ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు? చాలా చాలమందికి తెలిసిన సమాధానమే. కానీ ఈ ప్రశ్న ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పాఠ్యపుస్తకాలలో వచ్చే ప్రశ్న అవుతుంది. ముఖ్యమంత్రి హోదా, దాని గుర్తింపు వేరే లెవెల్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు కొత్తగా ఏమిటీ ప్రాధన్యత? గతంలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు కొందరికి గుర్తు ఉండకపోవచ్చును.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం చాలా ఫేమస్…. 2024 ఎన్నికల ముందు, ఎన్నికల వ్యూహం చెప్పి మరీ రాజకీయ పరిస్థితులను తలక్రిందులు చేసినవ్యక్తి. ఆ… ఏ చేస్తావులే? నీ మద్దతు? ఎవరికి లాభం ఉండదు. ముఖ్యం నీ గెలుపు ఒక ఎండమావి… ఎన్నో విమర్శలు. ఇంకా అవమానాలు. ఇంకా అతని అభిమానులకు అయితే, తలెత్తుకోగమలా ఈ సమాజంలో అనే ప్రశ్న… కానీ అభిమానులకు అండగా, మిత్రపక్షాలకు అండగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మార్గదర్శకంగా, అభివృద్దిని అటకెక్కించిన నాయకులకు సింహస్వప్నంగా మారాడు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

2024 ఎన్నికల ముందు ఏ పదవిలో పవన్ కళ్యాణ్ ఉంటారు అనుకునే వారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి మరింత పాపులారీటిని తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చగలిగితే, ఆ పదవికే వన్నె తెచ్చిన మొదటి ఉప ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు అంటే?

ఉప ముఖ్యమంత్రి మాములుగా మంత్రిగా ఉన్నట్టే కానీ ప్రధాన్యత, రాజకీయ ఫలితం అంతా ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళుతుంది. కానీ నేడు ఏపి ఉప ముఖ్యమంత్రికి ముందుగానే మంచి రాజకీయ నాయకుడుగా గుర్తింపు వచ్చింది. ఇంకా నమ్మదగిన నాయకునిగా నమ్మే జనులు అనేకమంది ఉన్నారు. రాష్టరాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 2024 ఎలక్షన్స్ గా పేరు పొందారు. అంతటి పాపులారిటీ వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి కి మరింత పాపులారిటీ వస్తుంది. ఆ పదవిలో అయన చేయబోయే మంచి పనులకు, ఆయనకే ఎక్కువ ప్రధాన్యత గుర్తింపు దక్కుతుంది.

జన సైనికులు పవన్ కళ్యాణ్ మాటపై పొత్తులో భాగంగా ఎక్కువకాలం తెదేపాతో సఖ్యతతో ఉంటే, అదే విధంగా తెదేపా అనుచరుల నుండి సఖ్యత ఉంటే, ఒకరికొకరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేదోడు వాదోడుగా ఉన్నట్టు ఇరు పార్టీల అనుచరుల మద్య సఖ్యతగా ఎక్కువగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ముఖ చిత్రం కూడా త్వరలోనే మారుతుంది. ముఖ్యమంత్రితో పోటీపడే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టిస్తారు.

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts