడికి వెళ్ళే భక్తులు (స్త్రీ / పురుషులు) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేయవలెను. నుదుట కుంకుమ ధరించాలి.

గుడి ఆచారం ప్రకారం సంప్రదాయమైన దుస్తులు ధరించాలి. మగవారు పంచె, కండువా… ఆడువారు సంప్రదాయక చీరలు.

దేవాలయమునకు బయలుదేరుతున్నప్పుడే భగవన్నామ స్మరణ మేలని అంటారు.

భగవంతుడికి భక్తితో పూజించడానికి కనీస పూజా సామాగ్రి ఉండాలి… అంటే ధూప దీప నైవేద్యాలు…

దేవాలయ ప్రాంగణం చేరుకోగానే, ప్రాంగణం బయటే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు.

దేవాలయం ఆలయం ప్రవేశించడానికి ముందు, ఆలయ గోపురానికి నమస్కరించి ఆపైన మెట్లకు నమస్కరించాలి.

దేవాలయం లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ మనసు భగవంతుడిపైనే పెట్టాలి.

దేవాలయం చుట్టూ ఆలయంలొని దైవమును అనుసరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటారు.

ప్రదక్షిణ సమయంలో మనసంతా భగవంతుడిపైనే ఉండడం శ్రేయస్కరం అంటారు.

దేవాలయంలో పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిలబడాలని అంటారు.

ఆలయంలో దైవమును ఆపాదమస్తకం వీక్షించాలని అంటారు. అంటే కాళ్ళ దగ్గర నుంటి ముఖం వరకు పూర్తిగా దైవమును దర్శించాలని అంటారు.

దైవదర్శనం అయిన తరువాత ఆలయంలో కాసేపు కూర్చొని ఆలయంలో కొలువుతీరిన దైవనామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో కాసేపు దేవాలయంలోనే ఉండాలని అంటారు.

దైవ ప్రసాదం భక్తితో స్వీకరించడం వలన భగవంతుంది అనుగ్రహం కలుగుతుందని అంటారు.

ఇంటికి తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ ఆలయంలోని స్వామికి నమస్కరించుకుని ఆలయం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ తిరిగి గోపురానికి నమస్కరించి వెళ్ళాలని అంటారు.

వివిధ ప్రాంతాలు వివిధ పద్దతులను బట్టి ఆయా దేవాలయములలో కొన్ని ప్రత్యేక నియమాలు చెబుతూ ఉంటారు. అటువంటి క్షేత్రముల దర్శనమునకు వెళ్ళే ముందు, ఆయా క్షేత్రముల చరిత్రను, నియమాలను ముందుగా తెలుసుకోవడం శ్రేయస్కరం అంటారు.

తెలుగు భజన పాటలు వింటూ

తెలుగు భజన పాటలు వింటూ ఉంటే, మదిలో పాటల పల్లకి అవుతుంది. కీర్తనలు భజన పాటల రూపంలో భజించడం అంటే మనసును భక్తివైపు మరల్చడమే.

భక్తుడి భజన వలన భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలాగే భక్తుని మది గుడిలో నుండి మనసంతా వ్యాపిస్తాడని అంటారు.

భజన చేయడం వలన భగవంతుని అనుగ్రహం త్వరగా పొందవచ్చని పెద్దల మాట. పదే పదే భగవణ్ణామమ్ భజించడం అంటే భగవంతుని అనుగ్రహం కోసం తపించడమే అంటారు.

కర్మ ప్రభావం చేత మనిషి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటే, సుఖంలోనూ దుఖంలోనూ భగవంతుడిని దర్శించడమే భక్తి అని చెబుతారు.

నిత్యము విషయ లాలస చేత, మనిషికి భక్తిపై మనసు లగ్నం కానప్పుడు మాత్రం, భజన చేయడం వలన మనసు భక్తికోసం తపిస్తుంది అంటారు.

తెలుగు భజన పాటలు వింటూ ఉంటే మనసు తన్మయంతో పరవశిస్తుందని అంటారు.

వ్యక్తిని సత్యదూరం వైపు నడిపించే విషయాలు వ్యక్తి చుట్టూ చేరడంలో చాలా వేగంగా వస్తాయి. కానీ సత్యంవైపు నడిపించే భక్తిమార్గం వైపు మాత్రం వ్యక్తి నడవడానికి భగవంతుడి అనుగ్రహం అవసరం అంటారు. భగవంతుడి అనుగ్రహం భజన చేత త్వరగా కలిగితే, భజన పాటలు భగవంతుడిని స్తుతి చేస్తూ ఉంటాయి.

భగవంతుడి భజన పాటలు మనసును కుదుటపరుస్తాయని అంటారు. భజన పాటలు భగవంతుడిపై మనసు లగ్నం అయ్యేవిధంగా ప్రభావం చూపగలవని పెద్దల మాట.

భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో భజన చేయడం అంటే అదొక తపస్సు అని అంటారు. భక్తి భజన పాటల వలన మనసు త్వరగా భగవత్సరూపమును పట్టుకుంటుందని అంటారు.

తెలుగు భక్తి భజన పాటల పుస్తకాలు ఉచితంగా మీ ఫోనులో కానీ కంప్యూటర్ లో కానీ లాప్ టాప్ లో కానీ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది అక్షరాలను క్లిక్ చేయండి.

అన్నమాచార్యుల అమృతవర్షిణి భక్తి కీర్తనల పి‌డి‌ఎఫ్ పుస్తకం డౌన్ లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి… ఇవే అక్షరాలపై

ఆనంద మంగళం మధుర భక్తి గీతాల తెలుగు పుస్తకము కోసం ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి

త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు తెలుగు భక్తి పాటల పుస్తకం కోసం ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి

తపన కొరకు భక్తితో భజన భాగవన్నామ స్మరణకు నాంది

భక్తి కోసం మనసు తపించడమే, కష్టం కలిగినప్పుడు అది శాంతించదనికి, భక్తి మనసుకు మంచి మందు అంటారు. మంచిమందు కోసం మనసు ముందుగా ఇష్టపడకపోవచ్చు కానీ అలవాటు అయితే మాత్రం ఆ మంచి మందును అందరికీ పంచే మంచి ప్రయత్నం మనసు చేయగలదని అంటారు.

తపన ఉంటే తపస్సు చేసేవరకు మనసు ఊరకుండదు అని అంటారు. అటువంటి తపన భక్తివైపు మరలితే, జీవితం ధన్యత పొందుతుందని చెబుతారు. అటువంటి తపనకు నాంది భగవంతుడి భజన అంటారు.

తెలుగు భజన పాటలు వింటూ , భజన చేస్తూ భాగవన్నామ స్మరణలో మనసు తన్మయావస్తకు చేరడం ఒక తపస్సు వంటిది అంటారు. అలాంటి తపస్సు వలన లోపాలే ఉండే భగవంతుడు కష్టంలోను మనసు చలించకుండా బుద్దిని సన్మార్గంలో నడిపిస్తాడని పెద్దలంటారు.

భగవంతుడు కోసం పాటలు రచించినవారు ఎందరో… ఆ మహానుభావులు రచించిన పద్యాలు, కీర్తనలు భజన రూపంలోకి మార్చినవారు కూడా ఉన్నారు.

అలాంటి రచనలే భజన పాటలుగా మారితే, ఆ తెలుగు భజన పాటలు వింటూ మనసు భగవంతుడి వైపు తిరుగుతుందని అంటారు.

భజ గోవిందం భజగోవిందం అంటూ సాగే భజన పాటతో గోవిందుడి అనుగ్రహం పొందడం సులభతరం అంటారు.

ఎందుకు భజన పాటలు వ్యక్తి మనసుని భక్తి మార్గం వైపు తిప్పగలవని అంటారు.

ఎందుకంటే భక్తి వలన ముక్తి సులభమనే సూచన పొందినవారంతా భక్తికై తపిస్తారు.

భక్తుల మొర అలకించే భగవానుడు, త్రికరణశుద్దితో పలికే పలుకులను భగవంతుడు అలకిస్తాడు.

ఒకరే ఒక చోట కూర్చుని ఉంటే, అతని మనసు పలు పలు విధాలుగా తలంపులు చేయడానికే ప్రయత్నం చేయవచ్చు.

ఇంకా ఒక్కరే కూర్చుని భక్తితో భగవానుదిని స్మరించే సమయంలో ఏదో ఒక సమస్య మనసుపై ఒత్తిడి తేవచ్చు…

ఎలాగో లాగా ఒక వ్యక్తి ఒక చోట కూర్చోవడానికి ప్రయత్నం చేయడానికే చాలా సమయం పడుతుంది. కానీ సావాసంలో మనసు త్వరగా నిలకడ పొందగలదని అంటారు.

పదిమండి ఒక చోట కూర్చుని, క్రమశిక్షణతో ఒక పని మొదలు పెడితే, ఆ పనిలో వారంతా లీనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదిమందిలో ఎక్కువమంది పనిమీద ధ్యాస పెట్టగలరు. అలాగే భగవంతుడిని ప్రార్ధించేవారిలో కూడా పదిమంది ఒక చోట కూర్చుని భాగవన్నామ సంకీర్తన చేస్తుంటే, ఎక్కువమంది మనసు ఆ సంకీర్తన ఆలాపన చేస్తూ ఉంటుంది.

అందుచేత పదిమంది కలసి చేసే పనిలో ఎక్కువమంది శ్రద్దాశక్తులు కలిగి ఉండే అవకాశం ఎక్కువ. ఇక భజన పాటలు పాడడం మొదలు పెడితే మాత్రం, ఎక్కువమంది మనసు భగవంతుడి వైపు వెళుతుంది.

ఏకాగ్ర చిత్తం కలిగి ఉండడం భక్తిలో మొదటి మెట్టుగా చెబుతారు.

భగవన్నామ స్మరణకు భజన పాటలు తోడ్పాటు అందిస్తాయి…

తెలుగు భజన పాటలు వింటూ

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది. భక్తీ, ముక్తికి భగవద్గిత మనసుకు ఔషధం వంటిది అని అంటారు.

మహాభారతములో భీష్మ పర్వములో ప్రారంభం అయ్యే భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంధంగా ప్రసిద్ది చెందింది.

భగవద్గీత ఉపనిషత్తుల సారమని అది జీవితానికి దిశా నిర్దేశం చేయగలదని అంటారు. భక్తీ భావనతో గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంటుంది. భగవద్గీత చదువుతూ, చిత్తశుద్దితో జీవించడం పాపహరణకు ఒక మార్గమని పెద్దలు చెబుతారు.

మనిషి జీవనంలో యోగం ఉంటుంది. మనిషి జీవించే క్రమంలో కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు ఉంటాయి.

భగవానుడు అర్జునునిడికి బోధించిన భగవద్గీతలో ఆత్మ తత్వము, జీవన కర్తవ్యము – కర్మ, జ్ఞానము, భక్తి, యోగ సాధన, భగవత్తత్వము, శ్రద్ధ, గుణ విభాగము తదితర విషయాలు ప్రస్తావించబడతాయి.

అనేక మంది మహానుభావులు భగవద్గీతను రీడ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంటారు. ఎక్కువ మంది భగవద్గీతను జ్ఞానం కొరకు చదువుతూ ఉంటారు.

స్వాతంత్ర్య ఉద్యమం దేశమంతా వ్యాప్తి చెంది, దేశాన్ని ఒక తాటిపై నిలబెట్టిన మహాత్మా గాంధి కూడా భగవద్గీత పారాయణం చేసినట్టు ఆయన రచనలే చెబుతాయి.

వ్యక్తిలో స్ఫూర్తిని రగిలించే శక్తి భగవద్గీత పఠనం వలన వస్తుందని అంటారు

“నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.”

— మహాత్మా గాంధీ

జ్ఞానం అందించే భగవద్గీతలో విభాగాలు ఉంటాయి. అవి ఈ క్రింది యోగములుగా చెబుతారు.

అర్జునవిషాద యోగము
సాంఖ్య యోగము
కర్మ యోగము
జ్ఞాన యోగము
కర్మసన్యాస యోగ:
ఆత్మసంయమ యోగము
జ్ఞానవిజ్ఞాన యోగము
అక్షరపరబ్రహ్మ యోగము
రాజవిద్యారాజగుహ్య యోగము
విభూతి యోగము
విశ్వరూప సందర్శన యోగము
భక్తి యోగము
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
గుణత్రయవిభాగ యోగము
పురుషోత్తమప్రాప్తి యోగము
దైవాసురసంపద్విభాగ యోగము
శ్రద్దాత్రయవిభాగ యోగము
మోక్షసన్యాస యోగము 

ఎరుకలో ఉన్నవాడికి పొంచి ఉన్న ప్రమాదంపై అవగాహన ఉంటుంది. పాములు పట్టేవానికి పాముల గురించి బాగుగా ఎరుకలో ఉంటుంది. కావున అతను పామంటే భయపడడు. అలాగే జీవన పరమార్ధం ఎరుకలో ఉన్న వ్యక్తికి, బాధించే విషయాలు ఉండవని అంటారు.

భగవద్గీత వలన విషయ వాసనలు నశించి, విషయములకు ఆలవాలమైన మనసు గురించి మనసే ఆలోచన చేయడమే ఒక అద్బుతమని అంటారు.

మనసు అనేది మననము వలన దుఃఖము, సుఖము తెచ్చుకుంటుంది అంటారు. సుఖదుఃఖాలు మనసుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. సుఖంగా ఉంటే సంతోషం, దుఃఖంగా ఉంటే విచారం…

విషయాల వలన విచారం ఎక్కువయ్యే మనసుకు భక్తిభావన ఒక ఆలంబనగా ఉంటుందని అంటారు. భక్తితో ఆలోచన చేసే మనసు శాంతిగా శోచించడం అలవాటు చేసుకోగలుగుతుందని అంటారు.

భక్తి భావన భగవద్గీత రీడ్ చేయడం ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు. భక్తితో మెదిలే మనసులో వ్యగ్రత కన్నాశాంతస్వభావం పెరుగుతుంది.

మనసులో భక్తి భావనలు పెంచుకునే ప్రక్రియలో భగవానుడు బోదించిన భగవద్గీతను చదువుకోవడం మంచి అలవాటుగా చెబుతారు.

భగవద్గీతకు సంబంధించిన వివిధ పుస్తకాలు ఆన్ లైన్లో రీడ్ చేయడానికి లేదా మీ ఫోనులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బట్టన్ పై క్లిక్ చేయండి.

భక్తి భావనలు

తెలుగురీడ్స్

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు. ప్రవచనాలు వినడం వలన భాగవతం బాగుగా మనసులో నాటుకుంటుంది.

వినుడు భాగవతం భగవంతుడిని చేరాలనే భావనను పెంపొందించుకో… తెలుగులో భాగవతం విను, అలా భాగవతం వినగా వినగా… కాలంలో వచ్చే కష్టానికి కారణం కనబడగలదు.

భాగవతం రచించిన తరువాతే వ్యాసుని మనసు శాంతించినది అని పండితులు చెబుతారు. అలాంటి భాగవతం వినాలనే సంకల్పం చేయడం, భక్తి అనే భావన బలపడుతుంది.

చదివే భాగవతం మనసులో బలంగా నాటుకోవాలంటే, పెద్దల మాటలలో భాగవతం గురించి వినాలని అంటారు.

వినడం అలవాటు అయితే, ఆలోచన అగుతుంది. వింటున్న విషయం పైనే మనసు నిలబడుతుంది. అలాంటి మనసుకు భాగవతం వినాలనే తలంపును తెచ్చిపెడితే, భక్తి భావన బలపడే అవకాశం ఎక్కువ.

చదవకూడని బుక్స్ అనెకంగా అందుబాటులో ఉంటాయి… అవి చదవాల్సిన బుక్స్ చదవకుండా ఉండడానికి అవరోధాలుగా ఉంటాయి.
కాబట్టి చదవకూడని విషయాలు చదివిన మనసుకు పెద్దలమాట మంత్రంలాగా పనిచేస్తుందని అంటారు. కాబట్టి భాగవతం పండితుల ప్రవచనాల ద్వారా వినడం ప్రధానం అంటారు.

భగవంతుడిని గురించి, భగవంతుడి అనుగ్రహం పొందిన భక్తుల గురించి భాగవతం చక్కగా తెలియజేస్తుందని అంటారు. అందువలన భాగవతం గురించి ప్రవచనాలు వినాలనే అంటారు.

భక్తి భావం బలపాడడానికి భాగవతం చక్కగా ఉపయోగపడుతుందని అంటారు. పుస్తక రూపంలో లభించే భాగవతం పండితుల వాక్కులలో మరింతగా మనసును చేరగలదు.

ఒక్కడే అయినా అనేక రూపాలలో దర్శనమిచ్చే భగవంతుడు గురించి భాగవతం బాగుగా తెలియజేస్తుందని అంటారు. వ్యాస భాగవతం పోతనా మాత్యుల ద్వారా తెలుగులోకి అనువదించబడింది.

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం చదవడం సాధన వైపు మనసు మరలుతుంది

పలువురు పండితులు భాగవత ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. భాగవతం గురించి తెలుగులో ప్రవచనాలు విని, భాగవతం చదవడం మొదలుపెడితే, చదివేటప్పుడు ఊహించే అలవాటు గల మనసుకు పెద్దల మాటలు మార్గదర్శకం కాగలవు.

భాగవతం గురించిన పెద్దల మాటల ప్రభావం మనసుపై భాగవతం చదివేటప్పుడు పడుతుంది. భగవంతుడు గురించి విన్న మనసు, భగవంతుడి గురించి చదువుతుంటే, సక్రమమైన ఊహాశక్తి పుడుతుంది.

మనసుకు ఉండే బలం ఊహా శక్తి అయితే, అది చెడు విషయాలపైకి వెళితే, అదే దాని బలహీనత… అదే మనసు భగవంతుడు గురించి ఊహ చేయడం మొదలుపెడితే, అదే బలం. అయితే సదాచారం వలన సక్రమమైన పరివర్తన ఉన్నట్టు… పెద్దల మాటల వలన సక్రమమైన ఆలోచన ఉంటుందని అంటారు.

తపించే హృదయానికి భావావేశం ఎక్కువైతే, అది భాగవతం వైపు మరలితే, భక్తి భావన బలపడుతుంది. భక్తి భావన బలపడడం అంటే, మనోబలం పెంచుకోవడమే అంటారు.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ శుభాకాంక్షలు…

రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము మననము చేయడము జీవనగమ్యము చేరడానికే. రాముడు అనుగ్రహం ఉంటే, సాధ్యం కానీ విజయం సిద్దిస్తుంది.

శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామనామము జపించడమే మార్గం.

ఏమి కర్మలు చేసి ఉన్నమో? ఏమి కర్మలు వెంటాడుటయో? కాలం – కర్మ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుటయో? ఎవరికెరుక? ఆ రామునికెరుక… కనుక రామునే పట్టుకుంటాను. రామనామము నిత్యము మననము చేస్తా!

శ్రీరామనామము జపిస్తూ, రామభజనము చేసే పోతనకు రామానుగ్రహం అయ్యింది. శ్రీమద్భాగవతమ్ సంస్కృత భాష నుండి తెలుగు భాషకు అనువదించారు.

రామానుగ్రహం పొందిన పోతనామాత్యులు, శ్రీమద్భాగవతమ్ రామునికే అంకితం అందించారు… కానీ డబ్బుకోసం మరే ఇతర విషయాలకు ఆశపడలేదు. తన మనసును రామస్వరూపముతో నింపేసుకున్నారు. మనసు నిండా రాముడే ఉంటే, మరి ఆ మనిషి కావలసినదేముంటుంది.

రామదాసు రామునిపైనే దృష్టి. రామదాసు జీవితం సుఖంలో ఉన్నప్పుడు రామాలయం నిర్మించారు. కష్టంలో ఉన్నప్పుడూ దాశరది శతకం అందించారు. రామానుగ్రహం కలిగితే మంచి పనులు జీవనోద్దరణ నిర్మాణమే మనసులో ఉంటుంది.

ఎంత కష్టం వచ్చిన రామునిపై నమ్మకంతో ఉండి, జీవితాల్ని ధన్యం చేసుకున్నవారు బమ్మెర పోతన, రామదాసు…

శ్రీరాముడు కేవలం పోతనను అనుగ్రహించడమే అనుకుంటే, రామదర్శనం పొందితే చాలు. కానీ రాముడు తెలుగువారందరినీ అనుగ్రహించాలని అనుకున్నాడు.

రావణాసురుడిని చంపడమే కాకుండా, చాలా కాలం భూమిపై ఉండి, మనుష్య జాతిని ఉద్దరించిన శ్రీరాముడు, తెలుగువారందరినీ అనుగ్రహించడం కోసం బమ్మెర పోతనతో భాగవతం అనువాదం చేయించాడు.

అలాగే శ్రీరాముడు రామదాసును అనుగ్రహించడమే అనుకుంటే, రామదాసు గుడి కడుతున్నప్పుడే గోపన్న మనసులో శ్రీరాముడు చేరాడు. కానీ అందరినీ అనుగ్రహించడం కోసం రామదాసుతో శతకం అందించాడు.

మన శ్రీరాముడు కేవలం భక్తుడునే అనుగ్రహించడం కాదు, భక్త జనాన్నే అనుగ్రహించడం చేస్తూ ఉంటాడు.

అలాంటి మన శ్రీరాముడు అందరి మనోసింహాసహనంలో సీతాలక్ష్మణ ఆంజనేయులతో అధిష్టించాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు…

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే”

భక్తిభావనాలు తెలుగులో

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది. భక్తి భలే మందు మనుసుకు. భక్తిభావన చేత మనసు శాంతికి దగ్గరగా అశాంతికి ఆమడ దూరంగా ఉంటుంది.

భక్తి భావనలు… భక్తి భావన బలమైనది

దైవంపై మనసుకు ఏర్పడే భక్తి భావన ఎంత బలంగా ఉంటే, అంతటి మనోశక్తి అంటారు. విగ్రహం ముందు నిగ్రహం మనలో మనోశక్తికి మూలం అంటారు.

ఎవరికి ఇష్టమైన దైవం, వారి వారి మనసు మూలంలో ఉంటారు. కానీ మనసు తనకు తాను ఏర్పరచుకునే విషయలాలస వలన మూలలోనే మిగిలిపోతుంది.

మనసు ఏర్పరచుకునే విషయాలు, అలవాటుగా మారి ఉంటాయి. అలా అలవాటులు మనసులో ఉన్న భక్తి భావనను తొక్కి పెడతాయి. బలమైన అలవాటులు శక్తిని హరిస్తూ ఉంటే, మనసు మాత్రం అలవాటుకు లొంగుతుంది.

నియంత్రణ ప్రధానంగా ఆచారం ఉంటే, కేవలం మన మనసును విషయవాసనల నుండి దూరం చేయడానికే ఆచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయితే, ఆచరించడం మనసుకు మందు వేయడం వంటింది.

సమాజంలో మనిషి చుట్టూ ఉండే విషయాలు మనసులో గూడు కట్టుకుని ఉంటాయి. మదిగదిలో మెదిలే ఆలోచనలు కేవలం విషయాలవైపు మాత్రమే వెళితే, ఆ మనసుకు వ్యాపకాల పరంపర అంటే అమిత ఇష్టం ఏర్పడుతుంది.

విషయాలను చూస్తూ, విషయాల సృష్టికి ఆధారమైన వాడిని తలుస్తూ ఉండడం వలన మనసులో మూలలో దాగి ఉన్న భక్తి పైకి వచ్చే మార్గం కూడా ఏర్పడుతూ ఉంటుంది.

మనకు భక్తి భావం బలమైనది మనసుకు శాంతి అందించడంలో భక్తి భావం ముందుంటుంది. కారణం కష్టాలకు చలించిపోకుండా మనసుకు దైవమున్నాడనే భావన మనసులో చేరిన ఆందోళనను చెరుపుతుంది. ఆందోళన లేని మనసు అది శాంతిగా ఉంటుంది. దాని చుట్టూ ఉండేవారిని శాంతితో ఉండనిస్తుంది. కాబట్టి భక్తి భావం మనసుకు శాంతిని అందిస్తుంది.

బలమైన మనసుకు బలహీనతే అద్దంకి. బలహీనత కూడా బలంగా మార్చగలిగే శక్తి దైవానికి ఉందని పెద్దలంటారు. కానీ భక్తి భావన బలంగా లేకపోవడం వలననే, మనసు ఆందోళనకు దగ్గరగా, అశాంతిని అనుకుని ఉంటుంది.

ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న అనుభవాలు అనుభవిస్తూ, మనసులో మరో మూలన పడిన భక్తి భావనను పైకి తీసుకువచ్చే ఆలోచనలకు కూడా అవకాశం ఇవ్వడమే భక్తి భావన బలపడడానికి మార్గం అంటారు.

జీవితంలో కష్టసుఖాలు కామన్. కానీ కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. ఇష్టపడి పనిచేస్తే, కష్టం తెలియకుండా పని పూర్తి అవుతుంది. అది కూడా మనసు వలననే అంటారు.

అలాంటి మనసుకు భక్తి భావనను కూడా పెంచే విధంగా ఆలోచనలకు అవకాశం ఇవ్వడమే భక్తి భావన పెరుగుదలకు బీజం పడుతుంది.

విగ్రహం ముందు నిగ్రహం వహించడం నియంత్రణలో ప్రాధమిక ప్రయత్నం

విగ్రహం ముందు నిగ్రహం వహించడం నియంత్రణలో ప్రాధమిక ప్రయత్నం అయితే, భక్తి భావన బలపడడానికి అది ఆది ప్రయత్నం అవుతుంది.

మనకు అనేక మతాలు, అనేక దైవాలు, దేవతలు ఉన్నారు. మన సమాజంలో మత స్వేచ్చ ఉంది. దైవనామ స్మరణకు, దైవారాధనకు షరతులు లేవు.

మనసు ఉండాలే కానీ మార్గములు అనేకం. భక్తి అనే భావన మనసులో మెదలాలి కానీ దేవతలకు కొదువలేదు.

ఒక దైవం అనుకుని. ఆ దైవంపై నమ్మకం ఉంచుకుని, ఆ దైవ నామస్మరణ చేయడం. ఆ దైవ స్వరూపమును మనసులో ముద్రించుకోవడం ప్రధానం అయితే అందుకు విగ్రహారాధన మొదటిమెట్టు అంటారు.

దైవ స్వరూపమును మనసులో బలంగా ముద్రించుకోవడానికి మార్గం విగ్రహం ముందు నిగ్రహంతో ఉండడం.

నిగ్రహం అలవాటు కావడానికే విగ్రహం ముందు కూర్చుని నియమాలతో ఉండడం. స్తోత్రం చేయడం, దైవ సేవ చేయడం అంటారు.