ఈ రోజు కొన్ని తెలుగు పదాలు అర్ధములు Daily Telugu Words #1

  1. పురోహితుడు – పురమునకు హితుడు పురోహితుడు… పురము యొక్క హితము కొరకు పూజలు చేయువారు…

2. కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది.

3. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం

4. తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు.

5. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట

6. తతంగం: తంతువు

7. తారతమ్యం: తేడాలు లేదా బేధాలు

8. తనువు: శరీరము… కాయము…

9. మనువు: వివాహము, పెండ్లి

10. మధురం : తీపి, తీయనిది.

ఈ పదాలు ఉపయోగిస్తూ కొన్ని వ్యాక్యాలు రాయండి.

  1. పురోహితుడు వలన పురము క్షేమము. 2. కలిమి కలిగి ఉన్నా, వినయం ఉండాలి. 3. సమస్య పరిష్కారానికి శోధన జరగాలి. 4. ఆర్ టి సి అధికారులు బస్సులో తనిఖీ నిర్వహించారు. 5. పోలీసులు దొంగలని వెంబడించి, పట్టుకున్నారు. 6. చిన్న పని చేయడానికి, అతను చాలా తతంగం చేస్తాడు. 7. ఉపాధ్యాయునికి విద్యార్ధులపై తారతమ్యాలు చూడకూడదు. 8. నిత్య జీవితంలో యోగాభ్యాసం వలన తనువు చాలించేవరకు వ్యక్తీ ఆరోగ్యంగా ఉండవచ్చు. 9. ఆమె అతడిని మనువు చేసుకుంది. 10. ఆమెకు మధుర పదార్ధాలు అంటే మిక్కిలి మక్కువ.

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts