అనుమానం పెనుభూతం – మనసును బాధతో మెలిపెట్టే భావన పెద్దలు చెప్పిన పెద్ద మాట, మనిషి జీవితంలో భావోద్వేగాలు చాలా ఉంటాయి, అవి చాలా ముఖ్యమైనవి. కొన్ని మనకు బలం అయితే, కొన్ని మనకు బలహీనత. అలాంటి బలహీనత భావనలలో “అనుమానం” ఒకటి. అందుకే పెద్దలు “అనుమానం పెనుభూతం” అని అంటారు. అంటే, చిన్నగా మొదలైన అనుమానం తర్వాత పెద్ద సమస్యగా మారి జీవితాలనే ప్రభావితం చేస్తుంది.
అనుమానం ఒక చిన్న సందేహమే అనుకుంటే, పొరపాటు… మొదట్లో చిన్నగానే ఆలోచనల్లో దాగి ఉంటుంది…. అది క్రమంగా పెరిగి మన మనసును పూర్తిగా ఆక్రమిస్తుంది. ఒకసారి మనసులో అనుమానం స్థానం సంపాదించుకున్న తర్వాత, అది ఎదుటివారిని అనుమానిస్తూ, నిత్యం ఇరువురుకి మనస్సాంతి లేకుండా చేస్తుంది.
మనిషి శాంతికి భంగం కలిగించే భావనలో అనుమానం ముందు ఉంటుంది.
ఇది బంధాల మద్య చిచ్చు పెట్టె అంశము, ప్రమాదకరమైనది. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎడబాటు పెంచడంలో బీజం అనుమానమే అవుతుంది. అది అంటుకుంటే, ముట్టుకునే అవకాశం లేకుండా ఇద్దరినీ విడదిసేస్తుంది. చిన్న ఊహతో ప్రారంభమై పెద్ద బ్రమ దగ్గర గొడవలు పెడుతుంది.
ఇదే అనుమానం మిత్రుల మధ్య కూడా మంట పెట్టి, స్నేహాన్ని తుంగలో తొక్కేస్తుంది… మొదట్లో చిన్నగా అనుమానం ఒక మనసుని వెంటాడితే, రెండవ వ్యక్తిని వేటాడుతుంది… కాబట్టి అనుమానం అనే ఆలోచనకు ఆమడ దూరంగా ఉంటె, పక్కనే ప్రశాంతత ఉంటుంది.
అనుమానం పెను ప్రమాదం పెద్ద భూతం వంటిది.
అనుమానం మనిషిలో భయాన్ని పెంచుతుంది. ప్రతి చిన్న విషయం కూడా మనకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది. మనసులో నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. చివరకు మనం ఒంటరిగా మారిపోతాము.
ఒకరికొకరు నమ్మకం లేకపోతే సమాజంలో శాంతి ఉండదు. ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటే, అక్కడ ప్రేమ, సహకారం, పరస్పర గౌరవం ఉండవు. అందుకే నమ్మకం అనేది సమాజాన్ని కట్టిపడేసే గొలుసు లాంటిది.
అనుమానం ఎందుకు వస్తుంది,
అంటే ప్రధానంగా నమ్మకం లోపం వలన వస్తుంది. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటే కూడా అనుమానం ఎక్కువగా ఉంటుంది.
పాజిటివ్ థింకింగ్ బెస్ట్, అనుమానించడం తగ్గించడంలో ఆలోచనలు పెంచుకోవాలి…. మొదటగా మనం మనపై నమ్మకం పెంచుకోవాలి. మన ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఏ విషయాన్నైనా పూర్తిగా అవగాహన చేసుకోవాలి. సందేహం ఉంటే, నేరుగా మాట్లాడి స్పష్టత పొందాలి. ఊహలకు తావివ్వకూడదు.
ఒకసారి మనం ఎదుటివారిపై నమ్మకం పెంచుకుంటే, అనుమానం అదే తగ్గిపోతుంది. బందాలు బలపడతాయి. అయితే అందుకు సహనం కూడా అవసరం. ప్రతి విషయం వెంటనే అర్థం కాకపోవచ్చు. కొంత సమయం ఇవ్వాలి.
“అనుమానం పెనుభూతం” చిన్నగా మొదలై పెద్ద సమస్యగా మారుతుంది. మన సంబంధాలను, మనసును, జీవితాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మనం అనుమానానికి బానిసలు కాకుండా, నమ్మకాన్ని పెంచుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రేమ, విశ్వాసం, సహనం వంటి మంచి విలువలను పెంపొందించుకోవాలి.
కాబటి మంచి ఆలోచనలు మంచి, పుస్తకాలు చదవడం లేదా మంచి మాటలు వినడం మంచిది అంటారు.
పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?
శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?
ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది
వర్షాలు – వేసవి మధ్య ఆకస్మిక మార్పులు
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు


