తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది.

భక్తప్రహ్లాద తెలుగు భక్తి మూవీలో భగవంతుడిగా హరనాథ్ నటిస్తే, బాల భక్తుడిగా రోజారమణి చాల చక్కగా నటించారు. చిన్నారి భక్తుడి తండ్రి హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు (SV Rangarao) నటిస్తే, హిరణ్యకశిపుడు భార్య లీలావతిగా అంజలిదేవి నటించారు. చిన్నారి భక్తుడికి  గురువులుగా రేలంగి నరసింహారావు, పద్మనాభంలు నటించారు. నారదుడుగా బాల మురళి కృష్ణ నటించారు.

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద సాంకేతిక వర్గం

Banner/బ్యానర్: AVM Productions/ఏవిఎం ప్రొడక్షన్స్
Direction/దర్శకత్వం:Ch Narayana murthy సిహెచ్. నారాయణమూర్తి
Actor Actress/నటినటులు: SV Rangarao/ఎస్వి రంగారావు, Balamurali Krishna/బాల మురళి కృష్ణ, Relangi/రేలంగి, Padmanabham/పద్మనాభం, Haranath/హరనాథ్, dhoolipala/ధూళిపాళ, Ramana Reddy/రమణారెడ్డి, Nagaiah/నాగయ్య. AnjaliDevi / అంజలీదేవి, Jayanti/జయంతి, Baby Rojaramani/బేబీ రోజారమణి, L Vijayalakshmi/ఎల్ విజయలక్ష్మి, Geetanjali/గీతాంజలి, Vanisri/వాణిశ్రీ, Nirmala/నిర్మల తదితరుల్ Bhakta Prahlada/భక్తప్రహ్లాద చిత్రంలో నటించారు.
Story/కధ: DV Narasaraju/నరసరాజు
Sangitam/సంగీతం: S Rajeswara Rao/ఎస్ రాజేశ్వరరావు

జయ విజయులకు మునుల నుండి శాపం భక్తప్రహ్లాద మూవీలో

వైకుంఠములో ద్వారాపాలకులుగా జయవిజయులు వైకుంఠద్వారం దగ్గర నిలబడి ఉంటారు. సనకసనంద మహర్షులు వైకుంఠములోనికి ప్రవేశించబోతే, వారిని జయవిజయులు అడ్డుకుంటారు.

మహర్షులు తమకు శ్రీమహావిష్ణువు దర్శనం అత్యవసరం అన్నా అడ్డుకుంటారు, శ్రీహరి లక్ష్మీసమేతులై ఏకాంతంగా ఉన్నారని లోనికి ఎవరిని అనుమతించం అని అడ్డుకుంటారు. శ్రీహరి భక్తవత్సలుడు భక్తులకు, శ్రీహరికి ఎవరూ అడ్డుకాకూడదు మీరు అడ్డుతోలగమని చెప్పినా జయవిజయులు సనకసనంద మహర్షులను అడ్డుకుంటారు.

కోపగించిన మహర్షులు రాక్షసులై భూలోకంలో జన్మించమని జయవిజయులకు శాపానుగ్రహం ఇస్తారు. జగన్నాటక సూత్రదారి వచ్చి జరిగిన విషయం గ్రహించి, జయవిజయులు చేసింది తప్పు దానికి మీరు శిక్ష అనుభవించాలంటే, జయవిజయులు శ్రీహరిని ప్రార్ధిస్తారు.

అప్పుడు శ్రీమహావిష్ణువు జయవిజయులు శాపఫలం అనుభవించాక, వారు తిరిగి వైకుంఠము వచ్చేలా అనుమతి ఇవ్వవలసినదిగా తాపసులను కోరితే, బదులుగా సనకసనంద మహర్షులు దానికి మేమంతవారము నీవెట్లా అనుగ్రహించిన మాకు సమ్మతమే అని చెబుతారు.

నాకు విరోధులుగా మూడు జన్మలు ఎత్తి తరువాత వైకుంఠము చేరతారా ? నాకు భక్తులుగా ఏడు జన్మలు ధరించిన తరువాత వైకుంఠము చేరతారా ? అని జయవిజయులకు శ్రీహరి చెబితే. బదులుగా జయవిజయులు స్వామి నీకు దూరంగా ఏడు జన్మల కాలం మేము ఉండలేము, విరోధులుగా మూడు జన్మలకాలం తరువాత వైకుంఠప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటారు. అలా జయవిజయులు మూడు జన్మలు శ్రీహరికి శత్రువులుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

మొదటి జన్మలో దితి కడుపునా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా రెండవ జన్మములో రావణ, కుంభకర్ణులుగా మూడవ జన్మములో శిశుపాల, దంతవర్తులుగా భూలోకములో జన్మించి, నన్ను విరోధించినా, నిరంతరం నాపై ధ్యాసనే కలిగి ఉండి, తదుపరి వైకుంఠము చేరగలరని శ్రీహరి సెలవిస్తారు.

హిరణ్యాక్షమరణం, హిరణ్యకశిపుడు తపస్సు, ప్రహ్లాద జననం

తరువాయి సన్నివేశంలో కశ్యప ప్రజాపతి సంద్యాసమయంలో తన ఆశ్రమంనందు ధ్యాననిమగ్నుడై ఉండగా, అయన భార్య అయిన దితి అక్కడికి వస్తుంది. వసంతకాలం ప్రకృతి ప్రభావరిత్యా ఆమె కామప్రభావానికి లోనై కశ్యపప్రజాపతి చెంతచేరుతుంది, విరహభావంతో.

కశ్యప ప్రజాపతి ఆమెను వారించగా ఆమె తిరస్కార వైఖిరికి ఆమె కోరికను తీర్చుతారు. తత్ఫలితంగా అనతికాలంలో ఆ దంపతులకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారికీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు నామకరణం చేసిన కశ్యప ప్రజాపతి, వారు రాక్షసులై లోకకంటకులుగా శ్రీహరి విరోధులు అవుతారని చెబుతారు. దానికి దితి దుఃఖిస్తే, నీ మనుమడు మాత్రం శ్రీహరి భాక్తాగ్రేసుడై కీర్తిని సముపర్జిస్తాడని ఆమెను ఊరడిస్తారు.

దైత్యుడైన హిరణ్యాక్షుడు ప్రజలను పీడిస్తూ, సాదుజనులను హింసిస్తూ, భూమాతను కూడా హిరణ్యాక్షుడు హింసిస్తూ, భూమిని రక్షించడానికి శ్రీహరి ఆదివరాహఅవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి, శిష్టరక్షణ చేస్తారు.

విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఇదంతా శ్రీహరి వలననే జరిగింది, అందుకు శ్రీహరిపై విరోధం ఇంకా పెంచుకుంటాడు. ఎలాగైనా శ్రీహరిని ఓడించాలని శ్రీహరిపై యుద్దానికి సంసిద్ధుడు అవుతుంటే, గురువు బోధనచేత యుద్దకాంక్ష పక్కనపెట్టి, తపస్సు చేయడానికి బయలుదేరతాడు.

బ్రహ్మదేవుడి గురించి ఘోరతపము ప్రారంభిస్తాడు, బ్రహ్మ ప్రత్యక్ష్యం అయ్యేదాకా కఠోర తపము చేస్తే, బ్రహ్మగారు హిరణ్యకశిపుడు తపస్సునకు మెచ్చి, వచ్చి వరం కోరుకో అంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏడేడు పదునాలుగు లోకాలలో గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, అస్త్ర, శస్త్రాలతో, దిక్కులలో, పగలు, రాత్రి, ఇంటా, బయటా, పైన, క్రింద, జంతువులు, మనుషులు, దేవతలు, కిన్నెర, కింపుర్శ, గంధర్వులు, అన్ని వస్తువుల ద్వారా మరణం లేని వరం అడిగితే, బ్రహ్మగారు అనుగ్రహిస్తారు.

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తపము చేస్తున్న సమయంలో గర్భిణిగా ఉన్న లీలావతిని ఇంద్రుడు చెరపట్టి తీసుకువెళుతుంటే, నారద మహర్షి అడ్డుపడి, ఆమెగర్భంలో ఉన్నది రాక్షస జాతి బాలుడే అయినా మహాభక్తుడు కాగలడు, కావునా ఆమెను విడిచిపెట్టమని వారిస్తాడు. తదుపరి లీలావతిని నారదమహర్షి తన ఆశ్రమంలోకి తీసుకువెళతారు.

ఆ ఆశ్రమంలో గర్భిణిగా ఉన్న లీలావతితో నారద మహర్షి బ్రహ్మజ్ఞానం భోదిస్తుంటే, ఆమె నిదురిస్తుంటే, ఆమె గర్భంలో ఉన్నఆ నెలల బాలుడు ఆ జ్ఞానసారాన్ని గ్రహిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు లీలావతి ప్రసవిస్తే, సుపుత్రుడిగా తపస్సు పూర్తిచేసుకుని వచ్చిన హిరణ్యకశిపుడుకి పరిచయం చేస్తారు. లీలావతి మరియు నారదులు. ఆ బాలుడికి ప్రహ్లాదుడిగా నామం నారద మహర్షే సూచిస్తారు.

వరగర్వం వలన హిరణ్యకశిపుడు ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. సర్వసాదులను హింసిస్తూ, ప్రజలందరినీ నన్నే దేవుడుగా కొలవవలసినదిగా ఆజ్ఞలు జారి చేస్తాడు. ఇంద్రుడిని జయించి, స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు. సాధువులు, మునులు శ్రీహరిని వేడుకొనగా అందుకు శ్రీహరి హిరణ్యకశిపుడు సుపుత్రుడు నాకు మహాభక్తుడై ఉంటాడు, అందువల్లే హిరణ్యకశిపుడు అంతం కూడా అవుతుంది అని చెబుతారు.

భక్తప్రహ్లాద హరిభక్తి నివారణ ప్రయత్నం చేసే హిరణ్యకశిపుడు

నారాయణనామం పలుకుతుంటే ఎంతమధురంగా ఉంటుందో పలికేవారికీ తెలుస్తుంది అంటారు, కానీ ఈ మూవీలో నారాయణనామం గొప్పతనం కనబడుతుంది. నారాయణనామం యొక్క రుచి ప్రహ్లాద త్రాగినట్టుగా ఈ మూవీ కల్పిస్తుంది. నారాయణనామజపం వలన మరణ భయంపొందని దృఢమైన మనస్సుని పొందిన బాలుడు భక్తి భావన ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది, ఈ భక్తప్రహ్లాద మూవీలో. నారాయణమంత్రం తల్లి కడుపులో ఉండగానే నారద మహర్షిచే బోధించబడుతుంది.

మదిలో భక్తిభావనలు పెంపొందించుకోవడానికి భక్తప్రహ్లాద చిత్రం ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. భక్తి ధ్యాసలో భవభందాలా భయం లేదని చాటి చెప్పే చిత్రం, చూస్తున్నవారిలో కూడా నారాయణ నామంపై మమకారం పెంచుతుంది. భక్తుడి భక్తి తత్పరతతో రాతిస్థంభం నుండి కూడా భగవంతుని రప్పించవచ్చని చాటి చెప్పే తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద .

అధర్మ కర్మవలననే ప్రజాపతి సంతానం ద్రుష్టబుద్దితో పుడితే, ధర్మపరివర్తనతో లీలావతి వలన ద్రుష్ట రాక్షసుడికి సుపుత్ర సంతానం కలిగింది. అంతటా హరినామం నిషేదిస్తే, నిషేదించిన ఇంటే హరినామ కీర్తన జరగటం జగన్నాటక సూత్రదారి మాయ ఎంతగొప్పదో అర్ధం అవుతుంది.

నారదుల ఆశ్రమం నుండి ఇంటికి వచ్చిన బాలుడు ఎప్పుడు శ్రీహరి ధ్యాసలోనే ఉండి, ధ్యానం చేస్తూ ఉంటాడు. ముల్లోకాలు జయించిన హిరణ్యకశిపుడుకి కంటిమీద కునుకు లేకుండా చేసేది, తన సుపుత్రుడు భక్త ప్రహ్లాద ప్రవర్తన. రాక్షస బుద్దులు రాకుండా ప్రసన్నంగా ఉండడం దానవాగ్రేసురుడుకి అసలు నచ్చదు. అలా ఉన్న ఆ బాల ప్రహ్లాదుడిని గురుకులంలో విద్యాబుద్దులకోసం చండామార్కుల ఆశ్రమంకు పంపుతారు.

గురుకులంలో ప్రహ్లాదుడి హరిభక్తి కీర్తనలు

గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు గురువుల దగ్గర అన్ని విద్యలు, వేదపాటాలు నేర్చుకుంటాడు, కానీ హరిభక్తిని మరువడు. వేదవిద్యలు ఇట్టే పట్టిన ప్రతిభను చూసి ముచ్చటపడి, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వద్దకు తీసుకువెళతారు.

హిరణ్యకశపుడు పుత్రుడిని తనతొడపై కూర్చొనబెట్టుకుని, ప్రహ్లాదుడుని నీవు నేర్చుకున్న విద్యలలో సారం ఏమిటో చెప్పమని అడిగితే, తండ్రి తొడపై కూర్చోని ప్రహ్లాదుడు వేదసారమైన పరమాత్మ తత్వాన్ని శ్రీహరిపై పొగుడుతూ పద్యం చెబుతాడు. శ

్రీహరి మాట తనపుత్రుని నోట విన్న హిరణ్యకశిపుడుకి కోపం వస్తుంది. హరిభక్తి మనకు తగదని చెప్పినా, హరి భక్తితత్పరుడైన బాలుడు దృఢమైన మనసుతో శ్రీమహావిష్ణువునే స్తుతిస్తాడు.

తనపుత్రుడికి రాక్షసజాతికి అవసరమైన శాస్త్రవిద్యలు సరిగా బోధించమని మరలా గురుకులానికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. తిరిగి గురుకులం చేరిన ప్రహ్లాదుడు, అక్కడి ఉన్నవారందరికీ హరిభక్తి భోదిస్తూ ఉంటాడు.

అది చూసిన చండామార్కులవారు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపునికి అప్పజెప్పి, ప్రహ్లాదుడిని మార్చడం మావల్ల కాదు అని చెబుతారు. హరిభక్తి మానతవా లేదా అని కఠినంగా అడిగినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేను అంటాడు. ఇక ప్రహ్లాదుడిని చంపమని, భటులకు అజ్ఞా ఇస్తాడు, హిరణ్యకశిపుడు.

ఏనుగుతో తొక్కించినా, ఎత్తైన కొండలపై నుండి తోసివేసినా, పాములతో కరిపించినా ఎలా ప్రయత్నించిన శ్రీహరి అనుగ్రహంతో బ్రతికే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలకు మరణం దరిచేరని ప్రహ్లాదుడిని చూసి, హిరణ్యకశిపుడు తన పుత్రుడిని నిలదీస్తాడు.

నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని, ప్రహ్లాదుడి భక్తికి పరవశిస్తూ ఉండే, శ్రీమహావిష్ణువు, ప్రహ్లాదుడు చూపించిన రాతికట్టడమైన స్థంభం నుండి పై సగ భాగం సింహంగా, క్రింద భాగం నరుడుగా కలిగి నృసింహస్వామిగా  ఉద్భవించి, పగలు, రాత్రి కానీ సంద్యా సమయంలో ఇంటా బయటా కానీ గడపపై ప్రాణం లేని గోళ్ళతో హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. చివరగా భక్తప్రహ్లాద (BhaktaPrahlada) స్త్రోత్రంతో తృప్తిపడి, ప్రహ్లాదునికి వరాలు ఇస్తాడు.

ఇందుకలడని అందుకలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు శ్రీహరి అని పడే ప్రహ్లాద పద్యం చక్కగా ఉంటుంది.

భక్తిమార్గం సులభమార్గం అని అదే చివరివరకు తోడు అని భక్త ప్రహ్లాదుడి చరితను చెబుతారు. ఈ భక్తి మూవీ అదే చూపుతుంది.

ధన్యవాదాలు

తెలుగురీడ్స్.కామ్
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం

తెలుగు వ్యాసాలు