మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

మాయాబజార్ వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ లేక టచ్ చేయండి

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది.

అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం చేయాలని, వారి బాల్యంలోనే పెద్దలు మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుపై సుభద్ర అభిమన్యుని తీసుకుని తన మెట్టింటికి బయలుదేరుతుంది.

శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం నుండి ద్వారకకు తిరిగి వస్తూ, ధర్మరాజు ఇచ్చిన బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని బలరాముడికి, శశిరేఖకు బహూకరిస్తాడు. బలరామునికి ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”దానిపై నిలబడిన ఎవరైనా సరే, వారి మనసులోని కుఠిలం స్వయంగా వెల్లడి చేసేస్తారు.” ఇంకా శశిరేఖకు ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”ఆ పెట్టెని తెరిచి చూస్తే మనసులో ఏది ఎక్కువ ఇష్టంగా ఉంటే ఆ వస్తువు కానీ లేక ఆ వ్యక్తికాని కనబడతారు” దానిని తెరిచి చూసిన శశిరేఖకు తన బావ అభిమన్యుడు కనబడతాడు.

శ్రీకృష్ణుడు వేరొక చోట ఉండగానే, పాండవులకు జగిరిన అన్యాయం తెలుసుకుంటాడు. అప్పుడు నిండుసభలో ద్రౌపదిపై జరిగిన ఆకృత్యం కూడా స్వామికి తెలయబడడం, ఆమెకు శ్రీకృష్ణ భగవానుడు తనమహిమచేత నిరంతర వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పరధ్యానంలోకి వెళ్లడం గమనించిన బలరాముడు, శ్రీకృష్ణుడిని ఏమయ్యిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు, తనవారితో పాండవులకు జరిగిన అన్యాయం గురించి, కౌరవులు వడిగట్టిన దారుణాలను వివరిస్తాడు. వెంటనే బలరాముడు ”నేను ధర్యోధనుడిని హెచ్చరించి, పాండవులు రాజ్యాన్ని పాండవులకు తిరిగి వచ్చేలా చేస్తానని” ద్వారక నుండి హస్తినాపురానికి బయలుదేరతాడు.

హస్తినాపురంలో ధర్యోధనుడుకి బలరాముడు వస్తున్నాడనే సమాచారంతో దిగులు చెందుతుంటే, అతని మేనమామ శకుని ”ఎందుకు..దిగులు, బలరాముడుని స్థుతి చేయడం ద్వారా అతనిని ఇట్టే ప్రసన్నం చేసుకోవచ్చును, కావునా బలరాముడికి బ్రహ్మరధం పట్టేవిధంగా ” ఆహ్వానం పలకమని చెబుతూ ఇంకా ”మన లక్ష్మణ కుమారునికి, బలరాముని కూతురు శశిరేఖను ఇచ్చ వివాహం చేయమని అడుగు, ఈ వివాహం జరిగితే భవిష్యత్తులో యాదవ వంశంవారు అంతా మనవైపే ఉండవలసి ఉంటుంది” అని బోధ చేస్తాడు. శకుని సలహాతో ధర్యోధనాధులు సంతోషిస్తారు. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

బలరామునికి ధర్యోధనుడు సకల మర్యాదలు చేసి, ఆసనం వేసి పాదసేవ చేస్తూ ఉంటు అన్ని విషయాలు తమకు అనకూలంగా ఏకరువు పెడతారు. పాండవులు తప్పు చేసినట్టుగా, పాండవులపై ఆరోపణలు చేస్తూ బలరాముడికి ధుర్యోధనాదులు మాటలు ఎక్కిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ కుమారుడుకు, శశిరేఖను ఇచ్చి వివాహం చేయవలసినదిగా వరం కోరతాడు, ధర్యోధనుడు. అప్పటికే ధర్యోధనుడు కపట మర్యాదలకు సంతోషించిన బలరాముడు, ధర్యోధనుడు కోరికకు అంగీకారం తెలుపుతాడు. అక్కడి నుండి బలరాముడు, ధర్యోధనుడు ఇచ్చిన అనేక కానుకలను స్వీకరించి తిరిగి ద్వారకకు వస్తాడు.

పాండవుల వనవాసానికి వెళ్లే సమయంలో సుభద్ర తన వీరకుమారుడు అభిమన్యునితో కలసి, శ్రీకృష్ణుడి నివాసానికి చేరుతుంది. అయితే ధర్యోధనుడికి ఇచ్చన మాటకు లోబడిన, రేవతి-బలరాములు శశిరేఖను, అభిమన్యునితో కలవకుండా కట్టడి చేస్తారు. శశిరేఖా-లక్ష్మణ కుమారుల వివాహం నిశ్చయం చేస్తారు. సుభద్ర బలరాముడిని తనకు ఇచ్చిన మాట గురించి అడిగినా, రేవతి, బలరాముల మనసు మారదు. దాంతో సుభద్ర అభిమన్యుని తీసుకుని, పాండవుల దగ్గరకు బయలుదేరుతుంది.

అయితే అడవిలో భీమసేనుడి కుమారుడు అయిన ఘటోత్కచుడు ఉన్న చోటికే అభిమన్యుడు చేరుకుంటుండగా, ఘటోత్కచుడు-అభిమన్యుడికి యుద్దం జరుగుతుంది. చివరికి సుభద్ర ప్రతిజ్ఙ చేయబోతూ తనవారి పేరు చెప్పడంతో…వెంటనే ఘటోత్కచుడు సుభద్ర కాళ్లపై పడి శరణు వేడుకుంటాడు. తను ఎవరో చెబతాడు. సుభద్ర, అభిమన్యులు ఘటోత్కచుని ఆహ్వానం మేరకు, వారి నివాసానికి చేరతారు. శశిరేఖా పరిణయం గురించి వివరం తెలుసుకున్న ఘటోత్కచుడు, ద్వారకలో శ్రీకృష్ణుడిని కలుసుకుంటాడు. అక్కడి ఇరువురి మాయా పధకంలో భాగంగా అసలు శశిరేఖని అభిమన్యుని దగ్గరకు చేర్చి, ఘటోత్కచుడు శశిరేఖ వేషంలో లక్ష్మణ కుమారునితో వివాహ ప్రక్రియలో పాల్గొంటాడు. ఇక అక్కడి సినిమాలో తిరిగే మలుపులు మనసుని మరింత రంజింప చేస్తాయి. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో ఘటోత్కచుని మాయాప్రభంజనం ధుర్యోధనాదులను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందీ…వివరణ కన్నా వీక్షణ బాగుంటుంది. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి