అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని పాంతాలకే పరిమితం. అలా మన తెలుగువారికి అట్లతదియ అంటే అట్టతద్దిగా మనకు మాత్రమే పరిమితం. ఇంకా తెలుగు ఆడవారికి ప్రత్యేకం ఈ అట్లతద్ది పండుగ.

అతివలు ఆడుతూ పాడుతూ ఆనందంగా జరుపుకునే పండుగ అయితే అదీ మన తెలుగువారికి ప్రత్యేకంగా ఉన్న పండుగగా అట్లతద్ది, దీనిన అట్ల తదియ అంటారు. మన తెలుగునేలలో అట్లతో కూడిన నోము. ఉదయం నుండి ఉపవాసం ఉండి, సాయంకాలం పార్వతి పరమేశ్వరులను పూజించి, చంద్రోదయం జరిగాక, చంద్రదర్శనం చేసి బోజనం చేయడం ఉంటుంది. ఇంకా ఈ పండుగ గురించి అట్లతద్ది వ్రతవిధానంలో చెబుతారు.

అట్లతద్ది నోమును ఆరేళ్ల నుండి పెళ్లయినవారు కూడా చేసుకుంటూ ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా ఎక్కువగా అట్లతద్ది ఉండడం చేత ఆట పాటలు కూడా చేరినట్టుగా ఉండవచ్చు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆట పాటలతో ఆడే అమ్మాయిలు సాయంత్రం గౌరిదేవిని పూజించడంతో మంచి మొగుడు వస్తాడనేది ప్రసిద్ధి. ఇంకా ఇందులో అట్లతో పోసిన వాయనాలు ముత్తయిదువులకు ఇవ్వడం అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వచ్చే ఈ పండుగలో మరో ప్రత్యేకత.

గౌరిదేవిని పూజించడానికి ఆడపిల్లలలో ఆసక్తి పెంచడానికే అన్నట్టు అట్లతద్ది పండుగ విధానం ఉన్నట్టుగా అని అంటారు. సర్వమంగళను పూజిస్తే, మంగళములు కలుగుతాయి కాబట్టి ఆ సర్వమంగళ అయిన పార్వతి మాతను పూజించడానికి ఆడపిల్లలకు ఆటపాటలతో కూడిన విధానం కలిగిన పండుగ కేవలం అట్లతద్ది మాత్రమే ఉంది.

ఆశ్వయుజమాసంలో దసరా తర్వాత వచ్చే తదియ తిదిని అట్లతదియగా పేర్కొంటే, అది అట్లతద్ది పండుగగా మనతెలుగు ఆడపిల్లలకు ఇష్టమైన పండుగ. అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వచ్చే పండుగ గూర్చి యూట్యూబ్ వీడియోలో శ్రీమతి అనంతలక్ష్మి గారు చెప్పిన మాటలు చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేదా క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్