కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో కార్తీకదీపం వెలింగించడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తీకదీపం ఈ మాసమంతా ప్రతిరోజూ వెలించడం విశిష్ట పుణ్యముగా చెబుతారు.

కార్తీకమాసములో భక్తులు అంతా దేవాలయ సందర్శనం పరమ భక్తితో చేస్తూ ఉంటారు. శివకేశవుల ఆలయాలకు భక్తులు వేల సంఖ్యలో వెళుతూ ఉంటారు. లోకంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలు, శైవాలయాలకు వెళ్లి శివకేశవుల దర్శనం చేసుకోవడం పరమ పుణ్యంగా భావిస్తారు. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ భక్తుల కోలాహాలం కార్తీకమాసములో ఎక్కువగా ఉంటుంది.

కొందరు కాలినడకన పాదయాత్ర చేసి దేవాలయం సందర్శనం చేస్తారు. ఈ కార్తీకమాసములోనే దైవ దర్శనానికి బహుదూరం నుండి భక్తితో నడస్తూ వచ్చి, దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి నామాలు పలుకుతూ, నడుస్తూ దేవాలయం దర్శనం చేసుకోవడం చాలా మంది భక్తులు కార్తీకమాసంలోనే ఎక్కువగా చేస్తారు.

ఇంకా కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం విశేష రోజుగా భక్తులు భావిస్తారు. ప్రతి సోమవారం శివ దర్శనం చేయడం, శివుని ముందు దీపారాధన చేయడం పరమపుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. రోజులో రెండు సంధ్యా సమయములలో దీపారాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు.

హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసము

మాసమంతా ప్రతిరోజూ భగవంతునికి సంబంధించిన కర్మలనే ఆచరిస్తూ ఉండడం విశేషం. అవకాశం ఉన్నవారు మాసమంతా ప్రతిరోజూ నియమబద్దంగా నదీస్నానం చేస్తూ, శివకేశవుల ఆలయాలలో హరి హరులను దర్శిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం నదీస్నానం చేసి, శివాలయం దర్శించుకునేవారు కొందరుంటారు. హరి హరులకు కూడా ఇష్టమైన మాసంగా కార్తీకమాసమును చెబుతారు.

నెలరోజుల పాటు భక్తుల మనసులో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం గా కాలం కదులుతుంది. ప్రతి కదలికలోనూ భగవంతుని దర్శనం చేయడానికే తాపత్రయపడుతూ ఉంటారు. అలా కార్తీకమాసము అంతా కార్తీకపురాణం శ్రవణం చేయడం చాలా ముఖ్యమైన కర్మ. పండితుల మాటలలో కార్తీకమాసము యొక్క వైభవం ప్రవచనాలుగా వింటూ ఉంటారు.

కార్తీకపురాణం తెలుగులో తెలుగుపుస్తకం రూపంలో కూడా మనకు లభిస్తుంది. పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకములో ఉండే అంశంతో తాదాత్మకం చెందడం అంటారు. అలా భావించేవారు ఈ కార్తీకమాసములో కార్తీకపురాణ తెలుగుబుక్స్ చదువుతారు. కార్తీకమాసము పరమ పవిత్ర మాసంగా భావించే భక్తులు తప్పనిసరిగా కార్తీకపురాణ పఠనం కూడా చేస్తూ ఉంటారు.

అటువంటి పరమ పవిత్రమైన కార్తీకమాసములో కార్తీకపురాణం తెలుగు బుక్స్ మీ కంప్యూటర్ లేకా ఇతర సాంకేతిక పరికరాలలో చదువుకోవచ్చు. ఆన్ లైన్లో కార్తీకపురాణము పి.డి.ఎఫ్ బుక్ రూపంలో ఫ్రీగురుకుల్ వెబ్ సైట్లో లభిస్తుంది. ఈ కార్తీకపురాణం మీరు ఆన్ లైన్లో ఏదైనా బ్రౌజరు సాయంతో కేవలం చదువుకోవడానికి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

పరమ పుణ్యకాలమైన కార్తీకమాసములో స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం తెలుగు పి.డి.ఎఫ్. బుక్ మీ మొబైల్ / కంప్యూటర్ / లాప్ టాప్ / టాబ్లెట్ పరికరాలలో ఏదైనా బ్రౌజరు ద్వారా చదవడానికి ఇక్కడ ఈ అక్షరాలను క్లిక్ చేయండి. ఇంకా సంపూర్ణ కార్తీక మహాపురాణం పి.డి.ఎఫ్ పార్మట్లో తెలుగులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి. కార్తీక పురాణం గురించి గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్