SBI కెవైసి సబ్మిట్ గడువు

SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా?

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది.

మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది.

ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆధార్ లింక్ చేయవచ్చును. కానీ కెవైసి సబ్మిట్ చేయడం కుదరదు. కచ్చితంగా బ్యాంక్ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లాలి.

కెవైసి అనగానేమి?

బ్యాంకులకు బాస్ అయిన (ఆర్.బి.ఐ.) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం.. బ్యాంకులన్ని వారి వారి కస్టమర్ల వివరాలను క్రమంగా అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ తమ దగ్గరి ఖాతాదారుల వివరాలు బ్యాంక్ దగ్గర లేకపోతే, అలాంటి కస్టమర్లకు బ్యాంకులు మెసేజ్ పంపిస్తాయి. వెంటనే మీ ఖాతా సంబంధించి, కెవైసి డాక్యుమెంట్లు సమర్పించండి.

మీ ఖాతాను బ్లాక్ చేయకుండా ఉండడానికి కెవైసి తప్పనసరిగా చేయించుకోమని సూచిస్తాయి. ఎస్‌బీఐ అదే పని చేస్తోంది. SBI కెవైసి సబ్మిట్ గడువు ఫిబ్రవరి 28, 2020 తేదీ వరకే ఉంది. ఆ లోపు కెవైసి అప్డేట్ చేయించుకోవాలని తమ కస్టమర్లను కోరుతుంది.

కెవైసి ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం?
ఎస్‌బీఐ కెవైసి అప్‌డేట్ చేసుకోవాలని మీరు భావిస్తే. మీకు కావాల్సిన డాక్యుమెంట్లు. పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్‌ఈజీఏ కార్డు, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) లెటర్ వంటి డాక్యుమెంట్లతో బాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో‌గ్రాఫ్ మరియు వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ వంటి వివరాలు మీకు అవసరం అవుతాయి.

ఈ పైన తెలియజేయబడ్డ డాక్యుమెంట్లలో ఒక రెండు ఉన్నా కూడా మీ కెవైసి అప్డేట్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీ ఖాత ఉన్న బ్రాంచికి వెళ్ళి పైన చెప్పబడిన ఏవైనా రెండు డాక్యుమెంట్లతో బాటు ఫోన్ నెంబరు ఉండాలి. సదరు బ్యాంకు ఆఫిసరుతో మీరు మీ కెవైసి అప్డేట్ చేయించుకోవచ్చును.