తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

తెలుగులో మనకు మీనింగ్ తెలియని పదాలు ఎన్నో ఉంటాయి అంటారు. సహజంగా కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగువాడుక పదాలు అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం. వీటిలో చాలా పదాలు ఇంగ్లీషువే ఉంటాయి. అంతెందుకు ఇంగ్లీషు భాషను తెలుగులో అయితే ఆంగ్లభాష అంటారు. ఆంగ్లము అనే పదము కన్నా ఇంగ్లీషు అనే పదము ఎక్కువమందికి తెలుసు అంటారు.

ఎక్కడైనా ఏదైనా నాటకం, సభ లాంటివి జరిగితే వాటి గురించి వివరించేటప్పుడు స్టేజి అనే పదం తెలుగులో మాట్లాడుతూనే వాడుతూ ఉంటాం. స్టేజికి తెలుగులో పదం రంగస్థలం అంటారు. తెలుగులోనే మాట్లాడేవారు స్టేజి పదం ఉపయోగించినంతగా రంగస్థలం అనే పదం ఉపయోగించరు అనే భావన కూడా బలంగానే ఉంటుంది. రంగస్థలం తెలుగు సినిమా కూడా వచ్చింది. అయినా కొంతమంది తెలుగు మాట్లాడేటప్పుడు స్టేజి అనే పలుకుతారు. సినిమా అంటే తెలుగు చలనచిత్రం. సినిమా అనే ఎక్కువమంది ఉపయోగిస్తారు.

తెలుగు పుస్తకాలు చదవడం వలన తెలుగుభాషపై పట్టుతో బాటు తెలుగు సాహిత్యంలో మనిషి జీవిత పరమార్ధమునకు సంబంధించిన విషయాలు బోధపడతాయి అని అంటారు. టి.వి. రాకముందు చిన్న పిల్లలకు అమ్మ చెప్పే చిట్టి చిట్టి కధలే అమ్మకు కాలక్షేపం, పిల్లలకు సరదా. టెలివిజన్ రాకముందు తాతయ్యలకు కూడా పిల్లలకు నీతి తెలుగు కధలు బోధించడమే ప్రధాన కాలక్షేపం. సాయంకాలం అయితే నాన్న చెప్పే తెలుగు కధలు వినడమే కొందరి పిల్లలకు ఇష్టం. పిల్లలకు కధలు చేప్పేకాలం టి.వి. వచ్చి మింగేసిందంటారు.

టి.వి. వచ్చాక తెలుగు పుస్తకాలు చదివే అలవాటు పోయి సీరియల్స్ చూసే వ్యసనం వచ్చేసింది. ఇక పిల్లలకు చెప్పడానికి నీతి కధలు ముందు పెద్దలకు తెలిసి ఉండాలి కదా అని కొందరు విమర్శించేవారు లేకపోలేదు. నీతి కధలు తెలుగులో చదివి ఉంటే, కొత్త నీతి కధను కల్పించే చెప్పగలిగే ఊహాశక్తి పెరుగుతుంది అంటారు. మన తెలుగు పుస్తకాలలో అంతటి శక్తి ఉందంటారు. తెలుగులో ఉండే కధలు కాలక్షేపంతో బాటు నీతిని కూడా ప్రబోధం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంటాయి.

పనిలేకుండా తిండి తింటూ ఉండేవారికి తెలుగులో ఎక్కువగా చెప్పే తెలుగుకధ తిండిబోతు దెయ్యం తెలుగు కధ. ముఖ్యంగా పెద్దలు ఎక్కువగా పిల్లలకు దెయ్యం అంటూ భయపెడుతూ చెబుతుంది అని అంటారు. పని చేయకుండా ఉంటే, మనసుకు పట్టే భావనను దెయ్యంతో పోలుస్తూ చెబుతారు. పనిలేనివారికి మనసు చేసే గోల దెయ్యాల గోలలాంటిదే అంటారు. అదే పని ఉంటే ఆ పనిద్వారా అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది. శరీరం పనిచేస్తున్నంతసేపు ఏకాగ్రతతో ఉన్న మనసులో స్వస్థతకు చేరుతుంది. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన విశ్రాంతి రాత్రివేళల్లో పొందుతుంది అంటారు. ఇలాంటి నీతిని ప్రభోదించే కధగా తిండిబోతు దెయ్యం అంటూ చాలా మంది పెద్దలు పిల్లలకు చెబుతూ ఉంటారు.

అమ్మ చెప్పే కధలు పిల్లల మనసుకు మరింత చేరువగా ఉంటాయి. మనసులో అమ్మపై ఉండే మమతతో అమ్మ చెప్పిన మాటలు మనసులో మరింత పదిలంగా ఉంటాయి. అమ్మ చెప్పిన కధలతో మనసు మమతతో మరింత మమేకం అవుతుంది. కావునా అమ్మ చెప్పే తెలుగు కధలలో ఉండే నీతి మనసులో ఎప్పటికి గూడు కట్టుకుని ఉంటాయి.

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

అమ్మ నాన్న పిల్లలపై మమకారంతో ఉంటారు. అమ్మ అప్యాయంగా పిల్లలకు సేవ చేస్తూ ఉంటుంది. పిల్లలకు సమాజంలో గుర్తింపు వచ్చేవరకు పోషణకు నాన్న సంపాదిస్తూ ఉంటాడు. తమకోసం తాము పడిన కష్టం ఎక్కువ కష్టం పిల్లలు విషయంలో అమ్మా నాన్న పడడానికి సిద్దపడతారు. ఇంకా పిల్లలకు కొరకు మంచి మంచి నీతి కధలను కూడా అమ్మనాన్న చెబుతూ ఉంటారు. అలా వారు చెప్పే తెలుగు కధలలోని నీతిని పిల్లలు ఎప్పటికీ మరిచిపోరు.

సమాజంలో అమ్మా నాన్నల సామాజిక పరిస్థితిని బట్టే పిల్లలకు సమాజంలో ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఇంకా అమ్మానాన్నల పెంపకం వలననే పిల్లల ప్రవర్తన ఉంటుందని అంటారు. అమ్మానాన్నలు చూపే ప్రేమతోబాటు వారు ఆచరించి మార్గదర్శకంగా నిలిచినతీరును పిల్లలు పెరుగుతున్నప్పుడు గ్రహిస్తారు. కాబట్టి పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల మాట ఒకమాటగానే ఉండాలి. ఒక సదాచారం అలవాటుగా ఉండాలి. మంచిని బోధించే తెలుగు పుస్తకాలు చదవాలి, నీతి కధలను పిల్లలకు బోధించాలి. నేటి పిల్లలు రేపటి పౌరులు కాబట్టి. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అమ్మానాన్నల పాత్ర ప్రధానమైనదిగా చెబుతారు.

చిన్న పిల్లలకు చిట్టి చిట్టి కధలంటే ఆసక్తిగా వింటారు. తెలుగులో అనేక చిట్టి చిట్టి కధలు ఉంటాయి. చిట్టి పొట్టి చిన్న కధలలో చిట్టి చిలకమా పాట చాలా ప్రసిద్ది. ఈ పాట తెలియనివారు ఉండరు. టి.వి. వచ్చినా ఈ చిట్టి చిలకమ్మా పాట మాత్రం నిలబడిందంటే, ఆ పాట మనసును ఎంతగా ఆకర్షిస్తుందో అర్ధం అవుతుంది. చిట్టి చిలకమ్మా…అమ్మ కొట్టిందా… అంటు పిల్లలు పాడే పాట పెద్దవారికి కూడా వినాలనిపిస్తుంది. ఇలా కొన్ని పాటలు అయితే యూట్యూబ్ ద్వారా నేడు పిల్లలకు బాగా చేరువగా ఉన్నాయి.

గమనికగా మనం గమనించవలసిన విషయం ఏమంటే, పిల్లలకు యూట్యూబ్ వీడియోలో తెలుసుకున్న నీతి, ఆచరణలోకి వచ్చేటప్పటికి అమ్మానాన్నల మాటలు గుర్తుకు వచ్చినట్టుగా గుర్తుకురాదు అనే విషయం కూడా గమనించదగిన గమనికగా ఉంటుంది. ఇంకా అమ్మ నాన్నలు చెప్పే నీతిని ఆచరించలేదని అమ్మకి, నాన్నకి తెలిస్తే బాధపడతారనే భావన పిల్లలలో ఉంటుంది. కానీ యూట్యూబ్ వీడియో ద్వారా తెలుసుకున్న నీతి పాటించకపోతే, యూట్యూబ్ వీడియో బాధపడదు కదా… అందుకే యూట్యూబ్ వీడియో ద్వారా తెలియనివి తెలుసుకుని అమ్మానాన్నలే పిల్లలకు చిట్టి చిట్టి కధలుగా చెప్పాలని అంటారు.

తెలుగులో ఉండే తెలుగునీతి కధల తెలుగు పిడిఎఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. నీతి కధలంటే మహాభారతంలోని గాధలనే ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇంకా చాలామంది రచించిన పుస్తకాలలో నుండి కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే ఒక రచయిత రచించన తెలుగు రచనలో అతని ఊహాత్మక కల్పన ఉండవచ్చు. కానీ మహాభారత, రామాయణం లాంటి ఇతిహాసములలోని కధలు చిట్టి పొట్టి కధలుగా చేసి రచంచిన తెలుగు బుక్స్ కూడా మనకు లభిస్తాయి. వాటి వలన యొక్క ప్రయోజనం అని అంటారు. మీరు ఫ్రీగురుకుల్ సైటు నుండి తెలుగు పిడిఎఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

డౌన్లోడ్ చేయబడిన పి.డి.ఎఫ్ తెలుగుబుక్స్ మీరు స్టోర్ చేసిన పేరును బట్టి మరలా ఓపెన్ చేసుకుని నెట్ లేని సమయంలో కూడా చదువుకోవచ్చును. తెలుగులో చదువుకుని తెలుగులో నీతికధలు చెప్పనివారుంటే, వారికి తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. బాగుంటందనే ఉద్దేశ్యం కలగాలని ఆశిస్తూ…ఈ వ్యాసం ముగిస్తున్నా…

ధన్యవాదాలు – తెలుగురీడ్స్