డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా ఇలాంటి పనులు చేసి, తమ డబ్బుని కోల్పోయేవారు ఉంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

అదేంటి దోచుకోబోయే చోటులు కూడా ఉన్నాయా?

అంటే అలా బోర్డు పెట్టి ఉంటే, అక్కడ డబ్బు ఎవరు దాయరు. కానీ అలాంటి అవకాశానికి ఆస్కారం ఉండవచ్చును.

ఇప్పుడు బ్యాంకులో డబ్బు దాచుకుంటే, ఆ డబ్బు బాద్యత ఆ బ్యాంకుదే. కాబట్టి బ్యాంక్ డిపాజిట్లు రూపంలో డబ్బులు దాచుకోవడం సురక్షితమేనని అంటారు.

షేర్ మార్కెట్…. ఇక్కడే దాచుకుంటున్న డబ్బులు పెరగవచ్చును… ఆవిరికావచ్చును.

కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టి, ఎటువంటి నిర్వాహక కార్యక్రమాలు లేకుండా డబ్బులు సంపాదించడానికి అనువైన మార్గం షేర్ మార్కెట్ అయితే, అందులో పెట్టుబడులు పెట్టేవారి డబ్బులు పెరిగే అవకాశం ఎలా ఉంటుందో? అవి ఆవిరయ్యిపోయే అవకాశం కూడా అంతే ఉంటుంది.

ఇక్కడ దాచుకున్న డబ్బులు మొత్తం పెట్టుబడి పెట్టడం కన్నా, అతి తక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టి, షేర్ మార్కెట్ పై పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే… దాచుకున్న డబ్బులో యాభై శాతం వరకు మాత్రమే పెట్టుబడిగా పెట్టి, లాభాలు కోసం చూడడం మేలు అంటారు.

ఉదాహరణకు మీ దగ్గర దాచుకున్న డబ్బు 4 లక్షలు ఉంది. దానిలో ఎంత మొత్తం షేర్ మార్కెట్ లో పెట్టడానికి

చూడాలి. అంటే 4 లక్షలలో పదవ వంతు డబ్బు పోయినా బాధాకరమే… ఇంకా చేజేతులా ఆ డబ్బుని పోగొట్టుకోవడం మరింత బాధాకరం. అయితే ఒక్కోసారి రిస్క్ చేసి, డబ్బు సంపాదించాలనే ఆలోచన పుడితే, దానికి పూనుకునేటప్పుడు తక్కువ మొత్తం ఉపయోగించాలి కాబట్టి మన దగ్గర నాలుగు లక్షలు ఉంటే, అందులో నాలుగు వేల నుండి నలభై వేలు వరకు డబ్బులు మాత్రమే ఉపయోగించుకోవడం మేలు.

షేర్ మార్కెట్లో పెట్టిన సొమ్ములు ఎలా పెరుగుతాయి? ఏఏ కంపెనీలలో పెట్టుబడులు పెడితే, ఎంత కాలంలో డబ్బులు పెరిగే అవకాశం ఉంది? ఏ కంపెనీలు ఎంత కాలం నుండి షేర్ మార్కెట్లో ఉన్నాయి? ఏఏ కంపెనీలు నిలకడగా లాభాలు గడిస్తున్నాయి? తదితర ప్రశ్నలు ప్రాక్టికల్ గా సమాధానాలు లభించినప్పుడు షేర్ మార్కెట్ పై అవగాహన వస్తుంది.

కావునా షేర్ మార్కెట్ లో అడుగుపెట్టేటప్పుడు పెట్టుబడులు స్వల్పంగా ఉండేవిధంగా చూసుకోవాలని నిపుణుల అభిప్రాయం.

ఇంతకీ దోచుకోబోయే చోటు ఎక్కడ?

ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఉండి, దానికి ఆన్ లైన్ ఖాతా ఉంటే, ఆన్ లైన్ ఖాతా వివరాలు కనక తస్కరింపబడితే, సదరు వ్యక్తి దాచిన డబ్బుల ఆన్ లైన్ మోసాల వలన డబ్బులో కోల్పోయే అవకాశం ఉంటుంది.

షేర్ మార్కెట్లో ఒక్కసారిగా దూసుకువచ్చి, విపరీతంగా లాభాలు వస్తున్నాయనే భ్రమ కలిగిన చోటు నమ్మలేం.

అవును షేర్ మార్కెట్లో కేవలం పెట్టుబడుల చేతనే డబ్బులను పెంచుకోవచ్చును.

కానీ ఒక్కసారిగా పెరిగిపోతున్న విలువలు, ఒక్కసారిగా దిగిపోవచ్చుననే సూత్రం మరవకూడదు.

ఒక్కొక్కసారి ఏదైనా కొత్తగా కంపెనీ లేని లాభాలు ఉన్నట్టుగా చూపించి, మార్కెట్లో పెట్టుబడిదారులను బురిడీ కొట్టించే అవకాశం ఉంటుంది.

త్వరిత గతిన ఎదుగుదల ఒక్కొక్కసారి ఉండవచ్చును… ఎప్పుడూ ఉండదు.

దీర్ఘకాలం సాగిన ఎదుగుదల, అప్పటికే దీర్ఘకాలం రన్నింగులో ఉన్నట్టు, ఇంకా దాని బ్రాండ్ విలువను బట్టి ఇంకా కొంతకాలం దాని విలువ ఉంటుంది. కాబట్టి లాభాలు తక్కువగానే ఉన్నా దీర్ఘకాలం నుండి మార్కెట్లో నిలకడగా ఉన్న కంపెనీలను చూడాలి.

అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి, ప్రశాంతంగా ఉండడం అసాధ్యం అంటారు. ఎందుకంటే ఎప్పుడూ లాభాలు ఆకస్మాత్తుగా పెరుగుతాయో? ఎప్పుడు లాభాలు కాదు అసలుకే మోసం వస్తుందో తెలియదు.

ఎందుకంటే షేర్ మార్కెట్ అంతా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

ఎప్పుడు షేర్ మార్కెట్ లో కంపెనీలపై నమ్మకం ఉండదు?

ఒక కంపెనీ లాభాలు లేకుండా లాభాలు వస్తున్నట్టు తప్పుడు లెక్కలు చూపిస్తూ, షేర్ మార్కెట్లో చలామణీ అవుతూ, దాని బండారం బయటపడ్డప్పుడు, మిగిలిన కొత్త కంపెనీల విషయంలో కూడా పెట్టుబడిదారులకు నమ్మకం సడలిపోవచ్చును.

ఏదైనా నమ్మకమైన మీడియా సంస్థలో కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగినప్పుడు.

షేర్ మార్కెట్లో ఉన్న కంపెనీ. తమ కంపెనీలో మూల ధనాన్ని, ఇతర అవసరాలకు తరలించి, కంపెనీ దివాలకు దారితీసినప్పుడు, ఇతర దీర్ఘకాలిక కంపెనీలపై కూడా పెట్టుబడిదారులు పునరాలోచనలో పడతారు.

అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే?

ఎప్పటికప్పుడు తాము పెట్టుబడి పెట్టిన కంపెనీ యొక్క యోగ సమాచారాలు తెలుసుకోవాలి.

మార్కెట్ పై ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను పరిశీలించాలి.

ప్రజలలో ఎక్కుగా ప్రభావితం చూపే అంశం ఉంటే, వాటి గురించి సమాజంలో రాబోయే మార్పులు కూడా అంచనా వేసుకోవాలి.

ముందుగా పుకార్లలో వాస్తవాలు గ్రహించాలి. పుకార్లు వాస్తవంగా కనబడుతూ అవాస్తవంగా ఉండవచ్చును. అవాస్తవంగా కనబడుతూ వాస్తవాన్ని ప్రచారం చేయవచ్చును. పుకార్లలో వాస్తవం ఎందుకు గ్రహించాలంటే, పుకార్ల వలననే నమ్మకం సడలిపోతుంది. మార్కెట్లో నమ్మకం ప్రధానం కాబట్టి…

స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అనేది కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల (ఆర్థిక లావాదేవీల యొక్క వదులుగా ఉండే నెట్‌వర్క్, భౌతిక సౌకర్యం లేదా వివిక్త సంస్థ కాదు) స్టాక్‌ల (షేర్లు అని కూడా పిలుస్తారు), ఇది వ్యాపారాలపై యాజమాన్య దావాలను సూచిస్తుంది;

వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడిన సెక్యూరిటీలు అలాగే ప్రైవేట్‌గా మాత్రమే వర్తకం చేయబడినవి కూడా ఉండవచ్చు. ఈక్విటీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడిదారులకు విక్రయించబడే ప్రైవేట్ కంపెనీల షేర్లు రెండో వాటికి ఉదాహరణలు. స్టాక్ ఎక్స్ఛేంజీలు సాధారణ ఈక్విటీ మరియు ఇతర భద్రతా రకాల షేర్లను జాబితా చేస్తాయి, ఉదా. కార్పొరేట్ బాండ్‌లు మరియు కన్వర్టిబుల్ బాండ్‌లు.

స్టాక్ మార్కెట్‌లో లాభాలను పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

బలమైన ఆర్థిక మరియు లాభదాయక చరిత్ర కలిగిన కంపెనీలలో పరిశోధన మరియు పెట్టుబడి పెట్టండి.

రిస్క్‌ని వ్యాప్తి చేయడానికి వివిధ పరిశ్రమలు మరియు కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచండి.

డాలర్ ధర సగటు మరియు విలువ పెట్టుబడి వంటి పెట్టుబడి వ్యూహాలను ఉపయోగించండి.

దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండండి మరియు స్వల్పకాలిక మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి.

మార్కెట్ ట్రెండ్‌లు మరియు వార్తల గురించి మీకు తెలియజేయండి, ఇది సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాల గురించి అనిశ్చితంగా ఉంటే ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌ను కలిగి ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం మరియు గత పనితీరు భవిష్యత్తు ఫలితాలను సూచించదు.

ప్రధానంగా దాచుకున్న డబ్బులు దోచుకుపోకుండా ఉండాలి. కాబట్టి ముందుగా అవగాహన చాలా అవసరం. షేర్ మార్కెట్ పై పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం మేలు. ‘డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా‘ తస్మాత్ జాగ్రత్త అవసరం.

ధన్యవాదాలు.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?