ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి. మందారదామం మిసిమి కచిక కోలుకో తోలుతో తోకతో వేయవే లయోల […]

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం చదవండి. అమ్మ ఒడి గురించి వ్రాయండి అంటే తెలుగులో వ్యాసం వ్రాయడానికి కొంత విశ్లేషణ… విధ్యార్ధులకు ఆర్ధికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కొరకు ఈ పధకం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో నివసించే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో […]

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి… పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది. మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం. స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు […]

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది. అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను పంచేస్తుంది. అమ్మలేని జీవిలేదు. అమ్మలేని జీవితం లేదు. అమ్మతోనే వెలుగు ఆరంభం. లోకంలోకి ప్రయాణం ప్రారంభం అమ్మ […]

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం. అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది. పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు. కేవలం చదువుకునే వయసులోనే […]

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు గమనించి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగలడు. అలా ముందుగానే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసినప్పుడు మాత్రం, ముందస్తు […]

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి. అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు. అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి […]

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం. శతకాలు చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉన్నత తరగతి పాఠ్యాంశాలలో కూడా తెలుసు శతకాలు ఉంటాయి. పలువురు పెద్దలు శతకాలను చదవమని చెప్పడమే, శతకాలు చదవానికి ఒక ప్రేరణ. ఇంకా ఉన్నత తరగతి పాఠ్యాంశాలలోనూ తెలుగు శతకాలు ఉండడం కూడా ప్రధాన కారణంగా కనబడుతుంది. సమాజనికి మేలు చేసే విషయాలు బాల్యం నుండి అలవాటు చేయడం కోసం పలు పాఠ్యాంశాలు విధ్యార్ధులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ విధంగా ఆలోచన చేస్తే, […]

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

మాయొక్క పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం , కొత్తగా కట్టబడిన మా పాఠశాలలోకి మేము ఈ మద్యనే మారాము. అందమైన భవనంలోకి మా పాఠశాల మార్చబడింది. ఊరికి దూరంగా కొత్తగా నిర్మించిన పాఠశాల చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా పాఠశాల వాతావరణం ఉంటుంది. మూడు అంతస్తుల భవనంలో అన్నీ తరగతులు మరియు తరగతుల సెక్షన్ల వారీగా గదులు ఉంటాయి. నేను చదువుకునే తరగతి గది చివరి ఫ్లోర్. మాతరగతి గదికి ఒక డోర్, ఇంకా రెండువైపులా […]

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం. స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. బాలుర కన్నా ఎక్కువగా బాలికలు చదువులో ముందుంటున్నారు. అయితే వారికి సరైనా భద్రత కల్పించగలిగితే, స్త్రీలు మరింత ముందుకు సాగుతారు. మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. ఓర్పు వహించడంలో స్త్రీలు ముందు ఉంటారు. కనుక వారికి సమాజంలో సరైన భద్రత కల్పించగలిగితే, మెరుగైన సమాజం మన ముందు ఉంటుంది. ఒక పురుషుడైన, ఒక స్త్రీ అయినా అమ్మ ఒడిలో పాఠాలే, ఎప్పటికీ మదిలో […]

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పడుతుందా? తెలుగులో వ్యాసం. అవినీతి అనేది ఒక అంటువ్యాధి వంటిది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి పాకినట్టు, అవినీతి అనేది కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. అంటువ్యాధి ఆరోగ్యానికి హాని చేసినట్టు, అవినీతి కూడా సామాజిక అభివృద్దికి కూడా అడ్డుపడుతుంది. అలా అనడానికి అసలు అవినీతి అంటే నీతి తప్పి ప్రవర్తించడం అంటారు. నీతి తప్పి ప్రవర్తించడం అంటే, తాను చేయవలసిన పనికి తగిన జీతం లభిస్తున్నా, అదనపు ప్రతిఫల […]

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు. సమాజంలో మనిషికి మనిషికి మద్య ఏర్పడే సంబంధాలలో మరొక మనిషి పాత్ర ఉంటుంది. అవి మొదట్లో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండవు. కారణం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చెప్పుడు మాటలు విని, నమ్మడమే అవుతుంది. ఒక మనిషి ఇంకొక మనిషి ఏర్పడిన పరిచయం ప్రక్రుతి వలన కానీ మరొక మనిషి వలన కానీ జరుగుతుంది. అలా ఏర్పడిన కొన్ని సంబంధాలు ఎక్కువకాలం కొనసాగుతుంది. అలాంటి బంధాలలో కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉంటాయి. కుటుంబ బాంధవ్యం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతుంది. స్నేహ సంబంధం మనసును బట్టి, మనసు ఇష్టాయిష్టాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహం, కుటుంబ సంబంధం మనిషి మనసుకు బలంగా మారతాయి.  ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అలాంటి మానవ సంబంధాలు ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు సంబంధాలకు చేటు చేస్తాయి. అవి స్నేహ సంబంధం కావచ్చు. లేక కుటుంబ సంబంధం కావచ్చు. మనిషికి మాటల వలననే మంచి సంబంధాలు ఏర్పడుతాయి. అలాంటి మాటలను కొందరు మంచికి ఉపయోగిస్తే, కొందరు చెడుకు ఉపయోగించవచ్చు. కొందరు చెడు అలవాట్ల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్ల కొరకు మాట్లాడే మాటలు చెప్పుడు మాటలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మాటలు, వారి స్వార్ధం కొరకు మాత్రమే ఉంటూ, విన్నవారికి చేటును చేసే అవకాశం ఉంటుంది. మరికొందరికి చెడు గుణాలను కలిగి ఉండవచ్చు. మంచి సంబంధాలను చూసి ఓర్వలేని గుణం కలిగి, కొందరు సమాజంలో ఉండవచ్చు. ఇలాంటి వారి మాటలు మంచి సంబంధాలకు చేటును చేస్తాయి. ఇవే చెప్పుడు మాటలుగా సమాజంలో చెబుతారు. మౌనం మనిషిని మునిగా మారిస్తే, మాటలు మనిషిని మాటకారిగా మారిస్తే, మంచికి ఉపయోగిస్తే, వారి వలన వారి చుట్టూ ఉన్నవారికి శాంతి చేకూరుతుంది. కానీ మాటకారికి చెప్పుడు మాటలు చెప్పే స్వభావం ఉంటే మాత్రం, వారి చెప్పుడు మాటలకు సత్సంబంధం బలి అయ్యే అవకాశం ఉంటుంది. అదే మాటకారికి మంచి గురించి చెప్పే అలవాటు ఉంటే, […]

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం యొక్క చరిత్ర […]

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి. మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు. నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం […]

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది.  తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట చాల చాలా ప్రధానమైన విషయం. మారుతున్న కాలంలో ఆడువారు ఉద్యోగస్తులుగా చక్కగా రాణిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం […]

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం. విద్య వలన వ్యక్తి బుద్ది వికసిస్తుంది. విద్య పలురకాలు… అయితే ప్రాధమికంగా శాస్త్రీయ విద్యతో విద్యార్ధి దశ ప్రారంభం అయితే, అటువంటి విద్య అన్ లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. నేటి విద్యా వ్యవస్థ సాంకేతికత తోడై సులభతరంగా మారుతుంది. నేర్చుకునే ఉత్సాహం ఉండాలే కానీ ఎవరైనా విద్య నేరుకునే విధంగా విద్యావ్యవస్థ మారుతుంది. ఇంటర్నెట్ ఆధారిత పరికరాల వాడుక పెరిగాక, ఆన్ లైన్ విద్యకు ప్రాముఖ్యత పెరిగింది. నేటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకంగా విద్య అందరికి అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి విద్యాలయానికి వెళ్లి, నిర్ణీత సమయాలలో విద్యాభ్యాసం […]

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది. అలాంటి సుగుణాభిరాముడి గురించి […]

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం. డిజిటల్ యుగంలో, మొబైల్(సెల్) ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. ఈ పరికరాలు నిత్యం సోషల్ మీడియాతో కనెక్ట్ కావడానికి, మరియు వినోదంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొబైల్ వాడుక విస్తృతంగా పెరుగుతున్న వలన, అదే ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక వ్యసనం వలె మారే అవకాశం ఉంది. ఈ వ్యాసం మొబైల్ వ్యసనానికి కారణాలు, పర్యవసానాలు మరియు సంభావ్య పరిష్కారాలను అన్వేషిస్తుంది, […]

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి. గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు. ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది. మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది. భూమి, గాలి, […]

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా? అవును ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం ఒక నేస్తంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను ఎందుకు ఒంటరిగా ఉంటే పుస్తకం ఓకే నేస్తం మాదిరిగా ఉంటుందని అంటున్నాను అంటే, పెద్దలు ఇదే మాటను ఎక్కువగా చెబుతారు. పుస్తకం వలన విషయపరిజ్ఞానం పెరుగుతుందని అంటారు. పెద్దలు పలికే పలుకలలో పుస్తకాలు ఎక్కువగా చదవండి… అగవగాహన చేసుకోండి… విషయాలపై ఆలోచన చేయండని చెబుతారు. కావున పెద్దల మాటలను బట్టి చూస్తే, పుస్తకాలు ఒక మంచి మిత్రుడు మాదిరిగా మారతాయి. నా దృష్టిలో నుండి చూస్తే నాకు తెలుగు పుస్తకం తెలుగు నేస్తంలాగా, ఇంగ్లీష్ పుస్తకం ఒక గుడ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. తెలుగు పుస్తకం చదివితే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బాగా తెలుగు తెలిసిన స్నేహితుడి మాటలు తెలుగులో అక్షరాలుగా పదాలు పేరాలలో పేరుకుపొతే అవి ఒక తెలుగు మిత్రుడి మాటలుగా నా మనసులోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు నా స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉంటే పది మంది మిత్రులు ఉన్నట్టే. ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ పుస్తకాలే నాకు మిత్రులు. ఇంకా గ్రంధాయలం నుండి ఎరువు తెచ్చుకునే తాత్కాలిక నేస్తం అప్పుడప్పుడు పలకరిస్తుంది. గ్రంధాలయం నుండి ఒక నాయకుడు చరిత్ర పుస్తకం అయితే ఓ పాతకాలపు నేస్తం నాకు దొరికినట్టే… అలాగే నేటి నాయకుల చరిత్ర అయితే ఓ సోషల్ ఫ్రెండ్ ఉన్నట్టే… ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది.. తరం మారుతుంది తరతరాల సంస్కృతి పుస్తకం వలననే తరం నుండి తరానికి చేరుతుంది… అంటే పుస్తకం ఒక దీర్ఘకాలిక నేస్తమే అవుతుంది… మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. ఎందుకంటే మంచి పుస్తకం అంటే అందరికి మక్కువ ఉంటుంది. కాలంలో కలిసిపోయిన విషయాలను పుస్తకం గుర్తుకు తేగలదు. ఓ మంచి నాయకుడు జీవితం ఒక పుస్తకంగా మారితే, ఆ నాయకుడు కాలం చేసాక కూడా ఆయన జీవితం పుస్తకరూపంలో లోకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎంతోమందికి మంచిమిత్రుడులాగా ఉపయోగపడుతుంది. […]

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్ ఫ్రీగా లభించే మూవీస్ లిస్ట్ ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకుని వాచ్ చేయడానికి… తెలుగు మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్… ఈ మొబైల్ యాప్ తెలుగు పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, యాక్షన్ మూవీస్ లిస్ట్… డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీస్ మొదలైన మూవీస్ లిస్టులు డిస్ప్లే అవుతాయి. వాటి నుండి మీకు […]

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించుకోవడం మనకు మనం మేలు చేసుకోవడం అంటారు. అవసరం లోన్ గురించి తెలుగులో వ్యాసం. అవసరానికి తగినంత డబ్బు లేనప్పుడు లోన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడం కష్టం కాకుండా చూసుకోవడం ప్రధానం. అటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మనసులో గుర్తు ఉంచుకోవలసిన ఆలోచన… ఎందుకంటే ఆలోచనే మనసును మరింత ముందుకు నెడుతుంది. లోన్ తీసుకునేటప్పుడు ఆలోచన, అవసరాలకు అనుగుణంగా లోన్ తీసుకోవడం ప్రధానం అయితే, […]

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి మనసుకు వారికే తెలియాలి. ఎందుకంటే? భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది వారి […]

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు… డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకీ, డొనాల్డ్ కు మద్య స్నేహపూర్వక సంబంధం పత్రికల ద్వారా తెలియబడుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యం […]

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి. దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది. ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో అంటారు. మన దేశం చాలా విశిష్టమైన దేశం సంప్రదాయబద్దమైన కుటుంబ జీవనం భారతదేశంలో ఆనాదిగా వస్తుంది. అనేక […]

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.  లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చును… అలా అవగాహన ఉన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం తోచకపోవచ్చును… పరిష్కారం లభించినా, పరిష్కరించే […]

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది. తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ వ్యాసం వ్రాయమంటారు. అంటే వ్యాసం ఒక వస్తువు లేదా […]

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

వేడుక వలె జరుపుకనే పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి. సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి. అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు నిర్వహిస్తారు. కొన్ని పండుగలు కేవలం కుటుంబం వరకే పరిమితం అవుతాయి. కుటుంబంలో బంధువులతో కలిసి పండుగ నిర్వహించుకుంటూ […]

ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో.. జనవరి మాసంలో పండుగలు తెలుగులో 2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి13వ […]

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి. అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది. సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి. మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, […]

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్ నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది. ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా. అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు. చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి. వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి […]

2020 అంతా స్టాప్ దేర్ 2021?

2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం. గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది. అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన… 2020అంతా కరోనా […]

తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్

బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి. ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది. ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది. […]

మన భారతంలో భారత్ బంద్

ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి. ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని ప్రతిపక్షాలు ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని. రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద […]

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది. 27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు. ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు […]

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది.

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం కారు వేగానికి బ్రేకులు వేసినట్టయ్యింది. ఆశించిన ఫలితాలు అంటే టిఆర్ఎస్ కన్నా బిజెపినే సాధించినట్టయ్యింది. గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది. కమలనాధులు చేసిన ప్రచారం గ్రేటరు ఓటరులో మార్పును తెచ్చింది. గతంలో గ్రేటరు తీర్పు అధికార పార్టీ కారుకు సూపర్ ఫాస్ట్ అందించింది. ఇప్పుడు కారు ఫాస్ట్ వెళ్లింది. కానీ కమలం వికసించింది. దూసుకొచ్చిన కారుకు వికసించిన కమలం, కారుతో సమానంగా కనబడుతుంది. నిన్న శుక్రవారం జరిగిన […]

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి?

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలం అంటే ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిఆర్ఎస్ కంటే బిజెపి ఆదిక్యంలో ఉండడం విశేషం. గ్రేటరు ఎన్నికలలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పోలింగ్ శాతం 50 శాతం లోపే… ప్రధాన పోటీ నెలగొన్న పార్టీలు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు… ఈ రెండు పార్టీలలో గెలుపెవరిది? గ్రేటరులో గ్రేటెస్ట్ గెలుపు ? అయితే కొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆదిక్యం అంతగా పట్టింపుకాదు అని…. మరికొందరంటారు. పోస్టల్ […]

కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం

నిత్య దీపారాధనతో చేసినా, కార్తీకమాసంలో చేసే దీపారాధన ప్రముఖమైనదిగా చెబుతారు. ఇంకా కార్తీకమాసంలో ప్రత్యేకతిధులలో చేసే దీపారాధన విశిష్టమైనదిగా చెబుతారు. అయితే కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం అంటే మరింత విశిష్టమైనదిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కార్తీకమాసంలో సోమవారంతో కూడిన కార్తీకపౌర్ణమి రోజున కార్తీకదీపం పెట్టే విధంగా రోజులు వచ్చి ఉంటాయి. అయితే ఆ సమయంలో అందరికీ ఆ భాగ్యం తెలిసి ఉండకపోవచ్చును. లేకా తెలిసినా చేసే అవకాశం లేకపోవచ్చును. అందరికీ తెలిసేలా కొందరు చేసే […]

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా […]

జ్ఙాన బోధ గీత అయితే

జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా […]

సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది

అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే […]

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది. […]

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి […]

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. […]

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు […]

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి. శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి. బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి. […]