2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?

2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?

2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా? ఆ సంవత్సరం మూడు పార్టీలు ఒక్కటిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019లోని రాజకీయ పార్టీలు ఎవరికివారే అంటే, అందులో నిలబడి విజయం సాధించిన పార్టీ వైసిపి. మరి 2024 సంగతి ఏమిటి? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఇన్ ఏపి పాలిటిక్స్.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఇప్పటి అధికార పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఒక్కటై ముందుకు సాగాలి. ఇది అన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలిసిన సత్యమే. అయితే అందులో ఎవరు ఎటువంటి ఫలితం ఆశించి పొత్తులకు సిద్దపడతారో తెలియాలి? ఎవరికి గరిష్ట ప్రధాన్యత? ఇదే పెద్ద ప్రశ్నగా మారుతుంది.

గతంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్ళపాటు ఆ పార్టీని ప్రజలు ఆదరించేవారు. కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన నూతన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు మాత్రం ఐదేళ్ళకే ఒక ప్రభుత్వాన్ని తిరస్కరించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక రాబోయేది మూడవ ఎన్నికలు. ఏదైనా ఒక సంప్రదాయం కొనసాగించే అలవాటున్న ఆంధ్రప్రజలు రాబోయే 2024 ఎటువంటి తీర్పు చెబుతారో తెలియదు. కానీ ఇప్పటి నుండే పొత్తులకు రాజకీయ చర్చలు మొదలు అవుతున్నాయి.

ఐదేళ్ళకు ఒక ప్రభుత్వాన్ని తిరస్కరించిన ఆంధ్రా ప్రజలు మరలా అదే సంప్రదాయం కొనసాగిస్తే, రాబోయే రోజులలో మరొక కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్క అవకాశం అనుకుంటే మాత్రం… జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక ఐదేళ్ళు కొనసాగవచ్చును. ప్రజలతీర్పు ఎలా ఉండనుందో ఎవరు అంచనా వేయగలరు?

2024లో కొత్త ప్రభుత్వం రానుందా? 2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం

2014లోని రాజకీయ పొత్తులు 2024లోనూ పొడచూపితే, ప్రస్తుత ప్రభుత్వం రాబోయే రోజులలో మూడు పార్టీలకు గట్టి పోటీనివ్వాల్సి ఉంటుంది. వైసిపి ప్రభుత్వం తమ పధకాల గురించి, తమ ప్రభుత్వ విదానాల వలన ఏం అభివృద్ది జరిగిందో? ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రజల విశ్వాసం పొందితే, వైసిపి పార్టీ మరలా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు.

అభివృద్ది మంత్రం జపించినా ఓట్లేసిన ప్రజలు అభివృద్ది జరగలేదని భావిస్తే వెంటనే తిరస్కరించడం బహుశా ఏపిలోనే త్వరగా జరిగినట్టుగా ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో… జరిగిన రాజకీయ ప్రచారంలో చంద్రబాబునాయుడు గారి అభివృద్ది మాటలను ప్రజలు విశ్వసించారు. తరువాత ఎన్నికలలో వెంటనే ప్రభుత్వాన్ని తిరస్కరించారు. వేగంగా ప్రజల నిర్ణయం మార్పు చెందడం ఏపిలోనే కనబడింది.

రాష్ట్రం అభివృద్ది చెందితే, రాష్ట్రప్రజలకు ఆర్ధిక వనరులు పెరుగుతాయి. సంపాదన పెరుగుతుంది. సంపాదన పెరిగితే, ఖర్చు చేసే సామర్ధ్యం పెరుగుతుంది. ఖర్చు చేసే సామర్ధ్యం వలన కొనుగోళ్ళు పెరుగుతాయి. కొనుగోళ్ళు పెరిగితే, అమ్మేవారు పెరుగుతారు. అమ్మేవారు పెరిగితే, ఉత్పత్తిదారులు పెరుగుతారు. ఉత్పత్తిదారులు పెరిగితే, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగితే, రాష్ట్రాదాయం మరింతగా పెరుగుతుంది. రాష్ట్రాదాయం పెరిగితే, కొత్తగా పన్నులు పెంచడం కన్నా మరింతగా అభివృద్ది పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని అంటారు. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రజలకు ఆదాయ వనరులు పెరిగి, ప్రజలు కష్టపడి డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా పెంచే ప్రభుత్వాన్ని ఎప్పటికీ చరిత్రలో ఉండేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లిఖించుకుంటుంది. అలా రాష్ట్రం ఎప్పటికి అభివృద్ది చెందేను?

ఒకే ప్రభుత్వమును పదేళ్లు కొనసాగించని ప్రజలు అయితే, ఐదేళ్ళలోనే తమ పాలనతో అభివృద్దిని సృష్టించగలరా?

భవిష్యత్తు బాగుండాలంటే, ఇప్పటివారు కష్టపడాలి. అలా ప్రజలు కష్టపడి రాష్ట్ర ఆదాయం పెరగడంలో తమ వంతు పాత్రను పోషించడానికి సరైన వేదిక ఏర్పడాలి. అంటే అభివృద్ది జరగాలి. ఉపాధి పెరగాలి. ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు రావాలి. వ్యాపారాలు వృద్ది చెందాలి. పన్నులు సకాలంలో చెల్లించాలి…. అనేకానే రంగాలలో అభివృద్ది సాధిస్తేనే, స్వర్ణాంధ్రప్రదేశ్.

ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కృషిచేసినవారిని పొగుడుతారు. చేటు చేసినవారిని వదిలేస్తారు. మేలు చేసినవారికి గుర్తుపెట్టుకుంటారు. ఇలా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తననే సమాజం గుర్తు పెట్టుకుంటే, ఒక వ్యవస్థవంటి రాజకీయ పార్టీ చేసిన పనులను కూడా అలాగే గుర్తు పెట్టుకుంటుంది. ఇది అభివృద్ది కోసం ఆలోచన అయితే. రాబోయే రోజులలో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ప్రజలను ఎవరు ఎంతవరకు నమ్మిస్తారో? వారిదే విజయం. విజయం సాధించాకా ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే, ప్రభుత్వం పతనం కావడం ఖాయం.

రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 2024 దారెటు?

కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రములో రెండు ఎన్నికలలో రెండు పార్టీల ప్రభుత్వాల పాలన ఉంది. 2024లో మూడవ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో? ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం 2024 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తారు. ఒక్కసారి ప్రజలు నిర్ణయిస్తే, ఐదేళ్లకాలంపాటు వందల నిర్ణయాలు తీసుకునే అధికారం రాజకీయ పార్టీకు సొంతం అవుతుంది.

మరి 2024లో రాబోవు ఎన్నికలలో ఏపార్టీ ఎవరితో జతకడతాయి? ఎవరిని ప్రజలు ఆదరిస్తారు? ఎవరిని తిరస్కరిస్తారు? రాజకీయ చర్చలు జోరుగా సాగుతుంటాయి.

ఎవరెవరు ఎవరితో జట్టు? ఎవరెవరు ఎవరితో కటీఫ్ 2024 కోసం ఎదురు చూపులు మొదలు.

2014లో నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి… నాలుగు పార్టీలు రెండుగా పోటీ పడ్డాయి. ముగ్గురు కలిసి విజయం సాధించారు. మరి 2024లోనూ అదేతీరున పోటీ చేస్తారా? ఈ ప్రశ్నతోబాటు… అప్పటిలాగానే తెదేపా కు ఎక్కువ బాగం సీట్లు ఉంటాయా? లేక పొత్తు పార్టీలకు ఎక్కువ సీట్లు ఉంటాయా? పొత్తు పొడిచేదెప్పుడు? రాజకీయ చర్చలకు తెరపడేదెప్పుడు? 2024 దగ్గరలోనే తేలే అవకాశం ఉండవచ్చును. చతురతతో రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీల విదానం ఎలా ఉండబోతుందో? ఇప్పుడే చెప్పడం కష్టమే.

ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆంధ్ర ప్రజలు ఆశించేది రాష్ట్రాభివృద్ది… కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు గారి పాలనను బట్టి 2014లో ఓట్లేసి గెలిపించారు. 2019లో తృప్తి చెందని ప్రజలు 2019 కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఎంతవరకు ఉందో, అప్పుడే అంచానాకు రాలేము కానీ 2024 మాత్రం అభివృద్దిని చూసే, ఆంధ్రప్రజలు ఓటేస్తారని అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు ఎందుకంటే… ఏదో సెంటుమెంటు ప్రకారం రెండు అవకాశాలు కాదు… అభివృద్ది విషయంలో సంతృప్తి లేకపోతే తిరస్కరణ 2019లో ఎదురైతే, 2024 పరిస్థితి ఎలా ఉంటుందో? చూడాలి.

తెలుగురీడ్స్.కామ్

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

మనసుకు నచ్చే మంచి మాటలు

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

వివిధ విద్యావిషయాలు తెలుగు వ్యాసాలు

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో