శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఓం శ్రీ మంజునాదాయ నమః శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

చిరంజీవి శివుడుగా నాట్యం చేసిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం. జెకె భారవి రచించిన భక్తి కధ ఆధారంగా చిరంజీవి శివుడిగా మీనా పార్వతి దేవిగా, అర్జున్ భక్తుడిగా అతని భార్యగా సౌందర్య నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం శ్రీ మంజునాథ. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం విశేషం అయితే హంసలేఖ సంగీతం అందించారు, నారా జయదేవి నిర్మించారు.

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస సినిమాను యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేక నొక్కండి.

భూదేవి భూమిని చీల్చుకుంటూ పైకి వస్తే, ఒక రాక్షసాకారాలు ఆమెను తరుముతూ ఉంటుంది ప్రారంభ సన్నివేశంలో.  అప్పుడు భూదేవి శ్రీమంజునాథ(SriManjunatha) అంటూ ఆర్తనాదం చేయడంతో కైలాసంలో ధ్యానం ఉన్న కైలసవాసి కనబడతారు. అప్పుడు పార్వతి దేవి శివయ్యని అడుగుతుంది ఏమిటి స్వామి భూమాత అక్రోసిస్తుంది, ఏమిటి వైపరీత్యం అంటే అప్పుడు, పరమేశ్వరుడు పార్వతితో కలికాలం కదా భూలోకంలో కామ క్రోధ, లోభ, మద, మాచ్యర్యాలు జనులు లోనవుతూ ఉంటారు అని సెలవిస్తారు.

ధర్మోరక్షిత రక్షితః అనే సూత్రంతో మనిషే మహనీయుడు అవుతాడని అంటే, అటువంటి మానవుడు ఎవరని అడిగితే మంజునాధుడు భూలోకంలో రుద్రుడుని దూషిస్తూ కనబడే వ్యక్తిని చూపిస్తారు. అతనే భూలోకంలో ధర్మరక్షణకు పూనుకునే భక్తుడుగా మారతాడని మంజునాధుడు సెలవిస్తారు. ఇక శివదూషణ సాగే పాటలో మరో భక్తురాలు కాత్యాయని శివస్తుతి చేస్తూ కనబడుతుంది. తరువాయి ఇంటికి విచ్చేసిన మంజునాధుడుని తండ్రి మందలిస్తాడు.

గ్రామపెద్ద ఒక తప్పుడు తీర్పు ఇస్తుండడంతో మంజునాధ అక్కడికి వచ్చి ఆ గ్రామ పెద్దకి బుద్ది చెబుతాడు. అక్కడే ఉన్న కాత్యాయని (సౌందర్య) మంజునాధ(అర్జున్)ని చూసి ఇష్టపడుతుంది. శివాయలంలో ప్రసాదం పెట్టని పూజారిని ఎదురించి మంజునాధ ఆ అన్నార్తికి ప్రసాదం పెడతాడు. శివుడు సంతోషిస్తాడు, ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చినందుకు. మరలా మంజునాధ, కాత్యాయని గుడిలో కలిసే పరిస్థితి వస్తుంది. ఊరి పెద్దలంతా భక్త మంజునాధపై ఆగ్రహంగా ఉంటారు. అన్యాయాన్ని ఎదిరించే గుణం కలిగిన మంజునాధుడు కనిపించకుండా ఉంటూ అన్యాయాన్ని ఆపని భగవంతుడిపై కోపంగానే ఉంటూ ఉంటాడు.

భక్తుడు మంజునాధ-కాత్యయనిల వివాహం వారికి సంతానం

శ్రీ మంజునాధ చరితం నీ శ్రీ మంజునాధ అంటూ సాగే పాట పాడుతూ శివ మహిమలు గురించి చెప్పే పాటలో ఆ ప్రాంత అంబికేశ్వర మహారాజ దంపతులు కనబడతారు. శివుడు హాలాహల భక్షణం, గంగావతరణ, శివపార్వతుల అర్ధనారీశ్వర స్వరూపం గురించి ఈ పాటలో చక్కగా చూపుతారు. ఆ మహారాజుకి మంజునాధుడి అనుగ్రహంతో ఎదుటివారి నుదుటి వ్రాతలు చదివే విద్య అతని సాధన వలన వస్తుంది.

మంజునాధుడు(శివుడి) అనుగ్రహంతో కాత్యాయని మంజునాధు(అర్జున్)లకు వివాహం జరుగుతుంది. కాత్యయనిని దేవదాశిగా మారుస్తుంటే భరించలేని మంజునాధు(అర్జున్)డు ఊరి పెద్దల మద్య తాళి కడతాడు. ఇంటికి వచ్చిన మంజునాధ-కాత్యాయనిలను ఇంట్లోని వారు కాత్యాయనికి శివుడిపై ఉన్న భక్తి కారణంగా వారిని ఇంటిలోనే ఉండనిస్తారు. శివుని పేరు చెబితే చిరాకు పడే మంజునాధుడి భార్య కాత్యాయని శివుడిని సంతానం కోసం పూజిస్తూ ఉంటుంది. భక్తురాలి కాత్యాయని భక్తికి భగవంతుడు శివుడు కట్టుబడడం ఈ సన్నివేశంలో కనిపిస్తుంది.

సంతానం కోసం మౌనవ్రతం చేస్తూ ఉండే కాత్యాయనికి శివుడు మారువేషంలో వచ్చి మూలికను ఇచ్చి వెళతాడు. తత్పలితంగా వారికి ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి సిద్ధూ అని నామకరణం చేస్తారు. కానీ ఆ పుత్రుడు పూర్తిగా శివుని భక్తుడిగా ఉంటాడు. అది మంజునాధుడి(అర్జున్)కి నచ్చదు అయితే అతను తన తల్లిదండ్రులతో వాదించి ఇకపై దైవ ప్రస్తావన తీసుకురావద్దని చెబుతాడు.

దైవ మంజునాధుడు మానవ మంజునాధతో వివిధ రూపాలలో హితబోధ చేయడం

శివుడు లేడని ఒప్పుకో మీ నాన్నని భాదపెట్టకు అని సిద్ధుకు మంజునాధుడి స్నేహితులు చెబుతుంటే, అప్పుడు సిద్ధూ శివుడి గురించి వివరిస్తూ ఉండగా తండ్రి వచ్చి సిద్ధూని చెంపపై కొట్టి ఇంటికి తీసుకువెళతాడు. కానీ మంజునాధ(అర్జున్)కు నిద్రరాకుండా కలలే వస్తూ ఉంటాయి. లేచి ఊరికి దూరంగా కొండలలో కూర్చున్న మంజునాధ(అర్జున్) దగ్గరికి శివుడైన మంజునాధుడు మారువేషంలో వస్తారు. అలా వచ్చిన మంజునాధుడు మానవ మంజునాధుడికి హితబోధ చేస్తే ఆలోచనలో పడతాడు మంజునాధుడు(అర్జున్). అలా ఆలోచనలో ఉన్న మంజునాధుడు దగ్గరికి వాళ్ళ అమ్మ వేషంలో దైవ మంజునాధ వచ్చి మాట్లాడి వెళుతుంది. ఇంకా ఆలోచనలో సాగుతుండగా మళ్ళి మంజునాధుడు సిద్దుడి వేషంలో వచ్చి మాట్లాడి వెళతాడు.

నిరంతర ఆలోచనల నుండి బయటపడిన మంజునాధుడు(అర్జున్) ఇంటికి వస్తాడు. అలా వచ్చిన మంజునాధ (అర్జున్)ని ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని అడిగితే ఆశ్చర్యపడతాడు మంజునాధుడు (అర్జున్). అప్పుడు ఇంట్లో వారిని అడుగుతాడు మీరు ఇంతకముందు నాదగ్గరికి వచ్చారు అని అడిగితే, కుమారుడు సిద్ధూ వచ్చి నీదగ్గరికి మా రూపాలలో వచ్చింది దైవం మంజునాధుడు(శివుడు) అని చెబుతాడు. ఇంటిలో ఉన్న మంజునాధుడు శివభక్తుడుగా మారతాడు. ఆ సన్నివేశంలో ఒక్కడే మంజునాధుడు ఒక్కడే మంజునాధుడు ఒక్కడే అని సాగే పాట భక్తిప్రదాయకంగా సాగుతుంది. హరుడు ఒక్కడే, శివుడు ఒక్కడే, మంజునాధుడు ఒక్కడే, గంగాధరుడు ఒక్కడే అంటూ మానవ మంజునాధ భక్తమంజునాధగా మారుతాడు.

భక్తుడు అయిన మంజునాధ తన కుటుంబంతో ధర్మస్థల దైవ దర్శనానికి దేవాలయానికి వెళతాడు. అదే ఊరికి అంబికేశ్వర మహారాజు దేవాలయానికి వస్తాడు. అప్పటికీ భక్త మంజునాధ అంటే గిట్టని కొందరు అక్కడికి వస్తారు. అదే సమయంలో సుడిగాలి రావడం దేవాలయంలో దీపాలు ఆరిపోతాయి. సుడిగాలి వచ్చి దీపాలు ఆరిపోయాయి అంటే నాస్తికుడు దేవుడిని నమ్మని మంజునాధ (అర్జున్) దేవాలయానికి రావడమే కారణం అని మహారాజుతో చెబుతారు. అప్పుడు మహారాజు భక్త మంజునాధకి ఆలయప్రవేశం చేయాలంటే మీ భక్తితో ఆరిపోయిన దీపాలు వెలిగించండి అప్పుడు దైవాన్ని దర్శించుకోండి అని ఆజ్ఞాపిస్తాడు.

భక్తిగానంతో దేవాలయ దీపాలు వెలిగించే భక్త మంజునాధ

ఓం మహా ప్రాణదీపం, శివం శివం మహా ఓంకార రూపం అంటూ అందుకునే పాట గుక్కతిప్పకుండా సాగుతుంది. పాట పూర్తయ్యేసరికి గుడిగంటలు లక్ష గుడిదీపాలు వెలగడం మంజునాధ దైవమహిమ, మంజునాధ భక్తి తేట తెల్లమవుతుంది మహారాజుకి. మహారాజు తనతో రాజ్యానికి వచ్చేయమని భక్తమంజునాధని కోరితే, నేను అహంకారంతో అజ్ఞానంతో కోటిసార్లు దైవ దూషణ చేశాను కాబట్టి కోటిలింగ ప్రతిస్థాపన చేస్తాను అని బడులిస్తాడు భక్త మంజునాధ.

కోటిలింగాల ప్రతిస్థాపనకు మహారాజుకూడా వచ్చి వెళతాడు. ఆ మహాకార్యం పూర్తయ్యాక పార్వతి పరమశివులు చాల సంతోషిస్తారు. అనుగ్రహించదలచిన పరమేశ్వరుడు మంజునాధుడు భక్త మంజునాదని అనుగ్రహించడానికి ఒక వృద్ద వేషంలో వస్తారు. అయితే అతిదిగా భోజనానికి వచ్చిన ఆ వృద్ధుడు భక్త మంజునాధని పరీక్షించడానికి తననితనే దూషిస్తాడు, కోపగించిన భక్త మంజునాధ వచ్చింది పరమశివుడు అని గుర్తించక స్వామి ఇంటినుండి గెంటివేస్తాడు. ఆ సమయంలో మౌనవ్రతంలో ఉన్న కాత్యాయనికి వచ్చింది శివుడు అని తెలిసిన భర్తకు చెప్పలేని అపస్మారక స్థితిలో ఉంటుంది.

శివయ్య ఇంటినుండి వెళ్ళిపోయాక స్పృహలోకి వచ్చిన కాత్యాయని మాట్లాడి స్వామిని అడుగుతుంది. కానీ మౌనవ్రతం చేస్తున్న కాత్యాయని మాట్లాడం విని మంజునాధ అడిగితే, వచ్చింది సాక్షాత్తు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అయిన మంజునాధుడు అని బదిలిస్తుందే. భక్త మంజునాధ మరలా వృద్ద రూపంలో వచ్చిన మంజునాధుడిని వెతుకుతూ వెళతాడు. పరిక్షలు పెట్టవాడు దొరికితే పకృతి ఒప్పదనే ఏమో భక్తుడిని పరీక్షిస్తూ భగవానుడు కూడా భాదపడుతూ ఉంటాడు.

పార్వతిమాత కోయి రూపంలో వచ్చి అన్నదానం చెయ్యమని సూచన చెప్పి వెళుతుంది. ఆ సూచనతో అన్నదాన కార్యక్రమానికి పూనుకుంటారు ఆ పుణ్యదంపతులు. అయితే సిద్ధూ స్నానం చేస్తుండగా పాము కరిచి చనిపోతాడు. అయితే అన్నదాన కార్యక్రమం ఆగకూడదని, ఆ విష విషయాన్ని మనసులో దిగమింగుకుని, అన్నదాన కార్యక్రమం చేస్తారు. గుడిలో దీపాలు పాటపాడి వెలిగించినట్టు మీ భక్తితో నా బిడ్డ ప్రాణాలు బతికించమని అడుగుతుంది, కాత్యాయని. అప్పుడు మంజునాధ భక్తుడు ఊళ్ళోకి చావులేని ఇంటినుండి పిడికెడు ఆవాలు తెమ్మని చెబుతారు. తిరిగివచ్చిన కాత్యాయనికి చావు తప్పదని అర్ధం అయిన కాత్యాయని మౌనం వహిస్తుంది.

ఇక ఇంట్లో శవం పెట్టుకుని అన్నదానం చేయడం అధర్మం అని మంజునాధని మహారాజు దగ్గరదోషిగా నిలబెడతారు. నేరం ఆరోపింపబడి సభలో మౌనంగా ఉన్న మంజునాధని రక్షించాడానికి పైన నుండి మంజునాధుడే అఘోర రూపంలో వస్తాడు. అలా వచ్చిన మహాస్వామి భక్త మంజునాధని పరీక్షపెడితే, ఆ అగ్నిపరీక్షలో మంజునాధకి ఏమి జరగకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మంజునాధ మహాభక్తుడు అని అఘోర రూపంలో వచ్చిన భగవానుడు తీర్మానించి సభనుండి నిష్క్రమిస్తారు.

యముడు పనిని మంజునాధుడు చేయడం – శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

మహారాజుతో కలిసి ధర్మజ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్న మంజునాధ వలన అంతా సంతోషిస్తూ ఉంటారు. అయితే, కైలాసంలో సంతోషిస్తున్న పరమశివుడు దగ్గరకి యమధర్మరాజు వస్తారు. అలా వచ్చిన యముడు చెప్పిన విషయాన్ని విని దిక్కులకు నాధుడు అయిన మంజునాధుడు దిగ్బ్రాంతికి గురి అయ్యినట్టు కనబడడం జరుగుతుంది. యముడు పాశాన్ని మంజునాధుడికె ఇచ్చేసి కైలాసం నుండి మరలుతాడు. భక్త మంజునాధ నుదుటిని ఒకరోజు రాజు చదివి, విషయం భక్తమంజునాధకి చెబుతాడు. తన మరణం తద్యం అని తెలుసుకున్న భక్త మంజునాధ ఇంటికి తిరిగి వెళతాడు.

ఇంటికి వస్తున్న భక్త మంజునాధని అతనంటే పడనివారు కత్తితో గాయాలు చేస్తారు. గాయాలను పైకి కనబడకుండా ఇంటికివచ్చిన భక్త మంజునాధ ఇంటిలోనివారిని గుడికి పంపించి మృత్యువుకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరణం అంటే భయముండే మనిషి మృత్యువు కోసం ఎదురు చూడడం, జననమరణాలు ఆటగా ఆడుకునే ఆ ఆటగాడు ప్రాణాలు తీసుకువెళ్ళడానికి దుఖించడం బహుశా ఈ భక్తిచిత్రంలోనే కనబడుతుంది.

భక్త మంజునాధకి దైవ మంజునాధకి జరిగే పతాక సన్నివేశం కంటతడి బెట్టిస్తుంది. చివరికి మంజునాధ దంపతులు కైలాస మంజునాధుడిలో కలిసి పోవడంతో ఈ తెలుగు చిత్రం ముగుస్తుంది.

ఆద్యంతం భక్తుడి యోగక్షేమాలు కోసం తపించే దైవంగా కైలాస మంజునాధుడు కనిపిస్తే, కైలాస మంజునాధుడిని దూషిస్తూ, చివరికి కైలాస వాసి పాదాలు కోసం తపించే భక్తుడిగా భూలోక మంజునాధుడు కనిపిస్తాడు. ఇద్దరి వలననే ధర్మస్థలం కోటిలింగాల క్షేత్రంగా వెలసినట్టుగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. శివానుగ్రహం వలన జీవితాలు ఎలా ఉద్దరింపబడుతాయో ఈభక్తిచిత్రం తెలియపరుస్తుంది. నమ్మిన భక్తుడి యోగక్షేమాల కోసం భగవానుడు తాను విధించిన నియమయాలకు తాను విలపించే భగవంతుడి హృదయం శ్రీమంజునాధచిత్రంలో కనిపిస్తుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

Puttina Roju Subhakankhalu Quotes Telugu

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు

తెలుగువ్యాసాలు

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం