Ubuntu Software Like Windows Store

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ మాదిరి మాదిరి Ubunutu ఆపరేటింగ్ సిస్టంలో కూడా స్టోర్ ఉంటుంది, Ubuntu Software Like Windows Store. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ అప్లికేషన్ ఉంటాయి. ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ Ubunutu Software లో ఎక్కువగా కనబడతాయి. ఈ సాఫ్ట్ వేర్ నందు కనబడే ఐకాన్లపై క్లిక్ చేసి, ఆయా సాఫ్ట్ వేర్లు మీ డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ సిస్టమ్స్ లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

Ubuntu Software Like Windows Store
Ubuntu Software Like Windows Store

టాప్ మెనుబార్ నందు లెష్ట్ సైడ్ లో సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ పై క్లిక్ చేసి, మీకు కావాల్సిన సాఫ్ట్ వేర్ సెర్చ్ చేయవచ్చును. మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ సిస్టంకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, సాఫ్ట్ వేర్స్ ఇంకా లోడ్ అవుతాయి. సెర్జ్ కీవర్డుకు సంబంధించిన సాఫ్ట వేర్స్ ఉంటే, మీకు ఇందులో కనబడతాయి. లేకపోతే మీకు కావాల్సిన సాఫ్ట్ వేర్ ను ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.

Ubunutu Software నందు టాప్ మెను బార్ లో మిడిల్ గా ఉన్న మెనునావ్ లో మూడు మెనులు ఉన్నాయి. ఒక్కటి Explore(ఎక్స్ ప్లోర్), రెండు Installed(ఇన్ స్టాల్డ్) మూడు Updates(అప్ డేట్స్). ఈ మూడింటి గురించి చూద్దాం.

Ubuntu Software Like Windows Store
Ubuntu Software Like Windows Store

ఒక్కటి Explore(ఎక్స్ ప్లోర్): అంటే ఎక్స్ ఫోజ్ చూపించడం… Ubunutu Software లో ఈ మెను హైలెట్ అయ్యి ఉంటే, కొత్తగా మీరు మీ కంప్యూటర్ లేక ల్యాప్ టాప్ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవడానికి అనువుగా ఉన్న సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ ఇక్కడ చూపబడతాయి. ఇందులో మీరు లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉన్న సెర్చ్ బటన్ ద్వారా అప్లికేషన్ సెర్చ్ చేయవచ్చును. లేదా అక్కడ ఉన్న వివిధ కేటగిరిలలో నుండి అప్లికేషన్ సెర్చ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. వర్గాల (కేటగిరి) వారీగా చూస్తున్నప్పుడు, మీ Ubunutu సిస్టంలో ఇన్ స్టాల్ చేయబడినవి, చేయబడనవి కూడా చూపబడతాయి. అవసరం అయిన అప్లికేషన్ పై క్లిక్ చేసి, ఆ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

ఇందులో Categories(వర్గాలు)-

Audio & Video (ఆడియో మరియు వీడియో)

Communication & News (కమ్యూనికేషన్ మరియు న్యూస్)

Productivity (ప్రొడక్టివిటీ)

Games (గేమ్స్)

Graphics & Photography (గ్రాఫిక్స్ మరియు ఫోటోగ్రఫి)

Add-ons (యాడ్ ఆన్స్)

Developer Tools (డవలపర్ టూల్స్)

Education & Science (ఎడ్యుకేషన్ మరియు సైన్స్)

Utilities (యుటిలిటీస్)

పై విధంగా వర్గాలుగా మీకు ఎక్స్ ఫ్లోర్ మెనులో కనబడతాయి. ఆయా వర్గాలలో ఇమేజ్ డాక్యుమెంట్ క్రియేటర్, ఆఫీసు టూల్స్, ఫోటో ఎడిటింగ్ టూల్స్, వీడియో ఎడిటింగ్ టూల్స్, బ్రౌజర్లు, కోడింగ్ అప్లికేషన్స్ తదితర సాఫ్ట్ వేర్స్ అందుబాటులో ఉంటాయి.

రెండు Installed(ఇన్ స్టాల్డ్): Ubunutu Software లో కనబడే ఈ మెనును మీరు క్లిక్ చేస్తేనే హైలెట్ అవుతుంది. అది హైలెట్ అయ్యాక అందులో మీకు కనబడే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ అన్ని మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. మీ Ubunutu సిస్టం ఫార్మేట్ చేసేటప్పుడు, లేదా మీ చేత కానీ ఈ అప్లికేషన్స్ ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. కొన్ని రకాల బేసిక్ గేమ్స్ కూడా ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. మీకు ఇందలో గేమ్స్ కానీ, అప్లికేషన్స్ కానీ అవసరం లేదని భావిస్టే, వాటిని Ubunutu Software నుండి రిమూవ్ చేస్తే, అవి మీ సిస్టం నుండి తొలగింపబడతాయి.

మూడు Updates(అప్ డేట్స్): ఈ మెను కూడా మీరు క్లిక్ చేస్తేనే హైలెట్ అవుతుంది. సాదారణంగా ఇందులో అప్లికేషన్ లిస్టు కనబడదు. ఎందుకంటే, Ubunutu Software ఎప్పటికప్పుడు అప్డేట్ అడుగుతుంది. మీ సిస్టంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఎల్లప్పుడూ ఉంటే, Ubunutu Software ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. మీ సిస్టం నందు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఏదైనా అప్డేట్ పెండింగ్ ఉంటే, ఈ Ubunutu Software లో అప్టేట్ మెను నందు కనబడతాయి.

ధన్యవాదలు