మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును.
ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆచారంలోనే వేకువ వేళ నిద్రలేవడం, వేకువజామునే స్నానం చేసి, ధ్యానం చేయడం వంటివి ఉంటాయి. ఇటువంటి కర్మలను గురించి తెలియజేసే కొన్ని తెలుగు ఫ్రీ పిడిఎఫ్ తెలుగు బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను తాకండి.
ఎప్పటి ఆచారమో ఎంతమంది నుండి ఎంతమందికో వారసత్వంగా వస్తూ ఉంది. సాగుతూ ఉంది. అటువంటి ఆచారములో సందేహాలకు కూడా అవకాశం ఉంటుంది. అటువంటి ధర్మ సందేహాలు గురించి తెలియజేసే తెలుగు భక్తి ఫ్రీ పిడిఎఫ్ బుక్స్ ఈక్రింది బటన్లపై క్లిక్ చేసి రీడ్ చేయవచ్చును.
చనిపోదామని ఆలోచన చేసేవారిని, తమ మాట చేత కట్టడి చేయగలడమంటే, ఎంతో బుద్దివికాసం కలిగి ఉన్నవారికే సాధ్యం. అటువంటి చైతన్యవంతమైన బుద్ది హనుమంతునికి సొంతం. శ్రీరామాయణంలో హనుమంతుడు బుద్దివైభవం కనబడుతుంది.
హనుమంతుడు గురించిన తెలుగు భక్తి బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను క్లిక్ చేయండి.
భక్తులు గురించి తెలుసుకుంటే, భగవంతుడి అనుగ్రహం తెలుసుకునేవారిపై ఉంటుందని అంటారు. ఏదైవం గురించి ఆరాధించే భక్తుడి గురించి తెలుసుకుంటే, ఆదైవరూపంలో భగవానుడి అనుగ్రహం తెలుసుకునేవారికి కూడా కలుగుతుందంటారు. రామ భక్తుడిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, రామానుగ్రహం కలుగుతుంది. అలా శివభక్తులు, భవాని భక్తులు, అయ్యప్ప భక్తులు…
కొంతమంది గురించి, మహా భక్తులు తెలుగు పిఎడిఫ్ ఫ్రీ బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లపై క్లిక్ చేయండి.
సంప్రదాయంలో ఋషిరుణం తీరాలంటే, పురాణపఠం చేయాలంటారు. అటువంటి పురాణాలను అందించిన లేక అనువదించిన వారి గురించి తెలుగు బుక్స్…. గురువుల తెలుగు ఫ్రీ పిఎఎఫ్ బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను క్లిక్ చేయండి.
అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్ చదవడానికి ఈ పోస్టు చివరలో ఉన్న బటన్ పై క్లిక్ చేయగలరు.
అయ్యప్ప అనగానే నియమాల మాల మదిలో మెదులుతుంది. నియమంగా మాలధారణ స్వీకరించి, నియమంగా నిద్రలేచి, నియమంగా స్నానాది కార్యక్రములు చేసి, నియమంగా పూజచేసి, నియమంగా వడి చేసి, నియమంగా భిక్ష చేసి, నియమంగా స్వామిని ఆరాధిస్తూ, నియమంగా నిద్రకు ఉప్రక్రమించడం…
ఆహార నియమాలు, నిద్ర, నియమానుసారం క్రమం తప్పకుండా చేస్తూ స్వామిని ఆరాధించడంలో భక్తి పారవశ్యంతో ఉండడం ప్రధానంగా మాలలో కనబడుతుంది. మాల ధరించినవారు అయ్యప్పగానం చేస్తూ ఉంటే, వారితో బాటు వారిని చూస్తున్నవారు కూడా నిద్రాహారాలు మరుస్తారు. అయ్యప్ప అనగానే నియమమే ప్రధానంగా కనబడుతుంది.
హరిహరుల సుతుడు అయ్యప్ప ఎందరికో ఆరాద్య దైవం. నియమం తప్పే కాలంలో నియమాలతో కూడిన ఆహార పద్దతి, నిద్ర శరీరానికి, మనసుకు బలాన్ని చేకూరుస్తాయని అంటారు.
అలా ఆలోచిస్తే మన భారతీయులకు భగవానుడు అంటే ఉండే అద్వితీయమైన భక్తి భావమును నియమాలు తోడైతే, అవి ఆచరణలోకి వస్తే, అలా ఆచరణ అవసరమైన కాలం ఒక మండలం రోజులు ఉంటే, ఆ ప్రవర్తన మనసుపై ప్రభావం చూపుతుంది. మనసులో పెరిగే సత్వగుణం శరీరమునకు మేలు చేయగలదని అంటారు.
నియమాలలో తీసుకునే సాత్విక ఆహారం, మనసును సత్వగుణంవైపు తీసుకుపోతుంది. ఇంకా వీలైనంతగా భగవధ్యానమునకు వీలు కల్పించే అయ్యప్ప మాల నియమాలు మనిషి మనసుకు మరింత బలాన్ని ఇస్తాయి. సద్భుద్దితో ప్రవర్తించడం వలన శత్రుత్వం కూడా పోయే అవకాశం అధికంగా ఉంటుంది. అయ్యప్ప మాల నియమాల తోరణంగా చెబుతారు.
నియమాలతో మంచి మనసుతో క్రమం తప్పకుండా నిద్రహారాలకు భంగం కలగకుండా, అయ్యప్పనే ఆరాధించడంతో… అయ్యప్ప అనుగ్రహం భక్తులపై పరిపూర్ణంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఎవరైనా చెప్పేది ఒక్కటే మనసు లగ్నం చేయడం ప్రధానం. దైవంపై మనసు లగ్నం చేసి పూజ చేస్తే, అది ఫలిస్తుందని చెబుతారు. మనసు లగ్నం కావడానికే సాత్వికాహారం నియమాలలో ఉంటుందని చెబుతారు.
అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్
అనుభవం కష్టాలతో కూడి ఉంటే, వారి ఆలోచనలు సమస్యకు పరిష్కారంగా కనబడతాయి. అలాగే మనస్ఫూర్తిగా నియమాలు పాటిస్తే, వాటి ఫలిత ప్రభావం పూజకు ఉపయుక్తంగా మారుతుందంటారు.
40 రోజుల పాటు ఒక క్రమానుసారం నిద్రాహారాలు తీసుకుంటే, శరీరం కూడా ఆవిధంగా అలవాటు పడే అవకాశం ఎక్కువ. పాటించిన నియమాలు శరీరానికి శక్తిగా మారి ఫలితం ఇచ్చే కాలం కూడా 40 రోజులుగానే చెబుతారు.
నమ్మినవారికి మేలు చేసేవిధంగా మంచి ఆహార నియమాలతో కూడిన మాలధారణ అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే స్వీకరించగలం అనేది భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి చరిత్రను గురించి తెలుగు భక్తి బుక్ పిడిఎఫ్ బుక్ రూపంలో ఉచితంగానే రీడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ టచ్ క్లిక్ చేసి అయ్యప్ప స్వామి చరిత్ర పిడిఎఫ్ బుక్ చదవవచ్చును.
గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది.
అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు.
అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో అన్నదమ్ముల రూపంలో గురువు.
జీవితం ఓ సాధనగా సమాజం పాఠశాలగా భావిస్తే, పరబ్రహ్మ స్వరూపమైన గురువు మనకు ఏదో ఒక రూపంలో అప్పటికి అవసరమైన జ్ఙానం అందిస్తూనే ఉంటాడు. భక్తి కొలది పరబ్రహ్మమును వాడు, వీడు అని కూడా అంటాము. గురువును మాత్రం మీరు, వారు అనే సంభోదిస్తాము. గురువు అంటే అంతటి గౌరవభావం ఉంటుంది.
Bhagavanunini evaraina swatantramga
రామదాసు నిందించాడు. దూర్జటి దెప్పిపొడిచాడు. భగవానుని ఎవరైనా స్వతంత్రంగా పిలవడం భక్తిలో సహజం అయితే నేర్చుకోవడంలో మాత్రం చాలా భక్తిశ్రద్దలలో బాటు గౌరవం కూడాను ఉంటుంది.
అమ్మ ఒడిలో భద్రత ఉంటుంది. అమ్మను అనుసరిస్తూ నేర్చుకుని, నాన్నను అనుసరిస్తాం.. అన్నయ్య అయినా, అక్కయ్య అయినా వారిని అనుసరిస్తాం… ముందుగా నేర్వడం, నైపుణ్యం ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. గురుత్వం ఇంటిలోనే బంధుమిత్రుల రూపంలో సాధారణ విషయాలలో ఉంటుంది.
గురువు గురువులు గురువులతో న్యూస్ కూడా గురువుగా ఉంటే
పరిశీలించి చూస్తే సమాజం ఓ పెద్ద గురువుగా ఉంటుంది. న్యూస్ చూస్తే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఓ ఆలోచన పుడుతుంది. ఆలోచన పుట్టేలాగా చేయడమే గురుతత్వం అంటారు. గురువు గురువులు గురువులతో న్యూస్ కూడా గురువుగా ఉంటే, సమాజంపై అవగాహన పెరుగుతుంది.
ఆవుని చూస్తే సృష్టిలో చులకనగా చూసే గడ్డిపరకలను తిని, సృష్టికి మూలమైనవాడిని ఆరాధించడానికి అవసరమైన ద్రవ్యాలను ఇస్తుంది. మనకు అవసరం లేకపోయినా అది వేరే రూపం నుండి సమాజానికి ఉపయోగపడతాయని అవు, గడ్డిని చూస్తే అవగతమవుతుంది. పరిశీలిస్తే లోకంలో జరిగే ప్రక్రియలో కూడా గురుత్వం కనబడుతుంది.
Dattatreyula guruvulu prakruti nunde
దత్తాత్రేయుల వారి గురువులంతా ప్రకృతి నుండే ఉంటారు. అంటే ప్రకృతి పాఠశాలలో గురువులు అనేకంగా ఉన్నారు. గురుత్వం ఎక్కడిక్కడ జ్ఙానం అందించడానికే సిద్దమే. అయితే ఆలోచనతో కూడిన పరిశీలన, శద్ధ ముఖ్యం అంటారు. శ్రీగురు చరిత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలో…
గురుత్వాకర్షణ శక్తి చేత భూమి మీద మనం నిలబడి ఉండగలుగుతున్నాం. ఆ శక్తి వలననే వస్తువులు అన్ని కూడా వాటి వాటి పరిణామమును బట్టి భూమిపై ఉంటున్నాయి. గురుత్వాకర్షణ శక్తి లేకపోతే ఎలా మన శరీరం భూమిపై నిలబడి ఉండలేదో… లోకంలో జ్ఙానం లేకపోయినా మన మనసు జీవితంలో నిలబడదు. విషయాలపై అవగాహన ఉండడం చేత, విషయములను అనుభవించడం, విషయములను నేర్చుకోవడం, విషయములను సాధించడం… ఏదైనా విషయ పరిజ్ఙానం గురువు వలననే తెలియబడుతుంది. అటువంటి గురువు మనకు అమ్మ నుండే ప్రారంభం.
అయితే ఇలా మనకు తెలియకుండానే మనకు ఒక గుర్తింపు ఏర్పడడంలో సమాజంలో కొందరి గురువుల ప్రభావం ఉంటుంది. మనకు స్వయం ఆలోచన దృష్టి ఏర్పడే సమయానికి కొంతమంది గురుస్వభావం మనపై పడుతుంది. మనకు స్వీయ ఆలోచన కలుగుతున్నప్పుడు మన అభిరుచికి తగ్గట్టుగా బోధనా గురువుల దగ్గరకు వెళుతూ ఉంటాము.
అతను తిరిగి మరొకరికి గురువు కాగలడు. ఇంకా మరికొంతమందికి గురువు
మనం నేర్చుకునే సమయంలోనే ఆసక్తి చూపిన విషయంలో నైపుణ్యం పెంచుకుంటాం.. పరిశీలనాత్మక దృష్టితో ఊహాత్మక దృష్టి పెరిగి… ఒక విషయం గురించి గరిష్ట జ్ఙానమును సంపాదిస్తే, ఆ విషయంలో అతను తిరిగి మరొకరికి గురువు కాగలడు. ఇంకా మరికొంతమందికి గురువు కాగలడు. అంటే అమ్మ అనే గురువు దగ్గర తెలియకుండా మొదలైన బోధ, మన శ్రద్ధాసక్తుల చేత ఏదైనా ఒక విషయంలో నైపుణ్య సంపాదించి, అందులోనే మరొకరికైనా గురువుగా మారవచ్చును.
గరుత్వం ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉంటుంది. అది బోధ చేస్తూనే ఉంటుంది. కాలం బట్టి శ్రద్ధాసక్తుల బట్టి తెలిసి, తెలియక గురుత్వం బోధ చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనకు తెలిసి కానీ తెలియక కానీ విషయాలు బోధించబడుతూ ఉంటాయి. అయితే నేర్చిన విషయాలలో, నైపుణ్యం సాధించిన విషయంతో జీవన మనుగడ సాగుతుంది.
జీవితంలో కాలం కూడా ఒక గురువుగానే కనబడుతుంది. ఒకసారి కష్టం ఇస్తుంది. ఒకసారి సుఖం ఇస్తుంది. కష్టం, సుఖం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకు ఫలిత ప్రభావం అనుభవం అవుతుంది. కానీ కాలం కనబడదు. కనబడని కాలం, మనకు కనబడకుండా మనలోనే ఉండే మనసుపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. పరిమితమైన శరీరం గురించి ఎక్కువగా శ్రద్ద పెడితే, ఆలోచన కూడా పరిమితం. అపరమితమైన మనసు గురించి ఆలోచన చేస్తే, ఆలోచన అపరిమితమే.. అటువంటి మనసులను ప్రభావితం చేసే కాలం గురించి ఆలోచన చేయడం అంటే అది అద్భుతంగానే అనిపిస్తుంది.
మనిషిలో ఉంటూ మనిషి చుట్టూ ఉన్న పరిస్థితుల బట్టి ఏర్పడిన సంస్కార ప్రభావంతో ప్రవర్తించే మనసు. దానికి మూలమైనది, కాలంతో పోలిస్తే… మనసు భావాలు, కష్ట సుఖాలు రెండు భ్రమలు గానూ కదిలే కాలంలో ఏర్పడిన ఒక ప్రయాణం గురించిన ఆలోచన పుడుతుంది. అలా కాలంలో కలిగే కష్టసుఖాల వలన కాలాన్ని పరిశీలించాలనే ఆలోచన పుట్టడం కూడా కాలంలో కలిగేదే… పరిశీలిస్తే కాలమొక కొలమానం లేని గురువు.
ఏ గురువు దగ్గరకు ఏ వ్యక్తి ఎలా వెళుతున్నాడు
లోకంలో అనేకమంది జనులం. అనేకమంది జనులకు బోధించడానికి గురువులుంటారు. ఏ గురువు దగ్గరకు ఏ వ్యక్తి ఎలా వెళుతున్నాడు.. కాలమే నిర్ణయిస్తుంది. కాలం ఎలా ఈ ఫలితం ఇస్తుంది? అంటే అది కర్మప్రభావం అని అంటారు. అయితే అనుగ్రహం కలిగితే పరమార్ధం ఎలాగైనా తెలియబడుతుంది. కాలం అందుకు తగ్గట్టుగానే మార్పుని జీవితంలో తెస్తుందని అంటారు. అయితే పరమార్ధం వైపు వెళ్ళగలగడమే అదృష్టదాయకం అంటారు.
కొందరికి కాలం గురువుగా ఎవరో ఒకరిని నిర్ణయిస్తూ ఆ వ్యక్తి జీవితంలో పొందవలసిన కర్మఫలితం అందిస్తుందని చెబుతారు. అయితే అది చేసుకున్న కర్మకొద్ది ఫలితం… ఇంకా ఆ జీవితం భవిష్యత్తులోకి కూడా కర్మఫలితం ద్వారానే ముందుకు సాగుతుంది. కర్మఫలితం కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా రెండింటిలో అప్పటిదాకా ఉన్న అనుభవం ఆధారంగా అనుభవిస్తూ ముందుకు సాగుతుంది. కానీ కష్టమే కనబడుతూ, సుఖం ఏదో అలా కనీ కనబడక పోతుంటే మాత్రం… ఆ జీవితం భరించడం కూడా కష్టదాయకమే…
ఏదో ఆశతో ముందుకు సాగుతూ ఉంటాం… ఆశ తీరుతుందనే భావన బలపడేలాగా కష్టసుఖాలు కలుగుతూ ఉంటాయి. కానీ లక్ష్యం వైపు జీవితం సాగదు. మలుపుల తిరుగుతూ ఉంటుంది. మన ఆశ తీరుతుందనే భావన బలపడేలాగా పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో జీవితం సాగకుండా కష్టం తిష్టవేసినట్టుగానే ఉండే అవకాశం అతి కొద్ది మంది విషయంలో జరగవచ్చును. ఏదో ఒక ఆశ.. అది ఏస్థాయివారికి అనేది చెప్పలేం.
ఆశ నిరాశల మద్య జీవితం అనుభవం అవుతూ…… ఆశ వదిలేసి నిరాశనే పట్టుకున్న మనసుకు మాత్రం గురువు అవసరం ఏర్పడుతుంది. తన స్థితికి తనే ఎలా కారణమయ్యానో… తెలియబడాలి. కారణం అంతర్లీనంగా తెలుస్తునే ఉంటుంది. కానీ కన్ఫర్మ్ కాదు. గుర్తించడంలో అసక్తత ఉంటుంది. గురువు వలననే అది ఏమిటో తెలియవస్తుంది. ఆ యొక్క నిరాశను ప్రారద్రోలడంలో గురువు అనుగ్రహం ఏవిధంగా ఉంటుందో? అంటే అది వారి వారి జీవన పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ అటువంటి ఆశ నెరవేరడం, నిరాశ తొలగిపోవడంలో జీవిత పరమార్ధం కూడా కలిసి ఉండవచ్చును.
గురువు నైరాశ్యాన్ని ప్రారద్రోలతాడు
కొందరు అంటారు. అతి కష్టం. అతి నిరాశ. కోలుకోలేని ఎదురుదెబ్బలు.. స్థాయి మరీ దీనంగా ఉండదు. కానీ పరిస్థితులు ప్రతికూలం… కష్టంతో కాపురం చేస్తున్నట్టుగానే ఉంటుంది. అలాంటి కొన్ని జీవితాలలో వారి జీవన పరమార్ధం కూడా కలిసి ఉండవచ్చును అంటారు. వారి జీవితం సార్ధకతకోసం తిరగడం కోసమే అలాంటి పరిస్థితిని కాలం కల్పించవచ్చు అని అంటారు.
ఏది ఏమైనా జీవితంలో ఓ గురువు కష్టాన్ని దూరం చేస్తాడు. ఓ గురువు చిరకాల కోరిక సాధనను సులువుగా మారుస్తాడు. ఓ గురువు నైరాశ్యాన్ని ప్రారద్రోలతాడు. ఓ గురువు అపరిమిత జ్ఙానాన్ని అనుగ్రహించేస్తాడు. కాలం గుర్తు చేసిన గురువే ఇలాంటి అద్భుతాలు ఆయా జీవితంలో కల్పిస్తాడు. అటువంటి గురువు ముందు ఇక ఏం గొప్పగా ఉండదు. ఏం కోరలేం.. మనసు ఆ గురు పాదములనే పట్టుకుంటుంది. అప్పటిదాకా ఉన్న తన కోరికో, ఆశో, నైరాశ్యమో… అంతా మరిచిపోతుంది… ఇది కొందరి జీవితాలలో కొందరి ద్వారా కాలం సృష్టించేదిగా చెబుతారు.
ఒక వ్యక్తి జీవిత లక్ష్యం ఏమిటి? జీవితంలో ఒక వ్యక్తి ధర్మమేమిటి? ఈ సంఘర్షణ మనిషికి వచ్చినప్పుడు, ఆఇంటి పెద్దే, ఆ వ్యక్తి దిశానిర్ధేశం చేయగలడు. అప్పటికి తృప్తి చెందకపోతే, ధర్మసందేహాలు ఎక్కువగా ఉంటే, పురాణ పరిచయం పరిష్కారంగా ఉంటుందని, ప్రవచనకర్తలు చెబుతూ ఉంటారు. అటువంటి ప్రవచన సారం ఇచ్చిన పురాణాలు రామాయణం, మహాభారతం, శ్రీమద్భాగవతం లాంటి గ్రంధాలలో మనకు కనిపించే గురువుల గురించి తెలుసుకోవడం వలన జీవనం శాంతియుతం కాగలదు అంటారు. గురువు అనుగ్రహం అయితే, చదువుల తల్లి అనుగ్రహం వలన చదువులలో మర్మం తెలియబడుతుంది, అంటారు. మరి అలాంటి పురాణ పురుషులు అయిన మన గురువుల గురించి లభించే ఉచిత తెలుగు పుస్తకములు…
వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయడం మాత్రం కామన్. కానీ ఆలోచన పరిస్థితులకు అనుకూలంగా ఉంటే మనసు ప్రశాంతత. పరిస్థితులకు ప్రతికూలంగా ఉంటే, మనసులో ఆశాంతి.
ప్రశాంతతో ఉండే మనిషి మనసు, ఎదుటివారి ఆలోచనలో ఆంతర్యం గ్రహిస్తుంది. అశాంతితో ఉండే మనిషి మనసు ఎదుటివారి ఆలోచనలకు ప్రభావితం అవుతూ ఉంటుంది.
‘నీలోఇద్దరు‘ ఫ్రీ తెలుగుబుక్ లోని పరిచయం పేజి ఇమేజ్ ఈ క్రింద జతచేయబడింది, చదవండి.
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
పరిచయ పలుకులు వాడుక భాషలో చక్కగా ఉన్నాయి. ఇంకా పుస్తకం చదివితే మరింతగా మనసు పట్టుకుంటుంది.
ఒక తెలుగుబుక్ చదవగానే అందులో అంశం అర్ధం కాదు. ఆ బుక్ లో ఉన్న అంశంతో మనసు మమేకం కావాలి.
ఆ తెలుగుబుక్ లో ఉన్న అంశంపై ఆలోచన కలగాలి. ఆ ఆలోచన సవ్యదిశలో సాగాలి. అవగాహన ఏర్పరచుకున్న విషయంపైనే మనసుకు స్పష్టత వస్తుంది.
ఏదైనా ఒక తెలుగుబుక్ చదువుతుంటే, అందులో ఉన్న అంశం మనసుకు ఇష్టమా ? కాదా? అని సరిచూసుకోవాలి.
ఎందుకంటే మనసు ఇష్టపడితే, అందులోని అర్ధాన్ని తేలికగా గ్రహించగలదు. అందుకే మనసుకు ఇష్టమైన అంశం కలిగి ఉన్న తెలుగుబుక్ చదవాలి అంటారు.
ధర్మం గురించే తెలిపే బుక్స్, మనస్తత్తాన్ని గురించి విశ్లేషించే తెలుగుబుక్స్, సామాజిక స్పృహను కలిగించే తెలుగుబుక్స్ చదవడం వలన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, అంటారు.
ఎంతమందితో మనకు పరిచయం ఉంటే, అన్ని రకాల విషయాలు మన మనసులోకి చేరతాయి. ఎన్ని విషయాలు తెలిసి ఉంటే, అన్ని ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఎంత ఆలోచన ఎక్కువగా ఉంటే, అంతలా మనసు అలసటకు గురవుతుంది.
ఆలోచనలు ఎక్కువగా ఉంటే, ఆ ఆలోచనలు నియంత్రించడం మనసుకు అసాధ్యం కాదు, కానీ చాలా కష్టమంటారు. ఎందుకంటే అలవాటు పడిన మనసు, అలవాటును మార్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది.
ఎప్పటికప్పుడు మనసు తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే, దానికి సమాజం నుండి వచ్చే ప్రతిస్పందన వలన మనసు మరలా ప్రభావితం అవుతూ ఉంటుంది.
అందుకే మనిషి మనసు ఏవిధంగా ప్రభావితం అవుతుంది. దాని బలహీనత ఏమిటి? దాని బలమేమిటి? అనే విషయంలో అందరికీ వారి మనసు గురించి వారికి తెలుసుండాలి అంటారు.
మనస్తత్వాల గురించి విశ్లేషణలు కలిగి ఉన్న తెలుగుబుక్స్ చదవడం వలన కొంతవరకు మనసుపై మనసు పరిశీలన చేసే అవకాశం ఉంటుంది.
వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి.
భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి చేయడం మనకు శతకాలు తెలుగు పద్యాలలో కనబడుతుంది. ఎక్కువగా భక్తితో కూడిన భావనలను తెలియజేస్తూ, వివిధ దేవతల అద్భుత గుణముల విశిష్టతను భక్తి శతకాలు వెల్లడి చేస్తాయి. ఏభావనతో వెల్లడి చేసినా, తద్భావన ఎంతో లోతైన భావం కలిగి ఉంటాయి. ఇంకా శతక పద్యములు చిన్న పద్యములుగానే ఉన్నా గుణాత్మక మార్పును సూచిస్తూ ఉంటాయి అంటారు.
తెలుగులో శతకముల తెలుగుబుక్స్
శతకములు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి వేమన శతకం, సమతీ శతకం, దాశరధి శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం. కానీ పూర్తిగా మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఉండవు, బాగా ప్రసిద్ది చెందిన పద్యాలే ఉంటాయి. కవులు భక్తి పారవశ్యంతో చేసిన శతకాలు మనలోను భక్తిని పెంపొందిస్తాయి. అలాగే ఇంకా మనకు మరిన్ని శతకాలు కూడా ఉన్నాయి. తెలుగు కవులు రచించిన శతకాలు మనకు మరిన్ని ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ తెలుగుబుక్స్ రూపంలో లభిస్తున్నాయి. మారుతి శతకం, మూకపంచశతి కటాక్ష శతకం, నరసింహ శతకం, భర్త్రుహరి శతకం, కుమారి శతకం, కమార శతకం, కృష్ణ శతకం, ఆంధ్ర నాయక శతకం ఇలాంటి శతకాలు మరిన్ని అందుబాటులో ఉన్నాయి. భక్తిని, ఆలోచనను రేకెత్తించే ఈ శతకమాధుర్యాలు ఉచితంగా చదవాలంటే ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.
వేమన శతకంలో వేమన ఎక్కువగా వ్యక్తి, సమాజంలో వ్యక్తి వ్యవహారం ఎలా ఉంటుందో? సూచిస్తూ ఉంటాయి. పురుషలందు పుణ్యపురుషులు వేరయా అంటూ… వ్యక్తి గుణమును స్పృశిస్తుంది. వేమన శతకములు తెలుగు పద్యములు చదివి, వాటి భావన చదవడం వలన వ్యక్తి మనసు తనను తాను చెక్ చేసుకోవడం కూడా మొదలుపెడుతుంది అంటారు. ఇంకా సమాజంలో వివిధ రకాల వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో తెలియబడుతుందని అంటారు. వేశ్యతో సంబంధం కలిగి ఉన్న వేమన, ఒక్కసారే వైరాగ్యంతో యోగిగా మారి సామాజిక పరిస్థితులలో వివిధ వ్యక్తుల వ్యక్తుల ప్రవర్తనను తన పద్యములలో ఎత్తి చూపుతాడు. వేమన పద్యాలు చాలా ప్రసిద్ది చెందియున్నాయి.
వేమన శతకము తెలుగు పద్యములు మాదిరి సుమతీ శతకం కూడా సామాజిక హితమును కాంక్షిస్తూ ఉంటాయి. ఇంకా భక్తితో కూడిన ఆరాధనా భావనలను రేకెత్తించే తెలుగు శతకాలు మనకు లభిస్తాయి. కాళహస్తీశ్వర తెలుగు శతకం తెలుగు పద్యాలు మన శివుని గూర్తి తెలియజేస్తాయి. దూర్జటి రచించిన ఈ భక్తి శతకం శివలీలలను తెలియజేస్తుంది. చెరశాలలో రామదాసు వెల్లడిజేసిన రామభక్తి భావనలే దాశరధీ శతకం.
తెలుగు శతకాల బుక్ లింక్స్
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లింకులు ఈ క్రిందగా ఇవ్వబడ్డాయి. ఈ క్రింది లిస్టులో ‘తెలుగుబుక్’ అనే పదమునకు ఆయా పేర్లతో కూడిన బుక్ లింక్ చేయబడింది.
తెలుగు శతకములు చదవడంతో బాటు వినడం వలన కూడా ఆయా తెలుగు పద్యములు మన మనసులో మననం అవుతాయి. మననం చేత మనసులో మంచి విషయాలు పద్యరూపంలో చేరతాయి. గుర్తుకు వచ్చిన పద్యములకు సంబంధించిన పద్యభావనను తలచుకోవడం వలన, మనసు మార్పువైపు మరలుతుందంటారు.
తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగుభక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం.
భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో ఉన్నాయి. వారం యొక్క అధిదేవతకు సంబంధించిన భక్తి పాటలు ఈ లైవ్ చానల్స్ ద్వారా ప్రసారం అవుతాయి. సోమవారం అయితే శివునికి సంబంధించిన భక్తి పాటలు, శనివారం అయితే శ్రీవేంకటేశ్వరునికి సంబంధించిన భక్తిపాటలు ప్రసారం అవుతాయి. భక్తి చానల్ దీనిద్వారా ఏరోజుకారోజు ఆయా అధిదేవత గురించిన భక్తిపాటలు యూట్యూబ్ ద్వారా వినవచ్చును.
శ్రీవేంకటేశ్వరస్వామిపై పాటలు అంటే అన్నమయ్య కీర్తనలే. అవి వింటూ శ్రీవేంకటేశ్వరుడు పరవశించినట్టుగా అన్నమయ్య సినిమాలో చూశాం. అటువంటి కీర్తనలలో భక్తి పాటలు మనం వింటూ ఉంటే మన మనసు శ్రీవేంకటేశుడిపైకి, మన వీనులకు విందుగా భక్తిపారవశ్యం కలుగుతుంది. అన్నమయ్య కీర్తనలు తెలియజేస్తూ ఉచితంగా లభిస్తున్న ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అన్నమయ్య ఆలపించిన భక్తిపాటలు మనలో భక్తిభావం పెంచుతాయి. ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి గురించిన భక్తిపాటలు వింటూ ఉండడం వలన ఆ శ్రీవేంకటేశ్వరుని కరుణ కలుగుతుంది. ప్రతి శనివారం తెలుగు భక్తిపాటలు యూట్యూబ్ ద్వారా వినవచ్చును.
Navagraha dhyanam
జన్మసమయం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో వారం రోజులలోనూ ఏదో ఒక గ్రహం కష్టం కలిగించడానికి చూస్తూ ఉంటే మరొక గ్రహం శుభం ఇవ్వడానికి సూచిస్తూ ఉంటుంది. పుట్టిన సమయం బట్టి గ్రహగతులు ఆ వ్యక్తి కర్మను తెలియజేస్తాయి అంటారు. ఆవిధంగా ఆకాశంలో కదిలే గ్రహాలు, మారుతున్న తమ తమ స్థానాల నుండి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అయితే ఆ గ్రహాధిదేవతలను పూజించడం లేదా ఆ గ్రహ స్వరూపములనే ధ్యానం చేయడం ద్వారా ఆయా గ్రహ ఫలితములను ప్రభావమును తట్టుకునే శక్తిని పొందవచ్చు అంటారు. అంటే పూర్తి పేదరికంలో ఉన్నవాడికి ఒక వందకోట్ల లాటరీ తగిలితే, తట్టుకునే శక్తి అంటే అతని ఆరోగ్యం బట్టి ఉంటుంది. అందుకే మంచైనా చెడైనా ఫలితం మనిషి తట్టుకునే లాగా ఉంటే, ఆ వ్యక్తి వలన ఇతరులకు నష్టం జరగదు. కాబట్టి నవగ్రహాలను ధ్యానం చేయడం కూడా మంచిది అంటారు. అయితే ఇక్కడ భక్తి శ్రద్ధలతో పాటు నియమనిబంధనలు కఠినంగానే పాటించాలి, లేకపోతే ఫలితం ప్రతికూలం అంటారు. నవగ్రహ కీర్తనలు ఫ్రీ తెలుగు బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భక్తి – ముక్తి జానపద గేయాలు భక్తి పాటల తెలుగు పుస్తకం ఉచితంగా ఆన్ లైన్లో రీడ్ చేయవచ్చును లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ పుస్తకంలో పలు భక్తిపాటలు తెలుగులో ఉండి అందరికీ అర్ధం అయ్యేలా ఉన్నాయి. ఇందులో కొన్ని భక్తిపాటల ముందు మాటలు ‘నీ మహిమ తెలియనైతి !’ అనే భక్తి పాట, ‘భగవంతా! నీదే భారమురా!’ అను భక్తి పాట ‘ఈశ్వరున కెరుక!’ అంటూ ఈశ్వరునిపై భక్తిని ప్రకటించే భక్తి పాట, ‘శ్రీ కృష్ణ దేవుడు’ అంటూ కృష్ణుడి పాటలు, ‘శివ శివ అని భజించువారికి!’ శివుని గురించి భక్తి పాట రాముని మాటలు, సీతాభిరామా అంటూ ఇలా మరిన్ని భక్తి పాటలు ఈతెలుగు బుక్ లో మనం రీడ్ చేయవచ్చును. భక్తి ముక్తి జానపద గేయాలు ఉచిత తెలుగు భక్తి బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
Gudiki velli korikalu
మనం గుడికి వెళ్లి కోరికలు కోరుతూ ఉంటాం, కానీ శ్రీరామదాసు రామునికి గుడినే కట్టించి ఇచ్చాడు. గుడిని కట్టినందుకు జైలు పాలు అయితే అక్కడి నుండే శ్రీరామునిపై కీర్తనలు చేశాడు. భాదలోనూ భగవంతుడినే దర్శించి, సర్వం రామార్పణ బుద్దితో శ్రీరామదాసు చేసిన కీర్తనలు, సీతారామలక్ష్మణులను కదిలించాయి. శ్రీరామదాసు పాడిన భక్తిపాటలు దాశరధీ శతకంగా ప్రసిద్ది. దాశరదీ మకుటంతో అన్ని పద్యాలు ఉంటాయి. ఈ తెలుగు భక్తిపాటలు కలిగిన తెలుగు బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
శ్రీరామ నామము భజించిన నోరుండదు. రామా అనే పేరు అనేకమందికి ఉంటుంది. ఎక్కువమందికి ఆ పేరు పిలవడం, వినడం ఉంటుంది. ఇంకా శ్రీరామభక్తులకు రామ నామము రామనామము రమ్యమైనది అంటూ మనసులో మెదులుతూనే ఉంటుంది. రామనామం జపించడం చాలమందికి అలవాటుగా ఉంటుంది. ఇంకా ఈ యుగంలో నామకీర్తన కన్నా గొప్ప మోక్షమార్గం మరొకటిలేదు అంటారు. ఎంతగా భగవన్నామం జపిస్తే అంత మేలు మనసుకు అని చెబుతారు. శ్రీరామచంద్రుడిని గురించిన నామస్మరణ మనసుకు పడితే అంతకన్నా అదృష్టం మరొకటి లేదంటారు. శ్రీరామభజనం చేస్తూ తెలుగు భక్తిపాటల తెలుగు భక్తి బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ /టచ్ చేయండి.
ఇంకా తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ గురించి వివరాలు సింగిల్ లైనుతో ఉండే వెబ్ పేజి తర్వాత ఇక్కడ లింకు చేయబడుతుంది. గమనించగలరు.
తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశయాత్రదర్శిణితెలుగుబుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ.
యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్రదర్శనమునకుయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం ఈ కార్తీకమాసమును ముందు, తరువాత ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
కొందరు కార్తీకమాసంలో ఇంట్లో కార్తీకదీపం వెలిగిస్తే, కొందరు ఇంటికి దగ్గరగా ఉన్న ఆలయములలో కార్తీకదీపం ప్రతిరోజు వెలిగిస్తారు. కొందరు ఊరికి దూరంగా ఉన్నా, నదీస్నానం చేయడానికి అనువుగా ఉన్న ఊరికి వెళ్లి దేవాలయంలో కార్తీకదీపం వెలిగిస్తూ ఉంటారు. అంటే విశేష దీపం వెలిగించడానికి కార్తీకమాసం విశిష్ఠమైన మాసంగా భావిస్తారు. కార్తీకమాసంలో వైష్ణవాలయం కానీ శివాలయం కానీ తప్పనిసరిగా దర్శించమంటారు. ఇంకా భారతదేశంలో విశిష్టమైన పుణ్యక్షేత్రములకు యాత్రలు కూడా ఈ మాసంలోనే చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు.
అయితే దగ్గరలో ఉండే దేవాలయమునకు కొందరు కాలినడక దైవనామస్మరణతో భక్తితో పాదయాత్ర చేస్తూ శివుడిని లేక శ్రీహరిని దర్శించకుంటూ ఉంటారు. అలా దుర్గమ్మను, వేంకటేశ్వరుని, శంకరుని, వినాయకుడిని, కుమారస్వామిని, ఆంజనేయస్వామిని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. దూరంగా ఉండే పుణ్యక్షేత్రములకు మాత్రం వాహనం ద్వారా ఈ మాసం నుండే ఎక్కువగా ప్రయాణాలు కొనసాగుతాయి.
అయ్యప్పస్వామి మాలధారణ మండలకాలం ముగిసే సమయం కూడా కార్తీకమాసం మద్యలోకి రావడంతో మరింతమంది పుణ్యక్షేత్రములకు యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో దర్శించవలసిన పుణ్యక్షేత్రములను తెలియజేసే యాత్ర తెలుగు పుస్తకములను గురించి తెలుసుకుందాం.
యాత్రదర్శిణి దేవాలయాలు తెలుగు బుక్స్
శ్రీదత్తాత్రేయుని పుణ్యక్షేత్రములను తెలియజేస్తూ, ఆదేవాలయం చరిత్రను క్లుప్తంగా తెలిపే తెలుగు బుక్ ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తుంది. ఈ తెలుగుబుక్ లో మహురము, గిరినార్, కరెంజ, నరసోబావాడి, ఔదుంబుర్, గాణుగాపురం, కొల్హాపూర్, నాశిక్, కురుగడ్డ, పిఠాపురము, మాణిక్యనగర్ మొదలైన శ్రీదత్త దేవాలయములు ఉన్న ప్రాంతములు గురించి క్లుప్తంగా వివరించబడి ఉన్నాయి. ఈ ఫ్రీతెలుగుబుక్ చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల విశేష భారతవానిలో పుణ్యక్షేత్రములకు పెట్టింది పేరుగా చెప్పబడుతుంది. ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రములు సందర్శిస్తూ, తీర్ధయాత్ర చేయడం పరమపుణ్యప్రదంగా చెబుతారు. యాత్ర బస్సులవారి ద్వారా యాత్రల వివరాలు ఉంటాయి. అయినా కొన్ని పుస్తకముల ద్వారా దర్శించబోయే తీర్ధయాత్రస్థలం గురించి విశిష్ఠత తెలుసుకుని దేవాలయం దర్శిస్తే మంచిదని చెబుతారు. ఈ క్రింది తెలుగు చిత్రాలకు తెలుగులోఉత్తరభారతదేశయాత్రబుక్, దక్షిణ భారతదేశ యాత్ర బుక్, భారతదేశపు అన్ని పుణ్యక్షేత్రములు తెలుగుబుక్ లింకు చేయబడి ఉన్నాయి.
మీర ఈ క్రింది చిత్రాలను క్లిక్ టచ్ చేయడం ద్వారా ఆయా యాత్రలలో ఉండే పుణ్యక్షేత్రముల గురించి చదవవచ్చును. ఈ లింకుల ద్వారా ఈ తెలుగుబుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.
ఉత్తరభారత్ లో ఉండే పుణ్యక్షేత్రముల గురించి తెలియజేసే తెలుగు బుక్, భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
దక్షిణ బారతంలో ఉండే పుణ్యక్షేత్రల దర్శిణి తెలుగు బుక్ భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
పైచిత్రాలకు ఫ్రీగురుకుల్ వెబ్ సైటులోని పి.డి.ఎఫ్ పుస్తకములు ఆన్ లైన్ లింకులు ఎటాచ్ చేయడం జరిగింది. మీరు పై చిత్రంపై క్లిక్ చేసి ఆయా తెలుగుబుక్స్ రీడ్ చేయవచ్చును.
సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులోభగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.
మనకు రామాయణం, భాగవతం, పురాణములు చదవడానికి, వినడానికి ఉన్నా, వాటి సారాన్ని జీవిత పరమార్ధమును ప్రబోధం చేసే గ్రంధంగా భగవద్గీతను చాలామంది పెద్దలు చెబుతారు. భగవద్గీత భవసాగరమును దాటిస్తుందని చెబుతారు. అటువంటి భగవద్గీతను చదివే మనసుకు ఎటువంటి కష్టం ఎందుకు కలుగుతుంది? ప్రశ్న ఉదయించిన మనసుకు ఆ ప్రశ్నపై పరి పరి ఆలోచనలు కలుగుతాయి. కానీ సమాధానం లభిస్తే పొందే శాంతి అనిర్వీచనీయం.
ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక కష్టం కలిగితే వచ్చే ఫలితం తెలిసి ఉంటే, అటువంటి కష్టం వచ్చినప్పుడు మనసు ఆ కష్టాన్ని ఎదుర్కోవడంలో పోరాడుతుంది. తెలియని కష్టం వచ్చినప్పుడు తెలిసినవారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జీవితంలో కలిగే కష్టాలు ఎలా ఉంటాయో కొంతమంది జీవిత చరిత్రలు చదివితే అవగాహన ఉంటుందంటారు. అలా మహాత్మగాంధీ గురించిన తెలుగు పుస్తకం చదవడానికి చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
భగవద్గీత చదవడానికి వినడానికి కష్టమే కారణమా?
సంఘజీవి అయిన మనిషికి తన ఉంటున్న ప్రాంతంలో తనతోటివారితో తెలిసిన విషయాలతో జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ కాలం వలన వచ్చే పెద్ద కష్టంతో జీవితం ప్రభావం చెందుతుంది. కాలంలో ప్రతి వ్యక్తి జీవితం మార్పులకు గురి అవుతూ ఉంటుంది. సుఖంలో ఉండే ఆలోచన కన్నా కష్టంలో ఉండే ఆలోచనలు మనిషిని కుదుటపడనివ్వవు. కష్టం మనసుకు భగవద్గీత వినడానికి గాని చదవడానికి గాని కారణం కాగలదని అంటారు.
పెద్ద కష్టంలో ఓదార్పును తనకు తానే పొందవలసి వచ్చినప్పుడు మనసుకు మరింత కష్టమంటారు. ఒక్కోసారి ఎంతమంచివారు చెప్పిన మంచి మాటలు కూడా ఆ పెద్ద కష్టం బాధలో నుండి బయటపడవేయలేవు. సాదరణంగా ఏ మనిషికైనా మరణవేదన మాత్రం తనకుతానే ఎదుర్కొనవలసిన చాలా అతి పెద్ద కష్టం. కానీ కొందరికి అప్పుడప్పుడు మరణవేదనను తలపించేవిధంగా కష్టం చుట్టుముడుతూ ఉంటుంది.
కొందరి కష్టాలు కాయ(శరీరము)మును గాయపరిస్తే, కొందరికి మనసు వేదించే వేదనాపూరితమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. కష్టం కాయానికి వచ్చినా, మనిషి మదికి కలిగినా ప్రభావితం అయ్యేది మాత్రం మనిషి మనసే…. కారణం శరీరానికి కలిగిన గాయం బాధకు స్పందించేది మనసే, అలాగే ఏదైనా అప్పుల బాధ, లేక అయినవారికి శరీరానికి పెద్ద గాయం కలిగితే స్పందించేది…మనసే. మనిషికి కష్టం వచ్చింది అంటే అతని మనసు పొందే పరివేదనను బట్టి అతని చుట్టూ ఉన్నవారు ప్రభావితం అవుతారు.
ఎంతబలం ఉన్నా మనిషి అయినా కాలంలో మనసు ఎదుర్కొనే కష్టాన్ని బట్టి కదలికలు ఉంటాయి. అనుభజ్ఙులు అయినవారు తమ కుటుంబంలో ఉన్నవారికి ఏదైనా కష్టం గురించి పరిష్కారం తెలియజేయగలరు. ఎందుకంటే అటువంటి కష్టం తమ జీవితంలో ఎదుర్కొని ఉండి ఉండడం చేత, అటువంటి కష్టం మరొకరికి వస్తే పరిష్కారం తెలుపగలరు.
అనుభవం ఉన్నవారు కొత్తవారికి మార్గదర్శకులుగా
సమాజంలో చాలా విషయాలలో మనకు అనుభవం ఉన్నవారు కొత్తవారికి మార్గదర్శకులుగా నిలబడుతారు. అనే మోటారు వాహనాలు నడిపిన వ్యక్తి, కొత్తగా మోటారు వాహనం నడుపుతున్నప్పుడు, అతనికి జాగ్రత్తలు తెలియజేయగలడు. ఎలా వాహనం నడపాలో సూచనలు ఇవ్వగలడు. అలా అనేక విషయాలలో మనిషి అనేక మంది చేసిన సూచనలను తీసుకుంటూ, తను కూడా తాను చేస్తున్న పనులలో అనుభవం గడిస్తాడు. అయితే ఇదంతా సంఘజీవికి సహజంగా జరుగుతుంది.
సంఘంలో సంఘటిత జీవి అయిన మనిషి, తనకున్న బంధుమిత్ర సహకారంతో జీవిస్తాడు. అయితే అనుబంధాలతో మెసిలే మనిషి, తను తీసుకున్న నిర్ణయం తన చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా ప్రభావితం చేసేదిగా ఉన్నప్పుడు అతని మనసులో ఏర్పడేది సంశయమే అంటారు. సంశయమే సంఘర్షణ అయితే మరింతగా మనసు కుంగిపోతుంది అంటారు.
మనసులో ఏర్పడే సంఘర్షణకు ఆ మనిషి యొక్క మనసే సాక్షి. అటువంటి మనిషి అంతరంగం అతనికి మాత్రమే తెలుస్తుంది. అతని ప్రవర్తన వలన అతనితో కలిసి మెలిసి ఉండేవారికి కొంతవరకు తెలియవస్తుంది. ఏదైనా సంఘటనతో తన జీవితం ప్రభావితం చెందితే వచ్చే మానసిక సంఘర్షణకు సంఘం నుండి సానుభూతి వస్తుంది. కానీ తన అంతరంగంలో ఏర్పడే ఆలోచనలు నుండి తాను చేయబోయే నిర్ణయం మరొకరి జీవితం ప్రభావితం అయ్యేదిగా ఉన్నప్పుటి సంఘర్షణ అతను బయటికి చెబితేకానీ తెలియదు. ఒక్కోసారి అటువంటి ఆలోచనలు హాస్యాస్పదంగా కూడా మారుతూ ఉంటాయి.
భగవద్గీత పోగేట్టేది ఏమిటి?
సంఘంలో కొందరితో సహజీవనం చేసే మనిషికి ఆయా ప్రాంతంలో ఉండే వాతావరణం మరియు అతని తోటివారితో ఉండే అనుబంధం ఒక్కోసారి సుఖాలను తీసుకువస్తే, ఒక్కొసారి దు:ఖాలను తీసుకువస్తాయి. ఒక వ్యక్తికి అతని భార్య కోరికకు సరిపడా ధనం తన దగ్గర ఉన్నప్పుడే అతనికి అది సుఖం. కాకపోతే అతనికి అతని భార్య కోరికే దు:ఖదాయకం అవ్వవచ్చును. అలాగే అతని చుట్టూ ఉన్న బంధాలు నుండి వచ్చే విషయాలు అతని ఆర్ధిక స్థితికి, అతని ప్రవర్తనకు అనుకూలంగా ఉంటే అది సుఖం. కాకపోతే అయా బంధాల నుండి వచ్చే విషయాలు దు:ఖదాయకం.
ఏ మనిషికైనా తన చుట్టూ ఉన్నవారి జీవితాలను ప్రభావితం చేసే సంఘటనలు ఎదురైనప్పుడు ధర్మసందేహం ఏర్పడుతుంది. అప్పటికి కలగబోయే ఫలితాలపై మనసులో సంఘర్షణ ఏర్పడుతుంది. గాంధీగారు దేశంలో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అయనకు ఏర్పడే సంఘర్షణలకు భగవద్గీతే సమాధనపరిచింది అని పెద్దలు చెబుతూ ఉంటారు.
భగవద్గీత ఎందుకు చదవాలి అంటే దు:ఖం పోగొట్టుకోవడానికి అంటారు. ఎందుకు అంటే కురుక్షేత్రంలో తన బంధు వర్గములోని బంధువులను చూసి దు:ఖం పొందిన అర్జునుడి దు:ఖం భగవంతుని బోధతో పోయింది. కాబట్టి కాలంలో కలిగిన కష్టం వలన ఏర్పడిన దు:ఖంతో కర్తవ్య భంగం ఏర్పడినప్పుడు భగవద్గీత మనసుకు మందు అంటారు. హృదయంలో ఏర్పడే దు:ఖాన్ని అడ్డుకోవడానికి భగవద్గీతలోని ధర్మాలు తెలిసి ఉండడం ప్రధానమని చెబుతారు.
భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి తెలుగు బుక్స్
ఇంకా పెద్ద పెద్ద కష్టాలు కాలంలో కలిగినప్పుడు పెద్దలు మాటలు ఉపశమనం కలిగించలేకపోయినా భగవద్గీత వలన కర్మయోగం కలిగితే ఉపశమనం కూడా కలుగుతుంది అంటారు. మరణవేదన ప్రతి మనిషికి తప్పనిసరి అటువంటి మరణవేదనలో కూడా మనసు తట్టుకుని నిలబడాలంటే, అంటే మోక్షానికి అర్హత సాధించాలంటే భగవద్గీతాసారం జీర్ణం చేసుకున్న మనసు వలననే సాధ్యం అంటారు.
అటువంటి భగవద్గీతలో ఏముంది అంటే అందులో మొదటగా అర్జునుడికి పుట్టే దు:ఖం కనిపిస్తుంది. ఆ దు:ఖంతో అర్జునుడికి కలిగిన విషాదయోగం మాటలు మారితే ఎలా ఉంటుందో కనబడుతుంది. బంధాలపై అమితమైన ప్రేమతో ఉండే వీరుడి మనసులోని పరివేదన కనబడుతుంది అని అంటారు. భగవద్గీత గురించి శ్రీచాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
అర్జునుడి విషాదానికి చెదిరిన మనసుకు కర్తవ్యాన్ని బోధించే గురువుగా కృష్ణుడు మనకు భగవద్గీతో కనిపిస్తాడు. గురువు అయిన కృష్ణభగవానుడు శిష్యుడు అర్జుని చేసిన బోధ బాధలో ఉండే మనసుకు మందు అంటారు. దహింపడే దేహికి ఏర్పడే అజ్ఙానం తొలగించడానికి భగవానుడు పలికి వాక్కులు భగవద్గీతలో కనిపిస్తాయి.
భగవద్గీత సారం అర్ధం కావడం
ప్రవచనకారుల మాటలలో భగవద్గీత సారం అర్ధం కావడం వలననే జీవి తరించగలడనే మనకు వినిపిస్తాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు ప్రవచించిన ప్రవచనాలు ఆడియో రూపంలో ఉచితంగా తెలుగులో వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి వీడియో తెలుగుప్రవచనాలు వినడానికి ఇక్కడ / టచ్ చేయండి. తెలుగులో ప్రవచనాలు వినడం వలన మనకు బాగా తెలిసి ఉన్న తెలుగు చదవడం చేత మన మనసుకు మాటలు బాగా అర్ధం అవుతాయి.
ప్రధానంగా భగవద్గీత వలన అజ్ఙానం తొలిగి జ్ఙానం వస్తుందనేది చెప్పబడుతుంది. జ్ఙానం వలన కలిగే ధైర్యం సంసారం నుండి బయటపడవచ్చు అని అంటారు. తాను ఎప్పుడూ వెళ్లని ఇంటికి ఒక వ్యక్తి రాత్రివేళో వెళితే, ఆ ఇంటిలోకి వెళ్లగానే కరెంటుపోయి చీకట్లు కమ్ముకుంటే ఆ వ్యక్తికి భయం కలిగి అడుగు అక్కడే ఉంటుంది. ఒక వేళ అడుగు వేసినా భయంతోనే వేస్తాడు. అదే ఇంట్లో అప్పటికే నివసిస్తున్నవారు మాత్రం ఆ చీకట్లో గబా గబా టార్చిలైటు కోసం వెతుకుతారు. అంటే వారికి ఆ ఇంట్లో వెలుగునింపే వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలిసి ఉండడం చేత, వారికి ఆ చిమ్మచీకట్లో అడుగులు సాదారణంగా వేస్తారు. కానీ కొత్తగా ఆ ఇంట్లోకి అప్పుడే వచ్చిన వ్యక్తి మాత్రం ఆ చీకటి భయహేతువు. భగవద్గీత వలన ఒక దేహి జీవన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది, అంటారు.
భగవద్గీత భవసాగరం దాటించే గ్రంధంగా చెబుతారు.
తెలుగువ్యాకరణం తెలిసినవారికి తెలుగుపద్యాలు చదవమంటే గణగణమంటూ చదవుతారు. అలా కాకుండా తెలుగు సరిగ్గా అర్ధం కానివారికి తెలుగుపద్యాలు చదవమంటే మాత్రం అక్షరాలు కూడబలుక్కుంటూ చదువుతారు. అలాగే భగవద్గీత సారం ఒంటబడితే, ఆజీవి జీవన పరమార్ధం చాలా సులభం అంటారు. తెలుగుతెలియనివారికి తెలుగు సాహిత్యం మాధుర్యం తెలియబడనట్టు భగవద్గీత లేక సత్సమాన గ్రంధం చదవకపోతే, జీవిత పరమార్ధం తెలియబడదు అంటారు.
మనిషికి తెలియనవి మనిషిని మరింత భయపెడతాయి అంటారు. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అవసరం ఉండదో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం ఉంటే, ఆ ప్రయత్నంలో ఏర్పడే సందేహం దేహికి సమస్యాత్మకం అంటారు. దేహి సందేహాలకు సమాధానం భగవద్గీత అని చెబుతారు. అటువంటి భగవద్గీత గురించిన తెలుగురచనలు చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. అనేకమంది తెలుగులో రచించిన భగవద్గీత గురించిన రచనలు మీరు ఉచితంగా పి.డి.ఎఫ్ బుక్స్ గా చదవవచ్చును.
భగవద్గీతతెలుగులో వినడానికి చదవడానికి తెలుగు ప్రవచనాలు, తెలుగు బుక్స్, తెలుగు వీడియోలు ఉచితంగానే లభిస్తాయి. అయితే భగవద్గీత చదవడానికి, వినడానికి కారణం కొంతమందికి కాలం వలన వచ్చే కష్టం కారణం కావచ్చును. భగవంతుని మీద భక్తి కావచ్చును. మోక్షం కారణం కావచ్చును. భగవద్గీత చదవడానికి అయినా వినడానికి అయినా కారణం ఏదైనా, అది జీవితాన్ని ఉద్దరించే గ్రంధంగా చెబుతారు.
తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయదర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత.
ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలోకార్తీకదీపం వెలింగించడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తీకదీపం ఈ మాసమంతా ప్రతిరోజూ వెలించడం విశిష్ట పుణ్యముగా చెబుతారు.
ఈ కార్తీకమాసములో భక్తులు అంతా దేవాలయ సందర్శనం పరమ భక్తితో చేస్తూ ఉంటారు. శివకేశవుల ఆలయాలకు భక్తులు వేల సంఖ్యలో వెళుతూ ఉంటారు. లోకంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలు, శైవాలయాలకు వెళ్లి శివకేశవుల దర్శనం చేసుకోవడం పరమ పుణ్యంగా భావిస్తారు. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ భక్తుల కోలాహాలం కార్తీకమాసములో ఎక్కువగా ఉంటుంది.
కొందరు కాలినడకన పాదయాత్ర చేసి దేవాలయం సందర్శనం చేస్తారు. ఈ కార్తీకమాసములోనే దైవ దర్శనానికి బహుదూరం నుండి భక్తితో నడస్తూ వచ్చి, దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి నామాలు పలుకుతూ, నడుస్తూ దేవాలయం దర్శనం చేసుకోవడం చాలా మంది భక్తులు కార్తీకమాసంలోనే ఎక్కువగా చేస్తారు.
హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసము
ఇంకా కార్తీకమాసములో వచ్చే ప్రతి సోమవారం విశేష రోజుగా భక్తులు భావిస్తారు. ప్రతి సోమవారం శివ దర్శనం చేయడం, శివుని ముందు దీపారాధన చేయడం పరమపుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. రోజులో రెండు సంధ్యా సమయములలో దీపారాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు.
మాసమంతా ప్రతిరోజూ భగవంతునికి సంబంధించిన కర్మలనే ఆచరిస్తూ ఉండడం విశేషం. అవకాశం ఉన్నవారు మాసమంతా ప్రతిరోజూ నియమబద్దంగా నదీస్నానం చేస్తూ, శివకేశవుల ఆలయాలలో హరి హరులను దర్శిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం నదీస్నానం చేసి, శివాలయం దర్శించుకునేవారు కొందరుంటారు. హరి హరులకు కూడా ఇష్టమైన మాసంగా కార్తీకమాసమును చెబుతారు.
నెలరోజుల పాటు భక్తుల మనసులో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం గా కాలం కదులుతుంది. ప్రతి కదలికలోనూ భగవంతుని దర్శనం చేయడానికే తాపత్రయపడుతూ ఉంటారు. అలా కార్తీకమాసము అంతా కార్తీకపురాణం శ్రవణం చేయడం చాలా ముఖ్యమైన కర్మ. పండితుల మాటలలో కార్తీకమాసము యొక్క వైభవం ప్రవచనాలుగా వింటూ ఉంటారు.
తెలుగులో కార్తీక పురాణం బుక్
కార్తీకపురాణంతెలుగులో తెలుగుపుస్తకం రూపంలో కూడా మనకు లభిస్తుంది. పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకములో ఉండే అంశంతో తాదాత్మకం చెందడం అంటారు. అలా భావించేవారు ఈ కార్తీకమాసములోకార్తీకపురాణ తెలుగుబుక్స్ చదువుతారు. కార్తీకమాసము పరమ పవిత్ర మాసంగా భావించే భక్తులు తప్పనిసరిగా కార్తీకపురాణ పఠనం కూడా చేస్తూ ఉంటారు.
అటువంటి పరమ పవిత్రమైన కార్తీకమాసములో కార్తీకపురాణం తెలుగు బుక్స్ మీ కంప్యూటర్ లేకా ఇతర సాంకేతిక పరికరాలలో చదువుకోవచ్చు. ఆన్ లైన్లో కార్తీకపురాణము పి.డి.ఎఫ్ బుక్ రూపంలో ఫ్రీగురుకుల్ వెబ్ సైట్లో లభిస్తుంది. ఈ కార్తీకపురాణం మీరు ఆన్ లైన్లో ఏదైనా బ్రౌజరు సాయంతో కేవలం చదువుకోవడానికి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
పరమ పుణ్యకాలమైన కార్తీకమాసములోస్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం తెలుగు పి.డి.ఎఫ్. బుక్ మీ మొబైల్ / కంప్యూటర్ / లాప్ టాప్ / టాబ్లెట్ పరికరాలలో ఏదైనా బ్రౌజరు ద్వారా చదవడానికి ఇక్కడ ఈ అక్షరాలను క్లిక్ చేయండి. ఇంకా సంపూర్ణ కార్తీకమహాపురాణం పి.డి.ఎఫ్ పార్మట్లో తెలుగులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి. కార్తీక పురాణం గురించి గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
చరిత్రలో సంఘటనలను బుక్ ద్వారా చదివిన మనసు, ఆ సంఘటనలతో మేమకం కాగలదు. వర్తమానంలొని సంఘటనలతో బేరీజు వేస్తూ, భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. చరిత్రకు సంబంధించిన బుక్ రీడింగ్ చరిత్రను మైండులో స్టోర్ చేస్తుంది. బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్
చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్
తెలుగులో బుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో విషయసారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ బుక్ రీడింగ్ బెస్ట్ హ్యాబిట్ అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు అంటారు.
కటికి చీకటిలో మనిషి కళ్ళకు ఏమి కనబడదు అందకారం, రోజూ తిరిగే చోటే ఉన్నా ఒక్కసారిగా చీకటి అలుముకుంటే, ఎలా గందరగోళంగా ఉంటుందో…అలాగే మనకు అవసరమైన విషయాలలో మనసుకు సరైన అవగాహన లేకపోతే చీకట్లో ఉన్న స్థితే ఉంటుంది, అంటారు. తెలుగు విషయాలలోని సారం, తెలుగు పుస్తకాలలో ఉంటే, వాటిని రీడ్ చేయడంతో గ్రహించవచ్చును.
సందేశం సినిమాలలోనూ, తెలుగు పుస్తకాలలోనూ ఉంటుంది. అయితే ఒక తెలుగుసినిమా చూస్తున్నప్పుడు పాత్రలలో కనిపించే సందేశం కన్నా వారి వేషధారణ, భావప్రకటనను మనసు పట్టుకుని, వాటినే అనుసరిస్తుంది. అయితే ఒక తెలుగుబుక్ రీడింగ్ చేస్తుంటే మాత్రం, ఆ తెలుగు పుస్తకాలలోని పాత్రలను మన మనసే ఒక ఊహను చేయడం ప్రారంభిస్తుంది. మనసు తనకు తానుగా ఊహించడం మొదలుపెడితే, దానియొక్క బలం పెరుగుతుంది. అయితే అది అందరికీ ఆమోదయోగ్యమైనప్పుడు మరింత విలువను సంతరించుకుంటుంది. రాజమౌళి బాహుబలి సినిమా మాదిరి….
సినిమా తీసేవారికి కూడా బుక్ రీడింగ్ చేసే అలవాటు ఉంటుంది. తిరిగి వారు రచన చేయడం కూడా చేస్తారు. అంటే బుక్స్ రీడ్ చేయడం వలన ఆ తెలుగు బుక్స్ లోని సారం గ్రహించిన మనసు మరలా కొత్తగా ఊహించి ఇంకొక కొత్త రచన చేయగలిగే స్థాయివరకు ఊహించగలుగుతుంది. అంతటి శక్తి మనసుకు తెలుగు బుక్ రీడింగ్ వలన వస్తుంది, అంటారు. బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్.
తెలుగు పుస్తకాలలో విజ్ఙానం
తెలుగు పుస్తకాలలో విజ్ఙానం అందించేవి, పౌరాణిక ప్రమాణాలను అందించేవి, వికాసం తెచ్చే తెలుగు బుక్స్ చాలానే ఉంటాయి. సామాజిక స్థితిని, పూర్వపు సామాజిక చరిత్రను, గతకాలపు గొప్పవారి జీవిత చరిత్రలను తెలియజేసే తెలుగు బుక్స్ కూడా మనకు రీడ్ చేయాడానికి ఆన్ లైన్లో లభిస్తాయి.
తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు సాహిత్యపు రచనలు చదవడం ద్వారా మనకు తెలుగు సాహిత్యం తెలుస్తుంది. ఇంకా చారిత్రక తెలుగు బుక్స్ రీడ్ చేస్తే, చరిత్రలో మన పూర్వుల ఘనత తెలియబడుతుంది. చరిత్రలోని సంఘటనలు చదివి, వర్తమానంలోని సంఘటనలు చూసి ప్రభావితం అయిన మనసు భవిష్యత్తు సామాజిక స్థితిని అంచనా వేయగలదు. కాబట్టి చారిత్రాత్మక తెలుగు బుక్ రీడింగ్ చేయడం ఒక అలవాటుగా ఉండడం మంచిది, అంటారు.
తెలుగులో చారిత్రక పుస్తకాలు ఆన్ లైన్లో ఉచితంగా చదవాలంటే, ఇక్కడ ఈ అక్షరాలను తాకండి చారిత్రాత్మక తెలుగు బుక్స్ ఉచితంగా మీరు రీడ్ చేయవచ్చును. బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్
విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి! పుస్తకాలు చదవడం మంచి అలవాటు అంటారు. మరి పుస్తకాలు చదవడం అలవాటు లేనివారు పూర్వం ఉన్నారు. వారు సుఖవంతంగా జీవించారు. మరి పుస్తకాలు చదవడం ఎందుకు?
వృత్తి పనులు పెద్దల ద్వారా తరువాతి తరానికి తెలియపరచబడేవి. ఇంకా కుటుంబ సభ్యుల ద్వారా ఆయా ప్రాంతపు సంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ ద్వారా తెలియపరచడం… ముఖ్యంగా మనో వైజ్ఙానిక కార్యములు కూడా ఉండేవని అంటారు.
మనకు పని విధానం తెలిసి ఉండడం వలన, మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు?
అలా మనం వేగంగా మన పనులు మనం చేసుకుంటున్నామంటే, మనకు సదరు విషయ విజ్ఙానం మన పెద్దల ద్వారా, బంధుమిత్రుల ద్వారా తెలియబడి ఉంటుంది.
పుడుతూనే ఏది ఎలా చేయాలో? తెలియదు… నిత్యం ఎవరో ఒకరి ద్వారా విషయసంగ్రహం తెలుస్తుంటుంది. మనకు లాభం అనిపించిన విషయాలలో మనసు పట్టుకుంటుంది..
గతంలో చదువు లేకపోయినా విజ్ఙానం పెద్దలు ద్వారా తర్వాతి తరానికి తెలిసే వెసులుబాటుగానే ఆచారవ్యవహారాలు ఉండేవి అని అంటారు. అలా తెలియడానికి మన సంప్రదాయపు కుటుంబ వ్యవస్థే మూలం అంటారు.
విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ – చదువుకోక ముందే మన పెద్దవారి దగ్గర నుండి అందుతుంది.
గతంలో ఈ విధానం చాలా బాగుంది… అంటే ఇప్పట్లో ఈ విధానంలో మార్పు వచ్చినట్టే… అలా తర తరానికి మార్పు పొందుతూ వచ్చిన విధానంలో చాలా విషయాలు మరుగున పడతాయి.
వాటలో కొన్ని మంచిని కలిగించే విషయాలు ఎప్పటికీ కొనసాగుతూ మనకు అందుతూనే ఉంటాయి. అయితే కొన్ని ముఖ్య విషయాలు కూడా మరుగున పడే అవకాశం ఉంటుంది.
ఇలా మనకు ఆచారపరంపరలో మనకు, గతంలోవారికి మద్యలో మిస్ అయిన మంచి విషయాల గురించి పుస్తకాలలో లభించే అవకాశం ఉంటుంది.
సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు.
సమజం గతంలో ఎలా ఉంది? ఈ విషయాలు కూడా పుస్తకాలలో ఉంటాయి.
అలా ఎందుకు విషయాలు పుస్తకాలు నిక్షిప్తం? విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్
ఎప్పుడూ సమాజంలో పరిశీలకులు ఉంటారు. వారు విభిన్నంగా ఆలోచన చేయగలుగుతూ ఉంటారు. సమాజం గురించిన అవగాహన కోసం తపిస్తూ ఉంటారు.
ఇంకా గతంలోని సామాజిక స్థితి, విధి విధానాల గురించి, వారు విషయాలు తమ తమ పెద్దవారి దగ్గర నుండి తెలుసుకుని ఉంటారు.
ప్రస్తుత సామాజిక స్థితిగతులను పరిశీలించిన పిదప కొందరు ప్రవచనం రూపంలో సమాజంలోకి వస్తారు. కొందరు ఆచరణ చేయడానికి ప్రయత్నిస్తారు…కొందరు పుస్తక రూపంలోకి విషయాలను పొందుపరుస్తారు.
ఈవిధంగా పుస్తకాలలో విషయవిజ్ఙానం రచన ద్వారా పుస్తకాలలోకి వెళ్ళవచ్చును. విషయ విజ్ఙానం ఎందుకు?
అలాగే వస్తువు గురించి తెలిసి ఉంటే, ఆ వస్తువును బాగా వినియోగించగలరు. – విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి
విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి అయ్యి ఉండవచ్చును. ఒక వస్తువు తయారి చేయడం గురించి అయ్యి ఉండవచ్చును.
వర్తమానంలో జరుగుతున్న విషమయుల వలన భవిష్యత్తులో సంభవించే మార్పుల గురించి అయ్యి ఉండవచ్చును. ఏదైనా కానీ ఆయా విషయముల యందు పూర్తి అవగాహనతో కూడిన ఎరుక ఉండడం విజ్ఙానం అని అంటారు.
విజ్ఙానం, తెలిసి ఉండటం, ఎరుక కలిగి ఉండటం మూడు పదాలు ఒక్కటే కానీ అది లేకపోతే, జీవితం మరో జీవితంపై శక్తి కలిగి ఉన్నా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒక ఊరు నుండి మరొక ఊరుకు వెళ్లాలి…..
కానీ అతనికి బస్సుపై వ్రాసి ఉన్న అక్షరాలను కూడా చదవలేడు. కానీ అతను పూర్తి ఆరోగ్యవంతుడు. అప్పుడు అతను బస్సులో ఎన్ని గంటలు అయిన కూర్చుని ప్రయాణం చేయగలడు, కానీ అతను ఎక్కవలసిన బస్సు తెలుసుకోవాలంటే ఇంకొకరిపై లేక ఇంకొక వస్తువుపై ఆధారపడాలి.
ఇలా ఒక వ్యక్తి తన జీవితంలో నివసిస్తున్న మరియు తాను పని చేస్తున్న పరిస్థితులలో అవసరమైన పనిమూట్ల విషయంలోనూ, తన పరిచయస్తులో మన:వృత్తులపై ఒక అవగాహనతో కూడిన ఎరుక ఉంటే, అతని జీవితం సాఫీగా సాగుతుంది. లేకపోతే ఒక పనిమట్టు వాడాలంటే, ఇంకొకరిపై ఆధారపడాలి. ఇతరులతో మాట్లాడాలంటే మధ్యవర్తి అవసరం. ఇలా కొన్ని అవసరాలకు కొందరిపై ఆధారపడాల్సి వస్తుంది.
అందరికీ అన్ని తెలియవు కాబట్టి కానీ విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన కలుగుతుంది.
అయితే అందరికీ అన్ని తెలియవు కాబట్టి కొందరిపై ప్రతివ్యక్తి ఆధారపడాల్సిరావడం సమాజంలో సహజస్థితి. అయితే మనకు ఉన్న టాలెంటును బట్టి మనం నేర్చిన విద్యలో ఎరుక అంటే తెలిసి ఉండడం అనేది పరిపూర్ణంగా ఉండాలి.
అలా ఒక విషయం అంటే ఒక వస్తువు వాడుక, ఒక వస్తువు తయారి, ఒక సామాజిక అవగాహన ఏదో ఒక విషయంలో పరపూర్ణ జ్ఙానం ఉండడం అవసరం. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్.
మనకు ఏదో ఒక విషయంలో పరిపూర్ణ జ్ఙానం ఉండడం చేత, దానిని బట్టి మనకు రాని విషయములలోకూడా మనం సామాజికంగా ప్రయోజనం పొందగలం. ఎందుకంటే మనకు తెలిసి ఉన్న మన చుట్టూ ఉన్నవారిలో మరొకరికి తెలియకుండా ఉంటుంది.
అలాగే అతనికి తెలియని విషయం మనకు తెలిసి ఉంటుంది. అలా ఇరువురు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండడం చేత సామాజిక స్నేహభావన ఉంటుంది. ఇలా మనకు సమాజంలో ఒక గుర్తింపు విజ్ఙానం వలన వస్తుంది, అంటారు.
ఇప్పటికే మనకు తెలిసి ఉన్న విషయాలతో మనం సమాజంలో ఒక గుర్తింపుతో జీవిస్తూ ఉంటాం, అయితే సామాజికంగా వచ్చే మార్పులలో భాగంగా మనకు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అందుకే పుస్తకము చదవడం వలన లోతైన పరిశీలన కూడా అలవాటు అవుతుంది. అలాంటి అలవాటు ఇప్పుడున్న సాంకేతిక పరికరాల వాడుకలో కూడా ఉపయోగపడుతుంది. తెలుగుపుస్తకములు తెలుగులోరీడ్ చేసే విధంగా ఉండే అనేక పుస్తకములు
తెలియని విషయాలలో విజ్ఙానం పెంపొందించుకోవడానికి తెలుగువారికి తెలుగు బక్ రీడింగ్ ఉపయోగపడుతుంది. తెలిసిన విషయాలలో మరింత విజ్ఙానం పెంపొందించుకోండానికి తెలుగు బక్ రీడింగ్ ఉపయోగపడుతుంది. కొత్త విషయాల గురించి అవగాహన కొరకు కొత్త విషయాలలో ఉండే తెలుగు బక్ రీడింగ్ చేయడం ఉపయోగకరం అంటారు.
కుదురు ఉండని మనసును కాసేపు ఒకే విషయంలోకి తీసుకువెళ్ళడానికి పుస్తకం చదవడం ఉపయోగపడుతుందని అంటారు. అందుకే పుస్తకాలు చదవడం మంచి అలవాటు అంటారు.
వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి.
ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో వ్యక్తి బాధ్యతను గుర్తు చేస్తూ మాట్లాడే ప్రసంగాలలో వ్యక్తిత్వ వికాసం గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు.
విజ్ఙానంతో ఉండడం వికాసం అంటే విషయములందు జ్ఙానమును కలిగి ఉండుట, మరియు నిర్వహించు పనులలో బుద్ది వికసించి పనిచేయుటగా చెబుతారు. మనసుకు తాను చేస్తున్న పనులకు సంబంధించి సరైన జ్ఙానం కలిగి ఉండడం చేత, బుద్ది వికసించి ఆయా పనులలో సరైన రీతిలో స్పందించడం చేత పనులు సత్ఫలితాలను ఇస్తుంది, అంటారు.
బుక్ రీడింగ్
ఒక డాక్టర్ ఉంటే స్కూలు చదువుతున్న కాలం నుండే అతని మనసు పట్టుకున్న సైను బక్ రీడింగ్, గ్రహించిన సైన్సు సారంశం అతనిని కళాశాలకు వచ్చేటప్పటికి జీవశాస్త్రం, రసాయిన శాస్త్రం లాంటి సబ్జెక్టులవైపు వెళ్లేలా బుద్ది ప్రభావితం అవుతుంది అంటారు. అలా ఒక వ్యక్తి తన స్కూలు వయస్సు నుండే చదివే పుస్తకములలోని జ్ఙానాన్ని గ్రహించడం చేత, ఆయొక్క జ్ఙానాన్ని అనుసరించి, అతని భవితవ్యం ఆధారపడుతూ ఉంటుంది. వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ .
మనసు నేర్చుకున్న విషయాలను బట్టి బుద్ది వికాసం ఉంటుంది కాబట్టి మనసును మేలు చేసే విషయముతో నింపితే, మనిషి బుద్ది శాంతికి దారితీస్తుంది. కామంతో కూడిన పుస్తకాలే చదివితే, ఆ మనసు కామము తీర్చుకోవడానికి తపిస్తుంది. ఇతర పుస్తకాలు చదివితే ఇతరా విషయములవైపు బద్ది పోతుంది. కాబట్టి బుక్ రీడింగ్ అనే మంచి అలవాటుని, గుడ్ తెలుగు బుక్ రీడింగుకు చేయడానికి వెళితే, గుడ్ హ్యాబిట్ గా మనకు మేలునే చేస్తుంది.
వికాసం తెలుగువారి తెలుగు రచనలను తెలుగుభాషలో చదువుతూ తెలుగు భాషపై పట్టు పెంచుకోవడం చేత తెలుగుసాహిత్యం ఇంకా మనకు మరింత చేరువకావడంతో బద్ది వికాసానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తెలుగు పుస్తకములు చదవడానికి గురుకుల్ మీరు విజిట్ చేయడం ద్వారా అనే తెలుగు పుస్తకములను రీడ్ చేయవచ్చును. వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ .