భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మనకు రామాయణం, భాగవతం, పురాణములు చదవడానికి, వినడానికి ఉన్నా, వాటి సారాన్ని జీవిత పరమార్ధమును ప్రబోధం చేసే గ్రంధంగా భగవద్గీతను చాలామంది పెద్దలు చెబుతారు. భగవద్గీత భవసాగరమును దాటిస్తుందని చెబుతారు. అటువంటి భగవద్గీతను చదివే మనసుకు ఎటువంటి కష్టం ఎందుకు కలుగుతుంది? ప్రశ్న ఉదయించిన మనసుకు ఆ ప్రశ్నపై పరి పరి ఆలోచనలు కలుగుతాయి. కానీ సమాధానం లభిస్తే పొందే శాంతి అనిర్వీచనీయం.

ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక కష్టం కలిగితే వచ్చే ఫలితం తెలిసి ఉంటే, అటువంటి కష్టం వచ్చినప్పుడు మనసు ఆ కష్టాన్ని ఎదుర్కోవడంలో పోరాడుతుంది. తెలియని కష్టం వచ్చినప్పుడు తెలిసినవారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జీవితంలో కలిగే కష్టాలు ఎలా ఉంటాయో కొంతమంది జీవిత చరిత్రలు చదివితే అవగాహన ఉంటుందంటారు. అలా మహాత్మగాంధీ గురించిన తెలుగు పుస్తకం చదవడానికి చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

భగవద్గీత చదవడానికి వినడానికి కష్టమే కారణమా?

సంఘజీవి అయిన మనిషికి తన ఉంటున్న ప్రాంతంలో తనతోటివారితో తెలిసిన విషయాలతో జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ కాలం వలన వచ్చే పెద్ద కష్టంతో జీవితం ప్రభావం చెందుతుంది. కాలంలో ప్రతి వ్యక్తి జీవితం మార్పులకు గురి అవుతూ ఉంటుంది. సుఖంలో ఉండే ఆలోచన కన్నా కష్టంలో ఉండే ఆలోచనలు మనిషిని కుదుటపడనివ్వవు. కష్టం మనసుకు భగవద్గీత వినడానికి గాని చదవడానికి గాని కారణం కాగలదని అంటారు.

పెద్ద కష్టంలో ఓదార్పును తనకు తానే పొందవలసి వచ్చినప్పుడు మనసుకు మరింత కష్టమంటారు. ఒక్కోసారి ఎంతమంచివారు చెప్పిన మంచి మాటలు కూడా ఆ పెద్ద కష్టం బాధలో నుండి బయటపడవేయలేవు. సాదరణంగా ఏ మనిషికైనా మరణవేదన మాత్రం తనకుతానే ఎదుర్కొనవలసిన చాలా అతి పెద్ద కష్టం. కానీ కొందరికి అప్పుడప్పుడు మరణవేదనను తలపించేవిధంగా కష్టం చుట్టుముడుతూ ఉంటుంది.

కొందరి కష్టాలు కాయ(శరీరము)మును గాయపరిస్తే, కొందరికి మనసు వేదించే వేదనాపూరితమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. కష్టం కాయానికి వచ్చినా, మనిషి మదికి కలిగినా ప్రభావితం అయ్యేది మాత్రం మనిషి మనసే…. కారణం శరీరానికి కలిగిన గాయం బాధకు స్పందించేది మనసే, అలాగే ఏదైనా అప్పుల బాధ, లేక అయినవారికి శరీరానికి పెద్ద గాయం కలిగితే స్పందించేది…మనసే. మనిషికి కష్టం వచ్చింది అంటే అతని మనసు పొందే పరివేదనను బట్టి అతని చుట్టూ ఉన్నవారు ప్రభావితం అవుతారు.

ఎంతబలం ఉన్నా మనిషి అయినా కాలంలో మనసు ఎదుర్కొనే కష్టాన్ని బట్టి కదలికలు ఉంటాయి. అనుభజ్ఙులు అయినవారు తమ కుటుంబంలో ఉన్నవారికి ఏదైనా కష్టం గురించి పరిష్కారం తెలియజేయగలరు. ఎందుకంటే అటువంటి కష్టం తమ జీవితంలో ఎదుర్కొని ఉండి ఉండడం చేత, అటువంటి కష్టం మరొకరికి వస్తే పరిష్కారం తెలుపగలరు.

సమాజంలో చాలా విషయాలలో మనకు అనుభవం ఉన్నవారు కొత్తవారికి మార్గదర్శకులుగా నిలబడుతారు. అనే మోటారు వాహనాలు నడిపిన వ్యక్తి, కొత్తగా మోటారు వాహనం నడుపుతున్నప్పుడు, అతనికి జాగ్రత్తలు తెలియజేయగలడు. ఎలా వాహనం నడపాలో సూచనలు ఇవ్వగలడు. అలా అనేక విషయాలలో మనిషి అనేక మంది చేసిన సూచనలను తీసుకుంటూ, తను కూడా తాను చేస్తున్న పనులలో అనుభవం గడిస్తాడు. అయితే ఇదంతా సంఘజీవికి సహజంగా జరుగుతుంది.

సంఘంలో సంఘటిత జీవి అయిన మనిషి, తనకున్న బంధుమిత్ర సహకారంతో జీవిస్తాడు. అయితే అనుబంధాలతో మెసిలే మనిషి, తను తీసుకున్న నిర్ణయం తన చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా ప్రభావితం చేసేదిగా ఉన్నప్పుడు అతని మనసులో ఏర్పడేది సంశయమే అంటారు. సంశయమే సంఘర్షణ అయితే మరింతగా మనసు కుంగిపోతుంది అంటారు.

మనసులో ఏర్పడే సంఘర్షణకు ఆ మనిషి యొక్క మనసే సాక్షి. అటువంటి మనిషి అంతరంగం అతనికి మాత్రమే తెలుస్తుంది. అతని ప్రవర్తన వలన అతనితో కలిసి మెలిసి ఉండేవారికి కొంతవరకు తెలియవస్తుంది. ఏదైనా సంఘటనతో తన జీవితం ప్రభావితం చెందితే వచ్చే మానసిక సంఘర్షణకు సంఘం నుండి సానుభూతి వస్తుంది. కానీ తన అంతరంగంలో ఏర్పడే ఆలోచనలు నుండి తాను చేయబోయే నిర్ణయం మరొకరి జీవితం ప్రభావితం అయ్యేదిగా ఉన్నప్పుటి సంఘర్షణ అతను బయటికి చెబితేకానీ తెలియదు. ఒక్కోసారి అటువంటి ఆలోచనలు హాస్యాస్పదంగా కూడా మారుతూ ఉంటాయి.

భగవద్గీత పోగేట్టేది ఏమిటి?

సంఘంలో కొందరితో సహజీవనం చేసే మనిషికి ఆయా ప్రాంతంలో ఉండే వాతావరణం మరియు అతని తోటివారితో ఉండే అనుబంధం ఒక్కోసారి సుఖాలను తీసుకువస్తే, ఒక్కొసారి దు:ఖాలను తీసుకువస్తాయి. ఒక వ్యక్తికి అతని భార్య కోరికకు సరిపడా ధనం తన దగ్గర ఉన్నప్పుడే అతనికి అది సుఖం. కాకపోతే అతనికి అతని భార్య కోరికే దు:ఖదాయకం అవ్వవచ్చును. అలాగే అతని చుట్టూ ఉన్న బంధాలు నుండి వచ్చే విషయాలు అతని ఆర్ధిక స్థితికి, అతని ప్రవర్తనకు అనుకూలంగా ఉంటే అది సుఖం. కాకపోతే అయా బంధాల నుండి వచ్చే విషయాలు దు:ఖదాయకం.

ఏ మనిషికైనా తన చుట్టూ ఉన్నవారి జీవితాలను ప్రభావితం చేసే సంఘటనలు ఎదురైనప్పుడు ధర్మసందేహం ఏర్పడుతుంది. అప్పటికి కలగబోయే ఫలితాలపై మనసులో సంఘర్షణ ఏర్పడుతుంది. గాంధీగారు దేశంలో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అయనకు ఏర్పడే సంఘర్షణలకు భగవద్గీతే సమాధనపరిచింది అని పెద్దలు చెబుతూ ఉంటారు.

భగవద్గీత ఎందుకు చదవాలి అంటే దు:ఖం పోగొట్టుకోవడానికి అంటారు. ఎందుకు అంటే కురుక్షేత్రంలో తన బంధు వర్గములోని బంధువులను చూసి దు:ఖం పొందిన అర్జునుడి దు:ఖం భగవంతుని బోధతో పోయింది. కాబట్టి కాలంలో కలిగిన కష్టం వలన ఏర్పడిన దు:ఖంతో కర్తవ్య భంగం ఏర్పడినప్పుడు భగవద్గీత మనసుకు మందు అంటారు. హృదయంలో ఏర్పడే దు:ఖాన్ని అడ్డుకోవడానికి భగవద్గీతలోని ధర్మాలు తెలిసి ఉండడం ప్రధానమని చెబుతారు.

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి తెలుగు బుక్స్

ఇంకా పెద్ద పెద్ద కష్టాలు కాలంలో కలిగినప్పుడు పెద్దలు మాటలు ఉపశమనం కలిగించలేకపోయినా భగవద్గీత వలన కర్మయోగం కలిగితే ఉపశమనం కూడా కలుగుతుంది అంటారు. మరణవేదన ప్రతి మనిషికి తప్పనిసరి అటువంటి మరణవేదనలో కూడా మనసు తట్టుకుని నిలబడాలంటే, అంటే మోక్షానికి అర్హత సాధించాలంటే భగవద్గీతాసారం జీర్ణం చేసుకున్న మనసు వలననే సాధ్యం అంటారు.

అటువంటి భగవద్గీతలో ఏముంది అంటే అందులో మొదటగా అర్జునుడికి పుట్టే దు:ఖం కనిపిస్తుంది. ఆ దు:ఖంతో అర్జునుడికి కలిగిన విషాదయోగం మాటలు మారితే ఎలా ఉంటుందో కనబడుతుంది. బంధాలపై అమితమైన ప్రేమతో ఉండే వీరుడి మనసులోని పరివేదన కనబడుతుంది అని అంటారు. భగవద్గీత గురించి శ్రీచాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

అర్జునుడి విషాదానికి చెదిరిన మనసుకు కర్తవ్యాన్ని బోధించే గురువుగా కృష్ణుడు మనకు భగవద్గీతో కనిపిస్తాడు. గురువు అయిన కృష్ణభగవానుడు శిష్యుడు అర్జుని చేసిన బోధ బాధలో ఉండే మనసుకు మందు అంటారు. దహింపడే దేహికి ఏర్పడే అజ్ఙానం తొలగించడానికి భగవానుడు పలికి వాక్కులు భగవద్గీతలో కనిపిస్తాయి.

ప్రవచనకారుల మాటలలో భగవద్గీత సారం అర్ధం కావడం వలననే జీవి తరించగలడనే మనకు వినిపిస్తాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు ప్రవచించిన ప్రవచనాలు ఆడియో రూపంలో ఉచితంగా తెలుగులో వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి వీడియో తెలుగుప్రవచనాలు వినడానికి ఇక్కడ / టచ్ చేయండి. తెలుగులో ప్రవచనాలు వినడం వలన మనకు బాగా తెలిసి ఉన్న తెలుగు చదవడం చేత మన మనసుకు మాటలు బాగా అర్ధం అవుతాయి.

ప్రధానంగా భగవద్గీత వలన అజ్ఙానం తొలిగి జ్ఙానం వస్తుందనేది చెప్పబడుతుంది. జ్ఙానం వలన కలిగే ధైర్యం సంసారం నుండి బయటపడవచ్చు అని అంటారు. తాను ఎప్పుడూ వెళ్లని ఇంటికి ఒక వ్యక్తి రాత్రివేళో వెళితే, ఆ ఇంటిలోకి వెళ్లగానే కరెంటుపోయి చీకట్లు కమ్ముకుంటే ఆ వ్యక్తికి భయం కలిగి అడుగు అక్కడే ఉంటుంది. ఒక వేళ అడుగు వేసినా భయంతోనే వేస్తాడు. అదే ఇంట్లో అప్పటికే నివసిస్తున్నవారు మాత్రం ఆ చీకట్లో గబా గబా టార్చిలైటు కోసం వెతుకుతారు. అంటే వారికి ఆ ఇంట్లో వెలుగునింపే వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలిసి ఉండడం చేత, వారికి ఆ చిమ్మచీకట్లో అడుగులు సాదారణంగా వేస్తారు. కానీ కొత్తగా ఆ ఇంట్లోకి అప్పుడే వచ్చిన వ్యక్తి మాత్రం ఆ చీకటి భయహేతువు. భగవద్గీత వలన ఒక దేహి జీవన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది, అంటారు.

భగవద్గీత భవసాగరం దాటించే గ్రంధంగా చెబుతారు.

తెలుగువ్యాకరణం తెలిసినవారికి తెలుగుపద్యాలు చదవమంటే గణగణమంటూ చదవుతారు. అలా కాకుండా తెలుగు సరిగ్గా అర్ధం కానివారికి తెలుగుపద్యాలు చదవమంటే మాత్రం అక్షరాలు కూడబలుక్కుంటూ చదువుతారు. అలాగే భగవద్గీత సారం ఒంటబడితే, ఆజీవి జీవన పరమార్ధం చాలా సులభం అంటారు. తెలుగుతెలియనివారికి తెలుగు సాహిత్యం మాధుర్యం తెలియబడనట్టు భగవద్గీత లేక సత్సమాన గ్రంధం చదవకపోతే, జీవిత పరమార్ధం తెలియబడదు అంటారు.

మనిషికి తెలియనవి మనిషిని మరింత భయపెడతాయి అంటారు. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అవసరం ఉండదో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం ఉంటే, ఆ ప్రయత్నంలో ఏర్పడే సందేహం దేహికి సమస్యాత్మకం అంటారు. దేహి సందేహాలకు సమాధానం భగవద్గీత అని చెబుతారు. అటువంటి భగవద్గీత గురించిన తెలుగు రచనలు చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. అనేకమంది తెలుగులో రచించిన భగవద్గీత గురించిన రచనలు మీరు ఉచితంగా పి.డి.ఎఫ్ బుక్స్ గా చదవవచ్చును.

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి తెలుగు ప్రవచనాలు, తెలుగు బుక్స్, తెలుగు వీడియోలు ఉచితంగానే లభిస్తాయి. అయితే భగవద్గీత చదవడానికి, వినడానికి కారణం కొంతమందికి కాలం వలన వచ్చే కష్టం కారణం కావచ్చును. భగవంతుని మీద భక్తి కావచ్చును. మోక్షం కారణం కావచ్చును. భగవద్గీత చదవడానికి అయినా వినడానికి అయినా కారణం ఏదైనా, అది జీవితాన్ని ఉద్దరించే గ్రంధంగా చెబుతారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్