అనగనగా ఒక యువరాణి పెళ్లి చూపులు కొన్ని వందల సంవత్సరాల క్రితం, నదీతీరంలో విస్తరించిన రాజ్యం – శాంతి, సమృద్ధి, సత్య న్యాయాల పీఠికగా నిలిచేది. ఈ సామ్రాజ్యానికి పాలకుడు – నరేంద్ర భూపతి. ధర్మపరాయణుడు, ప్రజల మన్ననలు పొందిన రాజు. అతనికి సంతానం ఒక్కతే – యువరాణి వసంతలత. ఆమె రూపవతి, అందగత్తె, మాటకారి! ముద్దు మాట, సంస్కారం, జ్ఞానం – ఈ మూడింటి సౌందర్య కలయిక ఆమెలో పరిపూర్ణమైందిగా కనిపించేది. ఒకరోజు, మహారాజు యువరాణికి, ఒక ప్రముఖ యువరాజుతో ఆమెకు సంబంధాన్ని నిర్ణయించాడు. ఆ యువరాణి అతనితో ఏకాంతంగా మాట్లాడిన వెంటనే, ఆమె మనసు కలవలేకపోయింది. ఆ మాటలు రాజును చేరుకున్నాయి.
పెళ్లి సంబంధం చెడిపోయింది. రాజును దిగులు కలిగించింది. “ఆమెకు ఎలా సంయమనం లేదు? ఇలా ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తూ పోతే, ఎలా?” అని అతని మనసులో ఆవేదన. కానీ, తన కూతురిపై ప్రేమగల మహారాజు చాలా విచారించి, ఆ విషయంలో నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఒక ఉదయం, యువరాణి – సాదాసీదా మారువేషం ధరించి, పట్టణ వీధుల్లోకి బయలుదేరింది. నదీ తీరంలో ఉన్న పూరితొలగిన ప్రాంతంలో, మట్టి గుడిసెల మధ్య, ఆమె కాళ్లు ఆగిపోయాయి. అక్కడ ఆమెకు ఒక అమ్మాయి మాటలు వినిపించాయి.
“ఇంత వయస్సు వచ్చాక, నీకు పెళ్లి అవసరమా? పెళ్లి చేసుకుని ఏం చేద్దామని? ” అంటూ అక్కడ వయస్సు దాటిన పెళ్లి కొడుకుని ప్రశ్నిస్తూ, అతనిని కోపంగా చూస్తుంది. యువరాణి ఆ గుడిసెలోనికి వెళ్ళింది.
మారువేషంలో లోపలికి వచ్చిన యువరాణిని చుసిన ఆమె “ఇదిగో ఎవత్తో వచ్చింది, దీన్ని కట్టుకో… “ అంటూ ఆ గుడిసెలో నుండి బయటకు వెళ్ళిపోయింది… హటాత్తుగా లోపలి వచ్చింది ఎవరు? అనుకుంటూ యువరాణిని అతను ప్రశ్నించాడు… “ఎవరు నువ్వు?” అంటూ..
వెంటనే యువరాణి “ఏం జరుగుతుంది?” అని అతనిని అడిగింది… అప్పుడు అతను యువరాణితో “ఆమె తండ్రి నన్ను తన కూతురిని పరిణయమాడవలసినదిగా కోరాడు, అందుకే నేను ఆమెను ఇక్కడ కలుసుకోవలసినదిగా కోరాను, ఆమె ఇక్కడకు వచ్చాక, తనకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది” అని యువరాణితో అతను చెప్పాడు.
అప్పుడు, యువరాణి అతనితో “మరి నువ్వేం అనుకుంటున్నావ్?” అని అన్నది… అతను యువరాణితో మాట్లాడుతూ “నేను ఎనుకునేది ఏమి లేదు, ఆమె తన తండ్రిమాటను నిలబెట్టలేకపోయింది” అని అన్నాడు…
యువరాణి అతనితో మరలా మాట్లాడుతూ “అంటే, తండ్రి మాట ఇస్తే, ముసలోడిని మొగుడుగా చేసుకోవాలా? ముసలోడిని కట్టుకుని చేసేదేమిటి?” అంటూ అతనిని ప్రశ్నించింది…
అందుకు అతను యువరాణితో ఇలా చెప్పాడు “ఆమెకు అనారోగ్యం పాలైతే, ఆమె కోసం ఆ తండ్రి పడ్డవేదన, ఆమె తల్లిని అడిగితె చెబుతుంది. ఆమె యుక్త వయస్సులో ఉంది, ఆమె చుట్టూ తిరగడానికి ఒక్క యువకుడు సాహసం చేయడు? కారణం ఆ తండ్రి తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో వారికి తెలుసు? మరి కూతురి విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండే, ఆ తండ్రి కూతురుకి ఎటువంటి పెండ్లి కొడుకుని, ఎందుకు నిశ్చయించాడు? అనే ఆలోచన లేదు. వారిద్దరిలో తండ్రి ఖచ్చితంగా ఉంటె, ఆమె మాత్రం ఖచ్చితంగా లేదు” అన్నాడు.
వెంటనే మారువేషంలో ఉన్న యువరాణి, అతనితో మరలా మాట్లాడుతూ “అదేమిటి వయస్సు దాటినవాడిని పెళ్లి చేసుకోనని చెప్పింది, అంతే కదా, అది తప్పు ఎలా అవుతుంది.”
అందుకు బదులుగా అతను ఆమెతో “అంగడిలో ఒక గుఱ్ఱం అమ్మకానికి ఉంటే, ఆ గుఱ్ఱం పరిశీలించి బాగుంటే, ఆ గుఱ్ఱం యజమానితో మాట్లాడుతాం, కాని ఆ గుఱ్ఱంతో కాదు… ఆ గుర్రాన్ని కొనుగోలు చేస్తే, ఆ గుఱ్ఱంతో మన ప్రయాణం ఉంటుంది… ఒకవేళ ఏదైనా గుఱ్ఱం అడవిలో లభిస్తే, దానిని మచ్చిక చేసుకుని, దానితో ప్రయాణం మొదలు పెడతాం….. కాని నేను అతని తండ్రి కోరితే, ఈ పెళ్లి చూపులకు వచ్చాను, కానీ నేను ఆమె వెనకాల పడలేదు. అలా పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు, ఇద్దరికీ యజమానులు తల్లిదండ్రులు, వారు మాట్లాడుకోవలసి విషయాలు మనం మాట్లాడుకోకూడదు. ఆమె నన్ను చూసింది, తన అభిప్రాయం తనవారితో చెప్పి ఉంటే, బాగుండేది, కానీ ఆమె నాతో ప్రత్యక్షంగా తన ఆవేశాన్ని చూపడం, ఒప్పు అయితే కాదు.” అని అన్నాడు… ఆ సమాధానంతో యువరాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది…. తన మందిరంలోకి వెళ్ళిన యువరాణి మనసులో మార్పు మొదలైంది….


