నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం

నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం

నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం గురించి తెలుపుతూ తెలుగులో వ్యాసం. వ్యక్తికి విజ్ఞానం ముఖ్యం అయితే, జీవితంలో లక్ష్యానికి కావలసిన జ్ఞానం పుస్తకాలు, పాఠాలలో లభిస్తుంది.

అక్షరజ్ఞానం ఉన్న మనిషి జీవితంలో పుస్తకాలకు ప్రత్యెక స్థానం ఉంటుంది. ఇంకా కొందరికి మనసులో నాటుకుపోయిన పాఠాలు కూడా ఉంటాయి. చదువుకున్న పాఠాలు మనకు జ్ఞానం అందిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు మనఃశాంతిని ప్రసాదిస్తాయి. ప్రతిఒక్కరికీ తనకు ఇష్టమైన పుస్తకం ఉంటుంది. గుర్తు ఉండే పాఠం ఉంటుంది. ఆ పాఠం మన జీవితాన్ని మారుస్తుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది.

నా ప్రియమైన గ్రంథం

నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం

నా ప్రియమైన గ్రంథం భగవద్గీత. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు, అర్జునుడికి బోధించిన గ్రంధం కాబట్టి, అందులో కచ్చితమైన జీవిత పాఠం ఉంటుంది. ఇంకా అందులో కల్పనకు అవకాశం ఉండదు. చాలా గ్రంధాలు తిరిగి రాయబడి, కల్పనకు గురికావచ్చు కానీ భగవద్గీత అలా కాదు. దానిలో కల్పించి చెప్పడానికి ఏమి ఉండదు. మనిషి జీవితానికి అవసరమైన జ్ఞానం అందులో లభిస్తుంది. ఆద్యాత్మిక జ్ఞానం, యోగాజ్ఞానం, తాత్విక జ్ఞానం, ఆత్మజ్ఞానం భగవంతుడి చేత భక్తుడికి బోధించాబడ్డాయి…. శోధిస్తే ఎంతో మనోవిజ్ఞానానికి భగవద్గీత మంచి గ్రంధం. ఈ గ్రంథం నాకు జీవితం ఎలా నడిపించాలో, సమస్యలలో ధైర్యంగా ఉండాలో నేర్పిస్తుంది. ఇందులోని కథలు, ఉపదేశాలు మనుషులలో మంచితనాన్ని, సహనాన్ని, ధైర్యాన్ని పెంచుతాయి.

ఇంతకీ ఈ భగవద్గీతలో చెప్పే అసలు విషయం ఏమిటి? అంటే మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ దాని ఫలితం మీద అధికారం లేదు. ఫలితం ఆసక్తి కన్నా, కర్మను శ్రద్ధతో చేయడం ప్రధానం అని చెప్పబడింది. మనిషికి ఎక్కువ సమస్యలకు, దుఃఖానికి కారణం, కర్మఫలం మీద వ్యామోహమే. కాబట్టి భగవద్గీత చదివితే, మొహం పోయి, జ్ఞానం వస్తుంది…. జీవితం లక్ష్యంపై స్పష్టమైన అగవగాహన వస్తుంది. మనసు ప్రశాంతతతో ఉండగలదు.  కావున నాకు మాత్రం భగవద్గీత చాలా ఇష్టమైన గ్రంధం.

నా ఇష్టమైన పాఠం

నా ఇష్టమైన పాఠం శ్రీరామాయణం ఎందుకంటే? రామాయణంలో బంధాలు, ధర్మం గురించి చాలా భావోద్వేగంగా చెప్పబడుతుంది. ధర్మం కోసం జీవించే అన్నదమ్ములు, జీవితంలో ఎటువంటి స్థాయిలో ఉంటారో? అధర్మపరులు జీవితంలో ఏ విధంగా పతనం అవుతారో? ఈ పాఠంలో ఉంటుంది. గొప్పగా ఉండడమంటే, అవకాశవాదంతో ఉండడం కాదు, ఎన్ని అవకాశాలు ఉన్నా, ధర్మం తప్పకుండా జీవించడమే గొప్పగా ఉండడం అని రామాయణం తీర్పు చెబుతుంది. అందుకే నాకు శ్రీరామాయణం ఇష్టమైన మరియు నాపై ప్రభావం చూపించిన తెలుగుపాఠం.

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts