పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు

పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా వచ్చి అత్తారింటికి దారేది గోపాలా గోపాల అన్న సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడుల అజ్నతవాసిగా వచ్చి ప్రస్తుతం తెరనుండి కాకుండా నేరుగా ప్రజల్లో వెలుగుతున్న పవర్ స్టార్.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

పవన్ కళ్యాణ్ మూవీస్ – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ ఫస్ట్ ఫిలిం.

మెగాస్టారు చిరంజీవి చినతమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగుచలనచిత్రంతో ఆంధ్ర-తెలంగాణా రాష్ట్ర ప్రజలకు తెరపై పరిచయం అయ్యారు. 1996 లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో చిరంజీవి సోదరుడు హీరో అయితే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరొయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కాలేజీ ప్రేమకధ ఊరిలో పెద్దల పట్టుదల మద్య ప్రేమికులుగా కళ్యాణ్ – సుప్రియలు నటించారు. ఈచిత్రానికి పవన్ పేరు కళ్యాణ్ గానే పరిగణించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పవన్ కళ్యాణ్ కి కళ్యాణ్ గా తొలి చిత్రం.

తమిళంలో హిట్టైన గోకులత్తిల్ సీత చిత్రం ఆధారంగా తెలుగులో పునర్మించిన చిత్రం గోకులంలో సీత, ఈ చిత్రానికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారు. పవన్ కళ్యాణ్ రెండవచిత్రంలో రాశి కధానాయకగా హరీష్ సహానటుడుగా నటించిన తెలుగు చలన చిత్రం. కేవలం సుఖాల వెంట తిరిగే వ్యక్తి, తన స్నేహితుడి కోసం పెళ్లిపీటల మీద నుండి అమ్మాయిని తీసుకువచ్చాక, స్నేహితుడు కాదంటే, ఆ అమ్మాయికి ఆశ్రయం కల్పించి, ఆ అమ్మాయి సహవాసంలో చెడుసావాసలకు దూరమయ్యే డబ్బున్నవ్యక్తిగా, ఆమెను ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నటించారు.

పవన్ కళ్యాణ్ మూడవ తెలుగుచలనచిత్రంగా సుస్వాగతం తెలుగుచలనచిత్రం కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువ ప్రేక్షకులకు ప్రేమసందేశాన్ని అందించారు. ఆకర్షణ అనో ప్రేమ అనో యువత సమయం వృదా చేసుకోరాదు, అలా చేసుకున్న యువకుడు జీవితం ఎలా ఉంటుందో ఈచిత్రం ద్వారా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుగారు చక్కగా చూపించారు. ప్రేమించే తండ్రి, ప్రాణమిచ్చే స్నేహితుల మద్యలో ఒక యువకుడు ఒక యువతి ప్రేమకోసం, ఆమె అంగీకారం కోసం నాలుగు సంవత్సరాలు వేచి ఉండే యువకుడు పాత్రలో పవన్ నటన చక్కగా ఉంటే, పాటలు మంచి ప్రజాదరణను పొందాయి. ఆలయాన హారతిలో ఆఖిరి చితిమంటలలో అంటూ చిత్రం ఆఖరున వచ్చే పాట కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఉంటూ ఆకట్టుకుంటుంది.

తొలిప్రేమ ప్రేమకధా చిత్రాలలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా – పవన్ కళ్యాణ్ మూవీస్

సుస్వాగతం చిత్రంతో యువతకు మంచి మెసేజ్ అందిస్తే, తొలిప్రేమ చిత్రంతో లక్ష్యం ఎంత గొప్పదో నిజమైన ప్రేమ ఏమి చేస్తుందో తొలిప్రేమ చిత్రం ద్వారా మధ్యతరగతి కుటుంబ భావనలతో సాగే చిత్రం యువతను బాగా ఆకర్షిస్తే, ఆ చిత్రం నిదానంగా సాధించిన విజయం ఇప్పటికి ఆ చిత్ర దర్శకుడుకి అంతటి స్థాయిలో పేరు తెచ్చిన చిత్రం మరేది రాలేదు. కుటుంబంలో అఖిరి కొడుకుగా నాన్నతో చివాట్లు తింటూ పెదనాన్న అభిమానంతో సరదాగా స్నేహితులతో గడిపేస్తూ ఉండే అబ్బాయి మదిలో అలజడి సృష్టించిన ఒక దీపావళి తెల్లవారుజాము అతని జీవితాన్నే ఏవిధంగా మలుపు తిప్పిందో చిత్రం చూస్తేనే బాగుటుంది. కొన్ని చిత్రాలకు విశ్లేషణ కన్నా వీక్షణ ఉత్తమం అలాంటి చిత్రాల్లో తొలిప్రేమ తెలుగుచలనచిత్రం ఒకటి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి, అలీ తదితరులు నటించగా ఏకరుణాకరన్ దర్శకత్వం వహించారు.

తమ్ముడు టైటిల్ కి తగ్గ పాత్రలలో నటించడం పవన్ చిత్రాల్లో మొదటి చిత్రం నుండి కనబడుతుంది. అలాగే తమ్ముడు చిత్రంలో కూడా ఆదర్శంగా ఉండే అన్నకి తమ్ముడుగా, అఖిరికి అన్నఆశయాన్ని నెరవేర్చే తమ్ముడుగా, ఎప్పుడు తండ్రితో తిట్లు తినే చిన్నవాడిగా ఉంటూ, చివరికి తండ్రి శభాస్ అనిపించుకునే కొడుకు పాత్రలో పవన్ నటన యూత్ కి అద్బుతంగా అనిపించింది. ఇంకా ఈ చిత్రంలో ప్రక్కనే ప్రేమ ఉన్నా పట్టించుకోకుండా పోకడలను పట్టుకుని ఆకర్షణని ప్రేమ అనుకుని తిరిగే కుర్రవాడిగా కూడా పవన్ చాలా చక్కగా నటించారు. చిరంజీవికి తగ్గ తమ్ముడుగా తమ్ముడు తెలుగుచలనచిత్రంతో పవన్ అందరితో అనిపించుకున్నారు. తమ్ముడు చిత్రానికి ఏఅరుణప్రసాద్ దర్శకత్వం వహించగా ప్రీతిజింగానియా, అదితి గోవిత్రికర్ హీరొయిన్లుగా నటించారు.

పవన్ కళ్యాణ్ బద్రి – ఖుషి సూపర్ డూపర్ హిట్ తెలుగు చిత్రాలు

బద్రి టైటిల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో పవన్ నటనే హైలైట్ ఈచిత్రానికి. నువ్వు నందా అయితే ఎవడిక్కావాలి నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ డైలాగు పవర్ ఫుల్ డైలాగ్. ప్రకాష్ రాజు నందగా పవన్ బద్రిగా పోటిపడి నటించిన ఈ చిత్రానికి ప్రసిద్ద దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తిగా, ప్రియురాలితో పందెం కట్టి ఇంకొక అమ్మాయితో ప్రేమ నాటకం మొదలుపెట్టి, ఆ అమ్మాయితో ప్రేమలో పడడంతో ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధ చిత్రంగా మారుతుంది. రేణుదేశాయ్, అమీషాపటేల్, అలీ తదితరులు నటించిన ఈతెలుగుచలనచిత్రం చక్కటి ప్రజాదరణను పొందింది.

ఖుషి తెలుగుచలనచిత్రం చూస్తున్నంతసేపు ఖుషిగానే చిత్రకధనం సాగుతుంది. చక్కటి కాలేజీ ప్రేమ కధకు ఇగో ఉన్న అమ్మాయి పాత్రదారి అయితే ఆ ప్రేమికుడు పడే పాట్లు ఈచిత్రంలో చాల చక్కగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ భూమిక ప్రేమికులుగా ఈచిత్రం అందరిని అలరించి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం నిలిచింది. ఫైట్లలో చిరంజీవి చిత్రాలు ప్రసిద్ది అయితే ఖుషి చిత్రం తరువాత చిరంజీవి తన చిత్రానికి కూడా ఫైట్ కంపోజ్ పవన్ కళ్యాణ్ చేయించుకోవడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ జె సూర్య. పవన్ కళ్యాణ్ తారస్థాయిలో తీసుకువెళ్ళిన చిత్రం, ఖుషి తెలుగుచలనచిత్రం.

స్వీయ దర్శకత్వం – పవన్ కళ్యాణ్ మూవీస్

వరుస ఏడు హిట్ చిత్రాల హీరో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో భారి అంచనాల మద్య వచ్చిన జానీ తెలుగు చలనచిత్రం హాలీవుడ్ చిత్రానికి దగ్గరగా సగటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా నిలబడి, పవన్ కళ్యాణ్ మరియు పవన్ ఫాన్స్ కి నిరాశపరిచింది. రేణుదేశాయ్ పవన్ జంటగా వచ్చిన ఈతెలుగుచలనచిత్రం హాలీవుడ్ చిత్రం తరహాలో కధనం సాగుతూ సగటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా సన్నివేశాలు ఉంటూ భారిగా ఫెయిల్ అయిన చిత్రాల్లో చేరిపోయింది. ఖుషి వరకు ప్రతి చిత్రంతో అంచనాలు అందుకుంటూ అన్ని చిత్రాలతో అందరిని ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ జానీ చిత్రం విడుదల తర్వాత అంచనాలు తలక్రిందులు చేసింది.

ఇక అటుతరువాత వచ్చిన గుడుంబా శంకర్ తెలుగుచలనచిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించగా మీరాజాస్మిన్ జతగా నటించింది. ఈచిత్రం ఒక చిల్లర దొంగతనాలు చేసే దొంగగా, ఆపదలో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడి, ఆ అమ్మాయి ఆపదను తొలగించడానికి ఆ దొంగ పడేపాట్లు ఈ చిత్ర కధాంశం. అయితే గుడుంబాశంకర్ చిత్రం పవన్ కి తగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాని పాటలు ప్రాచుర్యం పొందాయి.

తొలిప్రేమ దర్శకహీరోల కాంబినేషన్ బాలు తెలుగుచలనచిత్రంతో పునరావృతం అయ్యింది. బాలు తొలిప్రేమచిత్రంలో పాత్రపేరు, అదే టైటిల్ ఆ చిత్రదర్శకుడుతో వచ్చిన బాలు చిత్రంలో శ్రియ, నేహ ఒబెరాయ్ జతగా నటించారు. పాటలు ప్రజాదరణ పొందాయి, చిత్రం విజయవంతం అయినా పవన్ పూర్వస్థాయిలో విజయం సాధించలేకపోయింది అప్పటికి, అయితే చిత్రం రెండవభాగం బాగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగం హాస్యభరితంగా సాగిన రెండవ భాగం కధనం బాగుంటుంది. అమ్మాయి కోసం అన్ని చేసే పెట్టె ఒక యువకుడు అనే అర్ధం వచ్చే లా బాలు టైటిల్ ట్యాగ్ లైన్ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ మూవీస్ – బంగారం

పవన్ కళ్యాణ్ బాలు తరువాత బంగారంగా ప్రేక్షకుల వద్దకు వచ్చారు. ప్రేమంటే పడని పని అంటే పడిపడి చేసే ఒక యువకుడు, సాటి యువతి ప్రేమ కోసం యుద్దమే చేస్తాడు. తన అవసరం తీరిన తనదారిన తాను పోకుండా, ఉపకారం పొందిన ఇంటిపెద్దకి ఇష్టం లేకపోయిన ఆ ఇంటి కూతురు ప్రేమని రక్షించి బంగారంగానే నిలబడతాడు. పాటలు చక్కగా ఉంటాయి, పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రీమసేన్ ప్రధానంగా నటించారు. ఈచిత్రంలో కేవలం ఇంకొకరి ప్రేమకోసం పాటుపడే కధానాయకుడుగానే ఉంటాడు, ప్రేమకోసం కాకుండా పనికోసం పాటుపడే యువకుడుగా పవన్ నటన బాగుంటుంది. Pawan Kalyan’s Eleventh Movie is Bangaram. ఈ చిత్రానికి దర్శకుడు తమిళ చిత్రాల దర్శకుడు ధరణి దర్శకత్వం వహించారు.

అన్నగా అన్నవరం ప్రేమికుడుగా తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్

చెల్లెలుపై మిక్కిలి మమకారం ఉన్న అన్నగా అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ చిత్రంలో నటించారు. చెల్లెలు అంటే అమితమైన అభిమానం ఉన్న అన్నయ్యగా ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించి, అక్కడ చెల్లెలు కాపురానికి అడ్డుగా ఉన్నసామజిక పరిస్థితులపై పోరాటం చేసి, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తులను అందుకు సహకరించే పెద్దమనుషులకు బుద్ది చెబుతాడు. సమాజంలో చెడు సాధారణ జీవితానికి ఎలా అడ్డంకిగా ఉంటుందో ఈ చిత్రంలో కనబడుతుంది. పవన్ కళ్యాణ్ అన్నగా నటిస్తే, అతడికి చెల్లెలిగా ప్రేమిస్తే ఫేం సంధ్య నటించింది. పవన్ కళ్యాణ్ కి జతగా అసిన్ నటించింది. సుస్వాగతం హీరోదర్శక కాంబినేషన్లో ఈతెలుగుచలనచిత్రం వచ్చింది. Annavaram Powerstar Pawan Kalyan’s Twelth Movie as hero.

Pawan Kalyan Thirteenth Film is Jalsa, Super Hit entertainer. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు చిత్రంలో నటించాల్సిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా తెలుగుచలనచిత్రంలో నటించడం విశేషం. ఈచిత్రం పవన్ అభిమానులకు ఖుషిలాగా జల్సా తెచ్చింది. పునరావాసం పొందిన నక్శలైట్ , కాలేజీలో చదువుకునే స్టూడెంట్ పాత్రలో పవన్ నటించారు. ఒక పోలీసు అధికారికి ఉన్న ఇద్దరి అక్కచెల్లెలికి ఒకే ప్రేమికుడుగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ప్రకాష్ రాజ్ పోలీసు అధికారిగా నటిస్తే, పోలీసు అధికారి కూతుళ్ళుగా  ఇలియానా, కమిలినిముఖర్జీ నటించారు. పార్వతి మెల్టన్ ఇలియానాకు స్నేహితురాలుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించారు. ఈ చిత్రంలో పాటలు ప్రజాదరణ పొందాయి.

ఖుషి సూపర్ హిట్ మూవీ

ఖుషి కాంబినేషన్లో హీరోదర్శకులతో పులి తెలుగుచలనచిత్రం వచ్చింది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసు పాత్రలో పవన్ నటన బాగున్నా చిత్రం ఆశించనంత విజయం సాధించలేకపోయింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జతగా నికిష పటేల్ నటించింది.

పులి తరువాత తీన్ మార్ చిత్రంలో పవన్ నటించారు. అమ్మాయితో మాట్లాడాలంటే సంవత్సరాల సమయం పట్టే కాలం, అమ్మాయితో రోజుల వ్యవధిలోనే తెగతెంపులు చేసుకునే కాలానికి పోల్చుతూ ఈ చిత్రంలో ఒకే సమయంలో రెండు తరాల ప్రేమకధలు కనిపిస్తూ కధనం సాగుతుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో త్రిష, కృతి కర్బందా పవన్ కళ్యాణ్ కి జతగా నటించారు. ప్రస్తుతంలో అందాలని ఆస్వాదిస్తూ ఉండే యువకుడు గడిచిన ప్రేమకధని వింటూ, తన జీవితంలో ప్రేమను పొందే యువకుడు కధగా ఈ చిత్రం ఉంటుంది. గతంలో ప్రస్తుతంలో ప్రేమకధలలో కధానాయకుడుగా పవన్ కళ్యాణ్ నటన బాగుటుంది. పాటలు బాగుంటాయి.

పవన్ పంజా గబ్బర్ సింగ్ చిత్రంలో

వివాదమైన న్యాయం ఉంటే ఆ వివాదానికి ప్రాచుర్యం లభిస్తుంది. పంజా చిత్రంలో ఒక క్రిమినల్ నిజాయతీ, అతని అంతరంగంలో ఉండే ఆవేదన చిత్రంలో పవన్ నటనలో కనబడుతుంది. యాక్షన్ త్రిల్లర్ గా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన పంజా చిత్రం కమర్షియల్ విజయం సాధించలేకపోయిన హీరో నటనపరంగా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్, జాకిష్రాఫ్, సారా జేన్, అలీ తదితరులు నటించారు. జై పాత్రలో పవన్ నటనతో ఈచిత్రంలోమెప్పించారు. తనను చేరదీసిన యజమాని కొడుకు దురాగతాలను అడ్డుకోవడానికి, యజమానిపై ఉండే విశ్వాసానికి ప్రతీకగా ఒక నేరస్తుడు మదిలో మెదిలే సంఘర్షణ యాక్షన్ త్రిల్లర్ గా ఈ చిత్రంలో ఉంటుంది.

హిందీలో విజయవంతమైన చిత్రం ఆధారంగా ఒక తిక్క పోలీసు ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ధియేటర్లో కూర్చున్న వ్యక్తి విరామం కోసం వేచి చూడకుండా దృష్టి తెరపైనే ఉంచగలిగే కధనం ఉంటే ఆ చిత్రం సూపర్ హిట్టే. గబ్బర్ సింగ్ చిత్రం చూస్తున్నంత సేపు చిత్రంలో లీనమవ్వడమే ఈ చిత్ర కధనం తిక్క పోలీసు ఆఫీసర్ నటన ప్రత్యేకత. పవన్ కళ్యాణ్, శృతిహసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది డైలాగ్ ప్రసిద్ది చెందింది. పాటలు అన్ని ఆకట్టుకునే విధంగా చక్కగా ఉంటాయి. తిక్క పోలీసు ఆఫీసర్ ప్రేమ కధలో పవన్ నటన ఆకట్టుకుంటుంది.

కెమెరా మేన్ గంగతో రాంబాబుగా టివి విలేకరిగా పనిచేస్తూ సమాజ సేవ చేసే బాద్యత కలిగిన పౌరుడుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారు. రాంబాబు పవన్ కళ్యాణ్ అయితే గంగగా తమన్నా నటించింది. ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయంగా అతని ఆకృత్యాలను అడ్డుకునే టివి విలేఖరిగా, చివరికి అతనిపై పోరాటానికి యువతలో చైతన్యం కలిపించి పోరాడే పాత్రలో పవన్ నటిస్తే, ప్రతిపక్ష నాయుకుడు కొడుకుగా ప్రకాష్ రాజ్ నటించారు. బద్రి దర్శకహీరో కాంబినేషన్లో కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం రావడం విశేషం. సామాజికమైన అంశాలకు సహజంగా స్పందించే వ్యక్తిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇప్పుడు సమాజ సేవకోసం రాజకీయాలలోకి వచ్చి జనసేనపార్టికి నాయకత్వం వహిస్తున్నారు.

సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది అంటూ అందరిని అలరించిన పవన్ కళ్యాణ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ తెలుగుచలనచిత్రంగా నిలించింది. జల్సా దర్శకహీరో కాంబినేషన్లో ఈచిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రేమకోసం ఇంటినుండి దూరంగా ఉంటున్న అత్తకోసం అల్లుడు పడేపాట్లు, అత్తకూతుళ్ళతో ఆటలు ఈచిత్రం సాగి, చివరికి సెంటిమెంట్ సన్నివేశంతో అందరిని ఆకట్టుకుంటుంది. అత్తగా నదియా నటిస్తే, మరదళ్ళుగా సమంతా, ప్రణీత నటించారు. ఒక మిల్లినియర్ పాత్రలో పవన్ నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలు, కధనం, సెంటిమెంట్, కామెడీ అన్నింటితో అందరిని అలరించే అత్తారింటికి దారేది. నెట్లో సగం సినిమా లీక్ అయ్యిన సూపర్ హిట్ అయ్యిన చిత్రం.

పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలయికలో వచ్చిన బహుతార తెలుగుచలనచిత్రం గోపాల గోపాల ఒక గోపాల భక్తుడు అయితే ఇంకో గోపాల దేవుడు. భక్తుడుగా వెంకటేష్ నటిస్తే, భగవానుడుగా పవన్ కళ్యాణ్ నటించారు. భక్తీ ముసుగులో కొంతమంది చేసే మోసాలను ఎండగడుతూ, పోరాడే ఒక భక్తుడు కోసం దిగివచ్చిన దేవుడుగా పవన్ ఈ తెలుగుచలనచిత్రంలో నటించారు. వెంకటేశ, శ్రియ భక్తులుగా నటించిన ఈ చిత్రంలో విష్ణువు అవతారం కృష్ణుడుగా పవన్ కళ్యాణ్ నటించి మెప్పించారు. హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు.

గబ్బర్ సింగ్ చిత్రానికి అనుకరణ చిత్రంగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది, కానీ గబ్బర్ సింగ్ స్థాయిలో ఈ చిత్రం విజయవంతం కాలేకపోయింది. ఎదురులేని ఒక వ్యక్తి నిర్మించుకున్న దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చి, అతని నుండి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిని, ఆమె ఆస్తిని రక్షించే పోలీసు పాత్రలో అలాగే ఆమెకు ప్రియుడుగా ఈ తెలుగుచలనచిత్రంలో పవన్ కళ్యాణ్ కనబడతారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పండిన హాస్యం ఈచిత్రంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు.

కాటమరాయుడు అత్తారింటికి దారేది చిత్రంలో పాట పల్లవి, అదే పేరుతో ఒక ఊరి పెద్దమనిషి పాత్రలో పవన్ నటించారు. ఆడవాళ్లంటే పడని వ్యక్తిగా తమ్ముళ్ళతో కలిసి ఉంటాడు. అయితే అతని తమ్ముళ్ళ తమ ప్రేమ ఫలించాలంటే అన్నకూడా ప్రేమలో పడాలని, భావించి, అతని జీవితంలోకి అవంతిక అనే అమ్మాయి వచ్చేలా చేస్తారు. అమ్మయాలంటే ఇష్టంలేని పెద్దమనిషికి అవంతికతో ఎలా ప్రవర్తించడం, ఆ అమ్మాయి కుటుంబ సమస్యని పరిష్కరించడం కోసం చూడడం ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శ్రుతి హసన్ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం కాటమరాయుడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడుసార్లు నటించిన పవన్ కళ్యాణ్

జల్సా చేసి అత్తారింటికి దారేది అంటూ అందరిని ఆనందింప చేసిన కాంబినేషన్ అజ్ఞాతవాసి తెలుగుచలనచిత్రంతో అభిమానులను నిరాశపరిచారు. తన తండ్రిని చంపినవారి ఆచూకికోసం తన కంపెనీలోనే ఒక ఉద్యోగిగా చేరి, వారిని తుదమొట్టించడమే ఈ చిత్ర కధాంశం. పవన్ కళ్యాణ్ కి జతగా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చిత్రాలు