XML లాంగ్వేజ్ దాని ఉపయోగాలు, XML అంటే ఎక్స్‌టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, ఇది మార్కప్ లాంగ్వేజ్, ఇది డాక్యుమెంట్‌లను ఎన్‌కోడింగ్ చేయడానికి ఉపయోగించే ఫార్మాట్‌లో మానవులు చదవగలరు మరియు మెషీన్ కూడా చదవగలదు.
ఈ లాంగ్వేజ్ మానవులు చదవగలిగేలా మరియు యంత్రం చదవగలిగేలా రూపొందించబడింది మరియు ఇది విస్తృత శ్రేణి అనువర్తనాల్లో ఉపయోగించబడుతుంది. XML యొక్క అత్యంత సాధారణ ఉపయోగాలు కొన్ని:
డేటా మార్పిడి: వివిధ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల మధ్య డేటాను మార్పిడి చేయడానికి XML సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, రెండు కంపెనీలు తమ ఉత్పత్తులు మరియు ధరల గురించి డేటాను మార్పిడి చేసుకోవడానికి XMLని ఉపయోగించవచ్చు.
వెబ్ సేవలు: XML అనేది అనేక వెబ్ సేవలకు ప్రాతిపదికగా ఉపయోగించబడుతుంది, ఇవి తప్పనిసరిగా సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లు, ఇవి వివిధ అప్లికేషన్‌లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి ప్రామాణిక మార్గాన్ని అందిస్తాయి.
కాన్ఫిగరేషన్ ఫైల్‌లు: సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల కోసం కాన్ఫిగరేషన్ ఫైల్‌లను రూపొందించడానికి XML తరచుగా ఉపయోగించబడుతుంది. వినియోగదారు ఇంటర్‌ఫేస్ లేదా నెట్‌వర్క్ కనెక్షన్‌ల సెట్టింగ్‌లు వంటి అప్లికేషన్ ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి సమాచారాన్ని నిల్వ చేయడానికి ఈ ఫైల్‌లను ఉపయోగించవచ్చు.
డేటా నిల్వ: నిర్మాణాత్మక మార్గంలో డేటాను నిల్వ చేయాల్సిన అప్లికేషన్‌ల కోసం XMLని డేటా నిల్వ ఫార్మాట్‌గా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కస్టమర్‌లు లేదా ఉత్పత్తుల గురించి సమాచారాన్ని నిల్వ చేయడానికి అప్లికేషన్ XMLని ఉపయోగించవచ్చు.
డాక్యుమెంట్ ఫార్మాట్‌లు: XHTML మరియు RSS వంటి డాక్యుమెంట్ ఫార్మాట్‌లకు XML ఆధారంగా ఉపయోగించవచ్చు. ఈ ఫార్మాట్‌లు వెబ్ డెవలపర్‌లు వెబ్ పేజీలు మరియు వార్తల ఫీడ్‌లను సృష్టించడానికి అనుమతిస్తాయి, వీటిని మనుషులు మరియు యంత్రాలు సులభంగా చదవవచ్చు.
మొత్తంమీద, XML అనేది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్ మరియు ఇతర రంగాలలో అనేక విభిన్న అప్లికేషన్‌లను కలిగి ఉన్న బహుముఖ మరియు విస్తృతంగా ఉపయోగించే సాంకేతికత.
ఆండ్రాయిడ్ స్టూడియోలో XML ఫైల్ కోడ్ రూపంలో వ్రాయవచ్చును లేదా డిజైన్ రూపంలో కోడ్ మొబైల్ యాప్ పేజిని డిజైన్ చేయవచ్చును. కానీ ఇది విజిబిల్ గా ఉంటే, దీని వెనుక భాష, జావా ప్రొగ్రామింగ్ ఉంటుంది.
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్ అవుతుంది. కారణం BharOS భారతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా ఇండియన్స్ పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా BharOS ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి డిఫాల్ట్ యాప్స్ లేకపోవడం. ఇంకా పర్సనల్ సెక్యూరిటీ పదిలం…
నేటి టెక్నాలజీ కాలంలో పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుంది… అని చాలామంది చెబుతుంటే, ఎక్కువమంది విశ్వసిస్తున్నారు.
కొన్ని కంపెనీలు గుత్తాదిపత్యం చెలాయించడానికి గానూ కొత్త ఫోనులో డిఫాల్ట్ యాప్స్ ఉంచుతున్నారు.
ఏమిటి ఈ డిఫాల్ట్ యాప్స్?
ఒక వ్యక్తి ఒక ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కొంటే, ఆ స్మార్ట్ ఫోనులో ఆ వ్యక్తి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా… కొన్ని యాప్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తను కొనుగోలు చేసుకున్న స్మార్ట్ ఫోన్ కు పూర్తి యజమాని ఎలా అవ్వగలడు? ఇది తేలని ప్రశ్న అయితే…
ఇప్పుడు ఇన్ స్టాల్ చేయబడిన డిఫాల్ట్ యాప్స్, ఫోన్ కొనుగులో చేసుకోవడానికి అవకాశం లేకపోవడం అంటే, అది అతని ఫోనుపై కంపెనీ కూడా యజమానిగా ఉంటున్నట్టే అవుతుంది కదా.
ఒక వ్యక్తి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నారు. అతను ఆ ఫోనులో ఆన్ లైన్ ద్వారా వీడియోలు చూడడానికి అనేక వీడియో ప్లాట్ ఫామ్స్ యొక్క వెబ్ సైటులు ఉంటాయి. వెబ్ సైటు ద్వారా వీడియో వీక్షణ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు, పర్టిక్యులర్ గా యూట్యూబ్ యాప్ డిఫాల్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు కావాలనుకుంటే, ఇన్ స్టాల్ చేసుకోవడానికి లేకపోతే అన్ ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం లేకుండా సాఫ్ట్ వేర్ తయారు చేయబడి ఉండడం జరుగుతుంది. ఇలా చాలా యాప్స్ డిఫాల్ట్ గా కొత్త ఫోనులో ఉంటున్నాయి. యూట్యూబ్ అయితే అందరూ వాడేదాకా అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు అది వాడుకలో ఉంది. ప్రారంభంలో యూట్యూబ్ డిఫాల్ట్ యాప్ లేదు….
ఇలా డిఫాల్ట్ యాప్స్ స్మార్ట్ ఫోన్ లో స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది. ఫోన్ మెమోరీ పుల్ నోటిఫికేషన్స్ ఎక్కువయ్యి…. ఫోన్ అంటే విసుగు వచ్చేవారు కూడా ఉండవచ్చును. ఇప్పుడు BharOS వలన ఇటువంటి డిఫాల్ట్ యాప్స్ సమస్య అసలు ఉండదనేది… ఆసక్తికరం… అభినందనీయం… ఆమోదయోగ్యం.
ఇంకా BharOS వ్యక్తిగత భద్రతకు హామినివ్వడం కూడా అందరికి ఆసక్తి పెరుగుతుంది. ఈ BharOS భరోసా ఉంటుందని నమ్మకం కలుగుతుంది.
అయితే ఈ ‘BharOS’ మన భారతదేశానికి సంబంధించినది అయితే ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన ఓఎస్ కంపెనీలకు ఎందుకు షాక్?
అంటే, ప్రపంచంలో ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారిలో భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి చాలామంది ఈ BharOS కు ఆకర్షితులైతే ఇతర ఓఎస్ కంపెనీలకు షాక్… భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్.
కానీ ఇతర ఫీచర్ల విషయంలో ఏమేరకు అవగాహన కనబరుస్తారో చూడాలి.
అవగాహన సులభంగా ఉంటేనే, అందరూ ఉపయోగిస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుక సులభంగా ఉంటుంది… తక్కువ ఖర్చు కాబట్టి ఇంతమంది వాడుతున్నారు.
జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు. జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్, ఇది వెబ్ అప్లికేషన్‌లు, మొబైల్ యాప్‌లు, గేమ్‌లు మరియు సాఫ్ట్‌వేర్ టూల్స్ వంటి వివిధ రకాల అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
మొదట 1995లో సన్ మైక్రోసిస్టమ్స్ ద్వారా విడుదల చేయబడింది. ఇది మొబైల్ యాప్‌ల నుండి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్‌లు మరియు గేమ్‌ల వరకు అనేక రకాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది. జావా ప్లాట్‌ఫారమ్-స్వతంత్రంగా రూపొందించబడింది, అంటే జావా కోడ్ మార్పు లేకుండా వివిధ రకాల కంప్యూటర్ సిస్టమ్‌లపై అమలు చేయగలదు. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటి మరియు ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందింది. జావా యొక్క కొన్ని నిర్దిష్ట ఉపయోగాలు.
అనేక ప్రొగ్రామింగ్ లాంగ్వెజెస్ ను జావా దాటి వెళ్ళి ప్రాచుర్యం పొందాయి. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగంతో జావా లాంగ్వేజ్ వినియోగం బాగా పెరిగింది.
జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు ఏమిటి?
ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్: కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు మరియు సప్లై చైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ వంటి ఎంటర్‌ప్రైజ్-స్థాయి అప్లికేషన్‌లను రూపొందించడానికి జావా సాధారణంగా ఉపయోగించబడుతుంది.
వెబ్ అభివృద్ధి: JavaServer Faces మరియు JavaServer పేజీల వంటి సాంకేతికతల ద్వారా డైనమిక్, ఇంటరాక్టివ్ వెబ్ పేజీలు మరియు వెబ్ అప్లికేషన్‌లను సృష్టించడానికి జావాను ఉపయోగించవచ్చు.
ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్: ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లను డెవలప్ చేయడానికి ఉపయోగించే ప్రాథమిక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా.
పెద్ద డేటా మరియు విశ్లేషణలు: పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు ఉపయోగకరమైన అంతర్దృష్టులను సేకరించేందుకు జావా తరచుగా బిగ్ డేటా మరియు అనలిటిక్స్ అప్లికేషన్‌లలో ఉపయోగించబడుతుంది.
గేమ్ డెవలప్‌మెంట్: వీడియో గేమ్‌లను అభివృద్ధి చేయడానికి జావా ఒక ప్రముఖ ఎంపిక, ముఖ్యంగా ఇండీ గేమ్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీలో.
సైంటిఫిక్ అప్లికేషన్స్: జావా అనుకరణలు, డేటా విశ్లేషణ మరియు విజువలైజేషన్ వంటి అనేక శాస్త్రీయ మరియు పరిశోధన అనువర్తనాల్లో ఉపయోగించబడుతుంది.
IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) : జావా అనేది రౌటర్లు, గేట్‌వేలు మరియు ఎంబెడెడ్ సిస్టమ్‌ల వంటి IoT పరికరాలకు ఎంపిక చేసుకునే ప్రోగ్రామింగ్ భాష.
రోబోటిక్స్: సంక్లిష్ట డేటా ప్రాసెసింగ్ మరియు నిజ-సమయ నియంత్రణను నిర్వహించగల సామర్థ్యం కారణంగా జావా రోబోట్‌లు మరియు డ్రోన్‌లను ప్రోగ్రామ్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
జావా బేసిక్ ఎక్జాంపుల్స్
public class HelloWorld {
public static void main(String[] args) {
System.out.println("Hello, World!");
}
}
public class Main {
public static void main(String[] args) {
int x = 5;
double y = 10.5;
char z = 'a';
String name = "John Doe";
System.out.println("x: " + x);
System.out.println("y: " + y);
System.out.println("z: " + z);
System.out.println("name: " + name);
}
}
public class Main {
public static void main(String[] args) {
int x = 5;
int y = 10;
if (x > y) {
System.out.println("x is greater than y");
} else {
System.out.println("x is not greater than y");
}
}
}
public class Main {
public static void main(String[] args) {
for (int i = 0; i < 5; i++) {
System.out.println("Hello, World!");
}
}
}
public class Main {
public static void main(String[] args) {
int i = 0;
while (i < 5) {
System.out.println("Hello, World!");
i++;
}
}
}
యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి! ఎలా యూట్యూబ్ ఛానల్ మరింతమంది వీక్షకులను ఆకట్టుకోవాలి? ఎలా మరింతమంది సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలి. ఇదో పెద్ద సవాల్ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ?. ఓ వెబ్ సైట్ అయితే సాంకేతికత అవసరం కానీ యూట్యూబ్ ఛానల్ కు సరైన కంటెంటు ఉంటే మాత్రం ఆ కంటెంటే వీక్షకులను తీసుకువస్తుంది. కాబట్టి కంటెంట్ ఆధారంగా అనేక ఛానల్స్ రావడంలో మరింత పోటీ పెరిగింది. ఆ పోటీలో నిలబడాలంటే, కంటెంటుతో బాటు మరికొంత ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వీడియోలకు వాటర్ మార్క్ జోడించండి!
ఆకర్షణీయమైన మీ యూట్యూబ్ ఛానల్ ఐకానును ఛానల్ కు బ్రాండెడ్ వాటర్ మార్కు జోడించండి. ఇది ఒక చక్కని చిన్న టిప్. మీ ఛానెల్ చూసేవారికి మీ ఛానెల్ యొక్క సభ్యత్వం పొందేందుకు ఇది మరొక మార్గాన్ని జోడిస్తుంది.
యూట్యూబ్ ఖాతాకు డిఫాల్ట్ సెట్టింగ్
మీ ఛానల్ వీడియోలను సందర్శించే వీక్షకులకు డిఫాల్ట్ వీడియో ద్వారా అన్నింటికి సబ్ స్క్రైబ్ అవ్వమని, ఇంకా మీ ఛానల్ గురించి తెలియజేసే, డిఫాల్ట్ సెట్టింగ్స్ జోడించండి.
థంబనైల్స్
ప్రతి యూట్యూబ్ వీడియోకు మొదటిగా కనబడే చిత్రమే వీక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక చక్కటి చిత్రంలోనే మీ వీడియోలో ఎలాంటి కంటెంట్ ఉంటుందో ఒక ఆలోచన వీక్షకుడి మైండులోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి వీడియోకు ఒక చక్కటి చిత్రమును అర్ధవంతంగా చూడచక్కని చిత్రంగా రెడీ చేసి వీడియోకు జోడంచడం వలన వీక్షకుల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది.
ట్రెండుకు అనుగుణంగా
యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఒక అంశంలో ఓ విధానంలో కంటిస్యూ టాపిక్స్ తో లేటెస్ట్ ట్రెండుకు తగ్గట్టుగా ఉండేవిధంగా తగు ప్రణాళిక అవసరం. ప్రతి వీడియో మీరు పడే కష్టం, మీకు వీక్షకుల సంఖ్యను పెంచుతుంది. సరైన స్క్రిప్ట్ మంచి వీడియోను మేకింగ్ చేయడానికి సహాయపడగలదు.
ప్రతి యూట్యూబ్ వీడియో కూడా ట్రెండును ఫాలో అవుతూనే మీ స్టైల్లో వీడియో మరింత అర్ధవంతంగా మరింత అవగాహన ఏర్పరచేవిధంగా ఉండాలి. ఉదాహరణకు ఒక సినిమాకు రివ్యూ వీడియోలు అనేకమంది చేస్తూ ఉంటారు. అన్ని వీడియోలు వీక్షించినా మీ రివ్యూ వీడియో వీక్షించాలనే విధానంగా మీ వీడియో ప్రజెంటేషన్ వీక్షకుడి మైండులో ఉండాలి.
అప్ లోడ్ టైమింగ్
మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్ డేట్ చేసే వీడియోలు ఓ క్రమపద్దతిలో నిర్ధిష్ట కాలపరిమితిలో క్రమం తప్పకుండా ఉండేవిధంగా చూసుకోవాలి. ఒక నెలలో ఏ వీడియోలు లేకుండా మరుసటి నెలలో పది వీడియోలు అప్ లోడ్ చేయడం కాకుండా, ప్రతి నెలలో ఓ మూడు వీడియోలు పది రోజుల కాల వ్యవధిలో వీడియోలు అప్ లోడ్ చేయడం వలన సబ్ స్కైబర్ మైండులో కూడా ఫలానా సమయంలో మీ వీడియో వస్తుందనే ఊహతో ఉండవచ్చును. ఇంకా అటువంటి వీడియోల కొరకు ఆసక్తితో ఎదురు చూడవచ్చును. వీక్షకుడి మైండులో సృష్టించబడే ఆసక్తితోనే మీ ఛానల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి.
యూట్యూబ్ వీడియో టైటిల్స్
మీ వీడియోకు టైటిల్ ఎంపిక విషయంలో మీరు చూపే శ్రద్ద, మీ యూట్యూబ్ వీడియో పాపులర్ కావడంలో ఉపయోగపడుతుంది. మీ వీడియోలో ఉండే కంటెంటు యొక్క ఉద్దేశ్యం ప్రతిబింబించేలా ఇప్పటి యూట్యూబ్ ట్రెండింగ్ వర్డ్స్ ఉపయోగిస్తూ టైటిల్ లెంగ్త్ కూడా పెద్దదిగానే ఉండే విధంగా చూసుకోవాలి. ఇంకా ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీ వీడియో టైటిల్ కూడా ప్రతిబింబించాలి. వీడియో డిస్క్రిప్షన్లో పాపులర్ వర్డ్స్ ఉపయోగించాలి. అవి వీడియో కంటెంటును ప్రతిబింబించే పదాలు అయి ఉండాలి.
బ్రాండెడ్ ఛానల్ లుకింగ్
మీ ఛానల్ సాదారణ యూట్యూబ్ ఛానల్ మాదిరిగా కాకుండా ఓ బ్రాండ్ టివి ఛానల్ మాదిరిగా మార్చేయండి. మీ ఛానల్ వీడియోలకు తగ్గట్టుగానే వచన రూపంలో కూడా బ్లాగు పోస్టులను ఆన్ లైన్లో విస్తరింపజేయండి. మీ బ్లాగు పోస్టులు గూగుల్ సెర్చ్ లో కనెక్ట్ అయ్యే విధంగా ఓ అందమైన బ్లాగుని సృష్టించండి. మొదట్లో మీ యూట్యూబ్ ఛానల్ పై శ్రద్ధ పెట్టినట్టే, మీ బ్లాగుని పాపులర్ చేయడంలో కూడా శ్రద్ద పెట్టండి. మీ ఛానల్ మరియు మీ బ్లాగు ఒకదానికొకటి సహాయకారిగా మారతాయి. మీ ఛానల్ మరింతగా వృద్ది చెందే అవకాశం ఉంటుంది.
వీడియో లెంగ్త్
ఇంకా ఎక్కువ నిడివి ఉండే యూట్యూబ్ వీడియోలు మీ ఛానల్లో ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోండి. అలా ఎక్కువ నిడివి వీడియోల వలన మీ ఛానల్ వాచ్ టైం పెరుగుతుంది.
ఛానెల్ కూ ట్రైలర్ వీడియో తయారు చేయండి. ఇది ఛానల్ యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలియజేస్తుంది.
తప్పనిసరిగా ఓ వెబ్ సైటు కానీ బ్లాగు కానీ మీ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉండేవిధంగాచూసుకోండి.
ప్రతి వీడియో నిడివి పదినిమిషాల పైబడి ఉండేవిధంగా ప్రణాలిక చేయండి.
షార్ట్ వీడియోస్
అందరూ ట్రెండిగా వినోదం చాలా సింపుల్ వీడియోలను అంటే షార్ట్ వీడియోలను ఇష్టపడుతున్నారు. కాబట్టి పొట్టి వీడియోలను రూపొందించండి. అవి ఛానల్ కంటెంట్ కు అనుసంధానంగా చిన్న చిన్న టిప్స్ అందించే విధంగా ఉంటే, దీర్ఘకాలిక వీడియో వీక్షణకు కూడా ఆసక్తి పెరగవచ్చును.
భారతదేశంలోమన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం.
మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని…
లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది.
చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా చైనా యాప్స్ ఉపయోగించకూడదని నిషేదం విధించింది.
కొన్ని రకాల చైనా యాప్స్ మనకు వాడుకలో అలవాటుగా మారాయి… అలాంటి వాటిలో షేర్ ఇట్, లైకీ, హలో, టిక్ టాక్ వంటి మొబైల్ యాప్స్…
మనదేశంలో టెక్ సంస్థలు అందించే కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్... ఇంకా తెలుగులో ఉండే మరికొన్ని మొబైల్ యాప్స్…
కొన్ని మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
గానా మ్యూజిక్ మొబైల్ యాప్
గానా మొబైల్ యాప్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను అందిస్తుంది. మూడు మిలియన్ సాంగ్స్ వివిధ ఇండియన్ లాంగ్వేజులలో లభిస్తాయి. లక్షల మంది విజిట్ చేసే మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
వింక్ మ్యూజిక్ మొబైల్ యాప్
ఇది మరొక మన ఇండియన్ మ్యూజిక్ మొబైల్ యాప్… లక్షల మందిచేత డౌన్ లోడ్ చేయబడిన ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
హాట్ స్టార్ స్ట్రీమింగ్ మొబైల్ యాప్
స్ట్రీమింగ్ మొబైల్ యాప్… ఈ యాప్ ద్వారా లైవ్ క్రికెట్ మ్యాచులు వాచ్ చేయవచ్చును. అయితే ఫ్రీగా వాచ్ చేయాలంటే, మొబైల్ నెట్ వర్క్ ఆఫర్ కలిగి ఉండాలి. ప్రీమియం చార్జెస్ చెల్లించి స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
ఫ్లిప్ కార్ట్ షాపింగ్ మొబైల్ యాప్
షాపింగ్ మొబైల్ యాప్… ఈ యాప్ నందు అనేక వస్తువులు అమ్మకాలకు ఉంటాయి. ఆన్ లైన్లో మీ మొబైల్ పరికరం నుండి వస్తువులను ఆర్డర్ చేయవచ్చును. బాగా ప్రసిద్ది చెందిన ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
జొమాటో ఫుడ్ ఆర్డర్ మొబైల్ యాప్
ఫుడ్ ఆర్డర్ మీ మొబైల్ ఫోన్ చేయాలంటే, జొమాటో మొబైల్ యాప్ మీ ఫోనులో ఉండాల్సిందే… ఇది ఒక పాపులర్ దేశంలో వివిధ ప్రధాన నగరాలలో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తుంది. ఇది మీకు అవసరమైతే గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
రెడ్ బస్ ఆన్ టికెట్ బుకింగ్ మొబైల్ యాప్
రెడ్ బస్ యాప్ ఉంటే, బస్ టిక్కెట్ చేతిలో ఉన్నట్టే అంటూ ప్రచారం కూడా ఉంది. అంతగా పాపులర్ చెందిన రెడ్ బస్ ఇండియన్ మొబైల్ యాప్ ద్వారా బస్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చును… గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు మరి కొన్ని యాప్స్
ఓలా క్యాబ్ ఆన్ లైన్ బుకింగ్ మొబైల్ యాప్
మీరు నించున్న చోట నుండే మీ మొబైల్ య నుండి క్యాబ్ బుక్ చేయవచ్చును. ట్రైన్, ఫ్లైట్ ద్వారా ట్రావెలింగ్ చేసేవారికి ఈ యాప్ ఉపయోగం… ఓలా యాప్ ద్వారా ప్రధాన పట్టణ, నగరాలలో క్యాబ్ బుకింగ్ చేయవచ్చును. ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
హైక్ మెసెజింగ్ మొబైల్ యాప్
ఇది ఇండియన్ మెసెజింగ్ మొబైల్ యాప్. దీనిలో చాటింగ్ చేయవచ్చును. లుడో గేమ్ ఆడవచ్చును. మరియు మెసెజింగ్ చేయవచ్చును. ఈ హైక్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
కూపన్ దునియా మొబైల్ యాప్
మొబైల్ వాడకం పెరిగాకా ఆన్ లైన్ కూపన్లు కూడా బాగానే లభిస్తున్నాయి. ఇండియాలో వివిధ కంపెనీలు అందించే కూపన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ కూపన్ దునియా మొబైల్ యాప్ ఉపయోగపడుతుందట… గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
న్యూస్ హంట్ మొబైల్ యాప్
మీ మొబైల్ ఫోనులో న్యూస్ ను హంటింగ్ చేయండి… న్యూస్ హంట్ మొబైల్ యాప్ డైలీ న్యూస్ హంట్ చేయండి… పాపులర్ చెందిని ఈ న్యూస్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
అహా తెలుగు ఓటిటి మొబైల్ యాప్
తెలుగులో గల మూవీస్, వెబ్ సిరీస్, కొత్తగా రిలీజ్ మూవీస్ ఈ అహా తెలుగు మొబైల్ యాప్ ద్వారా వీక్షించవచ్చును. ప్రీమియం ప్లాన్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
షేర్ చాట్ మొబైల్ యాప్
తెలుగులో గల మరొక పాపులర్ యాప్ ఇండియన్ భాషలలో చాట్ చేయవచ్చును… పోస్టుల్ చేయవచ్చును. అపరిచిత వ్యక్తులతో చాట్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
మరి కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్
లైక్లి షార్ట్ వీడియో స్టేటస్ మొబైల్ యాప్
మన ఇండియన్ పాపులర్ మొబైల్ యాప్స్ లిస్టులో ఇది ఒక్కటి. ఈ యాప్ ద్వారా 30సెకండ్స్ వీడియోలను ఆన్ లైన్లో షేర్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
డ్రైవింగ్ అకాడమీ మొబైల్ గేమ్
మన ఇండియన్ పాపులర్ మొబైల్ గేమ్ ఈ 3డి గేమ్ ద్వారా కార్ రేసింగ్ విత్ డ్రైవింగ్ రూల్స్… 100 లెవల్స్ వరకు ఈ గేమ్ ఆడవచ్చును. ఈ మొబైల్ గేమ్ మీఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
ఇండియన్ ఆయిల్ ఎల్.పి.జి గ్యాస్ బుకింగ్ మొబైల్ యాప్
ఎల్.పి.జి. గ్యాస్ బుక్ చేయాలంటే, ఈ మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చును. ఇది ఇండియన్ ఆయిల్ వారి మొబైల్ యాప్. గ్యాస్ బుకింగ్ హిస్టరీ, ఎల్పిజీ గ్యాస్ బుకింగ్ డిటైల్స్ లభిస్తాయి. మీ ఫోనులో ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
ఇండియన్ రైల్ స్టేటస్ మొబైల్ యాప్
టిక్కెట్ బుక్ చేసుకున్న ట్రైన్ ఎక్కడుందో తెలియాలంటే, ఈ మొబైల్ యాప్ ద్వారా ట్రైన్ లోకేషన్ కనుగొనవచ్చును. ఇండియన్ రైల్ ట్రైన్ స్టేటస్ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగులో కొన్ని మొబైల్ యాప్స్
తెలుగు నీతి కధలు మొబైల్ యాప్
సంతోషం, స్నేహం, స్పూర్తి, దయ, అభిమానం, విద్య, మనీ వంటి విషయాలలో నీతిని తెలియజేసే నీతి కధలు కలిగిన మొబైల్ యాప్ తెలుగులో రీడ్ చేయాలంటే ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగు సూక్తులు మొబైల్ యాప్
మాట సాధారణంగానే కనబడుతుంది… ఆలోచిస్తే భావం బలంగా మనసును తాకుతుంది… వాటినే సూక్తులు అంటారు. తెలుగులో సూక్తులు రీడ్ చేయడానికి మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగు జోక్స్ మొబైల్ యాప్
తెలుగులో జోక్స్, పొడుపు కధలు, సామెతలు, కోటేషన్స్, కవితలు, ధర్మ సందేహాలు కలిగిన తెలుగు మొబైల్ యాప్… తెలుగులో ఇవి రీడ్ చేయడానికి మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగు రాశిఫలాలు మొబైల్ యాప్
2021 తెలుగు క్యాలెండర్, దిన ఫలాలు, వార ఫలాలు, నక్షత్రం బట్టి రాశి వివరాలు మరియు పంచాంగం ఉంటుంది. డైలీ పంచాంగ చెక్ చేసుకోవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
శివ మహా పురాణం మొబైల్ యాప్
పరమ శివుని గురించి తెలియజేసే శివ మహా పురాణంతో బాటు, కార్తీక పురాణం, మాఘపురాణం, శ్రీ గరుడ పురాణం, మరికొన్ని పురాణాలు తెలుగులో రీడ్ చేయడానికి ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
పైన గల వరుస జాబితాలో గల ఇమేజులపై క్లిక్ చేయండి. తద్వారా గూగుల్ ప్లేస్టోర్ యాప్ మీ ఫోనులో ఓపెన్ అవుతంది.
గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆయా మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.
సూచనలు:
మీరు మీ ఆండ్రాయిడ్ ఫోనులో గల గూగుల్ ప్లేస్టోర్ నందు యాప్ ఇన్ స్టాల్ చేసుకునే ముందు, మీరు ఇన్ స్టాల్ చేయబోయే యాప్ యొక్క రివ్యూలు చదవడం మేలు.
ఏదైనా మొబైల్ యాప్ ఇన్ స్టాల్ ఫోనులో ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు, ఆ యాప్ సైజ్ చెక్ చేసుకోవడం మంచిది…
ఇంకా ఒక మొబైల్ యాప్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకునేముందు, ఆ యాప్ ప్రభావితం చేయబోయే ఫోను ఫీచర్లను కూడా సరిచూసుకోవడం మేలు.
ఎన్ని ఫీచర్లపై మొబైల్ యాప్ ప్రభావం చూపుతుందో, ఆ యాప్ వలన మీ ఫోన్ సామర్ధ్యంపైన కూడా అంతే ప్రభాం చూపే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఫోను స్మార్ట్ ఫోన్ రిసెట్ చేయాల్సిందేనని అంటారు. సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి సర్వీసు సెంటరుకు వెళ్లనవసరం లేదు. మీ ఫోన్లో డేటా పోయినా ఫరవాలేదు. ఫోను అన్ లాక్ చేయాలి. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనును బట్టి మీ ఫోనుని మీరే రిసెట్ చేసుకోవచ్చును.
గమనిక: ఏఫోను అయినా ఫ్యాక్టరీ రిసెట్ చేయడమంటే, ఫోనులో స్టోర్ అయిన డేటా డిలిట్ అయిపోతుంది. కొత్తగా ఫోను రిసెట్ కాబడుతుంది.
మీరు సామ్సంగ్ గాలాక్షీ స్మార్ట్ ఫోను అయితే, దానిని ఎలా రిసెట్ చేయాలి. పాస్ వర్డ్ మరిచిపోయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవచ్చును. కాబట్టి మీ సామ్సంగ్ గాలక్షీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి.
ఈ ఎడమ ప్రక్కగా గల చిత్రంలో మార్క్ చేసిన విధంగా పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక… గాలక్షీ ఫోను యొక్క పవర్ బటన్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్ మరియు హోమ్ బటన్ మూడు ఒకేసారి పట్టుకుని ఉండండి. కొన్ని సెకన్లకు మీకు బ్లాంకు స్క్రీనులో టెక్స్ట్ లిస్టు వస్తుంది.
పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక… గాలక్షీ ఫోను యొక్క పవర్ బటన్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్ మరియు హోమ్ బటన్ మూడు ఒకేసారి పట్టుకుని ఉండండి. కొన్ని సెకన్లకు మీకు బ్లాంకు స్క్రీనులో టెక్స్ట్ లిస్టు వస్తుంది. ఈ క్రింది చిత్రంలో గమనించండి.
పై చిత్రంలో లిస్టులో wipe data / factory reset అనే ఆంగ్ల అక్షరములు గల లైను పైకి సెలక్షన్ కలర్ వాల్యూమ్ బటన్ ద్వారా వచ్చేలాగా చేసి, పవర్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మరొక స్క్రీనులో మరొక టెక్ట్సు లిస్టు వస్తుంది. అందులో yes… delete all user data ఆంగ్ల అక్షరములు గల లైనుపైకి మరలా వాల్యూమ్ బటన్ ద్వారా సెలక్షన్ కలరుని తీసుకువచ్చి, పవర్ బటన్ ప్రెస్ చేయండి.
ఆ పై మీ ఫోన్ రిసెట్ కావడం ప్రారంభిస్తుంది. మీ ఫోనులో ఆండ్రాయిడ్ లోగో వచ్చి, డేటా రిసెట్ కాబడుతుంది. ఫోన్ రిస్టార్ అయ్యాక, మరలా మీరు కొత్తగా మెయిల్ ఐడి, పాస్ వర్డ్ ఎంటర్ చేసి, ఫోనును వాడుకోవాలి.
ఏదైనా ఒక వెబ్ సైటును మొబైల్ యాప్ గా కన్వర్ట్ చేయాలంటే, (WebView) వెబ్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తారు. ఈ (WebView) వెబ్ వ్యూ లో యుఆర్ఎల్ ద్వారా ఏదైనా వెబ్ సైటు స్క్రీనుపై చూపవచ్చును.
(WebView) వెబ్ వ్యూ ఉపయోగించి మొబైల్ యాప్ చేయడానికి ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఈ క్రింది ఇమేజ్ చూడండి.
WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్
పై ఇమేజులో లెఫ్ట్ సైడులో గతంలో క్రియేట్ చేసిన ప్రొజెక్టులు ఉన్నాయి. ఒక వేళ మీరు కొత్తగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తే, ప్రొజెక్టు పేర్లు కనబడవు. గతంలో ఏవైనా ప్రొజెక్టులు ఓపెన్ చేసి ఉంటే, పైచిత్రం మాదిరి ఉంటాయి. ఇక పై చిత్రంలో + Start a new Android Studio project అని గల ఆంగ్ల అక్షరాలపై క్లిక్ చేయండి. కొత్త ప్రొజెక్టు క్రియేషన్ కోసం, నెక్స్ట్ స్క్రీనుకు మూవ్ అవుతంది. తర్వాతి స్క్రీను ఈ క్రింది ఇమేజులో చూడండి.
పై ఇమేజులో ఉన్నట్టుగా మీకు స్క్రీను వస్తే, అందులో Empty Activity ని ఎంపిక చేయండి. ఆ తరువాత Next బటన్ పై క్లిక్ చేయండి. తరువాతి స్క్రీను ఈ క్రింది విధంగా ఉంటుంది.
WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్
పై ఇమేజులో Name ఆంగ్ల అక్షరాల క్రింద ఉన్న బాక్సులో Type Your App Name అను అక్షరాలు గలవు. అలాగే మీకు ఆండ్రాయిడ్ స్టూడియోలో అయితే My Application అనే ఆంగ్ల అక్షరాలు వస్తాయి. వాటి బదులు మీకు కావాల్సిన పేరు లేదా మీ వెబ్ సైటు పేరును అక్కడ టైపు చేయండి. దాని క్రిందగా Package name అనే ఆంగ్ల అక్షరాల క్రింద బాక్సులో మీరు ప్యాకేజి నేమ్ ఎంపిక చేయండి. ప్యాకేజి నేమ్ లో మొదటిగా వెబ్ సైట అడ్రస్ ఎక్స్ టెన్షన్, తర్వాత వెబ్ సైట్ నేమ్, ఆ తర్వాత యాప్ నేమ్ మూడు పదాలు ఉంటాయి. మూడు పదాల మద్యలో డాట్స్ ఉంటాయి.
ఉదా: telugureads.com ఒక వెబ్ సైటు… దీనిని మొబైల్ యాప్ గా మార్చడానికి ప్యాకేజి నేమ్ మొదటి రెండు పదాలు తప్పనిసరిగా ఈ క్రిందివిధంగా ఉండాలి.
com.telugureads.appname ఈ ఆంగ్ల అక్షరాలలో మొదటి com. డొమైన్ ఎక్సెటెన్షన్ అయితే రెండవది telugureads. వెబ్ సైటు నేమ్ మూడవది ఎంపిక చేసుకున్న యాప్ పేరును వ్రాయాలి. ఆ విధంగా ప్యాకేజి నేమ్ సెట్ చేసుకోవాలి.
మరొక ముఖ్యమైన ఆప్షన్ టార్గెట్ వెర్షన్ ఎంపిక: పై ఇమేజులో Minimum SDK అనే ఆంగ్ల అక్షరాల ప్రక్కగా బాక్కులో డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి, ఆండ్రాయిడ్ వెర్షన్ ఎంపిక చేయాలి. ఏ వెర్షన్ ఎంపిక చేస్తే, ఆ వెర్షన దగ్గరనుండి పైవెర్షన్లలో మాత్రమే మీ మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుంది. మీరు కిట్ కాట్ వెర్షన్ అంటే ఆండ్రాయిడ్ 4.0 ఎంపిక చేస్తే, మీ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ 4 నుండి లేటెస్ట్ వెర్షన్ వరకు సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ స్టూడియోలో మొబైల్ యాప్ కోసం ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా ఎంపిక చేసి, ఫినిష్ బటన్ క్లిక్ చేసిన కొన్ని నిమిషాలకు ఆండ్రాయిడ్ ప్రొజెక్టు బిల్డ్ పూర్తవుతుంది. ఆండ్రాయిడ్ స్టూడియో గ్రాడిల్స్, ప్రొజెక్టు ఫైల్స్ లోడ్ కాగానే మీకు మొదటిగా ఒక యాక్టివిటి ఓపెన్ అవుతంది. అదే డిఫాల్డ్ ప్రొజెక్టు యాక్టివిటి మెయిన్ యాక్టివిటి.
గమనిక
ఒక యాక్టివిటి యొక్క జావా క్లాసు పేరులో ఉన్న పదాలు, లేఅవుట్ ఫైలుకు రివర్సులో ఉంటాయి. ఉదా: MysiteWebviewActivity.java అని ఒక యాక్టివిటి ఆండ్రాయిడ్ స్టూడియోలో సృష్టిస్తే, దాని లేఅవుట్ ఫైల్ activity_webview_mysite.xml గా జనరేట్ అవుతుంది.
ఈ మెయిన్ యాక్టివిటీలో రెండు రకాల ఫైల్స్ ఓపెన్ అయి ఆండ్రాయిడ్ స్టూడియో కనబడుతుంది. ఒకటి ఎక్స్ఎంఎల్ లేఅవుట్ ఫైల్, రెండు జావా క్లాస్ ఫైల్. ఎక్స్ఎంఎల్ లేఅవుటులో డిజైన్, చేస్తే దానికి కోడ్ జావాక్లాసు ఫైల్లో వ్రాయాలి. ఈ క్రింది కోడ్స్ గమనించండి. కొత్తగా ప్రాజెక్టు సృష్టించాక, మెయిన్ యాక్టివిటి ఈ క్రింది ఫైల్స్ రూపంలో ఓపెన్ అవుతుంది.
ముందుగా ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్లో ఈ క్రింది పర్మిషన్ యాడ్ చేయండి.
అలాగే వాల్యూస్ ఫోల్డరులో గల స్టైల్స్.ఎక్స్ఎంఎల్ ఫైల్లో మొదటి లైన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
<style name="AppTheme" parent="Theme.AppCompat.Light.DarkActionBar"> ఈ ఒక్క లైనును ఈ క్రింది విధంగా మార్చండి.
<style name="AppTheme" parent="Theme.AppCompat.Light.NoActionBar">
activity_main.xml యాక్టివిటీ మెయిన్ ఎక్స్ఎంఎల్ ఫైల్
అలాగే జావా క్లాసు కూడా ఈ క్రింది కోడును అనుసరించి, ఈ పోస్టు చివరలో ఉన్న వీడియో ద్వారా మార్పులు చేయగలరు. MainActivity.java మెయిన్ యాక్టివిటీ జావా క్లాస్ ఫైల్. ఎల్లో కలర్లో ఉన్న కోడ్ మాత్రమే మీరు కాపీ చేయగలరు.
MainAcitivity.java మెయిన్ యాక్టివిటీ జావా క్లాస్ ఫైల్
ఆన్ లైన్లో ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ ఎంత వరకు మేలు? ఏదో ప్రయోజనం లేకుండా బిజినెస్ ఉండదంటారు. ఇప్పుడు కొన్ని సర్వీసులు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కాకపోతే పరోక్షప్రయోజనంతో కూడి ఉంటాయి. అంటే ఫ్రీ వెబ్ సైటు హోస్టింగ్? అది అందించేవారికే ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఉపయోగించేవారి బెనిఫిట్ సెకండరీ కానీ ఫ్రీగా లభిస్తుంది.
ఏదైనా ఫ్రీ అనేది ప్రాధమిక దశలో తెలుసుకోవడం వరకు మేలు అంటారు. ఇక వెబ్ సైటు హోస్టింగ్ విషయానికొస్తే మాత్రం వ్యక్తిగత బ్లాగింగ్ చేసే హాబీ ఉన్నవారికి ఫ్రీబ్లాగింగ్ బాగానే ఉంటుందని అంటారు. కానీ ప్రొఫెషనల్ డిజైనింగ్, బిజినెస్ వ్యవహారంలో మాత్రం ఫ్రీ హోస్టింగ్ కంటే పెయిడ్ హోస్టింగ్ మేలని అంటారు.
ఫ్రీ బ్లాగింగ్ చేయడం వలన లాభాలు ఏమిటి?
మొదటి ప్రయోజనం ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ వలన ఒక వెబ్ సైటును ఫ్రీగా ప్రారంభం చేయవచ్చును.
మనకు తెలిసిన విషయమును ఫ్రీహోస్టింగ్ సైటు ద్వారా ఖర్చులేకుండా అందరికీ షేర్ చేయవచ్చును. కాలం ఖర్చు, ఇంటర్నెట్ ఖర్చు, కంప్యూటర్ ఖర్చు వంటి సాదారణ ఖర్చులతో వెబ్ సైట్ నిర్వహించవచ్చును.
సబ్ డొమైన్ మరియు హోస్టింగ్ స్పేస్ ను ఉపయోగించుకుని, వెబ్ సైటును ప్రారంభించవచ్చును.
సెక్యురిటీ విషయంలో ఫ్రీ హోస్టింగ్ ప్రొవైడర్స్ వలన ప్రధాన ప్రయోజనంగా ఉంటుంది.
సపోర్టు విషయంలో అనేక వీడియో ట్యూటోరియల్స్ లభిస్తాయి. ఫ్రీ వెబ్ సైటును డిజైన్ చేయడంలోనూ, పోస్టింగ్ చేయడంలో, వెబ్ సైట్ సెట్టింగ్స్ గురించి వివరించే వీడియోలు ఉంటాయి.
ప్రధానంగా దీని వలన ఆన్ లైన్ వ్యవహారాలలో ఖర్చులేకుండా ఎక్స్ పీరియన్స్ వస్తుంది.
ఒక వేళ వెబ్ సైట పాపులారిటీ పెరిగితే, సబ్ డొమైన్ బదులు మెయిన్ డొమైన్ కు అప్ గ్రేడ్ కావచ్చును.
ఇక ఫ్రీబ్లాగింగ్ నిర్వహణ వలన నష్టాలు ఏమిటి?
వ్యక్తిగతం అయినా ప్రొఫెషనల్ అయినా ఓన్ బ్రాండింగ్ ఉండదు. ప్రొవెడర్ డొమైన్ మీ వెబ్ సైట పేరుకు వెనుక తోకలాగా ఉంటుంది. ఉదా: yourdomain.wordpress.com, yourdomain.blogspot.com, yourdomain.wix.com, yourdomain.telugureads.com
పరిమితమైన డిస్క్ స్పేస్ ఉంటుంది.
వెబ్ సైట్ డిజైనింగ్ ఫీచర్లు పరిమితంగానే ఉంటాయి.
యాడ్ మానిటరింగ్ విషయంలో పరిమితులు ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడైనా ప్రొవైడర్ నియమ నిబంధనల ప్రకారం హోస్టింగ్ నిలుపుదల అయ్యే అవకాశం ఉంటుంది.
ఉచితంగా వెబ్ సైట్ హోస్టింగ్ మరియు సర్వీసులు అందించే బ్లాగు సర్వీసు ప్రొవైడర్స్
గూగుల్ బ్లాగ్ స్పాట్ ప్రసిద్ది చెందిన ఫ్రీ బ్లాగింగ్ ప్రొవైడర్… అంతగా టెక్నికల్ నాలెడ్జ్ అంటే వెబ్ సైటు డిజైనింగ్ లో కోడ్ నాలెడ్జ్ ఏమి తెలియనివారికి మేలైన ప్రీ వెబ్ సైట్ ప్రొవైడర్ గా చెబుతారు. దీనిద్వారా బ్లాగింగ్ లుక్ మాత్రమే ఉన్నా చాలా పవర్ పుల్. హోస్టింగ్ స్పేస్, సెక్యురిటీ, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటి విషయంలో గూగుల్ బ్లాగ్ స్పాట్ మేలంటారు.
ఇది ఎక్కువగా కేవలం కంటెంటును ప్రజెంట్ చేయడానికి, బ్లాగు మాదిరిగా ఉపయోగించుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్న వెబ్ సైటు పేరుకు తోడుగా బ్లాగ్ స్పాట్ కూడా జతచేయబడుతుంది.
ఒక వేళ మీరు డొమైన్ కొనుగోలు చేస్తే, ఆడొమైన్ సెట్టింగ్స్ చేసుకోవాలి. దీనికి కొంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ విధానం తెలుసుకోవచ్చును.
ఇది మరొక బెస్ట్ ఫ్రీ వెబ్ సైట్ సర్వీస్ ప్రొవైడర్… వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ లేదా ప్రొఫెషనల్ వెబ్ సైటు డిజైనింగులో ప్రసిద్దిగాంచిన బ్లాగ్ సర్వీస్ ప్రొవైడర్… వర్డ్ ప్రెస్.కామ్(wordpress.com) ద్వారా ఉచితంగానూ వెబ్ సైట్ క్రియేట్ చేయవచ్చును. ఆపై ప్రీమియంకు అప్ గ్రేడ్ కావచ్చును. కానీ పరిమితమైన ఫీచర్లు ఉంటాయి.
దీనిలోనే వర్డ్ ప్రెస్.ఆర్గ్(wordpress.org) అని మరొక సైటు ఉంది. దీని నుండి మీరు మీ బ్రాండ్ కు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చును. ఇతరుల చేత చేయించవచ్చును. ఒక్కసారి డిజైన్ చేశాక మీరు పోస్టింగ్ చేసుకోవచ్చును. ప్రధానంగా హోస్టింగ్ మరియు డొమైన్ కొనుగోలు చేసి, వర్డ్ ప్రెస్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా సర్వరులో ఇన్ స్టాల్ చేయాలి. ఈవిధానం గురించి కూడా వీడియోలు ఉచితంగానే ఆన్ లైన్లో లభిస్తాయి. చాలామంది బ్లాగర్లు, చిన్న వ్యాపారులు ఈ విధానమునే ఫాలో అవుతారు.
పైన చెప్పబడినవి రెండూ ఎక్కుమంది బ్లాగర్స్ వాడుతారు. ఇంకా ఎక్కువమంది రిఫర్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా… ఇంకా మరికొన్ని ప్రొవైడర్స్ నుండి ఉచితంగా ఒక వెబ్ సైట్ తేలికగా సృష్టించవచ్చునో ఆ వీడియోలు క్రిందగా జతచేయడం జరిగింది గమనించండి.
కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు మొబైల్ యాప్స్ అందుబాటులో ఏం ఉన్నాయో? ఈ పోస్టులో చూద్దాం. రుచికరమైన కేక్ తింటుంటే, ఇంకా తినాలనిపిస్తుంది. కేక్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మరీ అంత తీపిగా ఉండదు. కానీ తీపిని కలిగి ఉంటుంది. ఎక్కువగా బర్త్ డే ఫంక్షన్లలో కేక్ కటింగ్ తప్పనిసరి. ఇంకా న్యూఇయర్ ఫంక్షన్లకు కేక్ కంటింగ్ ప్రధాన ఆకర్షణ. కేక్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు అంతా ఇష్టంగానే తింటారు. న్యూఇయర్ వస్తుందంటే కేకుల ఆర్డర్లతో బేకరీలు ఖాళీగా ఉండవు.
సంవత్సరంలో రోజూ ఎవరో ఒకరిది పుట్టన రోజు ఉంటుంది. పుట్టిన రోజునాడు కేక్ కటింగ్ చేయడం ఓ ఫ్యాషన్… న్యూఇయర్ కు అయినా బర్త్ డే కు అయినా కేక్ ఇంట్లోనే తయారి ఎలా చేయడం?
కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు ఈ క్రింది చూడండి.
రుచికరమైన కేక్ తయారీ విధానం వీడియోలు ఈ క్రిందిగా ఉన్నాయి. ఈ క్రింది వీడియోలను తాకి వీక్షించగలరు.
కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు
కేక్ తాయారీ విధానం మొబైల్ యాప్స్
బర్త్ డే కేక్ తాయారీ విధానం, కేక్ వంటకాలు గురించి వివరించే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ లింకులు ఈక్రింది బటన్లకు జత చేయబడి ఉన్నాయి. ఈ క్రింది బటన్లను తాకి మీరు మీ ఆండ్రాయిడ్ ఫోనులో యాప్ ఉచితంగా ఇన్ స్టాల్ చేయవచ్చును.
ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి. ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంతో కొంత తగ్గింపు ఉంటుంది.
ఎందుకంటే ఎక్కువ డిస్కౌంటుఆఫర్ చేస్తున్నారంటే, అవి ఎక్కువ స్టాక్ ఉండి ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్నాయి, అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చును.
గత కొంతకాలంగా ఆన్ లైన్లో భారీడిస్కౌంట్ల ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ డిస్కౌంట్లు మార్కెట్లో పోటిపడి ప్రకటిస్తే అది ఒక సీజన్ బట్టి ఉంటుంది.
ఎంత సీజన్ అయినా డిస్కౌంట్లు కొంతమేరకే ఉంటాయి. పాపులర్ బ్రాండెడ్ వస్తువులు అయితే తక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త కంపెనీలు అయితే ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. కానీ అవి అతిభారీగా ఉండవు.
ఎక్కువ డిస్కౌంటు ఇస్తున్నారంటే, అమ్మకాలు తగ్గిన మోడల్ అయ్యి ఉంటుంది. అమ్మకాలు తగ్గాయి అంటే, దానికన్నా ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్లు కొత్తగా రాబోతున్నాయి.
ఒక్కోసారి ప్రస్తుతం ఉన్న మోడల్ ధరలోనే, కొత్త టెక్నాలజీ మరొక అద్భుతమైన మోడల్ రాబోతున్నా, ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.
ఉదా: స్మార్ట్ ఫోన్ల రంగంలో త్వరలో 5జి ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే తయారు అయిన 4జి ఫోన్ల ధరలలో నిదానంగా మార్పులు రావడం సహజం. ఇలాంటి సమయంలో డిస్కౌంట్లు గతం కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి.
అయితే అతి భారీ డిస్కౌంట్లు అంటే సగానికి సగం ధర తేడా అంటే కొంచె ఆలోచించాలి. ఒకవేళ అది రిఫర్బిష్డ్ వస్తువు అయ్యుండవచ్చును. అంటే అప్పటికే వాడిన వస్తువును మరలా కొత్త ఫోనులాగా మార్చి అమ్మకానికి సిద్దం చేయవచ్చును. ఇలాంటి వస్తువులు అసలు ధర కన్నా 50% డిస్కౌంటు ధరలో లభిస్తాయి.
అందుకే ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువును గురించి సరైనా అంచనాకు రావాలి. ఆన్ లైన్ మార్కెట్లో భారీగా డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.
సహజంగా ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు, ఆఫ్ లైన్లో తక్కువ డిస్కౌంటు ఉంటాయి. కానీ వాటి మద్య తేడా భారీగా ఉండదు. భారీగా ఉందంటే అది మరలా రిపర్భిష్ చేసిన వస్తువు అయ్యుండాలి. లేదా ఫెయిల్యూర్ మోడల్ అయి ఉండాలి.
సాధారణంగా టెక్నాలజీ పూర్తిగా మారుతున్నప్పుడు మాత్రం డిస్కౌంట్లు కొంచె ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి సగానికి సగం తగ్గింపు ఉండకపోవచ్చును. ఇందువలన ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఎక్కువ ఆలోచన చేయాలి.
ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు చేయవచ్చును. ఫ్లిప్ కార్టులో పే లేటర్ ద్వారా అప్పు తీసుకోవచ్చును. ఇందుకు ఎటువంటి ష్యూరిటీతో సంబంధం లేదు.
కేవలం మీకు ఫ్లిప్ కార్టు ఖాతా ఉండి, ఆ ఖాతకు ఆధార్ ఐడి లింక్ అయితే సరిపోతుంది.
ఒక్కసారి మీ ఖాతా పేలేటర్ అప్రూవ్ అయితే, మీ ఖాతకు కొంత ఏమౌంట్ కేటాయించబడుతుంది. మీకు కేటాయించిన ఎమౌంటులో నుండి మీరు షాపింగ్ చేయవచ్చును.
ఈ నెల ఒకటో తేదీన మీరు కొనుగోలు చేస్తే, వచ్చేనెల పదవ తేదీ లోపు మీరు పే చేయవచ్చును.
ఉదా: మీరు 8000/- రూపాయిలతో ఒక స్మార్ట్ ఫోను మార్చి 1, 2020 తేదిన కొనుగోలు చేసారు. ఆ 8000/- లు మీ పేలేటర్ ఖాతా నుండి కట్ అవుతాయి. మీరు పేలేటర్ కు ఏప్రిల్ 10, 2020 లోపులో చెల్లించాలి. ఇంచుమించు 40 రోజుల అప్పు మీకు ఫ్లిప్ కార్ట్ నుండి పొందవచ్చును.
ఒకవేళ ఆర్డర్ కాన్సిల్ చేస్తే, సంబంధిత సొమ్ము మీ ఖాతాకు జమ అవుతాయి.
తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి.
వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం చదివే తెలుగువార్తాపత్రిక ఎలా ఉంటుందో అలానే ఆ పత్రిక ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది. మెయిడ్ ఎడిషన్ తోబాటు ప్రాంతీయ ఎడిషన్స్ మరియు అనుభంధ ఎడిషన్స్ ఆన్ లైన్లో ఉచితంగా చదవవచ్చును.
రోజువారి వార్తలను తెలుసుకునేవారికి పేపర్ చదివే అలవాటు ఉంటుంది. అయితే కొందరు పేపరు చదివేవారికి ఆన్ లైన్ తెలుగు న్యూస్ పోస్టుల కంటే, తెలుగున్యూస్ పేపరుపై ఆసక్తి ఉంటుందంటారు. అలాంటి వారికి ఆన్ లైన్లో న్యూస్ పేపరు చదవాలంటే ఆ న్యూస్ పేపరుకు సంబంధించిన ఇపేపర్ వెబ్ సైటును ఓపెన్ చేసి తెలుగుఇపేపర్ చదవవచ్చును.
నయా న్యూస్ కంటే న్యూస్ పేపరు లుక్ తో డైలీ పేపరును మాత్రమే ఆయా రోజులలో ఆన్ లైన్ ద్వారా చదవడానికి కొన్ని పాపులర్ తెలుగుఇపేపర్ లింకులు క్రిందగా గమనించండి.
Online epaper of Telugu News
ఈనాడు తెలుగుదినపత్రిక అందరికి తెలిసిన తెలుగు వార్తాపత్రిక. పాపులర్ న్యూస్ పేపర్లలో ఈనాడు మ్వాగజైన్ తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఒక్కటి. ఆనాటి రోజుల నుండి ఈరోజులలోనూ తెలుగువారింట్లో వేకువవేళలో వార్తలతో దర్శినమిచ్చే పేపర్లలో ఈనాడు ఒకటి. ఈనాడు తెలుగుఇపేపర్ చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్.
ఆంధ్రజ్యోతి ప్రధాన దిన పత్రికలలో ఒక్కటిగా తెలుగువారికి తెలుగులో వార్తలను అందించే తెలుగు డైలీ న్యూస్ పేపర్. ఆంధ్రులకు తెలుగు వార్తలను చేరవేయడంలో ఉండే ప్రముఖ పత్రికలలో ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ న్యూస్ పేపర్. ఈ ఆంధ్రజ్యోతి తెలుగుఇపేపర్ ను ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
సాక్షి ప్రధాన తెలుగు డైలీ న్యూస్ పేపర్లలో ఒక్కటి. తెలుగు రాష్రాలలో తెలుగువార్తలను అందించే ప్రధాన తెలుగుదిన పత్రికలలో సాక్షి తెలుగు దినపత్రిక ప్రముఖ డైలీ పేపర్. సాక్షి తెలుగుఇపేపర్ ఆన్ లైన్లో చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
నమస్తే తెలంగాణ తెలుగుదినపత్రిక అయితే తెలంగాణ ప్రాంత ప్రాధన్యతతో ఏర్పడిన పత్రికా సంస్థ. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింభించే విధంగానే పేరుకూడా నమస్తే తెలంగాణ అని ఉంది. నమస్తే తెలంగాణ తెలుగుఇపేపర్ ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
ఆంధ్రప్రభ డైలీ తెలుగు న్యూస్ పేపర్ తెలుగులో వార్తలను చేరవేసే పత్రికలలో ఆంధ్రప్రభ ఒక్కటి. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కూడా తెలుగుఇపేపర్ ను అందిస్తుంది. ఆంధ్రప్రభ తెలుగుఇపేపర్ చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
ఆంధ్రభూమి తెలుగుదినపత్రిక తెలుగులో వార్తలను అందించే ఈ డైలీ న్యూస్ పేపర్ తెలుగుఇపేపరు కూడా ఆన్ లైన్ యూజర్లుకోసం అందిస్తుంది. ఆంధ్రభూమి తెలుగుఇపేపర్ చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం.
వెబ్ బ్రౌజర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్‌లో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, తిరిగి పొందడానికి మరియు ప్రదర్శించడానికి వినియోగదారులను అనుమతించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఇది వెబ్ పేజీల కోసం వెబ్ సర్వర్‌లకు అభ్యర్థనలను పంపడం ద్వారా మరియు వినియోగదారు పరికరంలో పేజీలను ప్రదర్శించడం ద్వారా దీన్ని చేస్తుంది.
మీరు బ్రౌజర్ యొక్క చిరునామా బార్‌లో URL (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)ని టైప్ చేసి ఎంటర్ నొక్కినప్పుడు, బ్రౌజర్ ఆ URL వద్ద ఉన్న పేజీ కోసం వెబ్‌సైట్‌ను హోస్ట్ చేసే సర్వర్‌కు అభ్యర్థనను పంపుతుంది. ఆపై పేజీకి సంబంధించిన HTML (హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్) కోడ్‌ను బ్రౌజర్‌కు పంపడం ద్వారా సర్వర్ ప్రతిస్పందిస్తుంది. బ్రౌజర్ ఆ తర్వాత పేజీని రెండర్ చేయడానికి ఈ కోడ్‌ని ఉపయోగిస్తుంది, ఇందులో పేజీలోని టెక్స్ట్, ఇమేజ్‌లు మరియు ఇతర మీడియాను ప్రదర్శిస్తుంది.
అదనంగా, బ్రౌజర్ CSS (క్యాస్కేడింగ్ స్టైల్ షీట్‌లు) కోడ్‌ను కూడా చదువుతుంది మరియు వివరిస్తుంది, ఇది వెబ్‌పేజీ యొక్క లేఅవుట్ మరియు దృశ్య రూపకల్పనను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. మరియు వెబ్ పేజీలతో డైనమిక్ ఇంటరాక్షన్‌ని అనుమతించే జావాస్క్రిప్ట్‌ని అమలు చేయండి.
బ్రౌజర్‌లు బుక్‌మార్క్‌లు మరియు బ్రౌజింగ్ చరిత్రను సేవ్ చేయగల సామర్థ్యం మరియు అదనపు కార్యాచరణను జోడించగల పొడిగింపులు మరియు ప్లగిన్‌లకు మద్దతు వంటి అనేక ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. Google Chrome, Firefox, Safari, Microsoft Edge మరియు Opera వంటి అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్‌లలో కొన్ని.
యాప్‌కు బదులుగా వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
క్రాస్-ప్లాట్‌ఫారమ్ అనుకూలత: వెబ్‌సైట్‌లు డెస్క్‌టాప్ మరియు ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లతో సహా అనేక రకాల పరికరాలలో బ్రౌజర్‌ను కలిగి ఉన్నంత వరకు యాక్సెస్ చేయవచ్చు. దీనికి విరుద్ధంగా, యాప్‌లు సాధారణంగా నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టమ్‌కు ప్రత్యేకంగా ఉంటాయి మరియు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయబడి, పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడాలి.
ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు: బ్రౌజర్‌తో, యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇది పరికరంలో సమయాన్ని మరియు నిల్వ స్థలాన్ని ఆదా చేస్తుంది.
సులభమైన అప్‌డేట్‌లు: వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయడం అనేది సైట్ యొక్క కొత్త వెర్షన్‌ను సర్వర్‌లో ప్రచురించినంత సులభం, అయితే యాప్‌ను అప్‌డేట్ చేయడానికి తరచుగా వినియోగదారులు అప్‌డేట్‌ను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ సౌలభ్యం: వెబ్‌సైట్‌లను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయవచ్చు, అయితే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడిన పరికరాల్లో మాత్రమే ఉపయోగించబడతాయి.
మరింత ఖర్చుతో కూడుకున్నది: వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం అనేది యాప్‌ను అభివృద్ధి చేయడం కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఎందుకంటే ఇది అనేక రకాల పరికరాలలో యాక్సెస్ చేయబడుతుంది, అయితే యాప్‌ను అభివృద్ధి చేయడానికి సాధారణంగా ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు ప్రత్యేక సంస్కరణలను సృష్టించడం అవసరం.
మెరుగైన అన్వేషణ సామర్థ్యం: వెబ్‌సైట్‌లను శోధన ఇంజిన్‌ల ద్వారా మరింత సులభంగా కనుగొనవచ్చు, ఇది వినియోగదారులకు వాటిని కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది.
ఆఫ్‌లైన్‌లో పని చేయగల సామర్థ్యం, కెమెరా మరియు GPS వంటి పరికర లక్షణాలకు ప్రాప్యత మరియు పుష్ నోటిఫికేషన్‌లను పంపగల సామర్థ్యం వంటి వెబ్‌సైట్‌ల కంటే యాప్‌లు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చెప్పబడింది. రెండింటికీ వాటి స్వంత వినియోగ సందర్భాలు ఉన్నాయి మరియు రెండింటి కలయికను ఉపయోగించడం తరచుగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
మీ ఫోనులో ఇంటర్నల్ మెమోరీ (ఫోనులో మిగిలి ఉన్న స్పేస్ – ఫోను మెమోరి) తక్కువగా ఉంటుందా? ఇంకా మీ ఫోనులో డౌన్ లోడ్ చేయబడి ఉన్న మొబైల్ యాప్స్ కు కానీ వెబ్ సైటు ఉంటే, ఆ వెబ్ సైటును మీ ఫోనులో ఉండే బ్రౌజరు ద్వారా ఎలా ఉపయోగించుకోవచ్చును. ఈ పోస్టులో చూద్దాం.
మీ ఫోను 8జిబి మెమోరి, 16జిబి మెమోరి, 32జిబి మెమోరి మాత్రమే ఉండి ఉంటే, ఖచ్చితంగా మీకు ఈ పోస్టు ఉపయోగడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా బడ్జెట్ ఫోనులు 16జిబి – 32 ఫోను మెమోరిని కలిగి ఉన్న ఫోన్లు ఎక్కువమంది యూజర్ల దగ్గర ఉండి ఉంటాయి.
బడ్జెట్ స్మార్ట్ ఫోను మెమోరి?
అప్పటి బడ్జెట్లో 16-32జిబి ఫోను మెమోరి ఉన్న స్మార్ట్ ఫోన్లు లభించేవి. ఫోను మెమోరి కొన్నప్పుడు ఎంత ఉన్నా, వాడుతున్న కొలది అందులో ఉండే మొబైల్ యాప్స్ స్టోరేజి పెరిగి ఫోను మెమోరి సరిపోకపోవడం ప్రధానంగా వాడుతున్న బడ్జెట్ ఫోన్లలో వచ్చే అవకాశం ఎక్కువ. బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్ చూడడంతో మొబైల్ యాప్ బ్రౌజింగుపై అవగాహన పెరుగుతుంది.
మీరు ఒకప్పుడు 8జిబి ఫోను మెమోరి గల ఫోనును కొనుగోలు చేస్తే, అది వాడే కొలది ఫోను మెమోరి సరిపడకపోడం ఒక సమస్యగా తయారు అయితే, తరువాత 16జిబి ఫోనుమెమోరి గల స్మార్ట్ ఫోను కొన్నా… కొన్నాళ్లకు అదే పరిస్థితి రావడం గమనార్హం. ఇంకా 32జిబి ఫోను మెమోరి కూడా వాడుతున్న కొలది, గేమ్స్, యాప్స్ వాటి స్టోరేజిని పెంచుకుంటూ, ఫోను మెమోరిని ఆక్రమిస్తాయి.
కాబట్టి కేవలం చదవడం, చూడడం వరకే పరిమితమయ్యే మొబైల్ యాప్స్ కూ వెబ్ సైటు కూడా ఉండి, ఆ వెబ్ సైటులను మొబైల్ బ్రౌజరులోనే వాడుకుంటే, మనం ఆ మొబైల్ యాప్ ఫోన్లో వాడవలసిన అవసరం ఉండదు. ఇంకా ఫోను స్టోరేజి ఎక్కువగా ఉన్న స్మార్ట్ ఫోను ఉంటే, అన్ని సెక్యూర్ మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.
మొబైల్ బ్రౌజర్లు
అయితే మన స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసి మొబైల్ యాప్స్ లో కొన్నింటికి వెబ్ సైటు కూడా ఉంటుంది. ఉదాహరణకు తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉంది. అలాగే ఈ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ తోబాటు వెబ్ సైటు కూడా ఉంది. ఈ తెలుగురీడ్స్ వెబ్ సైటును మీరు బ్రౌజరులో ఓపెన్ చేస్తే, మొబైల్ పేజి మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇలా మీరు మీకు అవసరం అయినా ఆన్ లైన్ విషయం ఏదైనా బ్రౌజరు సాయంతో ఓపెన్ చేసి చూసుకోవచ్చును.
మీ స్మార్ట్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోను అయితే ఆండ్రాయిడ్ బ్రౌజరు, గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్లలో ఓపెన్ చేసి చూడవచ్చును. మీ స్మార్ట్ ఫోను యాపిల్ ఫోను అయితే సఫారి బ్రౌజరులో ఓపెన్ చేయవచ్చును. అయితే మీకు ఆండ్రాయిడ్ ఫోనులో క్రోమ్ బ్రౌజరు యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. అదే యాపిల్ ఫోను అయితే సఫారి బ్రౌజరు యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది.
అసలు బ్రౌజరు పనేమిటి అంటే ఇంటర్నెట్లో ఉండే ఏదేని ఒక వెబ్ సైటు చిరునామాను బ్రౌజరు అడ్రస్ బార్లో టైపు చేస్తే మీకు సదరు వెబ్ సైటులోని కంటెంటును బ్రౌజరులో చూపుతుంది. ఈ బ్రౌజరు పని కంప్యూటర్లో అయినా, లాప్ టాప్లో అయినా, స్మార్ట్ ఫోన్లో అయినా ఏదేని వెబ్ సైటు అడ్రస్ (డొమైన్ నేమ్) అంటే వెబ్ సైటు పేరు (ఉదా: గూగుల్ ఒక వెబ్ సైటు గూగుల్ డొమైన్ నేమ్ www.google.com, అలాగే ఫేస్ బుక్ వెబ్ సైటు పేరు అయితే, ఫేస్ బుక్ డొమైన్ నేమ్ www.facebook.com, ట్టిట్టర్ ఒక వెబ్ సైటు ట్విట్టర్ డొమైన్ నేమ్ www.twitter.com, ఐపిఎల్ టి20 ఒక వెబ్ సైటు పేరు అయితే దీని డొమైన్ నేమ్ www.iplt20.com) ఈ విధంగా ఉంటాయి.
ఇంకా మీకు మొబైల్ యాప్ తోబాటు వెబ్ సైటు కూడా ఉన్న మరిన్ని వెబ్ సైట్లు చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి. మీరు ఆ డొమైన్ పేరును బ్రౌజరులో ఎంటర్ చేయగానే, ఆ వెబ్ సైటు కంటెంటును బ్రౌజరు చూపుతుంది.
వెబ్ సైటు నేమ్ డొమైన్ నేమ్
మీరు తెలుగురీడ్స్ అనే వెబ్ సైటుకు సంబంధించిన డొమైన్ నేమ్ (www.telugureads.com) బ్రౌజరులో ఓపెన్ చేయడం ద్వారా ఆ వెబ్ సైటులో ఉంచబడిన కంటెంటును చూడగలరు. అయితే మీకు గమనించవలసిన విషయం ఒక్కటి ఏమిటంటే, ఏదైనా మొబైల్ యాప్ వెబ్ సైటు కన్నా ఉపయోగించడానికి వీలుగా డవలప్ చేయడం ఉంటుంది. ఈకామర్స్ లాంటి వెబ్ సైటులు అయితే మొబైల్ యాప్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తూ ఉంటారు. మీరు డిస్కౌంట్ల కొరకు చూస్తే, ఈ ఈకామర్స్ మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
ఏ మొబైల్ యాప్ అయినా ఖచ్చితంగా వెబ్ సైటు ఉండాలని లేదు, కొన్ని క్విజ్, గేమ్స్ లాంటి మొబైల్ యాప్ కేవలం యాప్ తరహా కంటెంటుతోనే ఉండడం వలన వాటి యొక్క వెబ్ సైటు కన్నా మొబైల్ యాప్ ద్వారానే ఉపయోగం ఎక్కువ. ఇంకా మెసేజింగ్ యాప్స్, వీడియో కాలింగ్ యాప్స్ మాత్రం వెబ్ సైటు కన్నా మొబైల్ యాప్ ద్వారానే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. వాట్సప్, స్కైప్ లాంటి మొబైల్ యాప్స్.
చూడడం, చదవడం ప్రధానంగా ఉండే కంటెంటు ఎక్కువగా వెబ్ సైటు ఆధారంగానే ఉంటాయి. అంటే సోషల్ మీడియా వెబ్ సైటులు ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ ఇన్ లాంటి వెబ్ సైటులు. ఇంకా రివ్యూ ఆధారిత వెబ్ సైటులు, న్యూస్ ప్రొవైడ్ చేసే వెబ్ సైటులు చదవడం ప్రధానంగా ఉంటాయి. వీటికి మొబైల్ యాప్ ఉన్నా, వాటికి వెబ్ సైటు కూడా ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి యాప్స్ ఉన్నా, వెబ్ సైటులు కూడా ఉంటాయి. 91మొబైల్స్ లాంటి టెక్ రివ్యూ మొబైల్ యాప్ ఉన్నా, ఆసంస్థకు వెబ్ సైటు కూడా ఉంది.
బ్రౌజరులో వెబ్ సైటు
బ్రౌజరు అడ్రసు బారులో మీరు ఖచ్చితంగా డొమైన్ నేమ్ అక్షరాలను తప్పులేకుండా టైపు చేస్తే, ఆ వెబ్ సైటు ఓపెన్ అవుతుంది లేకపోతే ఎర్రర్ చూపించడం ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని బ్రౌజర్లు డిఫాల్టుగా ఏదో ఒక సెర్చ్ ఇంజన్ ఎటాచ్ చేసి ఉండడం చేత, మీరు టైపు చేసిన అక్షరాలకు దగ్గరగా ఉన్న వెబ్ సైటులు, మరియ ఆ అక్షరాలకు మ్యాచ్ అయ్యే కంటెంట్ బ్రౌజరులో చూపించడం జరుగుతుంది. గూగుల్ సెర్చ్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ డిఫాల్ట్ గా ఉంటుంది.
ఇక బ్రౌజరు వాడుక విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ విడ్జెట్ మీకు హోమ్ స్క్రీనుపైనే అన్ని ఫోన్లలోనూ డిఫాల్ట్ గా సెట్ చేయబడి ఉంటుంది. ప్రక్కచిత్రం చూడండి
పై చిత్రంలో చూపినట్టుగా ఉండే ఈ విడ్జెట్ గూగుల్ సెర్స్ కు సపోర్ట్ చేస్తుంది. మీరు అక్షరాలను టైపు చేసి, లేక వాయిస్ ద్వారా గూగుల్ సెర్స్ చేయవచ్చును. మైక్రోఫోను ఐకానును టచ్ చేయడం ద్వారా మీ మాటలను గూగుల్ సెర్చ్ చేయవచ్చును. మీరు మాట్లాడిన మాటలకు డొమైన్ నేమ్ మ్యాచ్ అయితే ఆ డొమైన్ ముందుగా మీకు కనబడుతుంది. లేకపోతే ఆ మాటలకు పోలి ఉన్న కంటెంటు కలిగిన ఇతర వెబ్ సైటులు ఓపెన్ అవుతాయి.
వెబ్ ఆధారంగా ఉండే సేవలు ఎక్కువగా వెబ్ సైటును కలిగి ఉంటాయి. మొబైల్ ఫీచర్స్ ఆధారంగా ఉండేవి, ప్రధానంగా మొబైల్ ఉపయోగకరంగా ఉండే విధంగానే డవలప్ చేయబడి ఉంటాయి. వాట్సప్ మొబైల్ ఆధారంగానే పని చేస్తుంది. మీరు ఒకవేళ వెబ్.వాట్సప్ ఓపెన్ చేసినా, మీ మొబైల్ ను వెబ్ సైటుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎటాచ్ చేయాల్సిందే. బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్ ఉపయోగంచడం వలన మొబైల్ యాప్ అవసరం అంతగా ఉండకపోవచ్చును.
పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి….
పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం, నవగ్రహాల దృష్టి ప్రభావం లెక్కలు కట్టి ఇంకా పుట్టిన స్థలం ఇతరత్రా అంశాలు పరిశీలన చేసి, ఆ వ్యక్తి యొక్క జాతకం చెబుతూ ఉంటారు.
జాతకం చెప్పినప్పుడే కొన్ని ముఖ్యమైన పనులలో ప్రారంభించటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలను కూడా ఆ పిల్లవాని పెద్దలకు పండితులు తెలియజేసి ఉంటారు. గ్రహశాంతులు ఉంటే ఎప్పుడు చేపించుకోవాలి, ఎప్పుడు ఏ గ్రహ ప్రభావం చేత, ఆ పిల్లవాని భవిష్యత్తు ప్రభావితం అయ్యేది కూడా అంచనా వేసి చెబుతారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? స్వగృహం యోగం లాంటివి పరిశీలన చేసి, ఆ పిల్లల పెద్దలకు చెబుతారు.
ఇప్పుడు అలా పేరు, పుట్టిన తేది, సమయం, ప్రాంతము, టైం జోన్ వెబ్ సైటులో ఎంటర్ చేస్తే, ఆ వెబ్ సైటు మీ జాతకం ఆన్ లైన్లో ప్రాధమికంగా చూపుతుంది. అందులో పుట్టిన సమయం యొక్క పంచాంగ వివరాలు చూపుతుంది. ఇందులో పుట్టిన సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, తిది, వారం, నక్షత్ర పాదం, రాశి, యోగం, కరణం, జన్మనామం, దశలను చూపుతుంది. తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ..
ఇంకా వివాహ విషయంలో ఉపయోగపడే అవకహడ చక్రమును చూపుతుంది. మంచి చెడుల విషయంలో ఘాత చక్రమును చూపుతుంది. అలాగే అదృష్ట విషయములలో అనుకూల రోజు, తిది, గ్రహములు, రాశులు, లగ్నములు, రత్నం, దైవం, లోహం, వర్ణం, దిశ, సమయం, సంఖ్యలను చూపుతుంది.
గ్రహస్థితి పట్టికలను చూపుతుంది. ఇంకా గ్రహ వీక్షణలు, మైత్రి చక్రము కుండలిలు, షోడష వర్గ పట్టిక, గ్రహ భావములు తదితర విషయములతో బాటు జాతక దోశములు, పరిహారాలు, దశాంతర్దశా ఫలితములు, జాతక ఫలితాలను ప్రాదమికంగా మీకు ఈ వెబ్ సైటు చూపుతుంది. మీరు మీ ఫలితములను పి.డి.ఎఫ్ ఫార్మట్లో సేవ్ చేసుకోవచ్చును.
పూర్తి జాతకమును పొందాలంటే పెయిడ్ ఆష్ట్రాలజీలోకి వెళ్లి చూడవలసి ఉంటుంది. ఈ వెబ్ సైటులో మీరు ఎంటర్ చేయవలసిన డేటా పేజి ఈ క్రింది విధంగా ఉంటుంది.
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం.
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు
ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి?
ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషుసైంటిష్టులు కూడా ఈ విషయం అంగీకరించినట్టుగానే లోకం చెబుతుంది. ఆ ఏదో తెలియని శక్తి ఎలా మనమీద పని చేస్తుంది. అంటే గ్రహస్థితిని బట్టి పని చేస్తుంది, అని అంటారు. ఎలా గ్రహాలు స్థితి మనపై ప్రభావం చూపుతాయి? అంటే కొందరు ఇలా అంటారు.
ఒక కంపెనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ స్థాయి ఉద్యోగులు, మీటింగులో ఉన్నప్పుడు అదే రోజు కొత్తగా జాయిన్ అయిన క్రింది స్థాయి ఉద్యోగి అవసరం పడి, మీటింగులోకి వెళితే, ఆ మీటింగులో ముఖ్యవిషయం మాట్లాడుకుంటున్నవారి దృష్టి ఆ చిన్నఉద్యోగిపై పడి, వారి స్వభావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. ఆ చిరు ఉద్యోగి ఆ ఆఫీసులో ఉన్నంతకాలం ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అలానే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అలాగే ఒక జీవి పుట్టినప్పుడు, ఆకాశంలో గ్రహస్థితి దృష్టి, స్థానం, భావం ఆ వ్యక్తిపై ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేస్తాయి అంటారు.
గ్రహస్థితి సమయం బట్టి
అయితే ఆఫీసులో ఫస్ట్ ఇంప్రెషన్ పడ్డ చిన్న ఉద్యోగి, బాగా పనిచేసి, వారి మనసులో భావాలు చెరిపేసినట్టుగా, జీవి క్రమశిక్షణ వలన గ్రహస్థితి యొక్క ప్రభావం తట్టుకోవడం లేక ప్రభావం తగ్గించుకోవడంలాంటివి సాధ్యమే అంటారు. ఇలా కష్టపడి తన పైఅధికారుల అనుగ్రహం పొందిన చిన్నఉద్యోగి, ఆయా అధికారుల స్థితిని చూసి, ప్రవర్తించినట్టే, మనం కూడా కదులుతున్న కాలం గమనిస్తూ, మంచి సమయం మనకు అనుకూలంగా ఉన్న సమయంలో కొత్త ప్రయత్నం ప్రారంభిస్తే మంచిదని అంటారు.
కాలం కలసి రాకపోతే తాడు పాము అయ్యి కాటు వేస్తుంది అని అంటారు. అటువంటి కాలం చాలా విలువైనది, ఆలోచన పుట్టిన సమయం ఒక పండితుడికి, చెబితే ఆ ఆలోచన పుట్టిన సమయం ప్రభావం బట్టి మీ ఆలోచన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పగలిగే వారు ఉంటారు. సమయం గమనిస్తూ, పనిపై శ్రద్ద పెడితే పని జరుగుతుంది. అయితే
ఒక్కోసారి తలపెట్టిన సమయం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పండితులు అంటారు. కాబట్టి ఒక ముఖ్యపనిని ప్రారంభించే సమయం ముందుగానే సరి చూసుకుంటే, ఆ పని మనకు ఇబ్బందులు లేకుండా అవుతుంది.కానీ కష్టం లేకుండా పని ఉండదు. అయితే కష్టం వృధా కాకుండా ఉండాలంటే, తలపెట్టే పనిని సరైనా సమయంలోనే ప్రారంభించాలి అంటారు.
నక్షత్రం యాడ్ చేసుకుంటే
అటువంటి కాలంలో ప్రస్తుతం జరుగుతున్న సమయం గ్రహస్థితిని బట్టి నక్షత్రమును ఒకసారి వెబ్ సైటులో యాడ్ చేసుకుంటే, ఆ వెబ్ సైటు ఆ నక్షత్రం గలవారికి ఏ రోజు ఎలా ఉంటుందో మూడు రంగులలో చూపుతుంది. ఆ వెబ్ సైటను గూర్చి ఈ పోస్టులో చూద్దాం. మీనక్షత్రం బట్టిమీకు మంచి–చెడులను చూపేవెబ్ సైటు
పంచాంగం ప్రకారం మన నక్షత్రమును బట్టి మంచి చెడుల సమయములను పండితులు మనకు సూచిస్తూ ఉంటారు. అయితే ఇది మనకు ప్రత్యేకమైన సంధర్భములలో మాత్రమే మనం మనకు మంచి సమయము ఎప్పుడు ఉందో సరి చూసుకుంటాం. అంటే ఏదైనా గృహప్రవేశం, బారశాల లాంటి ముఖ్యపనులలో మాత్రమే బ్రాహ్మణ పండితుల దగ్గరకు వెళ్లి సమయాసమయములను చూసుకుంటాం.
ఎవరైనా 27 నక్షత్రములలోనే ఉంటారు, అయితే అందరికీ అన్నివేళలా అనుకూల సమయముగా ఉండదు. ఒక నక్షత్రమునకు ఒక్కో లగ్నం అనుకూలంగా ఉంటే, అదే లగ్నసమయం మరొకరికి ప్రతికూలం కాగలదు. ముఖ్యకార్యములలో మనం మూహూర్తం చూసుకుని ఆరంభిస్తాం.
అయితే కొన్ని సార్లు మాత్రం ఏదైనా వ్యాపారం విషయములలో నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవాలసి ఉండవచ్చును. రోజువారీ కార్యక్రమములలో కూడా కొన్ని సార్లు కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మనకు కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. అయితే వాటిలో రోజువారీ మంచి-చెడుల సమయములను అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం మన నక్షత్రముననుసరించి మనకు మేలు సమయం తెలుసుకోవాలంటే మాత్రం పండితులను కాంటాక్ట్ చేయాలి.
కానీ మంచి-చెడులు చెప్పేవారు ఈరోజులలో అందుబాటులో లేకపోవడం ఉండదు. ఎందుకంటే సాంకేతిక అభివృద్ది చెందాకా ఎవరైనా మాటలకు మాత్రం అందుబాటులోనే ఉంటారు. అయితే ఒక్కోసారి అలా పండితులను కాంటాక్ట్ చేసే సమయం కూడా మంచి సమయం కాకపోతే, అప్పటి ఆ సమయం ప్రభావం కార్యసమయం నిర్ధేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండకపోదు అంటారు.
అలా కాకుండా కొత్తకార్యం అయినా శుభకార్యం తలపెట్టాలనే సమయమే మంచిదా? కాదా? చెక్ చేసుకుంటే….ఆ తలంపు వచ్చిన సమయం మంచి సమయము అయ్యి ఉండి, ఆ సమయము కూడా మన నక్షత్రం ప్రకారం మనకు అనుకూలం అయితే, ఆయొక్క కార్యమునకు సంబంధించిన పనులు అన్ని చక చకా జరిగిపోతాయి అంటారు.
నక్షత్రం బలం బట్టి
ఊహూ అలా కాదు…కార్యం తలపెట్టాలనే ఆలోచన వచ్చిన సమయం, మన నక్షత్ర బలానికి వ్యతిరేకంగా ఉంటే, అది మనకు అనుకూల ఫలితం ఇవ్వకపోవచ్చును. అలాంటప్పుడు మనకు వచ్చి ఆలోచన సరైనదా? కాదా? అని సమయమును బట్టి నిర్ణయించాలంటే, మన నక్షత్రమును బట్టి మనకు అనుకూల సమయమును, ప్రతికూల సమయమును కలర్ ఇండికేషన్ రూపంలో చూపే వెబ్ సైటు అన్ని భారతీయ భాషలతో పాటు ఆంగ్లములో కూడా ఉంది.
అలా నక్షత్రమును బట్టి ఆ నక్షత్రమునకు ఏ ఏ కాలము చాలా బాగా అనుకూలంగా ఉంటే ఆ కాలము పచ్చ రంగులో ఉంటుంది. కాలము మద్యస్తంగా ఉంటే పసుపు రంగులో ఉంటుంది. ప్రతికూలంగా ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది. పచ్చ రంగు సూచించే సమయములో ఆ నక్షత్రమువారుశుభకార్యములు ప్రారంభించవచ్చునని, పసుపు రంగు సూచించే సమయములో మాములు కార్యములు నిర్వహించుకోవచ్చని, ఎరుపురంగు సూచించే సమయములో ఆచితూచి వ్యవహరించమని అర్దం.
వెబ్ సైటులో ఒక్కసారి మీ పేరు, పుట్టిన తేదీ, సమయం లేదా నక్షత్రం ఒక్కసారి జత చేసి మీ బ్రౌజరులో సేవ్ చేసుకుంటే, మీరు మరలా ఆ వెబ్ సైటును చూసిన ప్రతిసారి మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటులో సమయమును తెలుసుకోవచ్చును.