అల్లుఅర్జున్ అందరూ మెచ్చే మెగాహీరో – తెలుగురీడ్స్

మనకున్న మోస్ట్ పాపులర్ హీరోలలో అల్లు అర్జున్ అంటే అందరికి ఇష్టం, అల్లు అర్జున్ అభినయం, డాన్స్ అంటే ఎవరైనా మెచ్చుతారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ మెగా హీరో మన అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ నటించిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం తెలుగురీడ్స్...చదవండి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

అయితే కొత్తగా నిర్మితమవుతున్న అల్లు అర్జున్ సినిమా గురించి మొదటిగా చూసి, తర్వాత పూర్వపు చిత్రాల గురించి క్లుప్తంగా.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి , జులాయి సినిమాలు రాగా, ఇప్పుడు వీరి కాంబినేషన్లో అల వైకుంఠపురములో రాబోతుంది. ఈ చిత్రంలో ఇంకా పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తుండగా, టబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

తెలుగు చలనచిత్రాలు. విజేత, స్వాతిముత్యం చిత్రాల్లో బాలనటుడిగా తెలుగు తెరపై కనిపించిన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి డాడి చిత్రంలో డాన్సర్ గా కనిపించారు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగుతెరపై కనిపించి, మా అవార్డుగా ఉత్తమ నూతన నటుడు గెలుచుకున్నారు. అటు తరువాత అనుమెహతాతో వన్ సైడ్ లవర్ గా ఆర్యగా అల్లరి చేసి అందర్నీ అలరించిన బన్ని, తరువాత బన్నిగా గౌరీ ముంజల్ జోడీగా సూపర్ హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ ఆర్య చిత్రానికి నంది స్పెషల్ జ్యూరి పురష్కారం గెలుచుకున్నారు.

జెనిలియా డిసౌజాతో హ్యాపీగా వెండితెరపై డాన్సులు వేసిన అల్లు అర్జున్ సన్యాసినితో ప్రేమాయణం సాగించి దేశముదురుగా గుర్తింపు పొందారు. ఈ చిత్రానికి బన్నీకి ఉత్తమనటుడుగా ఫిలిం ఫేర్ పురష్కారం లభించింది. దేశముదురు చిత్రంతో క్యూట్ నటిగా గుర్తింపు పొందిన నటి హన్సిక మోత్వాని. అతిథి పాత్రలో శంకర్ దాదా జిందాబాదు చిత్రంలో కనిపించిన బన్నీ. తరువాత అల్లు అర్జున్ షీలాతో జతకట్టి పరుగుపెట్టి ఆర్య2, వరుడు, వేదం బద్రీనాథ్ జులాయి ఇద్దరమ్మాయలతో రేసుగుర్రంతో ఎవడు సన్ అఫ్ సత్యమూర్తికి రుద్రమదేవికి సరైనోడుగా దువ్వాడ జగన్నాధంతో నాపేరు సూర్య నాఇల్లు ఇండియా దాకా వచ్చారు.

అల్లు అర్జున్ (Allu Arjun) మూవీస్ వినోదంతో బాటు సందేశాత్మ చిత్రాలుగా కూడా ఉంటాయి. గంగోత్రి మూవీ మ్యూజికల్ హిట్ అయితే, ఆర్య ప్రేమిస్తూ ప్రేమించబడడం లేదనే వారికి ఓదార్పు సందేశంగా వన్ సైడ్ లవర్ల కోసమా అన్నట్టు ఉంటుంది. అలాగే అల్లుఅర్జున్ చిత్రాలలో నటనపరంగా చిన్న చిన్న పాత్రలు కూడా ఉన్నాయి. రుద్రమదేవిలో చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్ర, వేదం చిత్రంలో ఒక పేదప్రేమికుడుగా అందరిని అలరిస్తే, ఆర్య2 చిత్రంలో అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. ఎలాగైనా డబ్బే ప్రధానమని భావించే రోజులలో విలువలు గురించి మాట్లాడే యువకుడి పాత్రలో అల్లుఅర్జున్ నటించి మెప్పించారు. సన్ అఫ్ సత్యమూర్తి చిత్రంలో.

అల్లు అర్జున్ గంగోత్రి సినిమా మ్యూజికల్ హిట్ అయితే ఆర్య చిత్రంతో యువతలో క్రేజ్ పెరిగింది. ఒక ప్రేమకధని విబిన్న రీతిలో చెప్పిన దర్శకుడు సుకుమార్. సున్నితమైన మనసు కలిగిన అమ్మాయితో ప్రేమించకపోతే చస్తాను అన్నా యువకుడిని సహజంగా ఆమె ఒప్పుకుంటుంది. అటువంటి బెదిరింపు ప్రేమ నిజమైనది కాదు అనే అంశంగా ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధగా చూపుతుంది. పాటలు బన్ని నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

Allu Arjun Telugu Movies అల్లు అర్జున్ హ్యాపీ, దేశముదురు, పరుగు చిత్రాలు

సమాజంలో ప్రజాసేవ చేసేవారు ఉంటే వారిని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అటువంటి తీరులోనే బన్ని చిత్రం ఉంటుంది. రంగరాజు భూపతిరాజు పోలవరం ప్రాజెక్ట్ కోసం తన ఆస్తిని త్యాగం చేస్తాడు, అయితే అతని వెనుకనే ఉంటూ సోమరాజు మైసమ్మ సహాయంతో రంగరాజు భూపతిరాజుని హతమార్చి, ఆస్తిని హస్తగతం చేసుకుంటాడు. ఆ రంగరాజు భూపతిరాజు కొడుకే బన్ని. తన తండ్రి ఆశయం నెరవేర్చడానికి ప్రయత్నించి సఫలికృతుడౌతాడు.

చదువుకుని డాక్టర్ కావాలనే ఆశయంతో ఉండే మధుమతికి బన్ని పరిచయం ఆమె జీవితాన్నే మలుపు తిప్పుతుంది. తండ్రి చూసిన పెళ్లి చేస్తాను అంటే వద్దు చదువుకుంటాను అని చదువుని కొనసాగించే మధుమతి బన్నిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. లక్ష్యం మీద ధ్యాస ఉండే ఆమెకు, అమెపైనే ఆరాధన పెంచుకునే బన్నికి మధ్య జరిగిన కధే, హ్యాపీ చిత్రం ప్రేమకధా చిత్రం.

ప్రేమికుడుగా, మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ దేశముదురు చిత్రంతో ఏనార్జేటిక్ హీరోగా పాపులర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీతో డాన్సులు, ఫైట్లు, యాక్షన్ ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తుంది. కుటుంబ గొడవల్లో చిక్కుకున్న ఒక యువతి సన్యాసినిలతో కలిసి ఆశ్రమంలో ఉంటే, ఆ సన్యాసినిని చూసిన బన్నీ ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె వెంటపడడం, ఆమె వెనుక ఉన్న సమస్యకు కారణమైనవారిని తుదముట్టించి, ఆమెను పెళ్ళాడతాడు.

మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా సీక్వెల్ చిత్రాలల్లో రెండవది అయిన శంకర్ దాదా జిందాబాదులో అతిథి పాత్రలో అల్లుఅర్జున్ కనిపిస్తాడు. ఆ తరువాత పరుగు చిత్రంలో నటించాడు.  ఎప్పుడు పరుగులు పెడుతూ ఉండే యువకుడు ఒక ప్రేమజంటకు పెళ్లి చేస్తాడు, సదరు పెళ్ళికూతురు తరపువారు అతడిని తీసుకువెళ్ళి బందిస్తారు. అక్కడ ఒక అమ్మాయని ప్రేమిస్తాడు అతడు. ఆ కుర్రాడి వలన ఆ కుటుంబలో ఏర్పడిన పరిస్థితులకు, ఆ కుర్రాడు చెల్లించిన మూల్యం ఏమిటి ? అనేది చిత్ర కధాంశం  చివరికి ప్రేమ గెలుస్తుంది. ముందు  వెనుకలు చూడకుండా ఆకర్షితులయ్యే యువతని దృష్టిలో ఉంచుకుని తీసినట్టు ఈ చిత్రకధ వలన తెలుస్తుంది.

ఆర్య డైరెక్టర్ సుకుమార్ ఆర్యకి కొనసాగింపు చిత్రంగా ఆర్య2 చిత్రీకరించారు, అయితే కధ కొత్తది, పాత కధకి సంభందం లేకుండా ఉంటుంది. ఒక యువకుడిలో ఒకేసారి ప్రేమ మరియు స్నేహం కోసం పడే తపన ఈ చిత్రం కధాంశం. తాను ప్రేమించిన అమ్మాయినే స్నేహితుడు ప్రేమిస్తే, అతని కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి అవసరం అయితే ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ద పడే యువకుడి పాత్రలో అల్లుఅర్జున్ నటన హైలైట్ గా ఉంటుంది.

అల్లుఅర్జున్ వరుడు, వేదం, భాద్రినాథ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన తెలుగు మూవీస్ – చలనచిత్రాలు

లేచిపోయి గుళ్ళోనో రిజిస్ట్రార్ ఆఫీసులోనో పెళ్లిచేసుకునే కాలంలో పాత పద్దతిలో పెళ్లిని అయిదు రోజుల పండుగలా చేయమని తల్లిదండ్రులను కోరే కొడుకుగా అల్లు అర్జున్ వరుడు చిత్రంలో కనబడతారు. అంతేకాకుండా తాళి కట్టే సమయం వరకు పెళ్లి కూతురుని చూడకుండా ఆమె ఎలా ఉన్నా చేసుకోవడానికి సిద్దపడతాడు. పెళ్లి పండుగలాగా చేసే పద్దతిలో చిత్రం సాగుతుంది.

గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన హీరో అయినా వేదం చిత్రంలో ఒక పరిమిత క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటించడమే కాకుండా, ఆ చిత్రం ప్రమోషన్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఒక బీద యువకుడు, ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనే భావించే పాత్రలో అల్లుఅర్జున్ నటించాడు.

బద్రినాథ్ గుడిని చూపిస్తూ, బద్రీనాథ్ చుట్టూ తిరిగే ప్రేమకధ బద్రీనాథ్ చిత్రం. ఇందులో అల్లు అర్జున్ బద్రీనాథ్ గురించి, వివరించే గైడ్ పాత్రలో కనిపించారు. పెళ్లి చేసుకోకుండా గుడిలో గురువుగారి దగ్గర జీవితాంతం ఉంటానని ప్రమాణం చేసిన యువకుడుగా అల్లుఅర్జున్ నటించారు.

కాలిగా తిరిగే యువకుడిని ఇంట్లో జులాయి అని అతని తండ్రి తిడుతూ ఉంటుంటే, ఉండబట్టలేక కొంత డబ్బు ఇవ్వండి సాయంత్రానికి నాలుగు రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాను అంటాడు. డబ్బు తీసుకుని వెళ్ళిన యువకుడి జీవితమే మలుపు తిరుగుతుంది, ఒక అతిపెద్ద నేరంలో సాక్షిగా మారి, పోలీసుల పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకోవడమే ధ్యేయంగా ఉండే యువకుడు పాత్రలో జులాయి చిత్రంలో అల్లుఅర్జున్ నటించారు.

ఒక అమ్మాయితో ప్రేమిస్తున్నట్టు ఉంటూ, తన అసలు ప్రేమ కధని తెలియజేస్తూ, ఆ ప్రేమ కధలో శత్రువులైన వారిని ఇప్పుడున్న అమ్మాయి ద్వారా పట్టుకుని శిక్షించడమే ధ్యేయంగా సాగే పాత్రలో అల్లుఅర్జున్ ఇద్దరమ్మాయలతో ప్రేమ కధ చిత్రంలో నటించారు.

పోలీసు ఆఫీసరుకి తమ్ముడుగా ఉంటూ, అల్లరి పనులు చేస్తూ, అన్నపై కోపాన్నే ప్రదర్శిస్తూ ఉండే తమ్ముడు పాత్రలో కనిపిస్తాడు. అయితే తన అన్నపై చేయబోయిన హత్యాప్రయత్నం తెలియగానే అన్న కోసం పోరాటం మొదలు పెడతాడు. రేసుగుర్రం చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్టైనరుగా ఉంటుంది.

ఎవడు చిత్రంలో కనిపించేది రామ్ చరణ్ అయినా ఆ కధకి మూలమైన పాత్ర అంతా అల్లు అర్జున్ నటించిన పాత్రదే. చావునుండి బ్రతికిన ఒక యువకుడు తన రూపం కోల్పోయి ఇంకో రూపాన్ని పొంది, తన చావుకోసం ప్రయత్నించిన వారిపై పగ తీర్చుకుంటాడు. చావుదాక వెళ్ళిన యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించారు.

విలువలతో కూడిన ఆస్తులు అంతస్తుని గౌరవాన్ని పెంచుతాయి – సన్ అఫ్ సత్యమూర్తి

సన్ అఫ్ సత్యమూర్తి చిత్రం టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా అంతా తండ్రి సత్యమూర్తి గారి ఆలోచనతో జీవించే యువకుడి కధ. తన తండ్రికి చిన్న మాట కూడా రావడం ఇష్టంలేని సత్యమూర్తిగారి అబ్బాయిగా దానికోసం ఎంతటి రిస్క్ అయిన చేసే యువకుడిగా అల్లుఅర్జున్ నటించారు. విలువలే ఆస్తులు, విలువలేని ఆస్తి వ్యర్ధం అంటూ చిత్రం సాగుతుంది.

గమ్మునుండవోయ్ అనే మానరిజం బాగా అక్కట్టుకుంటుంది ఈ రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా ఒక పాత్రలో అల్లుఅర్జున్ నటన ఆకట్టుకుంటుంది.

సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ నటన చాలా ఎనర్జీటిక్ గా ఉంటుంది. విలన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో ముఖ్యమంత్రి కొడుకుగా అక్రమాలు చేస్తుంటే, అతనిని అంతకన్నా డామినేట్ చేస్తూ ఉండే పాత్రలో అల్లుఅర్జున్ నటించారు. సరైనోడు టైటిల్ కి తగ్గ చిత్రంలో టైటిల్ కి తగ్గ పాత్రలో నటించిన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

ఒక బ్రాహ్మణ బాలుడుగా ఉన్నప్పుడు సమాజంలో ఎదురైనా సంఘటనలతో, సమాజంలో జరిగే చెడుని తొలగించాలి అని నిర్ణయించుకున్న బ్రాహ్మణ యువకుడు కధ. రహస్యంగా చెడు కార్యక్రమాలు చేసే వారిని శిక్షిస్తూ, వృత్తి రిత్యా పౌరోహిత్యం చేస్తూ ఉండే పాత్రలో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటించారు.

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మిలిటరీ అధికారి కధ. అదుపులేని కోపం కలిగిన యువకుడు సైన్యంలో చేరి, కోపం వలననే సైన్యం నుండి తొలగించబడడం. మరలా అతను సైన్యంలో చేరడానికి చేసే ప్రయత్నాలే ఈ చిత్ర కధాంశం.

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు సమాచారం. ఇది షూటింగ్లో ఉన్న ప్రస్తుత చిత్రంగా ఉంది, 2019లో విడుదల కానుంది.

ఇవి ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన తెలుగు మూవీస్ – చలనచిత్రాలు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ యాప్ డౌన్ లోడ్ చేయండి