Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి

తెలిసిన టెక్ విషయాలు షేర్ చేయడంలో భాగంగా నాకు తెలిసిన Ubuntu ఆపరేటింగ సిస్టం గురించి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనకు ఎక్కువగా తెలిసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం కన్నా Ubuntu ఆపరేటింగ్ సిస్టం సెక్యూర్ అని అంటారు. మీకు Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి ఈ పోస్టు ద్వారా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

విండోస్ ఆపరేటింగ్ సిస్టం మనకందరికీ తెలిసిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్ఠం. వాడుకకు తేలికగా ఉండేది, ఏదైనా పాపులారిటీ త్వరగా పొందుతుంది. అలా విండోస్ చాలా పాపులర్. పాపులర్ అయినవి ధరతో కూడి ఉంటాయి. అలా విండోస్ ఆపరేటింగ్ సిస్టం నిర్ణీత ధరలో కొనుగోలు చేయలి. కానీ Ubuntu ఆపరేటింగ్ సిస్టం ఉచితంగా లభిస్తుంది. ఇంకా సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా యాంటీ వైరస్ లాంటివి కొనుగోలు చేయనవసరంలేదు.

అయితే Ubuntu ఆపరేటింగ్ సిస్టం, కమాండ్ మోడ్లో కంప్యూటర్ వాడడం తెలిసిన వారికి తేలికగా ఉంటుంది. టెర్మినల్ ద్వారా కమాండ్స్ ఉపయోగిస్తూ లైనక్స్ Ubuntu ఆపరేటింగ్ సిస్టంలో కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించేవారు. అయితే గత కొన్నాళ్ళుగా ఈ Ubuntu ఆపరేటింగ్ సిస్టం నందు కూడా విండోస్ మాదిరి ఐకాన్స్ ద్వారా కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించవచ్చును. కొన్ని రకాల కంప్యూటర్ యాప్స్ ఇన్ స్టాల్ కూడా ఐకాన్లపై క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

కొన్ని రకాల కోడింగ్ మరియు డిజైనింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రం టెర్మినల్ ద్వారా ఇన్ స్టాల్ చేయవలసి ఉంటుంది. ఉదా: జావా, ఒరాకిల్ లాంటి డవలప్పింగ్ టూల్స్…. టీమ్ వ్యూవర్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ జిప్ ఫార్మట్లో డౌన్ లోడ్ చేసుకుని, సాప్ట్ వేర్ ఇన్ స్టాలర్ ద్వారా మీ Ubuntu ఆపరేటింగ్ సిస్టం కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

తెలుగులో Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి మరిన్ని విషయాలు

మనకు అందుబాటులో Ubuntu ఆపరేటింగ్ సిస్టం ప్రస్తుతం యుబుంటు20.04 LTS లభిస్తుంది. యుబుంటు20.10 వెర్షన్ అక్టోబర్ 2020 విడుదల కానుంది. Ubuntu ఉచితంగానే మనకు ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్, డివిడిల ద్వారా Ubuntu ఆపరేటింగ్ సిస్టం మీ కంప్యూటర్ ల్యాప్ టాప్స్ నందు ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

Windows 7 ఎక్కువగా అందరూ వాడే ఆపరేటింగ్ సిస్టం. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టం సెక్యూరిటీ అప్డేట్స్ ఇక ఉండవని అంటారు. ఇతర అప్ గ్రేడ్ విండోస్ వెర్షన్స్ మాత్రమే సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయని అంటారు. విండోస్ వాడుతున్నవారు, విండోస్ తోబాటు Ubuntu ఓఎస్ కూడా ఇన్ స్టాల్ చేసుకుని వాడుకోవచ్చును. అయితే మీ సిస్టం ర్యామ్ కెపాసిటి బాగుండాలి. 4జిబి ర్యామ్ అయితే ఏదో ఒక ఓస్ వాడుకోవడమే బెటర్ చాయిస్.

విండోస్ 7 ఓస్ తో బాటు Ubuntu ఓస్ కూడా ఇన్ స్టాల్ చేయడం కోసం ఈ క్రింది వీడియో వీక్షించండి. ఈ క్రింది వీడియోలో Ubuntu 18.04 LTS వెర్షన్ ఇన్ స్టాలేషన్ చూపించారు. మీరు Ubuntu సైటు నుండి ‘ttps://ubuntu.com/’ ubuntu20.04 LTS డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి

విండోస్ ఓస్ తోబాటు Ubuntu ఇన్ స్టాల్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇన్ స్టాల్ చేసుకోవాలి. లేకపోతే మీ కంప్యూటర్ నందు ఇన్ స్టాల్ చేయబడిన ఓస్ తోబాటు మీ కంప్యూటర్ నందు డేటా కూడా డిలిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటికి రెండు సార్లు పార్టిషన్ విషయంలో, డిస్క్ సెలక్షన్ విషయంలో సరిచూసుకుని ఫార్మట్ చేయాలి.

మీ కంప్యూటర్లో కేవలం Ubuntu ఆపరేటింగ్ సిస్టం మాత్రమే వాడుకోవడానికి లేదా విండోస్ తోబాటు వాడుకోవడానికి మీరు Ubuntu ఓస్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. మీ కంప్యూటర్లో Ubuntu ఓస్ ఇన్ స్టాల్ చేసుకునే ముందు, మీ కంప్యూటర్ డేటా బేకప్ తీసుకోవడం సరైన చర్య. మీ కంప్యూటర్ నుండి డేటాను సురక్షితంగా సేవ్ చేసుకుని, కంప్యూటర్ ఫార్మట్ చేయడం మేలైన పద్దతి.

మరొక పోస్టులో Ubuntu ఓస్ నందు ఉచితంగా లభించే కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం…