కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి. అవి మనసులో మొదలైతే అవకాశాలు చేజరిపోతాయి. మనిషిలో ఆలోచన వివేకం పెంచాలి కానీ ఆటంకం సృష్టించకూడదు.

ఒకానొక ఊరిలో రాజులు అనే ఒక తెలివైన మరియు ప్రతిభావంతుడు అయిన యువకుడు ఉండేవాడు. అయితే అతనిలో అంతులేని ఆలోచనలు అలల వలె వస్తూ ఉంటాయి. అందువలన అతను ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అతనిలో ఆలోచనలు ఈ విధంగా సాగుతాయి… “ఇది ఇలా అయితే? అది అలా అయితే?” అని ఆలోచనలు సాగుతూ పనిని ప్రారంభించడానికి ఆటంకాలు అతని మనసులోనే మొదలు అవుతాయి.

ఒక రోజు రాజులు న్యూస్ పేపర్లో ఒక ఉద్యోగ ప్రకటన చూసాడు. ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలని అనుకున్నాడు. కానీ అతనిలో ఆలోచనలు అలల మాదిరి మొదలు…. ఎలా అంటే?  “నేను ఆ ఉద్యోగినికి సరిపోతానా?”, “వాళ్లు తిరస్కరిస్తే? ఎలా?”, “ఇంకా బాగా సిద్ధం కావాలా?” అనే ఆలోచనల వలన రోజులు గడిచిపోయాయి.

ఇలా కాలం గడుస్తుండగా, రాజులు వద్దకు అతని స్నేహితుడు వివేక్ వచ్చాడు.
“రాజులు, నీకు నా ధన్యవాదాలు, నీవు చాలా రోజుల క్రితం పేపర్లో వచ్చిన ఉద్యోగావకాశాలు యాడ్ గురించి, నాకు చెప్పావు…. నేను దరఖాస్తు చేశాను,,, నిజంగా నేను ఆ యాడ్ చూడలేదు, నీవు చెప్పడం వలననే నాకు తెలిసింది…. ఇప్పుడు  నాకు ఆ ఉద్యోగం వచ్చింది?” అని చెప్పి అక్కడ నుండి ఆనందంతో బయలుదేరాడు.
రాజులు ఆలోచించసాగాడు. ‘నా కన్నా తక్కువ చదువు చదివిన వీడికే ఆ ఉద్యోగం వచ్చేసింది అంటే, నేను దరఖాస్తు చేసి ఉంటే, ఖచ్చితంగా ఆ ఉద్యోగం నాకే వచ్చేది…’  అని చింతిస్తూ…. మరొక రోజు ఉద్యోగావకాశాల పేపర్ యాడ్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు.

నీతి:
ఆలోచన ఉండాలి కానీ అవే ఆటంకం కాకూడదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుని, ముందడుగు వేయాలి.

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts