Libre Office Insteadof MSOffice

విండోస్ ఆపరేటింగ్ సిస్టం బదులుగా లైనక్స్ Ubuntu ఆపరేటింగ్ సిస్టం వాడవచ్చు. అలాగే విండోస్ లోని MSOffice బదులుగా Libre Office లైనక్స్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో వాడవచ్చును. Libre Office Insteadof MSOffice in Ubuntu os.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

Libre Office లైనక్స్ Ubuntu osలో డిఫాల్ట్ అప్లికేషన్ గానే లభిస్తుంది. ప్రత్యేకించి మీరు Ubuntu osలో లిబ్రె ఆఫీసు డౌన్ లోడ్ చేయనవసరం లేదు. మీ కంప్యూటర్ లేక ల్యాప్ టాప్ నందు లైనక్స్ Ubuntu os ఇన్ స్టాల్ చేస్తున్న సమయంలోనే మీ సిస్టంలో Libre Office కూడా ఇన్ స్టాల్ చేయబడుతుంది.

MSOffice మాదిరిగానే Libre Office లోనూ డాక్యుమెంట్ రైటర్, కాలిక్యులేషన్, డ్రా వంటి అప్లికేషన్స్ లభిస్తాయి. ఈ క్రింది చిత్రం గమనించండి.

Libre Office Insteadof MSOffice

పై చిత్రంలో ఉన్నమాదిరి Libre Office అప్లికేషన్ల లిస్టు మీకు Ubuntu Softweare కనిపిస్తాయి. ఇవి ఇంతకుముందు చెప్పినవిధంగా, ముందుగానే మీ Ubuntu సిస్టంలో ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. మనకు ఎంఎస్ ఆఫీసులో పాపులర్ అయిన వర్డ్ డాక్యుమెంట్, వర్కుషీట్ అప్లికేషన్లకు బదులుగా మనకు Ubuntu సిస్టంలో Libre Office Writer, Libre Office Calc ఉపయోగడపడతాయి.

Libre Office Writer అంటే MSOffice లో MSWord మాదిరి వర్కుకు ఉపయోగంగా ఉంటుంది. అంటే లెటర్ రైటింగ్, డాక్యుమెంట్ మేకప్, బయోడేటా మేకింగ్ తదితర కంప్యూటర్ వర్కులకు Libre Office Writer ఉపయోగపడుతుంది.

ఇంకా Libre Office Calc అప్లికేషన్ MSOffice లో MSExcel Sheet మాదిరి కంప్యూటర్ వర్కులకు ఉపయోగపడుతుంది. క్యాలిక్యులేషన్ టేబిల్స్, బిల్లింగ్ ఫార్మట్స్ తదిరత కంప్యూటింగ్ వర్కులకు Libre Office Calc అప్లికేషన్ Ubuntu సిస్టంలో ఉపయోగపడుతుంది.

పవర్ పాయింట్ ప్రజంటేషన్ విండోస్ లో ప్రముఖమైన ఆఫీసు అప్లికేషన్. ఏదైనా ప్రొడక్టు గురించి ప్రజంటేషన్ తయారు చేయాలంటే, ఎంఎస్ పవర్ పాయింట్ ఉపయోగిస్తారు. పవర్ పాయింట్ మాదిరిగా మనకు Ubuntu సిస్టంలో Libre Office Impress ఉపయోగపడుతుంది. దీని ద్వారా వివిధ వస్తువులు, సేవల ప్రజంటేషన్స్ మేక్ చేయవచ్చును.

Ubuntu సిస్టంలో Libre Office Draw అప్లికేషన్ మనకు గ్రాఫిక్ డిజైన్ చేయడానికి ఉపయోగడుతుంది. Libre Office Insteadof MSOffice మాదిరి మనకు Ubuntu కలిగిన సిస్టంలో ఉపయోగపడుతుంది.

ధన్యవాదాలు