వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు.
వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన లక్షణాల వలన, గుణాలు వలన, అభిరుచుల వలన తన యొక్క ప్రవర్తనతో వివిధ పరిస్థితులలో వివిధ విధాలుగా గుర్తింపు పొందుతూ ఉంటాడు. అయితే వ్యక్తి అన్ని చోట్లా అన్ని వేళలా శోభించే గుణాలు, లక్షణాలు అతని యొక్క స్వభావముగా గుర్తింపు పొంది, అది ఆ వ్యక్తి యొక్క విశిష్ట తత్వముగా గుర్తింపు పొందుతుంది.
మనిషి యొక్క వ్యక్తిత్వమును పూర్తిగా ప్రభావితం చేసే అతని యొక్క మనసు మాత్రమే. ఎవరి మనసు వారి యొక్క ప్రవర్తనకు కారణం కాగలదని అంటారు. మనసులో ఏర్పడిన భావాలు, మనసులో గుర్తుగా మారిన సంఘటనలు, మనసులో గుర్తించబడిన విషయాలు, మనసులో కదులుతు ఆలోచనలు కలిసి సంఘర్షణగా మారుతుంటే, మనిషి యొక్క చేతలు తదనుగుణంగా ఉంటూ ఉంటే, తత్పరిణామ ఫలితమే మనిషికి ఒక గుర్తింపు పొందగలగడంలో మనసు తన ప్రత్యేకతను చాటుతుంది. ఇందుకు ఆ మనిషి చుట్టూ ఉంటే పరిస్థితలు, వ్యక్తులు కూడా బాగస్వామ్యం కాగలవు.
వ్యక్తి వ్యక్తిత్వం పై ప్రభావం
గుర్తింపు పొందిన వ్యక్తి యొక్క మనసు తన గుర్తింపును కొనసాగించడానికి ఆలోచనలు చేస్తుందని అంటారు. అలాగే అతనికి గుర్తింపును ఆపాదించినవారు కూడా సదరు ఆలోచనలకు కారణం కాగలరు. మొత్తానికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పెరుగుతున్న పరిస్థితులలో నేర్చుకున్న విషయ పరిజ్ఙానం, స్నేహం చేస్తున్న వ్యక్తుల, సంరక్షణ చేస్తున్న వ్యక్తుల ప్రభావంతో పాటు తన మనసు యొక్క స్పందనలు అనుసరించి… వ్యక్తిత్వం ఏర్పడుతూ… ఉంటుంది.
ఒక్క పూటలోనూ… ఒక్క నెలలోనూ వ్యక్తిత్వం ఏర్పడదు… అది పెరుగుతున్న వయస్సు నుండి… తన చుట్టూ ఉన్న వ్యక్తుల మరియు పరిస్థితుల ప్రభావం ప్రకారం ప్రతిస్పందిస్తున్న తీరు బట్టి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఒక్కసారి గుర్తింపు పొందిన వ్యక్తిత్వం జీవితకాలంపాటు కొనసాగుతుంది.
ఆసక్తులు, ఆశలు, కోరికలు, కోరికలు తీర్చుకోవడానికి సహకరిస్తున్నవారు, కోరికలు తీర్చుకోవడంలో భాగస్వాములు అవుతున్నవారు, కోరికలకు కారణం అవుతున్నవారు… ఆశలు కల్పిస్తున్నవారు… ఆశలు సృష్టిస్తున్న పరిస్థితులు, ఆశలకు కారణం అవుతున్నవారు… ఇలా ఏదైనా ఒక స్వభావం వృద్ది చెందడానికి వ్యక్తి మనసుతో బాటు సమాజం కూడా కారణం కాగలదు.
వ్యక్తిని బట్టి సమాజం దృష్టి, సమాజం తీరుని బట్టి వ్యక్తి
లోకంలో వ్యక్తిని బట్టి సమాజం దృష్టి, సమాజం తీరుని బట్టి వ్యక్తి ప్రవర్తన ఉంటుందని అంటారు. సమాజంలో వ్యక్తి జీవించాలి. కాబట్టి సమాజంలోని పోకడలు గమనిస్తూ, తన అవసరాల కొరకు తను మాట్లాడవలసినవారితో మాట్లాడుతూ, పనిచేయవలసిన చోట పని చేస్తూ, పని చేయించవలసిన చోట పని చేయిస్తూ… సమాజంలో తన యొక్క మనుగడకు తను ప్రవర్తించే ప్రవర్తన ఆధారంగా గుర్తింపు పొందే వ్యక్తి స్వభావం లేదా వ్యక్తిత్వంగా ఉంటుంది.
మనసుకు బాగా దగ్గరగా మెసిలేవారికి వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం తెలియబడుతుంది. ఎక్కువమందికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కొన్ని గుణాలు మాత్రమే తెలియబడతాయి.
ఒక సినిమా హీరో నటనా చాతుర్యం ఒక విశిష్ట గుణం అయితే, అది సినిమా ప్రేక్షకులందరికీ తెలియబడుతుంది. కానీ ఆ సినిమా హీరోయొక్క వ్యక్తిత్వం గురించి మాత్రమే అతనికి బాగా దగ్గరగా మెసిలే మనుషులకే తెలియబడుతుంది.
పాపులారిటీని బట్టి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా అంచనా వేయలేం…. అలాగే వ్యక్తిని బాగా దగ్గరగా పరిశీలించేవారికి మాత్రమే పూర్తి స్థాయి వ్యక్తిత్వం తెలియబడుతుంది. వారికే అతని యొక్క మంచి మరియు చెడు ఆలోచనల తీరు తెలియబడుతుంది.
ఒక వ్యక్తి వ్యక్తిత్వం మరొక వ్యక్తి వ్యక్తిత్వం
లోకంలో ఒక వ్యక్తి వ్యక్తిత్వం మరొక వ్యక్తి వ్యక్తిత్వం ఒకదానితోఒకటి ప్రభావం చూపగలవు.
ఇద్దరు వ్యక్తులు: ఏ అను ఒక వ్యక్తి, బి అను మరొక వ్యక్తి ఉన్నారనుకుంటే.
ఏ అను వ్యక్తి మనసులో పుట్టిన ఒక ఆలోచన బి అను వ్యక్తి మనసుపై ప్రభావం చూపింది. అప్పుడు బి అను వ్యక్తి యొక్క మనసు ప్రతిస్పందించడంలో వలన ఏ అను వ్యక్తి మనసు ప్రభావితం అవుతుంది. మరలా ఏ అను వ్యక్తి ప్రతిస్పందిస్తే, తిరిగి బి అను వ్యక్తి ప్రతిస్పందించడం జరుగుతుంది. ఇలా… ఇద్దరు వ్యక్తుల మద్య స్పందనలు ఉండవచ్చును.
అలా సమాజంలో ఇద్దరు వ్యక్తుల మద్య సంబంధాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి వివిధ వ్యక్తులతో బంధమేర్పడి ఉంటుంది. ఒక వ్యక్తికి… అన్న లేక తమ్ముడు, అక్కా లేకా చెల్లెలు, బావ లేక బావమరిది, మేమమామ, మేనత్త, మామగారు, అల్లుడుగారు, చిన్నాన్న, పెదనాన్న, పిన్నమ్మ, పెద్దమ్మ… ఇలా రకరకాల బంధాలతో వ్యక్తి మనసు ఎదుగుతూ… తను గ్రహించిన విషయాల వలన, తను గుర్తు పెట్టుకున్న సంఘటనల వలన, తనపై ప్రభావం చూపిన పరిస్థితులతో బాటు… నేర్చిన విద్యాబుద్దుల వలన వ్యక్తి వ్యక్తిత్వం ప్రభావితం అవుతూ ఉంటుంది.
మనసు ఒక సముద్రం అయితే, సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రపు అలలు ఆనందాన్నిస్తాయి. సముద్రపు లోతు ఎరుగము. సముద్రం పౌర్ణమినాడు పోటెత్తుతుంది. సముద్ర పొంగితే, అది వికృత ప్రభావం చూపుతుంది… అలా సముద్రం గురించి చెబుతూ ఉంటారు. అలా ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు అతనికి విశిష్టంగా వ్యక్తిత్వం అను సర్టిఫికెట్ లభిస్తుంది.