2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఇంకా మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశి పవిత్ర తిధులు వస్తాయి. అయితే మక్కోటి ఏకాదశిని మరింత పరమ పవిత్రమైన కాలంగా చెబుతారు. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన కాలంతో 2023సంవత్సరం మనకు స్వాగతం పలుకుతుంది. జనవరి ఫస్ట్ వేడుకలు ముగించుకుని వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుదర్శనం చేసుకుని 2023వ సంవత్సరం ప్రారంభించవచ్చును. 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?
2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

2023జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి తిది వస్తుంది. ముక్కోటి ఏకాదశి పరమ పుణ్యకాలం ఎందుకంటే దేవతలకు ఈ సమయం తెల్లవారుజామువేళ. కావునా ఆ సమయంలో దేవతలు విష్ణువు సన్నిధిలో ఉంటారు. మనము అదే వేళలో విష్ణు దర్శనం ఉత్తర ద్వారం ద్వారా చేసుకుంటే, అది మోక్షమును కూడా అందిస్తుందని అంటారు.

ఈ రోజున మూడు కోట్ల దేవతలు వైకుంఠంలో విష్ణుమూర్తి సన్నిధిలో ఉంటారని అంటారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి తిధినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఇక ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే, మోక్షం లభిస్తుందని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు.

ముక్కోటి ఏకాదశి తిధి సమయంలో విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడానికి వైష్ణవ దేవాలయాలు భారీగా ముస్తాబు చేస్తారు. ఆ తిధి రోజు అశేష భక్తులు వైకుంఠుడి దర్శనం చేసుకుంటారు. వీక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు మక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు.

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుగులో

వైకుంఠుడి దర్శనం శుభప్రదం ముక్కోటి ఏకాదశి రోజు పరమపుణ్యప్రదం…. మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మీ మనసు ఆ వైకుంఠుడిని ఆరాదించి, విష్ణువు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?
2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

అమ్మ ఆశీర్వాదం, తండ్రి అనుగ్రహం, ముక్కోటి ఏకాదశి దైవానుగ్రహం… మీకు మీ కుటుంబ సభ్యులకు ఇవన్నీ కలగాలని కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

ముక్కోటి ఏకాదశి రోజున అత్యంత భక్తితో విష్ణుమూర్తి దర్శనం పరమ పుణ్య ప్రదం… ఆ దేవ దేవుని అనుగ్రహం మీపై మీకుటుంబ సభ్యులపై కలగాలని కోరుకుంటూ… మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

నూతన సంవత్సరం వేడుక వెళ్లగానే సంతోషంగా ముక్కోటి ఏకాదశి రోజున పుణ్యం కూడా చేసుకోమని 2023 సంవత్సరం చెబుతుంది. మీకు మరియు మీ కుటుంబ సభ్యులపై వైకుంఠుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ…

నూతన సంవత్సరం మరియు ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు

2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?
2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

మన బలం ఆద్యాత్మిక బలం, అరుదైన సందర్భములలో వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటూ ఆ బలం మరింత పెంచుకోవాలి… ముక్కోటి ఏకాదశి పరమ పుణ్యకాలం… మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరం సంతోషంగా ప్రారంభించాం… ఆ మరుసటి రోజే ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించుకోవాలి…. మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

నీ మంచి మనసుకు పుణ్యకాలంతో పనిలేదు కానీ కర్మ ప్రకారం కాలం తెచ్చే కష్టాలు తట్టుకోవడానికి దైవబలం అవసరం కాబట్టి నీ మంచి మనసుకు ఆ దైవానుగ్రహం ముక్కోటి ఏకాదశి తిధి రోజు నీకు కలగాలని కోరుకుంటూ… నీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

తెలుగురీడ్స్

తెలుగువ్యాసాలు

జనవేదం