Text Editor Ubuntu OS

విండోస్ నోట్ పాడ్ మాదిరిగా Text Editor Ubuntu OS నందు ఉంటుంది. ఏదైనా నోట్స్ టైప్ చేసుకుని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విండోస్ లో ఏవిధంగా నోట్ పాడ్ ఉపయోగపడుతుందో, అలానే Ubuntu OS లో కూడా టెక్స్ట్ ఎడిటర్ మనకు ఉపయోగపడుతుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

వివిధ రకాల అప్లికేషన్ ప్రొగ్రామ్స్ దీనిని ఉపయోగించి వ్రాయవచ్చును. html, css, js, json, php, .net, xml, java తదితర కోడింగ్ భాషలు Ubuntu OS లో Text Editor ద్వారా వ్రాయవచ్చును. ఇది డిఫాల్ట్ అప్లికేషన్ గానే Ubuntu OS ఇన్ స్టాలేషన్ సమయంలోనే సిస్టంలో ఇన్ స్టాల్ కాబడుతుంది. Ubuntu Software ఓపెన్ చేస్తే ఈ క్రింది చిత్రంలో మార్క్ చేసిన విధంగా gedit టెక్స్ట్ ఎడిటర్ కనబడుతుంది. షో యాప్స్ నందు Text Editor అని ఉంటుంది.

Text Editor Ubuntu OS
Text Editor Ubuntu OS

Ubuntu ఆపరేటింగ్ సిస్టంలో Text Editor లో మెను నుండి కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలుసుకోవచ్చును. టెక్స్ట్ ఎడిటర్ గురించిన హెల్స్ చూడవచ్చును. అదే టెక్స్ట్ ఎడిటర్ నందు న్యూ విండోకి వెళ్లవచ్చును. ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా Text Editor ను క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెను వస్తుంది.

Text Editor Ubuntu OS

Text Editor useful for text editing and writting coding.

ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా 2 నెంబర్ సూచిస్తున్న open అక్షరాలు గల చోట క్లిక్ చేస్తే, ఇంతకుముందు సేవ్ చేసి, ఓపెన్ చేయబడిన టెక్స్ట్ ఎడిటర్ ఫైల్స్ ఓపెన్ చేయవచ్చును. అంటే రీసెంట్ ఫైల్స్… ఇంకా 1 నెంబర్ సూచిస్తున్న చోట క్లిక్ చేస్తే, కొత్త టెక్స్ట్ ఎడిటర్ ఫైల్ అదే విండోలో ట్యాబ్ మాదిరి ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి ఉన్న ఫైల్ అలానే ఉంటుంది. ఎన్ని సార్లు న్యూ విండో బటన్ క్లిక్ చేస్తే, అన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి.

Text Editor Ubuntu OS

ఇంకా Text Editor లో గతంలో సేవ్ చేయబడి, ప్రస్తుతం ఓపెన్ చేయబడిన ఫెల్ ట్యాబ్ నందు ఉండి, Ctrl + o టైపు చేస్తే, ఆ ఫైల్ సేవ్ చేయబడిన లోకేష్ లో ఉన్న టెక్స్ట్ ఫైల్స్ గల ఫోల్డర్ కనబడుతుంది. అలానే ప్రక్కన ఓపెన్ చేసి ఉన్న మరొక ట్యాబ్ నందు కూడా Ctrl + o టైపు చేస్తే, ఆ ఓపెన్ చేయబడిన మరొక ఫైల్ యొక్క లోకేషన్ ఫోల్డర్ కనబడుతుంది. దీని వలన ఏదైనా ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, ఆ ఫోల్డర్ ఫైల్స్ త్వరగా తిరిగి ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది.

Text Editor Ubuntu OS
Text Editor Ubuntu OS

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏవిధంగా నోట్ పాడ్ ఉపయోగిస్తారో, ఆవిధంగా Text Editor ను Ubuntu OS లో ఉపయోగిస్తారు. కోడింగ్ భాషలు ఈ టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఎడిట్ చేయవచ్చును.

ధన్యవాదాలు