ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి.

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి. ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంతో కొంత తగ్గింపు ఉంటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఎందుకంటే ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేస్తున్నారంటే, అవి ఎక్కువ స్టాక్ ఉండి ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్నాయి, అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చును.

గత కొంతకాలంగా ఆన్ లైన్లో భారీ డిస్కౌంట్ల ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ డిస్కౌంట్లు మార్కెట్లో పోటిపడి ప్రకటిస్తే అది ఒక సీజన్ బట్టి ఉంటుంది.

ఎంత సీజన్ అయినా డిస్కౌంట్లు కొంతమేరకే ఉంటాయి. పాపులర్ బ్రాండెడ్ వస్తువులు అయితే తక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త కంపెనీలు అయితే ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. కానీ అవి అతిభారీగా ఉండవు.

ఎక్కువ డిస్కౌంటు ఇస్తున్నారంటే, అమ్మకాలు తగ్గిన మోడల్ అయ్యి ఉంటుంది. అమ్మకాలు తగ్గాయి అంటే, దానికన్నా ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్లు కొత్తగా రాబోతున్నాయి.

ఒక్కోసారి ప్రస్తుతం ఉన్న మోడల్ ధరలోనే, కొత్త టెక్నాలజీ మరొక అద్భుతమైన మోడల్ రాబోతున్నా, ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.

ఉదా: స్మార్ట్ ఫోన్ల రంగంలో త్వరలో 5జి ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే తయారు అయిన 4జి ఫోన్ల ధరలలో నిదానంగా మార్పులు రావడం సహజం. ఇలాంటి సమయంలో డిస్కౌంట్లు గతం కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి.

అయితే అతి భారీ డిస్కౌంట్లు అంటే సగానికి సగం ధర తేడా అంటే కొంచె ఆలోచించాలి. ఒకవేళ అది రిఫర్బిష్డ్ వస్తువు అయ్యుండవచ్చును. అంటే అప్పటికే వాడిన వస్తువును మరలా కొత్త ఫోనులాగా మార్చి అమ్మకానికి సిద్దం చేయవచ్చును. ఇలాంటి వస్తువులు అసలు ధర కన్నా 50% డిస్కౌంటు ధరలో లభిస్తాయి.

అందుకే ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువును గురించి సరైనా అంచనాకు రావాలి. ఆన్ లైన్ మార్కెట్లో భారీగా డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.

సహజంగా ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు, ఆఫ్ లైన్లో తక్కువ డిస్కౌంటు ఉంటాయి. కానీ వాటి మద్య తేడా భారీగా ఉండదు. భారీగా ఉందంటే అది మరలా రిపర్భిష్ చేసిన వస్తువు అయ్యుండాలి. లేదా ఫెయిల్యూర్ మోడల్ అయి ఉండాలి.

సాధారణంగా టెక్నాలజీ పూర్తిగా మారుతున్నప్పుడు మాత్రం డిస్కౌంట్లు కొంచె ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి సగానికి సగం తగ్గింపు ఉండకపోవచ్చును. ఇందువలన ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఎక్కువ ఆలోచన చేయాలి.