సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

స్టార్ ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో టి.ఏ. రామన్ దర్శకత్వంలో హరిశ్చంద్ర తెలుగు చిత్రం 1930 దశకంలోనే వచ్చింది. ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి, పి కన్నాంబ, బందర్ నాయుడు, పులిపాటి వెంకటేశ్వర్లు, మాస్టర్ భీమారావు, ఆకుల నరసింహారావు, జె. రామకృష్ణారావు తదితరులు నటించారు.

ఇంకా రాజ్యం పిక్చర్స్ సమర్పణలో హరిశ్చంద్ర పేరుతోనే మరలా ఈ చిత్రం తెరకెక్కించగా, ఇందులో ఎస్వీ. రంగారావు, లక్ష్మిరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూరిబాబు, రఘురామయ్య, ఏ.వి. సుబ్బారావు, గౌరిపతిశాస్త్రి తదితరులు నటించారు.

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ కధ

తర్వాత సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది.

సత్యహరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాధనుండి తెలుగు తెరపై కె.వి. రెడ్డిగారు నందమూరి తారక రామారావుగారిని సత్యహరిశ్చంద్రగా చూపించారు. ప్రముఖ గాయని అయిన ఎస్ వరలక్ష్మిగారిని సత్యహరిశ్చంద్ర భార్యగా చంద్రమతిగా చూపించారు. తెలుగుతెర తొలి కధానాయకుడు అయిన నాగయ్యగారిని వశిష్ఠ మహర్షి పాత్రలో చూపించారు. ప్రముఖ నటుడు ముక్కామలగారిని మహర్షి విశ్వామిత్రుడుగా చూపిస్తూ, విశ్వామిత్ర ప్రధాన శిష్యుడు నక్షత్రకుడు పాత్రలో రమణారెడ్డి గారిని చూపించారు. కాశి పట్టణవాసిగా కాలకౌశికుడు పాత్రలో రేలంగి నరసింహారావుగారిని చూపిస్తూ, కాల కౌశికుడుకి గయ్యాళి భార్యగా గిరిజని చూపించారు. మిక్కిలినేని గారిని ఇంద్రుడుగా చూపిస్తూ పార్వతిపరమేశ్వరులుగా సబితాదేవి-ప్రభాకర్ రెడ్డిగార్లని చూపించారు. ఇంకా వివిధ పాత్రల్లో ఎల్ విజయలక్ష్మి, రాజబాబు, రాజనాల, రాజశ్రీ, వాణిశ్రీ, మీనాకుమారి, మోహన, చదలవాడ, బాలకృష్ణ మొదలైనవారు SatyaHarisChandra Movie నటించారు. ‘NTR Satya Harishchandra Full Story Telugu Movie’

ఇంద్రసభలో వశిష్ఠుడు-విశ్వామిత్రుల సంవాదం – సత్య హరిశ్చంద్ర గ్రేట్ మూవీ

ఆడినమాట తప్పని హరిశ్చంద్ర మహారాజు సూర్య వంశస్తుడుగా పరమశివ భక్తుడు. రాజసూయ యాగము చేసి యజ్నఫలాన్ని పొందిన హరిశ్చంద్ర మహారాజు ఆ యజ్నఫల మహిమ రాజ్యంలో ప్రజలందరికి కలగాలని రాజసభలో యజ్న ఫల దర్శన భాగ్యం అయోధ్య ప్రజలకు కల్పిస్తారు. పిమ్మట యజ్న ఫలం గొప్పతనం రాజర్షి దాత అయిన హరిశ్చంద్ర మహారాజు గురించి రాజవంశగురువు వశిష్ఠ మహర్షి సభకు తెలియజేస్తారు. అదే సభలో ఒక యోగి వచ్చి మహారాజు దగ్గర మాట ఆ యజ్నఫలాన్ని అర్ధిస్తారు. అంతటి మహిమ కలిగిన యజ్నఫలాన్ని ఆ యోగికి దానం చేసేస్తారు, హరిశ్చంద్ర మహారాజు. (అయితే ఆ నిష్కామయోగిగా వచ్చింది పరమశివుడే, యజ్నఫలాన్ని పట్టుకుని ఆ యోగి, హరిశ్చంద్ర మహారాజు పూజామందిరంలోకి వెళ్లి అంతర్ధానం అవుతారు. అక్కడ వాక్కులుగా  హరిశ్చంద్రుడు యొక్క సత్యనిష్ఠని పరీక్ష చేయదలచానని పరమశివుడు పార్వతిమాతతో పలకడం వినబడుతుంది.)

ఇంద్ర సభలో మహర్షులతో సమావేశమై ఉన్న దేవేంద్రుడు, సభలో మహర్షులతో అందరిని పేద, ధనిక బేదాలు లేకుండా అందరిని తరింపజేసే వ్రతం ఏదైనా సెలవియ్యండి అని అనగా…. విశ్వామిత్ర మహర్షి అందరికి తగిన ఏకైక వ్రతం ఏది లేదు అర్హతను బట్టి వారి వారి తాహతు బట్టి మాత్రమే వ్రతాలు వుంటాయి అని చెబితే, మహర్షి వశిష్టులు మాత్రం అందరూ ఆచరించి తరించగలిగే వ్రతం సత్యవ్రతం ఒక్కటే అని బదులు చెబుతారు. సత్యవ్రతం ఆచరింప అసాద్యం అని అందులోను మానవమాత్రులు ఆచరించడం అనేది కుదరదు. వారి జీవన విధానం రిత్యా మానవులు సత్యవ్రతం అసాద్యం అని మహర్షి విశ్వామిత్రులువారు చెబుతూ వశిష్ఠ మహర్షి ప్రతిపాదనని తోసిపుచ్చుతారు. వశిష్ఠ – విశ్వామిత్ర వాదనల పిదప దేవేంద్రులువారు అలాంటి సత్యవ్రతం చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని వశిష్ఠమహర్షిని అడుగుతారు.

అందుకు వశిష్ఠ మహర్షి సూర్య వంశస్తుడు త్రిశంకువు కుమారుడు అయిన సత్యహరిశ్చంద్ర మహారాజు గురించి చెబుతారు. ఆ మాటకు కూడా విశ్వామిత్ర మహర్షి ఇంకో వాదనను తీసుకువస్తారు. ఈ వశిష్ఠ మహర్షి హరిశ్చంద్ర వంశానికి గురువు కావున వశిష్టులు హరిశ్చంద్ర మహారాజు గురించి గొప్పగా చెబుతున్నారు అని అంటారు. ఇక ఇంద్ర సభలో దేవతలు, మహర్షుల సమక్షంలో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజు సత్యనిష్టతని పరిక్షిస్తానని అందులో హరిశ్చంద్ర మహారాజు కచ్చితంగా అసత్యమాడేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. అందుకు వశిష్ఠ మహర్షి ఒకవేళ సత్యహరిశ్చంద్రుడు అబద్దమాడితే నేను ఆచార బ్రష్టుడినై బ్రతుకుతాను అని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే విశ్వామిత్ర మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుతో అసత్యవాక్కు పలికించలేకపోతే తన తపశక్తిలో సగభాగం సత్యహరిశ్చంద్ర మహారాజుకి ధారపోస్తానని, సహస్ర వర్షములు సకల చక్రవర్తిగా పరిపాలన చేస్తాడని, అంతేకాకుండా చిరకాలం 14 మన్వంతరముల వరకు దేవేంద్ర సింహాసనంలో సగభాగం కలిగి ఉండేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

విశ్వామిత్ర మహర్షి పరీక్షలో భాగంగా రాజ్యదానం చేసేసిన సత్య హరిశ్చంద్ర మహారాజు

స్వర్గం నుండి బూలోకం వచ్చిన విశ్వామిత్ర మహర్షి తన ప్రధాన శిష్యుడు నక్షత్రకుడుతో కలిసి అయోధ్యకు హరిశ్చంద్ర రాజసభకు వస్తారు. ఒక ఎత్తైన మదపుటేనుగుపై ఒక పహిల్వాన్ ఎక్కి అతను విసిరిన రత్నం ఎంత పైకి వెళితే అంత ధనరాశి కావాలి అంటారు. సాదారణంగా ఒకమహారాజు అంతధనము ఇవ్వడమంటే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడమే అవుతుంది. హరిశ్చంద్రుడుని అంత ధనము అడిగితే, రాజు సంకోచించి మాట వెనుకకు తీసుకుంటాడెమో అని ఆలోచన చేసిన మహర్షి అంత మొత్తం ధనమును హరిశ్చంద్ర మహారాజుని కోరతారు. అడిగిన వెంటనే అంతధనము మీదే పట్టుకుని వెళ్ళండి అని అన్న హరిశ్చంద్ర మహారాజు మాటకు విశ్వామిత్ర మహర్షి ఆ ధనమును అవసరమైనప్పుడు తీసుకుంటాను నీవద్దనే ఉండని అని చెప్పి, రాజ సభనుండి నిష్క్రమిస్తారు.

విశ్వామిత్రవెనువెంటనే తన మాయ సృష్టిద్వారా క్రూరమృగాలను సృష్టించి అడవులలో స్వేచ్చగా వదిలేస్తారు, ఆ మృగాలు అడవి నుండి ఊళ్లపైకి వచ్చి పడతాయి. ప్రజలు మొర ఆలకించిన హరిశ్చంద్ర మహారాజు క్రూర మృగాల వేటకు అడవికి వెళ్లి, వాటిని వేటడతారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఇద్దరు స్త్రీలను సృష్టించి అడవిలో ఉన్న హరిశ్చంద్ర మహారాజు వద్దకి పంపిస్తాడు. ఆ స్త్రీలు హరిశ్చంద్ర మహారాజు ముందు ఆడి పాడి, మహారాజుని పెండ్లి చేసుకోవలసినదిగా కోరతారు. వారిని వారించిన వినని స్త్రీలను మహారాజు తన సైన్యం ద్వారా అడ్డుకుంటారు. వారు మరలా విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వచ్చి మొరపెట్టుకుంటారు.

మహర్షి ఆగ్రహంలో ఉండగా అక్కడికి హరిశ్చంద్ర మహారాజు వస్తారు. వచ్చి జరిగిన విషయం వివరిస్తారు. అయితే వరించిన తన కుమార్తెలను పెండ్లి చేసుకోవలసిందే అని చెబుతారు. (వివాహమహోత్సవంలో అందరిముందు అగ్ని సాక్షిగా చేసే మంత్రపూర్వక ప్రతిజ్ఞ ఉంటుంది. ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు కోరి వచ్చారు కదా అని ఆ స్త్రీలను వరిస్తే అసత్య దోషమే వస్తుంది.). అయితే ఇప్పుడు ఇప్పటికే అగ్నిసాక్షిగా సంతానం కోసమే వివాహమాడిన ధర్మపత్ని ఉండగా, ఈ స్త్రీలను వివాహమాడడం అధర్మమని హరిశ్చంద్ర మహారాజు చెబితే, అందుకు బదులుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, తపోధనుల మాట వినడమే రాజధర్మం అని చెబుతారు. రాజర్షి అయిన హరిశ్చంద్రుడు అటువంటి ధర్మం కలిగిన ఈ రాచరికం నాకు వద్దు అని రాజ్యదాననికే సిద్ధపడతారు. నిండు రాజసభలో సకల రాజ్యాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రకు ధారపోసి కట్టుబట్టలతో తన భార్య, కుమారుడుతో కలిసి రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరతారు, సత్య హరిశ్చంద్రుడు. రాజ్యాన్ని వీడుతున్న రాజుని చూసి ప్రజలు విలపిస్తూ హరిశ్చంద్రుడుకి వీడ్కోలు పలుకుతారు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

హరిశ్చంద్రుడు రాజభోగాలను త్యజించి, తన భార్యాపిల్లలతో అడవులలోకి

మొదటగా విశ్వామిత్ర మహర్షికి దానం చేసిన సొమ్ము హరిశ్చంద్ర మహారాజు వద్ద ఉంటుంది, అయితే సకల రాజ్యం దానంగా ఇచ్చిన మహారాజు విశ్వామిత్రుడికి ముందుగా ఇచ్చిన దానం ఋణంగానే ఉంటుంది. రాజ్యం నుండి బయటకు వచ్చిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్ర మహర్షి తనకు దానంగా ఇచ్చిన సొమ్ము నీవద్దనే ఉంది, కావునా అది నీకు రుణమే ఆ ఋణం తీర్చుకో అని చెబుతారు. అందుకు హరిశ్చంద్రుడు నెలరోజులు గడువు కోరతారు. అయితే ఆ రుణనిమిత్తం అయోధ్య రాజ్యంలో కానీ, అయోధ్య సామంత రాజ్యాలలో కానీ సంపాదన చేయకూడదని విశ్వామిత్ర మహర్షి అజ్నపిస్తారు హరిశ్చంద్రుడిని.

అడవుల బారిన పడిన హరిశ్చంద్రుడిని అతని భార్య పిల్లలు అనుసరిస్తారు, అలాగే రుణ వసూలు కోసం నక్షత్రకుడు హరిశ్చంద్రుడుని అనుసరిస్తారు. అయితే అడవులలో కూడా నక్షత్రకుడు ప్రవర్తనకు తోడూ, వశిష్టుడుగా మారువేషంలో ఒక రాక్షసుడు వచ్చి, విశ్వామిత్ర మహర్షి మోసం నాకు తెలుసు నేను అతన్ని అంతం చేస్తాని, నీవు నీ రాజ్యాన్ని దక్కించుకో అని చెబుతాడు. దానికి సత్యహరిశ్చంద్రుడు దానం చేసిన రాజ్యాన్ని నేను పొందగోరను, అని బదులు చెబుతాడు. తరువాత దావాగ్ని దహించుకుంటూ అడవినలువైపులా నుండి హరిశ్చంద్రుడివైపు వస్తూ ఉంటుంది.

అలా వస్తున్న అగ్నిదేవుడు నక్షత్రకుడుతో మీ నిజమైన పేర్లు మీవి కావు అని చెప్పినా మీకు ప్రమాదం ఉండదని చెపుతాడు. ఆ విషయం హరిశ్చంద్రుడుకి చెప్పి, తానూ బ్రహ్మర్షి విశ్వామిత్రుని శిష్యుడుని కాదు నాపేరు నక్షత్రకుడు కాదు అని చెప్పి, అగ్నిలోకి వెళ్లి, క్షేమంగా వచ్చేస్తాడు. అలా వెళ్లి వచ్చి హరిశ్చంద్రుడుని, అతని భార్య చంద్రమతిదేవిని కూడా ఆ పని చేయమంటాడు. పేర్లు తమవి కావు అని అనడమంటే అసత్యమే అవుతుంది. ఆ పని నేనుచేయననే చెబుతారు(కేవలమ పేరు తనది కాదు తాత్కాలికంగా నేను నేను కాదు అని చెప్పినా అసత్యదోషమే అవుతుంది అని భావించిన హరిశ్చంద్రుడు, వారి భార్య పిల్లలు). తరువాత చంద్రమతి దేవి ప్రార్ధనతో అగ్నిదేవుడు శాంతించి వెనుతిరుగుతాడు.

కాశీ పట్టణంలో భార్యా విక్రయం

ఇక అక్కడి నుండి బయలుదేరిన వారు కాశి పట్టణం చేరుకుంటారు. కాశి పట్టణంలో శ్రీమంతుల కొరకు దాసిలను విక్రయించే స్థలం ఉంటుంది. ఋణం చెల్లించవలసిన గడువు నేటితో తీరిపోతుంది అని అన్న నక్షత్రకుడు మాటలతో, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి దేవి, తనను విక్రయించి ఆ ఋషి ఋణం గడువులోపు తీర్చేయండి అని సలహా హరిశ్చంద్రుడుకి సలహా ఇస్తుంది. అందుకు హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మలేను, నేనే దాసిగా అమ్ముడయ్యి, ఆ ఋణం తీర్చేస్తాను అని చెబుతాడు. అయితే అమ్మకంలో రుణానికి సరిపడా సొమ్ములు రాకపోతే, నీవు ఋణగ్రస్తుడుగానే మిగిలిపోతావు అని నక్షత్రకుడి మాటలకూ, హరిశ్చంద్రుడు అచేతనావస్థలో ఉంటారు. అప్పుడు చంద్రమతి దేవి తననే విక్రయించి, ఆ ఋణం తీర్చేయమని హరిశ్చంద్ర మహారాజుకి చెబుతుంది. గత్యంతరం లేని హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మడానకి కాశి పట్టణంలో అయిష్టంగా సిద్దపడతాడు.

కాల కౌశికుడు కాశిపట్టణంలో గయ్యాళి భార్య భాదలకు లోనవుతూ తద్దినాలకు వెళుతూ ఉంటాడు. అలాంటి కాలకౌశికుడుకి తోడుగా జడబట్టు ఉంటూ ఉంటాడు. తద్దిన భోజనానికి వెళ్ళిన కాల కౌశికుడు వేషంలో పరమశివుడే వచ్చి కాశిపట్టణ దాసీ విక్రయ స్థలానికి వచ్చి చంద్రమతి దేవిని కాలకౌశికుడుకి దాసిగా నక్షత్రకుడు అడిగిన రుణసొమ్మును చెల్లించి, చంద్రమతి దేవిని కాల కౌశికుడు ఇంటికి చేరుస్తాడు. దాసిగా అమ్ముడైన చంద్రమతిదేవితోనే వారి కుమారుడు లోహితాస్వుడు వెళతాడు. విశ్వామిత్ర మహర్షి ఋణం తీర్చుకున్న సత్యహరిశ్చంద్రుడుకి ఇంకో ఆపద్ధర్మ ఋణం వచ్చి పడుతుంది. ఇన్నాళ్ళు హరిశ్చంద్రుడు వెనుక తిరిగిన నక్షత్రకుడుకి బత్యం బకాయి పడతాడు, హరిశ్చంద్రుడు.

నక్షత్రకుడి జీతం చెల్లించడానికి తనని అమ్మకానికి పెట్టమని హరిశ్చంద్రుడు నక్షత్రకుడుని కోరతాడు, అప్పుడు నక్షత్రకుడు కాశిపట్టణంలో సత్యహరిశ్చంద్రుడుని ఒక కాటికాపరి వీరబాహుకి అమ్మి వచ్చిన సొమ్ముతో వెనుతిరుగుతాడు. బానిసగా అమ్ముడుపోయిన హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తూ ఉంటాడు. కాటికాపరి వీరబాహు చెప్పినట్టు, శవదహనానికి తగిన ధాన్యము, ధనము తీసుకుని ఆ పని చేస్తూ ఉంటారు, సత్యహరిశ్చంద్ర రాజర్షి.

కాటిదాకా వెళ్లిన విశ్వామిత్ర పరీక్ష

బానిసగా కాలకౌశికుడు ఇంట్లో పనిచేస్తున్న చంద్రమతి, లోహితాస్వులను, గయ్యాళి కాలకౌశికుడు భార్య భాదలు పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా లోహితాస్వుడుని దర్బలకోసం కాలకౌశికుడు శిష్యులతో అడవికి పంపుతుంది, కాలకౌశికుడు భార్య, అక్కడ అడవిలో మాయసర్పం కాటుతో లోహితాస్వుడు మరణిస్తాడు. విషయం తెలిసిన చంద్రమతి దేవి లోహితాస్వుడు దగ్గరికి వెళ్లి విలపించి, కుమారుడి శవాన్ని పట్టుకుని కాటికి వెళుతుంది. కాని అక్కడ కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు, శవదహన సొమ్ము చెల్లించనదే శవాన్ని కాల్చడానికి వీలులేదని అడ్డుకుంటాడు. భర్తని గుర్తుపట్టిన చంద్రమతిదేవి భర్త అసత్యదోషమేర్పడకుండా ఉండడానికి శవాదహన రుసుం తన యజమాని దగ్గర నుండి తీసుకువస్తానని మరలా కాలకౌశికుడు ఇంటికి బయలుదేరుతుంది.

అయితే విశ్వామిత్ర సృష్టిలో భాగంగా మాయ దొంగ, కాశి రాజు యొక్క కుమారుడుని చంద్రమతి వేషంలో ఎత్తుకొచ్చి అడవిలో వదిలి వెళ్ళిపోతారు. కాలకౌశికుడు ఇంటికి వెళ్తున్న చంద్రమతి దేవికి దారిలో పసిబిడ్డ ఏడుపు వినిపించి, ఆ పసిబిడ్డదగ్గరకి వెళుతుంది, అప్పటికే ఆ బిడ్డడు మరణించి ఉంటాడు. మాయదొంగని వెంబడించిన కాశి రాజు సైనికులు చంద్రమతిదేవిని బంధించి, కాశి రాజుదగ్గర నిలబెడతారు. బిడ్డ ఆమెవలననే మరణించింది అని భావించిన కాశి రాజు చంద్రమతిదేవికి మరణదండన విధిస్తాడు. ఆ మరణదండనను అమలు చేయవలసినదిగా వీరబాహుకి అప్పజేపితే, ఆపనిని వీరబాహు హరిశ్చంద్రుడుకి అప్పజేప్పుతాడు.

కాటికాపరి వృత్తిరిత్యా హరిశ్చంద్రుడు తనభార్యని చంద్రమతిని వీరబాహు ఆదేశానుసారం హతం చేయడానికి సిద్దపడతాడు. అయితే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి వారించిన వినకుండా భార్య శిరస్సుని హరిశ్చంద్రుడు ఖండించబోతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా చంద్రమతి శిరస్సుని ఖండించాబోయిన ఖడ్గం పూలమాలగా చంద్రమతిదేవి మెడలో ప్రత్యక్ష్యం అవుతుంది. పరమశివుడు, ప్రత్యక్షమై సత్యహరిశ్చంద్రుడు కుమారుడిని, కాశిరాజు కుమారుడుని బ్రతికిస్తాడు. బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు తన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటారు. సత్యహరిశ్చంద్ర మహారాజు పరమశివ ప్రార్ధనతో సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ ముగుస్తుంది.

తెలుగు రీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు