వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది.

ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది.

కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల ఆశీస్సులు అందించడం.

వినాయకుని(Vinayaka) విఘ్నాదిపత్యం, చివరగా మూషికునిపై విజయంతో కద కంచికి మనం ఇంటికి అన్నట్లు సాగుతుంది.

వినాయక విజయం తెలుగు మూవీ సాంకేతిక వర్గం.

బ్యానర్: జగన్మాత ఆర్ట్స్
మూవీపేరు: వినాయక విజయం
పాత్రలు:
బాలవినాయకుడు: బేబీ లక్ష్మీసుధ
వినాయకుడు: ఎంజివి మదన్ గోపాల్
శివుడు: కృష్ణంరాజు
పార్వతి: వాణిశ్రీ
విష్ణువు: రామకృష్ణ

వినాయకుడి పుట్టుక కారణాలు ఒక రాక్షసుని వరం అని అంటారు. మూషిక రాక్షసుని వరం ఈ విధంగా ఉంటుంది.

అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, బ్రహ్మచర్య దీక్ష, జితేంద్రియుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన మహావీరుడు అయి బ్రహ్మ సృష్టిలో పుట్టకుండా ఉన్న వ్యక్తి చేత అంతం అయ్యే అవకాశం మూషిక రాక్షసుడికి మరణం సంభవించాలి.

ఆ కారణం లోక కళ్యాణం (Vinayaka Vijayam) అయింది. మన అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడు (Vinayaka)వచ్చాడు.

వినాయక విజయం భక్తి మూవీ కధ ప్రారంభం

కైలాసంలో ఆదిదంపతులు లక్ష్మినారాయణులు, బ్రహ్మాది దేవతలతో కొలువుదీరిన సభతో మూవీ ప్రారంభం అవుతుంది. ఆ యొక్క సభలో దేవతలందరూ త్రిపుసారుల సంహారం అయ్యింది.

కానీ మరలా వారి వారసులు మూషికుడు వలన మరియు గజాసురుడు వలన భవిష్యత్తులో ఇంద్రాది దేవతలకు ఇబ్బందులు కలగవచ్చు అని సందేహం నారద మునీంద్రులు వెలిబుచ్చుతారు.

అందుకు ప్రతిగా శ్రీమహావిష్ణువు ఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరులు ఇరువురు కలసి కైలాసంలో ఉండగా లోకాలలో ఎవరికీ ఏ ఇబ్బంది రాబోదని వెల్లడి చేస్తారు.

మరొక సన్నివేశంలో మూషికుడు, గజాసురుడు సభలో కొలువు తీరి ఉండగా నారద మహాముని వేంచేస్తారు. ఉచితాసినులు అయిన నారద మునీంద్రులు వారికి కైలాస సభ ప్రస్తావన తెచ్చి, హరిహరుల సహకారంతో రాక్షస జాతిని అంతమొందించాలని దేవతల ప్రయత్నం అని చెబుతారు.

దానికి మేము అంతకముందే దేవతలను అంతం చేస్తాం అని బదులు ఇస్తాడు మూషికుడు అయితే ఇంతకుముందు చాలామంది రాక్షసులు పలికి ఫలితం సాధించాలేకపోయరని ప్రతిగా బదులు పలుకుతారు నారద మునీంద్రులు.

శక్తితో శివుడు కలిసి ఉన్నన్నాళ్ళు ఎవరికీ అపాయం రాదని చెబితే, వారిని భక్తితో వేరు చేస్తానని గజాసురుడు పలుకుతాడు. ఇంద్రుడిని జయించి స్వర్గాన్ని జయిస్తానని మూషికుడు పలుకుతాడు.

మూషికుడు భార్య ప్రియంవద మాత్రం చాల ప్రాతివత్యం కలిగి, జగన్మాతను ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు తన పతి యోగక్షేమాలు కోరుతూ పూజలు చేస్తూ ఉంటుంది.

ఇక మూషికుడికి ఇతరుల మనస్సును కొంతసేపు మాయచేసి తానూ అనుకున్న మాయ వారిపై ప్రయోగించకలడు. ఈ విద్యను పూజామందిరంలో ఉన్న తన భార్యపై ప్రయోగించి చూపుతాడు.

మరొక సన్నివేశంలో గజాసురుడు శివుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు, అత్యంత భక్తి శ్రద్దలతో శివుడిని అర్చిస్తూ ఉంటాడు.

దేవేంద్రుడు దుర్వాస మహర్షి చేత శపించబడడం, వినాయక విజయం తెలుగు భక్తి మూవీ.

తరువాతి సన్నివేశంలో ఇంద్రసభకు దూర్వాస మహర్షి వేంచేస్తారు, అప్పుడు దేవేంద్రుడు ఆ మునీంద్రుడుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారు.

సంతసించిన ముని తన తపఃప్రభావమైన ఒక మాలను ఇంద్రుడికి ఇస్తాడు. అప్పుడే మూషికుడు కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశం చూస్తాడు. ఇంద్రుడిపై మూషికుడు తన విద్యను ప్రదర్శించి, మహామునిపై దుర్భాషలాడేవిధంగా ప్రేరేపిస్తాడు.

దాంతో ఇంద్రుడితో అహంకారపూరితమైన మాటలు మాట్లాడతాడు. దూర్వాస ముని ఆగ్రహానికి కారణం అయ్యేలా చేస్తాడు. ఇంద్రుడి ప్రవర్తన కారణంగా కోపగించిన ముని దేవేంద్రుడు పదవి కోల్పోయి రాక్షసులచే పీడీంపబడతావని శపించి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

మాయ తొలగగానే నేనెందుకు ఇలా ప్రవర్తించానని దేవేంద్రుడు చింతిస్తుంటాడు. అందుకు అక్కడకు వచ్చిన నారద మహర్షి, నీవు మూషికుని మాయప్రభావం వలన అలా ప్రవర్తించావని చెబుతాడు. అతని దుర్బుద్ధితో నీమీద ఈ ప్రయోగం చేసాడని వివరిస్తారు.

నారదుడు ఆ తరువాతి సన్నివేశంలో పార్వతి మాత వద్దకు వెళతాడు. శివుని గురించి గజాసురుడు చేస్తున్న భక్తిపూర్వకమైన తపస్సు సంగతి చెబుతాడు. అందులో అంతర్యం కూడా పార్వతి మాతకు వివరిస్తాడు.

పరమేశ్వరా అంటే పరిగెత్తుకెళ్ళి మరీ వరాలిచ్చే శివుడితో జాగ్రత్త అని చెబుతారు. అయితే పరమశివుడు మాయలు చేయని మహాదేవుడు, భక్తులు కోరికలు నెరవేర్చే భాక్తపరాదినుడు అని అంటుంది పార్వతి మాత.

ఈలోపు పరమేశ్వరులు అక్కడికి వేంచయగానే నారద మహర్షి నిష్క్రమిస్తారు. పార్వతి మాత మహాదేవుని గజాసురుడు సంగతి అడిగితే, భక్తులు కోరిక నెరవేర్చడమే నా కర్తవ్యం అని బదులిస్తే, తర్వాతి సన్నివేశం గజాసురుని తపఃప్రాంతంలోకి.

తపస్సు చేస్తున్న గజాసురుడు ఎంతకీ, శివుని అనుగ్రహం కలగలేదని, నీ కరుణలేని ఈ జన్మ నాకొద్దని తనతలని తానే నరుక్కోబోతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమైతే, అప్పుడు గజాసురుడు శివుని చూసి స్త్రోత్రం చేస్తాడు.

ముక్కంటి, గౌరీమనోహరా, గంగాధరా కరుణించితివా అని శివుని కాళ్ళపై పడతాడు. అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చా, వరం కోరుకో అంటాడు. గజాసురుడు నీవు నా గర్భంలో కొలువు అయి ఉండాలి అంటాడు, అప్పుడు పరమశివుడు, ఈ కోరిక వలన విపరీత పరిణామాలు వస్తాయని వారించినా, వాటికి నేనుసిద్దం నీ నా గర్భంలో కొలువు కమ్మని వేడుకుంటాడు, గజాసురుడు.

శివుడు గజాసురుడి గర్భంలోకి శివలింగంగా వెళతాడు. ఇక మూశికుడి ఆగడాలు మొదలవుతాయి. మూషికుడు ఇంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని ఆక్రమించి, తానూ ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు.

తల్లిచేతిలో పుట్టిన వినాయకుడు (Vinayaka), తండ్రి చేతితో మరలా బ్రతకడం

ఇంద్రాది దేవతలు, మునీంద్రులు బ్రహ్మలోకం వెళ్లి, బ్రహ్మదేవులకు మూషికుని గూర్చి మొరపెట్టుకుంటారు. భ్రాహ్మగారు మూషికుడు వరసంపన్నుడు అంటాడు. ఇంకా అతను అంతం అవ్వాలంటే, అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, జితేంద్రీయుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు సర్వశక్తి సముపార్జుతుడు మరియు నా సృష్టిలో జన్మించనివాడు అయి ఉండాలి.

అని చెప్పి, ఆ జగజ్జనని శరణు వేడండి అని చెబితే, దేవతలు పార్వతి మాతను కలిసి ఈ విషయం మొరపెట్టుకుంటారు. అప్పుడు పార్వతిమాత పరమశివులు లేరు, శివుడు లేకుండా నేనేమి చేయలేనని చెబితే, దేవతలు శ్రీమహావిష్ణువుని ప్రార్ధిస్తారు.

ప్రత్యక్షమైన ఉపేంద్రుడు పార్వతిమాతలో మోసాన్ని మోసంతో జయించాలి, మేము శివుడిని ఆ గజాసురుని గర్భం నుండి బయటికి తీసుకువస్తాం అయితే, మా ప్రయత్నానికి తోడుగా నీవు కూడా శివుడు వచ్చేవరకు భగ్నం కలగకుండా శివదీక్ష చేయమని అంతర్ధానం అవుతాడు.

అభ్యంగన స్నానం చేయబోతు పార్వతిమాత దేవతలు చెప్పిన సుగుణాలు కలిగిన కుమారుని ఆలోచన చేస్తూ, తన చేతిలో ఉన్న పసుపుముద్దతో బాలుడి బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మ బాలుడుకి జగన్మాత ప్రాణం పోస్తే, బాలుడికి(Vinayakudiki) పార్వతి మాత తన శక్తి ఆయుధం ఇచ్చి, నేను శివదీక్ష చేస్తున్నాను కావున, ఎవరు మందిరప్రవేశం చేయకుండా కావలి కాయమని చెప్పి, పార్వతి మాత శివదీక్షలో ఉంటుంది.

గజాసురుడు సభలో కొలువై ఉండగా, విష్ణువు, బ్రహ్మాదిదేవతలు మారువేషంలో వచ్చి ఎద్దులతో నృత్యప్రదర్శన చేసి, అతడిని మెప్పిస్తారు. అప్పుడు గజాసురుడు మీకు కావాల్సినది కోరుకోమంటాడు.

బదులుగా బ్రహ్మ, విష్ణువులు నీ గర్భంలో ఉన్న శివుడుని ఇచ్చేయమని చెబుతారు. గజాసురుడు దేవతలతో శివుడిని మీరే మెప్పించి తీసుకువెళ్ళండి అని బదులుఇస్తాడు. బ్రహ్మవిష్ణువుల స్త్రోత్రానికి శివుడు గజాసురుని గర్భం చీల్చుకొని బయటకి వస్తే, పరమశివుని చూసి గజాసురుడు ఎప్పుడూ నిన్ను చూస్తూ నీ చెంత ఉండే వరం ఇవమని కోరతాడు, శివుడు అనుగ్రహిస్తాడు.

కైలాస ప్రవేశం చేయబోయిన పరమశివుని పార్వతి పుత్రుడు(Vinayakudu) అడ్డగిస్తాడు. శివుడు వారించి చూసిన ఎదురించే బాలుని(Vinayakuni) శిరస్సు ఖండించి, శిరస్సుని ముక్కంటితో దగ్ధం చేస్తాడు. పుత్రుడి ఆర్తనాదంతో బయటకు వచ్చిన పార్వతిమాత విచారిస్తుంది.

అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఆ బాలుడుని మేము పునర్జీవుడిని చేస్తాం, కానీ శిరస్సు ఏది పెట్టాలని అంటారు. పరమశివుడు, నంది-బృంగిలను పిలిచి, ఎవరు ఉత్తరదిక్కుకి తలపెట్టుకుని పడుకుంటే, వారి తలను తీసుకురమ్మని చెబుతారు.

శివుని ఆజ్ఞతో బయలుదేరిన వారికి ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్నఏనుగు మాత్రమే కనిపిస్తుంది. ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని పడుకోవడం అంటే దక్షిణ యమస్థానాన్ని చూడడం అని అనుకుని, ఆ ఏనుగు తలని తీసుకుని కైలసానికి వెళతారు.

పార్వతి మాత అంత అందమైన బాలుడికి (Vinayakudiki) ఈ ఏనుగు తలా అని భాదపడితే, నారదుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ బిడ్డడు కారణ జన్ముడు అతను ద్విజన్ముడు, ద్విముఖుడు కావాలి కాబట్టి అంగీకరించమని అడుగుతారు.

అలాగే నీ బిడ్డడికి సర్వదేవతా శక్తులు వస్తాయని చెబుతారు. పార్వతి మాత అంగీకారం తరవాత ఏనుగు తలని ఆ బాలుడి(Vinayakudi) కి అతికిస్తారు. ఆ బాలుడు గజముఖుడై గజాననుడుగా మారతాడు.

గజాననుడు విఘ్నాదిపతిగా మూషికుడిని ఓడించి వినాయక విజయం పొందడం (Vinayaka Vijayam).

తరువాయి శాస్త్రోక్తంగా ఆ బాలుడికి బ్రహ్మోపదేశం చేసి తపస్సుకి పంపిస్తారు, పార్వతి పరమేశ్వరులు. తపస్సు విజయవంతంగా పూర్తిచేసుకుని వచ్చిన గజాననుడికి నారద మహర్షి కుమారస్వామిని తమ్మునిగా పరిచయం చేస్తారు. తపస్సు పూర్తిచేసుకుని జితేంద్రీయుడైన పుత్రుని చూసి, గణాధిపతిని చేయదలస్తే,  గణాధిపత్యానికి కుమారస్వామి పోటిపడితే, ఇద్దరికీ ఒక పరీక్షను పార్వతి పరమేశ్వరులు పెడతారు.

ఎవరైతే, ముమ్మారు విశ్వప్రదక్షణ చేస్తారో, వారికీ గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని చెబుతారు. వెంటనే కుమారస్వామి పోటిలో విజయం సాధించడానికి తనవాహనం అయినా నెమలిపై బయలుదేరితే, గజాననుడు ఆలోచన చేసి, తల్లిదండ్రుల వలననే విశ్వం ఉంటే, విశ్వకారకులైన తల్లిదండ్రుల పాదపూజ చేసి ముమ్మారు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే, కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోట గజాననుడు ఎదురువస్తూ కనబడతాడు.

ప్రదక్షిణ పూర్తిచేసి వచ్చిన కుమారస్వామి గజాననుడి గెలుపు అంగీకరించి, గణాదిపత్యం అన్నగారికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆవిధంగా గజాననుడు పార్వతి పరమేశ్వరుల పాదపూజ ద్వారా గణముల అన్నింటికీ అధిపతి అయ్యి, విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు.

మూషికుడు గర్విష్టి అయ్యి బందించిన ఇద్దరి దేవతా జంట కోరిక మేరకు వినాయకుడు వారికి మేలు చేయదలచి, మూషికుడుని యుద్దంలో ఓడిస్తాడు, అప్పుడు మూషికుని భార్య ప్రియంవద భక్తికి మెచ్చిన పార్వతిమాత మూషికుని రక్షిస్తే, జగన్మాత మూషికుని గతజన్మ దేవతలకు వివరించి, మూషికుని వినాయకుడిని శరణువేడమంటే, మూషికుడు వినాయకుడిని శరణువేడి వినాయకుడి పాదాల వద్ద ఎలుకగా ఉంటాడు. అతని భార్య వినాయకునికి చత్రమై భర్త చెంతనే ఉంటుంది. వినాయకుడుకి జగన్మాతకి అభేదంగా చెబుతూ వినాయక విజయం విజయవంతం అవుతుంది.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

తెలుగు చిన్న పిల్లల పేర్లు మొబైల్ యాప్ .

కధ కదిలే మనసును నిలుపుతుంది.

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు.

Telugulo Vyasalu teluguvyasalu.com