అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

స్వామియే శరణం అయ్యప్పా.. అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ. స్వామి అయ్యప్ప దివ్యచరితము, అయ్యప్పమాల దీక్ష మహిమలు చూపే తెలుగుమూవీ. గోదావరి తీరాన అయ్యప్ప దీక్ష తీసుకుని నియమాలను ఆచరించిన భక్తులను అనుగ్రహించే మహిమలు చక్కగా చూపిస్తారు. శబరిగిరి యాత్ర, మధ్యలో విశేషాల వివరణలు ఆద్యంతం భక్తిలోకి తీసుకువెళుతుంది ఈ భక్తిమూవీ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

Banner/బ్యానర్: జానకి ఆర్ట్ పిక్చర్స్
అయ్యప్పస్వామి మహత్యం తెలుగు భక్తి మూవీ
నటినటులు: శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్, చంద్రమోహన్, గిరిబాబు, జె.వి. సోమయాజులు, ఈశ్వరరావు, ఆహుతి ప్రసాద్, విద్యాసాగర్ తదితరులు.
దర్శకత్వం: కె. వాసు
నిర్మాత : మాగంటి ప్రసాద్

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

అయ్యప్ప చరితమును మహిమలను దీక్ష నియమాలను చక్కగా తెలియజెప్పే తెలుగు మూవీ. శరత్ బాబు ముఖ్యపాత్రలో ఈ భక్తిమూవీ సాంతం అయ్యప్ప దీక్ష మహిమను తెలియపరుస్తుంది.

అయ్యప్పస్వామి మహత్యం చిత్ర కధ

చిత్రప్రారంభం శరత్ బాబు మునిస్వామి స్వామిమాలదీక్షాకాలంలో నియమనిష్టలతో అనుసరిస్తున్నవిధానంలో టైటిల్స్ వస్తూ ఉంటాయి. టైటిల్స్ పూర్తవగానే ఇద్దరు చిన్నారులకు శరత్ బాబు మునిస్వామిగా వారికి అయ్యప్పమాల దీక్ష ఇవ్వడం చూపుతారు. అలాగే ఇంకొక వ్యక్తి మరోప్రక్క డబ్బులు తీసుకుని ఏమాత్రం దీక్ష నియమాలు పాటించకుండా ఉంటూ, ఇతరులకు దీక్ష ఇచ్చే గురుస్వామిగా చెలామణి అవుతూ ఉంటాడు.

అయ్యప్పస్వామి మహత్యం తెలుగు సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేక క్లిక్ చేయండి

శరత్ బాబు గురుస్వామిగా మాలలో దీక్షగా చేయవలసిన నియమాలు సక్రమంగా ఆచరిస్తూ, తనతోటి స్వామిలతో ఆచరింపచేస్తూ ఉంటారు. స్వామి మాల పవిత్రతను తెలియజేస్తూ నిత్యదీక్షాపరాయణుడై ఇతరస్వాములకు మార్గదర్శకంగా ఉంటారు. ఆ క్రమంలో తోటి స్వాముల సందేహాలు తీరుస్తూ ఉంటూ ఉండగా, ఒకరు అయ్యప్ప చరిత్రను అడిగితే, తానూ దీక్ష ఇచ్చిన ఇద్దరి చిన్నారులతో పాట రూపంలో వినిపించడంతో అయ్యప్ప దివ్య చరితను మనము చూడగలుగుతాం ఈ భక్తి మూవీ ద్వారా…

చిన్నారుల గానంతో అయ్యప్ప జన్మ వృత్తాంతం

త్రిమూర్తుల భార్యలు అయిన పార్వతి, లక్ష్మి, సరస్వతిల కోరిక మేరకు అత్రిమహర్షి భార్య అయిన అనసూయ ప్రాతివత్య మహత్యాన్ని పరిక్షించదలచి, త్రిమూర్తులు అత్రి ఆశ్రమానికి భిక్షుల వేషంలో వెళతారు. వారిని చూడగానే అత్రిముని వారికి ఏమికావాలని అడిగితే నీ భార్య నగ్నంగా మాకు వడ్డిస్తే, మేము మీ ఇంట భిక్ష స్వీకరిస్తాం అని అంటారు. సంకటంలో పడిన మహర్షి, తన భార్యను అడిగితే, అలాగే ఒప్పుకోండి అని బదులివ్వడంతో భిక్షులు రూపంలో ఉన్న త్రిమూర్తులు ఆశ్రమం లోనికి వెళతారు.

ఆశ్రమంలో భిక్షకు వచ్చింది, త్రిమూర్తులు అని గ్రహించిన అమ్మ అనసూయ వారిని తన ప్రాతివత్య మహిమతో చిన్నారులుగా మార్చివారికీ పాలిస్తుంది. అలాగే వారిని ఊయలలో వేసి ఆడిస్తుంది, సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులను చిన్నపిల్లలుగా మార్చివేయగల శక్తి కేవలం భర్తను అనుసరించడం వలన వచ్చింది. తనను అనుసరించడం వలన తన భార్యకు త్రిమూర్తులను చిన్నపిల్లలుగా మార్చగల తపఃఫలం వచ్చేంత గొప్పగా ధర్మాలు తెలిసి ఉండడం, ధర్మంపై కట్టుబడి ఉండడం అత్రి మహర్షి గొప్పతనంగా కనిపిస్తుంది.

అయితే త్రిమూర్తల భార్యలు వచ్చి అనసూయ అమ్మని ప్రార్ధిస్తే, మళ్ళి తన ప్రాతివత్య్త మహిమచేత ఆ చిన్నారి శిశువులను తిరిగి త్రిమూర్తులుగా మారుస్తుంది. అనసూయ ప్రాతివత్య గొప్పతనానికి సంతసించిన త్రిమూర్తులు వరం కోరుకోమంటే, బిడ్డలు లేని తమకు బిడ్డలను ప్రసాదించమని అడుగతారు అనసూయ-అత్రి దంపతులు. అప్పుడు వారికీ త్రిమూర్తి అంశతో కలిగే సంతానంలో దత్తాత్రేయులు ఒకరు.

దత్తాత్రేయులు తన భార్యతో గొడవపడి ఇద్దరు ఒకరినొకరు శాపాలను ఇచ్చుకోవడంతో ఆమె భార్య మహిషి అనే రాక్షసిగా జన్మిస్తుంది. రాక్షసిగా మారినా మహిషి, శుక్రాచార్య ముని సూచనమేరకు బ్రహ్మదేవుల కోసం తపస్సు చేస్తుంది. మహిషి తపస్సు చెడగొట్టే ప్రయత్నం ఇంద్రుడు చేసి సఫలం కాలేడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు మహిషిని వరం కోరుకోమంటే, ఆమె తనకు చావులేని వరం ఇమ్మంటుంది. పుట్టినవారు మరణించడం, మరణించినవారు పుట్టడం ప్రకృతి లక్ష్మణం దాన్ని ఎవరు మార్చలేరు. అంటే మహిషి తెలివిగా హరిహరులు (శివుడు-విష్ణువు)లకు ఎవరైనా సంతానం కలిగితే ఆ సంతానం చేతిలో మాత్రమే చనిపోయే వరం అడుగుతుంది. బ్రహ్మదేవులు వరం అనుగ్రహిస్తారు, ఇక మహిషి అందరి రాక్షసుల మాదిరి దేవతలను, సజ్జనులను పీడించడం మొదలుపెడుతుంది.

అయ్యప్ప స్వామి జననం

ప్రకృతి నియమాలు, వాటిని పాటించి సదా మంచినే కాంక్షించే వారిని ఇబ్బంది పెడితే, ఆ పరమాత్మా ఎప్పుడు ప్రకృతిలోకి వచ్చి ఆఅడ్డుని తొలగించడం పరిపాటి, స్థితినినిలబెడతాడు. ఇప్పుడు స్థితి స్త్రీ రూపం ధరిస్తే, లయం పురుషత్వంతో స్త్రీని సృజించి, ఒక కారణపురుషునికి జన్మకు కారణం అవుతారు. అలా జన్మించిన బాలుడే మణికంఠగా పెరిగి అయ్యప్ప అయ్యి ఇప్పుడు అందరిని అనుగ్రహిస్తున్న శబరిమల స్వామి. పద్మదళ రాజ్యాధినేత వేటకు అడవికి వచ్చిన రాజు అమందాత కొండలలో శిశువు రోదన విని వెతికితే కనిపించిన బాలుడిని దైవప్రసాదంగా భావించి, అంతఃపురానికి తీసుకువెళ్ళి పెంచుతాడు. ఆ బాలుడికి మణికంఠగా పెరిగి, గురుకులానికి వెళ్ళి సకల విద్యలు అభాసిస్తారు స్వామి అయ్యప్ప. విధ్యాబ్యాసం పూర్తయిన తరువాత గురువుగారికి గురుదక్షిణగా ఆయన పుత్రుడికి దృష్టి, వాక్కు ప్రసాదిస్తారు మణికంఠ.

విధ్యాబ్యాసం పూర్తీ అయ్యి అంతఃపురం చేరతారు స్వామి మణికంఠ, తరువాయి ఇంద్రుడు ఎలాగైనా మణికంఠ జన్మరహస్యం చెప్పి మహిషిని అంతం చేయించాలని తలచి, మణికంఠ పెంచిన తల్లికి శిరోభారం కలిగేల చేస్తాడు. ఇంద్రుడే వైద్యుడుగా వచ్చి రాజుతో రాణి శిరోభారం తగ్గాలంటే పులిపాలు కావాల్సిందే అని చెబుతారు. మణికంఠ పులిపాల కోసం అడవికి బయలుదేరితే అక్కడ మణికంఠకి ఇంద్రుడు తన జన్మరహస్యం, జన్మకారణం చెప్పి మణికంఠని మహిషిపై యుద్దానికి ప్రోత్సహిస్తారు. మణికంఠకి, మహిషి మధ్య జరిగిన ఘోరయుద్దంలో మహిషిని మట్టికరిపిస్తాడు మణికంఠ. తరువాయి మణికంఠ అంతఃపురానికి ఇంద్రుడినే పులిగా తీసుకునివెళతాడు. అప్పటికే ఇంద్రమాయ వలన కలిగిన శిరోభారం తొలగిపోతుంది. పులిగా ఉన్న ఇంద్రుడు నిష్క్రమించాక, మణికంఠ తన తల్లిదండ్రులతో నేను తపస్సుకు వెళతానని వెల్లడి చేస్తాడు.

మణికంఠ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులకు, మణికంఠ జ్ఞానబోధ చేస్తే, తండ్రి ఒక కోరిక కోరతాడు. నీ పట్టాభిషేకానికి అని చేయించిన నగలు ఒకసారి ధరించి మాకు దర్శనం కలగజేయి అని తండ్రి మణికంఠని అడిగితే, అందుకు బదులుగా మణికంఠ నేను త్వరలో ప్రతి సంవత్సరం మకరసంక్రాంతి రోజున మీరు తెచ్చే నగలను ధరిస్తాను. ఇప్పుడు నేను సంధించి వదులుతున్న బాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాకు ఆలయం కట్టించమని చెప్పి, విల్లుతో బాణం విడిచిన మణికంఠ తపస్సుకు బయలుదేరతాడు. అలా తండ్రి కట్టించిన ఆ ఆలయం శబరిమలై భక్తులను అనుగ్రహిస్తున్న అయ్యప్పకి నిలయం అయింది.

మణికంఠను అయ్యప్ప అని మొదట పిలిచినా తల్లిదండ్రులు

స్వామికి అయ్యప్ప పేరు ఎలా వచ్చింది అంటే ! తపస్సుకు బయలుదేరే సమయంలో తల్లిదండ్రులు మణికంఠని తండ్రి అయ్యా అని తల్లి అప్పా అని సంభోదిస్తారు. అలా తల్లిదండ్రులు సంభోదించిన రెండు పేర్లు ఒకటిగా అయ్యప్పగా అయ్యి అందరిని అనుగ్రహిస్తున్నాడు మణికంఠ స్వామి. అలా అయ్యప్ప చరితమును పిల్లచే గానం చేయించిన శరత్ బాబు గురుస్వామి మిగిలిన స్వాములకు పూజవిధానాలు, దీక్షనియమాలు, శబరిమలలో జరిగే సహస్రకలశాబిసేకం వంటి విశేషాలు చూపిస్తూ మాలదీక్షలో మార్గదర్శకంగా నిలుస్తాడు.

అయ్యప్పస్వామి మాలనియమాలు మండలం రోజులు ఆచరించి, శబరిమాల యాత్ర గురుస్వామి శరత్ బాబు మార్గదర్శకత్వంలో సాగడంతో పాటు మధ్యలో భక్తులపై అయ్యప్పస్వామి మహిమలు నిదర్శనంగా మారడం ఈ చిత్రం ఆద్యంతం భక్తిని పండిస్తూ ఉంటుంది. యాత్రలో స్వామిపై, మాలనియమాలపై పాటలు అందరిని అలరిస్తాయి. హరిహర పుత్రుడైన అయ్యప్పదీక్ష భక్తిశ్రద్దలతో ఆచరించి శబరిమల యాత్రను చేస్తే పూర్తీఫలితం ఉంటుంది అని తెలియజెప్పే భక్తిమూవీ. అలాగే తెలిసి తప్పులు చేస్తూ, స్వామి పేరు చెప్పి ఇతరులను మోసం చేసేవారిని స్వామి ఎలా శిక్షిస్తారో ఈ చిత్రం చూపుతుంది.

అందరు దేవతలు అవతరించి అవతార ప్రయోజనం తీరాక భూలోకంలో ఉండరు కదా మరి అయ్యప్ప ఎందుకు శబరిమలలోనే ఉండినట్టు అని శబరిమలయాత్రలో గురుస్వామిని మరో స్వామి ప్రశ్నిస్తారు. అప్పుడు గురుస్వామి స్వామి ఆంజనేయులకు అయ్యప్ప మాట ఇచ్చినవైనం, అలాగే పరబ్రహ్మ భక్తురాలైన శబరికి అయ్యప్పస్వామి ఇచ్చిన వరం గురించి, అయ్యప్ప గుడికట్టమని సందేశం తన తండ్రికి పంపించడం వివరిస్తారు. మణికంఠతండ్రి శబరిగిరిపై కట్టించిన ఆలయం శబరిమలై విరాజిల్లుతుంది. గోదావరి తీరాన ఉన్న ర్యాలీ గ్రామవాసి పరమేశ్వరశాస్త్రి ప్రధాన అర్చకులుగా తంత్రితో  శబరిగిరిపై అయ్యప్ప పూజలు ప్రారంభం అవుతాయి. పరమేశ్వర శాస్త్రి గారి వంశీకులు అర్చకులుగా ఇప్పటికి అయ్యప్ప పూజలు అందుకుంటూ ఉన్నాడు.

యాత్రకు బయలుదేరిన స్వాములకు గురుస్వామి మకరజ్యోతి గురించి వివరిస్తూ శబరిమాల చేరి అయ్యప్ప స్వామి దర్శనం పొందడంతో అయ్యప్ప స్వామి మహత్యం భక్తి మూవీ సుకాంతం అవుతుంది.

మంచి భక్తి సినిమాలగా అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ ఉంటంది, మాలధారణ, దీక్ష నియమాలు, శబరిమాల యాత్ర విశేషాలను మనకి స్క్రీనుపై చూపుతుంది.

స్వామియే అయ్యప్ప శరణం అయ్యప్పా శబరిమల అయ్యప్ప శరణం అయ్యప్ప, హరిహరతనయ అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం