అంబుజం అంటే నీటిలో ఉద్భవించినది అని అర్ధం. అంటే కమలం అంటారు. English Meaning : Lotus. తెలుగు వాడుక భాషలో ఎక్కువగా తామర పువ్వు అంటారు. అంబుజం పర్యాయ పదాలు: కమలం, పంకజం, నలిని, అంబుజం, అరవిందము, ఇందీవరము, ఉదజము, కంజము
ఉదాహరణలు: చెరువులో అందంగా కనిపించే అంబుజం పువ్వు.
ఆమె ముఖం కమలం వలె వికసించింది.
పురాణాలలో బ్రహ్మను అంబుజగర్భుడు అంటారు. సముద్రమును అంభోది అంటారు. మేఘమును అంభోదము అంటారు. తామర తీగను అంభోజిని అంటారు.

ఉపయోగం: ముఖ సౌందర్యాన్ని వర్ణించడానికి, పవిత్రతను సూచించడానికి ఈ పదం ఉపయోగిస్తారు.
అంబుజం అంటే తామర పువ్వు ప్రత్యేకతలు:
మట్టి నీటిలో పుట్టి కూడా మురికి తగలదు
ఉదయం సూర్య కిరణాలతో వికసిస్తుంది
సాయంత్రం మూసుకుపోతుంది
అందం, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు
తెలుగురీడ్స్,
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?


