ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? సమాధానం లభిస్తే, మనకు మార్గం లభించినట్టే. అయితే అవగాహన రావడం కోసం పోస్టు పూర్తిగా చదవగలరు. వితౌట్ డిజిటల్ డివైజ్, వుయ్ కాంట్ డు నథింగ్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఇష్టం ఉన్నా లేకున్నా వాడాల్సిన స్థితి అనివార్యం అవుతుంది.
కాబట్టి ఆన్ లైన్ లో ఉండే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఆన్ లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు కూడా అలాగే పెరుగుతాయి. అయితే ఆలోచిస్తూ ఉంటే డబ్బులు సంపాదన ఉండదు. ఆలోచనను ఆచరణలో పెడితే డబ్బులు సంపాదన ఉంటుంది.
కానీ ఒక్క విషయం గుర్తించాలి! ఏదీ కూడా వెంటనే ఫలితం ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా అనూహ్యంగా అది తగ్గుముఖం పడుతుంది. మనకు అర్ధం అయ్యే లోపులో ఫలితం ప్రభావం తగ్గిపోతుంది. కావునా శ్రమించి సాధించిన ఫలితం ఆస్వాదించగలం. ఇంకా అట్టి విధానాన్ని దీర్ఘకాలం కొనసాగించడానికి మంచి ప్రణాళికతో ముందుకు సాగగలం. కోటి రూపాయిలు సంపాదించడానికి కోటి మార్గాలు ఉండవచ్చును కానీ ఒక మార్గమును ఎంచుకుని పట్టుదలతో సాధన చేస్తేనే, కోటి రూపాయిలు సంపాదించే అవకాశం ఉంటుంది.
డబ్బు సంపాదనకు మనమే మార్గం సృష్టించుకోవాలి. ఎవరో సృష్టించిన మార్గంలో పోటీ ఎక్కువగా ఉంటే, మనం సృష్టించిన మార్గంలో కొత్తదనం మనకు ఆదాయ మార్గం కాగలదు. ఎందుకంటే ఎవరో క్రియేట్ చేసిన మార్గం మనకు తేలికగా తెలిసిందంటే, అది చాలా పాపులర్ కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా ఆలోచనను ఆచరణలోకి తీసుకురాగలిగితే, అంత త్వరగా డబ్బులు సంపాదన మొదలు అవుతుంది.
కూటికోసం కోటి విద్యలు, కానీ పట్టుదల వదలకూడదు
అయితే ఆరంభించేటప్పుడు అరకొరగా తెలుసుకుని ప్రారంభిస్తే, ఆప్రయత్నంలో ఆదిలోనే కలిగే ఆటంకాలతో అది ఆగిపోతుంది. కాబట్టి ఎంత త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనను కలిగి ఉన్నామో, అంతకన్నా ఎక్కువగా సాద్యాసాధ్యములు గురించి ఆలోచన చేయాలి. మన ఆలోచనకు మన సంపూర్ణ మద్దతు ముందు కావాలి. బిజినెస్ మేన్ సినిమాలో స్నేహితుడే నమ్మకపోతే, ముంబై ఎప్పుడు నమ్ముతుంది? అన్నట్టుగా ముందుగా మన ఆలోచనను మనం పూర్తిగా సమర్ధించాలి. కూటికోసం కోటి విద్యలు, కానీ పట్టుదల వదలకూడదు. పట్టిన పనిని సాధించడానికి కృషి చేయాలి. అయితే అది ఆచరణకు సాద్యమా? అనే ఆలోచన ప్రధానం. అసాద్యమైన ఆలోచనకు ఆచరణ ఎంత చేసినా ప్రయోజనం శూన్యం. కాబట్టి సరైన రీతిలో ఆలోచన చేయకపోతే అదనపు ఆదాయం దేవుడెరుగు. వృధా కాలయాపన జరుగుతుంది. ఇకా ఆన్ లైన్ ద్వారా అదనపు ఆదాయం కోసం ఎందుకు సాధ్యపడవచ్చును?
జనులు ఎక్కువగా తిరిగే చోట, మంచి వ్యాపారం జరుగుతుంది. అలాగే ఆన్ లైన్ యూజర్ల్ ఎంత ఎక్కువమంది పెరిగితే, అంత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగా ఆన్ లైన్ ఎస్సెట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ అస్సెట్ ద్వారా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించడానికి మార్గం ఏర్పడుతుంది. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? ఏఏ మార్గములు మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ పోస్టులో రీడ్ చేయండి.
పెద్ద గమనిక ఏమిటంటే?
పెట్టుబడి లేకుండా సంపాదన ఉండదు. కనీసం కాలం అయినా ఖర్చు పెడతాము. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. కాబట్టి మనకున్న విలువైన కాలాన్ని ఖర్చు పెడుతున్నామంటే, మనం మన కాలాన్ని పెట్టుబడి పెడుతున్నాము. కాలం పెట్టుబడి పెట్టేటప్పుడు కంటెంట్ క్వాలీటి కోసం కొంత ధనం ఖర్చు చేయడం వలన, అది మన ప్రయత్నానికి మరింత సాయపడుతుంది. ఆరంభంలో ఉచిత సర్వీసులు ఉపయోగించుకుంటూ, అనుభవం పెరిగే కొలది అవసరం మేరకు కొంత ధనమును కూడా ఖర్చు చేయగలిగితే ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గంలో మనం కూడా విజయవంతం కాగలమని అంటారు.
ఇప్పుడు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?
డబ్బులు సంపాదనకు సులభ మార్గం ఆన్ లైన్ మార్గం అంటూ కొందరంటారు. కానీ గమనించదగిన విషయం ఒక్కటి ఉంది. అదేమిటంటే, ఆన్ లైన్ డబ్బులు సంపాదన సులభమేకానీ మన ఎంచుకున్న టాపిక్ మరియు అది అందిస్తున్న ప్లాట్ ఫామ్ ఎక్కువమందికి చేరువ అయినప్పుడే. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే, అది పాపులర్ లక్షలమంది సబ్ స్క్రైబర్లు ఉంటే, సాదారణంగా కన్నా ఎక్కువ మొత్తం డబ్బులు సంపాదన చేయవచ్చును. అయితే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించగానే ఎక్కువమందికి చేరడానికి చాలా కష్టపడాలి. అలాగే బ్లాగు కూడా… మరి సులభంగా డబ్బులు సంపాదించడానికి ఆన్ లైన్ మార్గం సులభతరం కాదు. పోటీ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా కష్టపడి పని చేయాలి.
ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయడానికి మార్గములు కొన్ని ఉన్నాయి. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం, ఎక్కువమంది అనుసరించే మార్గం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం. వాటిలో సొంతంగా క్రియేట్ చేసిన వీడియోలు అప్ లోడ్ చేయడం. ఈ మార్గములో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. సులభంగా ఉండేవి కూడా ఎక్కువ పోటీ పెరిగితే, కష్టం కూడా పెరుగుతుంది. అలా యూట్యూబ్ ఛానల్స్ లో పోటీ పెరగడమే కానీ విధానం అయితే మిగిలిన ఆన్ లైన్ ఇన్కం మార్గముల కంటే సులభమైన విధానం.
కాబట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎంత సులభమో, ఈ క్రింది రెండు అంశాలలో దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మాత్రం అంత సులభంగా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించవచ్చును. పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడమే కాదు కోటి రూపాయిల సంపాదనను చేరుకునే అవకాశం ఉండవచ్చును. కాకపోతే దీర్ఘకాలం వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఉండడం ప్రధానం. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ పాపులారిటీ పెరిగితే కోటి రూపాయిల సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎటువంటి ఛానల్ పెడితే, త్వరగా ఎక్కువమంది సబ్ స్కైబర్లను పెంచుకోగలం.
వీడియో ఏవిధంగా ఉంటే, ఆ వీడియో ఎక్కువసేపు చూడగలదు.
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం కోసం యూట్యూబ్ ఛానల్
పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉచితంగానే క్రియేట్ చేయవచ్చును. మీ యూట్యూబ్ వీడియోలలో కంటెంటు ఆన్ లైన్ యూజర్లకు అవసరం అయితే, అది ఎక్కువమందికి నచ్చితే, ఎక్కువమంది మీ యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబ్ అయితే, ఎక్కువసేపు మీ యూట్యూబ్ వీడియోలు వీక్షణను పొంది ఉంటే, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయినట్టే, గూగుల్ యాడ్స్ అమోదమునకు రిక్వెస్ట్ చేసుకుని, గూగుల్ ద్వారా డబ్బులు మీ ఖాతాలోకి జమ అయ్యేవిధంగా సెటప్ చేసుకోవచ్చును.
పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడానికి, ఎటువంటి యూట్యూబ్ ఛానల్ పెడితే, సబ్ స్క్రైబర్లు పెరుగుతారు.
అయితే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ పెడితే, త్వరగా ఎక్కువమంది సబ్ స్కైబర్లను పెంచుకోగలం. ఇదే ప్రధానమైన ప్రశ్న. ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ పెరగడానికి, ఎక్కువమంది యూజర్లకు యూట్యూబ్ ఛానల్లో ఉండే కంటెంట్ అవసరం అయి ఉండాలి. ఇంకా ఆకంటెంట్ అంటే ఆసక్తికరంగా అనిపించాలి. మీ వీడియోలు ఎక్కుమందిని నచ్చాలి. అప్పుడే ఎక్కువమంది సబ్ స్క్రైబర్లు మీ యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబ్ అవుతారు. గమనించవలసిన అంశం ఏమిటంటే? ఒక యూట్యూబ్ ఛానల్ కు గూగుల్ నుండి సంపాదన లభించాలంటే, ముందుగా ఆ యూట్యూబ్ ఛానల్ కు 1000 సబ్ స్క్రైబర్లు అవసరం.
కాబట్టి కామన్ సబ్జెక్టు అయి ఉండి, అది యూజర్లకు నచ్చే విధంగా యూట్యూబ్ ఛానల్ డిజైన్ చేసుకోవాలి. వీడియోలు ఆసక్తికరంగా సాగాలి.
యూట్యూబ్ వీడియో ఏవిధంగా ఉంటే, ఆ వీడియో ఎక్కువసేపు చూడగలదు. ఎంత ఎక్కువ సేపు మీ యొక్క యూట్యూబ్ వీడియో వీక్షకుడు వీక్షిస్తే, అంత వీక్షణ సమయం మీ ఛానల్ కు పెరుగుతంది. త్వరగా 4000 గంటల వీక్షణ సమయం పూర్తవుతుంది. 4000గంటల వీక్షణ సమయం పూర్తయితే, అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ సాధ్యం.
ఒక యూట్యూబ్ ఛానల్ విజయవంతం కావాలంటే, ఆ ఛానల్ నందు ఒరిజినల్ కంటెంటు ఉండాలి. ఆ కంటెంట్ గతంలో వేరొకరు వాడినది అయి ఉండ కూడదు. ఛానల్ వీడియోలు అర్ధవంతంగా ఉండాలి. వీడియో ఆసక్తికరంగా సాగాలి. వీడియోలోని కంటెంటు ఇప్పటి ట్రెండుకు అనుగుణంగా ఉండాలి. ప్రతి వీడియో టైటిల్ వీడియోలోని కంటెంటుని ప్రతిబింబించేలా ఉండాలి. ముఖ్యంగా వీడియో డిస్క్రిప్షన్ పూర్తిగా ఉండాలి. అది కూడా వీడియో గురించి విపులంగా వివరిస్తూ ఉండాలి. ముఖ్యంగా యూట్యూబ్ సెర్చ్ లో వీడియోని చూపగలిగే విధంగా వీడియో డిస్క్రిప్షన్ ఉండాలి.
అయితే పెట్టుబడి లేకుండానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించవచ్చును. అప్పటికే మీకు ఒక స్మార్ట్ ఫోను ఉండాలి. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా సులభంగానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించవచ్చును. అయితే ఒక కంప్యూటర్ కూడా ఉంటే, మీరు మీ యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని నాణ్యమైన వీడియోలు ఎడిట్ చేసి అందించడానికి అవకాశం ఉంటుంది.
కొంత ధనం వెచ్చించి యూట్యూబ్ ఛానల్ కు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా మీ ఛానల్ మరింత నాణ్యంగా తయారు చేయవచ్చును.
ఆన్ లైన్ డబ్బు సంపాదన కోసం ఒక యూట్యూబ్ ఛానల్ సృష్టించడానికి ఐడియాస్
కుకింగ్ గురించి తెలియజేసే ఛానల్… వీడియోలలో ఒక్కొక్క కూర తయారీ గురించి తెలియజేయడం. కుకింగ్ టిప్స్ గురించి తెలియజేయడం.. చాలామందికి కుకింగ్ రాని వారు ఉండవచ్చును. అలాంటి వారు కుకింగ్ వీడియోల కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. ఇంకా కొత్త రుచుల కోసం చూసేవారు కూడా యూట్యూబ్ లో కుకింగ్ వీడియోల కోసం వెతుకుతారు. వంటల వీడియోల ద్వారా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం సులభం అంటారు.
ఆరోగ్యకరమైన విషయాలలో యోగ చాలా ప్రధానమైనది. మీకు యోగా తెలిసి ఉంటే, యోగాసనాలు, యోగా వలన ప్రయోజనాలు తదితర వీడియోలు కూడా యూజర్లను ఆకట్టుకోవచ్చును. డబ్బులు సంపాదించాలంటే ఆరోగ్యం గురించిన విషయాలు తెలిపే వీడియోలు చేయవచ్చును.
మ్యూజిక్ ఛానల్ కూడా బాగుంటుంది. ఈనాటి కాలంలో ప్రశాంతతో ఉండేవారి కన్నా ఒత్తిడిలో బ్రతికేసేవారు ఎక్కువ అంటారు. కాబట్టి ప్రశాంతమైన కూల్ మ్యూజిక్ మనసుకు శాంతిని చేకూరుస్తుంటే, అటువంటి పీస్పుల్ మ్యూజిక్ వీడియోల కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేసేవారు అధికంగానే ఉంటారు. ఆన్ లైన్ ఆదాయం రావాలంటే, మ్యూజిక్ తో మాయ చేసే వీడియోలు అవసరం.
ఇంట్లోనే ఉండేవారికి డాన్స్ మంచి ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకా కాంపిటేషన్స్ లో పాల్గొనేవారు కూడా డాన్స్ కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు. డాన్స్ నేర్పించే యూట్యూబ్ వీడియోలు చేయడం చేయవచ్చును.
మోటివేషన్ వీడియో ఛానల్ కూడా మంచి ప్రయోజనం చేకూర్చగలదు. ప్రముఖ వ్యక్తుల మాటల ఆధారంగా మోటివేషనల్ వీడియోలు చేసి, యూట్యూబ్ యూజర్లను ఆకట్టుకోవచ్చును. మోటివేషన్ వీడియోల ద్వారా కూడా డబ్బులు సులభంగా సంపాదించవచ్చునని అంటారు.
ముగ్గులు వేయడం, ఎన్ని చుక్కలతో ఎలాంటి ముగ్గులు వేయవచ్చునో… తదితర ముగ్గుల వీడియోలు ఎక్కువమందిని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.
ఏదైనా ఒక ఛానల్ విజయవంతం అయితే అది ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి అవకాశం సృష్టిస్తుంది.
కామెడీ వీడియో ఛానల్ కూడా ఎక్కువమందిని ఆకట్టుకోవచ్చును. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదనకు హాస్యం వినోదం ఈ రెండు ప్రధాన ఆయుధాలు….
ఫ్యాషన్ గురించి కూడా యూట్యూబ్ వీడియో ఛానల్ క్రియేట్ చేయవచ్చును. అయితే ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అందించేవిధంగా ఉండాలి.
వెడ్డింగ్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ గురించిన యూట్యూబ్ వీడియోలతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయవచ్చును. ప్రణాళికలు వేయడం వాటిని అమలు చేయడం వంటి వీడియోలు ఎక్కువమందిని ఆకట్టుకుంటే, ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం సులువు అంటారు.
కుట్టు మిషన్ మరియు కుట్టు మిషన్ కామన్ ప్రోబ్లమ్స్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మరియు ఫ్యాషన్ స్టిచింగ్ సంబంధించిన వీడియోలు బాగా ఆకట్టుకోవచ్చును.
పిల్లల సంరక్షణ, పిల్లల పెంపకం గురించిన యూట్యూబ్ ఛానల్ కూడా విజయవంతం అయే అవకాశం ఉంటుంది.
వినోదభరితమైన విషయాలు అంటే సినిమాల గురించి, సినిమా హీరోల గురించి తదితర అంశాలలో యూట్యూబ్ ఛానల్ కూడా సృష్టించవచ్చును.
మేకప్ టిప్స్ గురించిన అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయవచ్చును.
పిండి వంటల గురించిన వీడియో ఛానల్ పెట్టడం ద్వారా మంచి ఆదాయం అర్జించవచ్చును అంటారు.
అవకాయ పచ్చడి గురించిన అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్
వ్యవసాయం గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చును.
మోటార్ సైకిల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి యూట్యూబ్ ఛానల్
తయారీ విధానం గురించిన అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్
మూవీ రివ్యూ యూట్యూబ్ వీడియో ఛానల్ ద్వారా మంచి రివ్యూ వీడియోలతో యూజర్లను ఆకట్టుకోగలిగితే, ఎర్న్ మనీ ఆన్ లైన్ సులభం.
కోటి రూపాయిలు సంపాదించడానికి, ఆన్ లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి విద్యా విషయాల సమాచారం గురించి యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వివిధ రకాల విద్య గురించిన వీడియోలు యూట్యూబ్ సెర్చ్ చేయవచ్చును.
డబ్బులు సంపాదించడానికి వివిధ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్
సబ్జెక్టుల వారీగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, అందులో వివరణాత్మక వీడియోలతో విద్యార్ధులకు అర్ధం అయ్యే విధంగా ఆన్ లైన్ పాఠాల చెప్పగలిగితే, ఎర్న్ మనీ విత్ వీడియోస్ చాలా సులభమే అంటారు.
ఉద్యోగ సమాచారం అందించే యూట్యూబ్ ఛానల్, మంచి అవకాశం కోసం వేచి ఉండేవారికి ఉపయోగపడే సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబ్ అవుతూ ఉంటారు. విలువైన సమాచరం అందించే ఛానల్ ఎక్కువమంది యూట్యూబ్ సబ్ స్క్రైబర్లను పొందగలదు. తద్వారా ఈజి మనీ ఎర్నింగ్ పాజిబుల్.
ఆన్ లైన్ లో డబ్బులు సంపాదన సులభమే అవుతుంది. ఎప్పుడంటే, వివిధ వస్తువుల రిపేరుల గురించి తెలియజేసే యూట్యూబ్ వీడియో ఛానల్ ఎక్కుమంది చూడడం జరుగుతుంటే…
తెలుసుకోవాలనే తపన ఉన్నవారు కొత్త వీడియోల కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఉత్పత్తి విధానం గురించి, వస్తువుల తయారీ విధానం గురించి తెలియజేసే యూట్యూబ్ వీడియో ఛానల్ విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఛానల్ ఎక్కువమందిని ఆకట్టుకోగలిగితే, ఆన్ లైన్ మనీ ఎర్న్ చేయడం సులువే అంటారు.
టాలెంట్ టెస్టులకు, ఎంట్రెన్స్ టెస్టులకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ గురించి మరియు జికె గురించిన యూట్యూబ్ వీడియో ఛానల్ విజయవంతం అవుతుంది. అటువంటి ఛానల్ వీక్షకులు పెరిగితే, డబ్బులు సంపాదించడానికి మంచి మార్గం లభించనిట్టే….
మొబైల్స్ గురించి, మొబైల్ సమస్యల గురించి, మొబైల్ రివ్యూస్ అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్
సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ మరియు వాటిని అందించే సంస్థల గురించి, వాటి వలన లభించే ఉద్యోగ అవకాశాలు గురించి యూట్యూబ్ ఛానల్
పూజలు, పూజా సామాగ్రి, ఇంటిలో వాస్తు వివిధ భక్తి పరమైన వీడియోలతో యూట్యూబ్ ఛానల్
ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల గురించి, మనీ వాలెట్స్ గురించిన యూట్యూబ్ ఛానల్
ఎక్కౌంటింగ్ గురించి, టాలీ ఉపయోగించు విధానం గురించిన యూట్యూబ్ ఛానల్
నమ్మదగిన సమాచారంతో ఉపయోగపడే ఆలోచనలతో వీడియోలు ఉంటే యూట్యూబ్ ఛానల్ ఆదాయపు వనరుగా
చాలామందికి లెటర్ ప్రిపేరింగ్, పేజ్ సెట్టింగ్, ప్రింట్, టేబుల్స్ వంటికి ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్ గురించి అవగాహన ఉండకపోవచ్చును. ఆఫీసు గురించి పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఆపీస్ గురించి యూట్యూబ్ ఛానల్…
ఇక ఎప్పుడూ ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని ఇతరుల తెలుసుకునే సాదారణ సమస్యలు అయితే, కొన్ని వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. కొందరు అడిగి తెలుసుకోవడం కంటే, వెతుకులాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా వీడియోల శోదన చేసేవారికి సాదారణ సమస్యలు, పరిష్కారాలు యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడవచ్చును.
ఇన్ కం టాక్స్, జిఎస్టీ గురించి యూట్యూబ్ ఛానల్ ఎక్కౌంటింగ్ రంగంలో ఉండేవారికి టాక్స్ అప్డేట్స్ గురించి సమాచారం అవసరం. వ్యాపారస్తులకు, ఎక్కువ ఆదాయం వచ్చేవారికి కూడా… కాబట్టి ఈ ఛానల్ విజయవంతం అయినా మంచి డబ్బులు సంపాదించే మార్గం కాగలదు.
కొత్త వ్యాపారాలు, పాత వ్యాపారాలు, వ్యాపార విషయాల గురించి సలహాలు యూట్యూబ్ ఛానల్
వివిధ ఉచిత సేవల గురించి తెలియజేసే ఇన్పర్మేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి మంచి మార్గం.
ట్రావెలింగ్ స్పాట్స్, ట్రావెలింగ్ రూట్స్ గురించి తెలియజేసే యూట్యూబ్ ఛానల్ ఇది మరొక ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి మంచి మార్గం.
అందుబాటులో ఉంటే లైవ్ బిజినెస్ ఆఫర్స్ గురించిన యూట్యూబ్ ఛానల్
షేర్ మార్కెట్, షేర్ మార్కెట్ గురించి అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్
మనోవిజ్ఙానం గురించిన వీడియోలతో యూట్యూబ్ ఛానల్
గొప్పవారి జీవిత చరిత్రల వీడియోలతో యూట్యూబ్ ఛానల్
ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదనకు వివిధ రకాల పనులు, వాటి సమస్యలు, వాటి పరిష్కారాలు
అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, మోటార్ సైకిల్ మెకానిక్, కార్ మెకానికజం, కార్పెంటర్ వర్క్, పెయింటింగ్ వర్క్, బిల్డింగ్ వర్క్, వెల్డింగ్ వర్క్, రిపేరింగ్స్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ రిపేర్, టివి రిపేర్, ఫ్రిజ్ రిపేర్, స్టవ్ రిపేర్, మోటార్ వైండింగ్, జనరేటర్ రిపైర్స్, సెలూన్, ఆటోమొబైల్స్… ఇలా రకరకాల పనులు లేదా షాపులు లేదా సర్వీసులు ఉంటే, వాటిలో వచ్చే సమస్యలు, పరిష్కారాలతో యూట్యూబ్ వీడియో ఛానల్స్ సృష్టించవచ్చును. ఎందుకంటే ఎప్పుడు ఎవరికీ ఏ విషయంలో అవసరం ఏర్పడుతుందో తెలియదు. కావునా అందరి వృత్తుల వారికీ వేరు వృత్తులలోని సమస్యలు, పరిష్కారాలు అవసరం కాబట్టి… యూట్యూబ్ లో చాలా వీడియోలు విజయవంతంగా చూడబడుతున్నాయి. కావునా మీరు ఎంచుకున్న కంటెంటులో అర్ధవతంగా, ఆసక్తికరంగా వీడియోలు చేస్తూ ఉండడం వలన క్రమంగా యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు పెరుగుతారు. వీడియో వీక్షణ సమయం పెరుగుతుంది. త్వరగా యూట్యూబ్ వీడియో ఛానల్ ద్వారా డబ్బు సంపాదన ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.
దేశంలో వివిధ చేతి వృత్తి పనులు ఉన్నాయి. అలా ప్రతి పనిలోనూ సమస్య ఉండవచ్చును. ప్రతివారికి ప్రతి పని గురించి అవగాహన ఉండకపోవచ్చును. ప్రతివారిలోనూ సమస్యకు పరిష్కారం చూపే ఆలోచన తట్టకపోవచ్చును. కావునా ప్రతి చేతి వృత్తి గురించిన అవగాహన వీడియోలు చేయడం చేయవచ్చును. ఇంకా చేతి వృత్తి పనులలో ఉండే సాదారణ సమస్యలు, వాటికి పరిష్కార వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ సృష్టించవచ్చును.
మన సమాజంలో అనేక చేతి వృత్తులు, అనేక రిపేరు పనులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అవగాహన కల్పించడం… అందులో కామన్ ప్రోబ్లమ్స్ గురించిన వీడియోలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయితే, కోటి రూపాయిలు సంపాదించడం సులభమే అవుతుంది.
యూట్యూబ్ ఛానల్ కాకుండా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం కోసం ఒక బ్లాగుని రన్ చేయడం
అవును ఒక యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయితే కోటి రూపాయలు సంపాదించడం ఎలా ? ప్రశ్నకు బదులు లభించనట్టేనని అంటారు. అలాగే ఒక బ్లాగు విజయవంతం అయినా సరే కోటి రూపాయలు సంపాదించడం ఎలా ? ప్రశ్నకు బదులు లభించినట్టే. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ బ్లాగు కానీ దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాలి.
ఇప్పుడు ఒక బ్లాగుని సృష్టిస్తే డబ్బులు సంపాదించవచ్చునా? బ్లాగు సృష్టించడం సులభమేనా? బ్లాగుని ఎలా సృష్టించడానికి ఆన్ లైన్ అవకాశాలు ఏమిటి?
ఒక విజయవంతమైన బ్లాగుని సృష్టించడానికి కొంత టెక్నికల్ కోడ్ తెలిసి ఉండాలి. లేదా ఉచితంగా లభించే బ్లాగింగ్ ప్లాట్ ఫామ్స్ పై సాధన అవసరం. బ్లాగింగ్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం కష్టమే అవుతుంది. కారణం ఉచితంగా లభించే బ్లాగింగ్ ప్లాట్ ఫామ్స్ లో పరిమితులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫ్రీగా డబ్బులు సంపాదించాలంటే, ఎక్కువ కాలం బ్లాగు పోస్టులు చేస్తూ ఉండాలి.
బ్లాగర్ లేదా వర్డ్ ప్రెస్ ద్వారా ఫ్రీగా బ్లాగుని క్రియేట్ చేయవచ్చును. ముందుగా ఫ్రీగానే బ్లాగుని ప్రారంభించి, అందులో అవగాహన వచ్చాకా, డబ్బులు ఖర్చు చేసి, బ్లాగింగ్ చేయడం వలన డబ్బులు వృధా కాకుండా, ఒక విజయవంతమైన బ్లాగుని క్రియేట్ చేయగలం. ఈ క్రింది పోస్ట్ రీడ్ చేయండి వర్డ్ ప్రెస్ లో బ్లాగుని క్రియేట్ చేయడం, వర్డ్ ప్రెస్ బ్లాగు ద్వారా పోస్టుని క్రియేట్ చేయడం వివరించబడి ఉంది.
డబ్బు డబ్బు డబ్బు మూడు సార్లు చెప్పినా ముప్పై సార్లు చెప్పినా డబ్బు చాలా అవసరం. డబ్బుంటే లోకంలో ఒక స్టేటస్, డబ్బుంటే అవసరాలు తీరతాయి. వస్తువులు సమకూరతాయి. జీవితాన్ని సుఖవంతంగా కొనసాగించడానికి డబ్బు అవసరం ఎంతైనా ఉంది. అటువంటి డబ్బు సంపాధన సులభంగా ఉండదు. ఏ రంగంలోనైనా డబ్బులు సంపాదించడానికి వివిధ విదానాలు ఉంటాయి. ఖచ్చితమైన విదానం ఎక్కువకాలం కొనసాగిస్తే, ఎక్కువకాలం డబ్బులు సంపాదించవచ్చును.
అరకొరగా తెలుసుకుని ఏదైనా ప్రారంభిస్తే, అది ఆరంభశూరత్వంగా మిగులుతుంది. కావునా ఏదైనా అంశంలో అవసరం మేరకు అవగాహన ఉండాలి. ఇక డబ్బులు సంపాదించే మార్గములలో అయితే, మరింతగా అవగాహన అవసరం ఎందుకంటే, మోసం చేయబడేది, మోసపోయేది కూడా డబ్బులు విషయంలోనే ఎక్కువ అంటారు.
బ్లాగు / వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్
కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ సృష్టించాలంటే, కొన్ని ఫెయిల్యూర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ గురించిన వీడియోలు చూడండి. అవి కూడా యూట్యూబ్ లో ఉంటాయి. అలాగే ఒక బ్లాగుని సృష్టించాలంటే, ఫెయిట్యూర్ బ్లాగర్స్ యొక్క అభిప్రాయాలు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. సూచనలు సలహాలు స్వీకరించండి. కొత్తగా ఆలోచించండి. విభిన్నంగా ఉండే విదానంలో బ్లాగుని కానీ ఛానల్ కానీ సృష్టించవచ్చును.
పైన యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అంటూ చదివారు కదా…. అలాగే బ్లాగుని సృష్టించడానికి కూడా అటువంటి సమాచారపరమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవచ్చును. యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో పరంగా ఉంటుంది. బ్లాగ్ అయితే వచన రూపంలో ఉంటుంది. లోకంలో అనేకానేకా సమస్యలు. వాటి పరిష్కారాల కోసం ప్రపంచంలో ఆన్ లైన్ యూజర్లు గూగుల్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ వెతుకుతూ ఉంటారు. అందులో మీ వీడియో కానీ మీ బ్లాగు పోస్టు కానీ ప్రధమ స్థానంలో కనబడితే, మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ బ్లాగు కానీ విజయవంతం అయినట్టేనని అంటారు.
మీరు సృష్టించిన యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయితే, బ్లాగుని సృష్టించడం
మీకు ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా ఆదాయం వస్తుంది. అయినా మీరు మీ యూట్యూబ్ ఛానల్ కు అనుగుణంగా ఒక బ్లాగుని సృష్టించవచ్చును. మీ యూట్యూబ్ వీడియోలలో వివరించినట్టే, మీరు బ్లాగు పోస్టుల ద్వారా కూడా వచన రూపంలో వివరించవచ్చును. ఆ వివరణలో అవసరం మేరకు ఫోటోలు కూడా ఉంటే, మీరు బ్లాగుని కూడా విజయవంతం చేయవచ్చును. అప్పుడు మీరు కేవలం యూట్యూబ్ ఛానల్ నుండే కాకుండా బ్లాగు ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును. కోటి రూపాయలు డబ్బులు సంపాదించాలనే కలకు చేరువ అవుతున్నట్టే.
మీకు విజయవంతమైన బ్లాగు ఉంటే, దానికి ఒక యూట్యూబ్ ఛానల్ అదనపు ఆదాయం
ఆన్ లైన్లో మీరు క్రియేట్ చేసిన బ్లాగు సక్సెస్ అయ్యింది. అందులోని బ్లాగు పోస్టులకు వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది. డబ్బులు బాగానే వస్తున్నాయి. అయినా మీ బ్లాగుకు అనుగుణంగా యూట్యూబ్ వీడియోలు ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ కూడా కొనసాగించడం వలన అదనపు ఆదాయం మీకు వస్తుంది. అందువలన కోటి రూపాయల సంపాదన కల త్వరగా నెరవేరవచ్చును.
కావునా ఒక పాపులర్ బ్లాగుకు, ఒక యూట్యూబ్ ఛానల్ మరింత సాయపడుతుంది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఒక బ్లాగు కూడా సాయపడుతుంది. కోటి రూపాయిలు సంపాదించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా ఆదాయ వనరుగా మారగలదో, అలాగే ఒక బ్లాగు ద్వారా కూడా కోటి రూపాయిలు సంపాదించడానికి కృషి చేయవచ్చును.
గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా ఆదాయం తక్కువగా
యూట్యూబ్ ఛానల్ అయినా బ్లాగు అయినా సరే గూగుల్ యాడ్ సెన్స్ ఖాతానే మూలంగా కనబడుతుంది. ఇంకా గూగుల్ యాడ్ సెన్స్ అమోదం త్వరగా లభించదు. ఎన్నో నియమ నిబంధనాలు ఉంటాయి. ఇంకా అవన్నీ దాటి గూగుల్ యాడ్ సెన్స్ అమోదం లభిస్తే, గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా కలిగిన వ్యక్తి పరికరంలో యాడ్స్ క్లిక్ చేయకూడదు. ఇంకా అతని లేక ఆమె ఫ్రెండ్స్ పరికరాలలో కూడా యాడ్స్ క్లిక్ చేయరాదు. అలా చేస్తే గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఖాతాలో జమ చేయబోయే మొత్తం నుండి కోతలు ఉంటాయి. ఇలా గూగుల్ యాడ్ సెన్స్ ఖాతాను పరిశీలిస్తే, పెద్ద తలకాయపోటుగా అనిపిస్తుంది.
ఇన్ని నియమ నిబంధనలు పాటించాకా కూడా గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా ఎర్నింగ్ కోత పడవచ్చును. గమనిస్తే మనకు దానిమీద అపనమ్మకం కూడా ఏర్పడవచ్చును. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ లేదా బ్లాగుకు ట్రాఫిక్ ఉన్నా సరే, గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా అనిపిస్తే…. ఇతర మార్గములలో ఎలా?
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి గూగుల్ యాడ్ సెన్స్ కాకుండా వేరే మార్గములు.
దీనినే అఫిలియేట్ విధానం అంటారు. ఈవిధానం ద్వారా మీరు పాపులర్ ఆన్ లైన్ సంస్థల నుండి ఖాతాను సృష్టించుకుని, వారి ఉత్పత్తులకు మీ వెబ్ సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తారు. ఆ ప్రచారంలో మీ వెబ్ సైట్ ద్వారా వారి ఉత్పత్తి అమ్మకం అయితే, మీ ఖాతాలో వారి నుండి డబ్బు వస్తుంది. అలా ఈ క్రింది రంగాలలో మీరు అఫిలియేట్ ఖాతాలను తెరవవచ్చును.
ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి ఆన్ లైన్ ఆదాయ వనరు ఏర్పడాలి. ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఒక బ్లాగు లేదా మీ టాలెంట్ ఆన్ లైన్లో బాగా పాపులర్ అయితే, అదే ఆదాయ వనరుగా మారుతుంది. తర్వాత కోటి రూపాయిలు ఆన్ లైన్లో సంపాదించడానికి అవకాశాలు మెరుగుపడతాయి.
వెబ్ హోస్టింగ్
డొమైన్ సేల్
ఫ్రీలాన్సర్ వెబ్ సైట్స్
టెలికం సంస్థలు
ఇకామర్స్
బ్యాంకింగ్
వర్డ్ ప్రెస్ థీమ్స్ అండ్ ప్లగిన్స్
కంప్యూటర్ వైరస్ ప్రోగ్రామ్స్
సాఫ్ట్ వేర్స్
ఎస్ఇఓ ప్రొడక్ట్స్ వెబ్ సైట్ ర్యాంకర్స్
ఇబుక్స్
ఆన్ లైన్ సేవలు
డూప్లికేట్ కంటెంట్ ఫైండర్స్
పిడిఎఫ్ ఎడిటర్స్
ఇమార్కెటింగ్ టూల్స్
ఇలా వివిధ రకాల సంస్థల ఉత్పత్తులను మీరు మీ వెబ్ సైట్ ద్వారా ప్రచారం కల్పించవచ్చును. అయితే మీ వెబ్ సైటుకు ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి. అప్పుడే అఫిలియేట్ రంగంలో మీరు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చును.
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం కొరకు ఒక వెబ్ సైటుకి ఎక్కువ ట్రాఫిక్ కావాలంటే
మీ వెబ్ సైట్ కంటెంటులో డూప్లికేట్ కంటెంట్ ఉండరాదు.
వెబ్ సైట్ ఎస్ఇఓ ఆప్టిమైజేషన్ అయి ఉండాలి.
కంటెంటు ఆసక్తికరమైన పోస్టులతో ఉండాలి.
గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా ఏఏ అంశాలు సెర్చ్ చేస్తున్నారో? అటువంటి అంశాల ఆధారంగా వెబ్ సైటులో ఆర్టికల్స్ ఉండాలి.
ఆర్టికల్స్ అర్ధవంతంగా ఉండాలి. వివరంగా ఉండాలి.
మీ వెబ్ సైటుకి తగినంత ప్రచారం కల్పించాలి.
ఈ విధంగా ఒక బ్లాగు లేదా వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించవచ్చును. అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి సోషల్ మీడియా కూడా ఉపయోగపడతుంది.
సోషల్ మీడియా ఖాతా ద్వారా డబ్బులు సంపాదించడం.
మీకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటి ఖాతాల ఉంటే, వాటి ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును. మీ సోషల్ మీడియా ఖాతాలో మొబైల్ ఇన్ స్టాల్ షేర్ చేయడం. ఇకామర్స్ అఫిలియేట్ లింకులను షేర్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును. అయితే మీ సోషల్ మీడియా ఖాతా భారీ ఫ్యాన్ పాల్లోయింగ్ ఉండాలి. మీకు ఒక ఫేస్ బుక్ ఖాతా ఉంటే, దానికి లక్షలమంది ఫాల్లోవర్స్ ఉండడం చేత ఏదైనా లింక్ షేర్ చేయగానే ఎక్కువమందికి చేరుతుంది. అందులో అవసరం అయిన ఉత్పత్తి అమ్మకం జరిగితే, తద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో కూడా పరిమితులు ఉంటాయి.
సొంతంగా ఒక బ్లాగు మరియు యూట్యూబ్ ఛానల్… రెండు అనుసంధానంగా క్రియేట్ చేసుకుని, వాటిలో ఏదో ఒక్కటి పాపులర్ చేసినా చాలు, వాటి ద్వారా డబ్బులు సంపాదించడం సులభం.
కష్టం లేకుండా వచ్చే ఆదాయం అంత తృప్తికరంగా ఉండదని అంటారు. అలాగే సులభంగా వచ్చే ఆదాయం ఎక్కువ రోజులు నిలబడదు అంటారు. సులభంగా వచ్చిందంటే, సులభంగానే ఖర్చు అవుతుంది. కష్టంగా వచ్చిందంటే, ఎక్కువకాలం పడుతుంది. అంటే ఎక్కువకాలం మన దగ్గర డబ్బు రావడంలోనే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కష్టంతో కూడిన పనిని ఎంచుకోవాలి అంటారు. అయితే కష్టం అన్నింటిలోనూ ఉంటుంది.
ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం సులభమే కానీ అందులో ఎప్పటికప్పుడు యూజర్లకు నచ్చే విధంగా యూట్యూబ్ వీడియోలను క్రియేట్ చేసి అప్డేట్ చేయడం కష్టంతో కూడుకున్న పనే. అలాగే ఒక బ్లాగుని సృష్టించడం కన్నా ఒక బ్లాగులో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మేటర్ అప్ లోడ్ చేయడం కష్టంతో కూడుకున్న పనే.
ఏదైనా శ్రమిస్తే ఆదాయం రావడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఇది ఎక్కువ కాలం నిలుస్తుంది. అది ఆన్ లైన్ ఆదాయం అయినా, చేతి పని అయినా.
ఏదైనా ప్రారంభించగానే ఆదాయం వస్తే, అది సులభం
ఒక బ్లాగుని సృష్టించిన నెలరోజులలోపు ఆదాయం రావడం ప్రారంభం అయ్యిందంటే, అప్పుడు అనిసిన్తుంది. బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించడం సులభం అని. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, కొన్ని రోజులలోనే డబ్బులు సంపాదించడం మొదలైతే, యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించడం చాలా సులభం అనిపిస్తుంది. అలాగే ఫేస్ బుక్ పేజిలో అఫిలియేట్ లింకులు షేర్ చేయగానే, ఆదాయం రావడం ప్రారంభం అయితే, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం చాలా సులభం అనిపిస్తుంది.
అవే పద్దతులలో ఆదాయం రావడానికి ఎక్కువ కాలం పడితే, అప్పుడే అనిపిస్తుంది… ఆయా మార్గాలలో డబ్బులు సంపాదించడం చాలా కష్టంతో కూడిన పని అని.
ఏదైనా ప్రారంభించగానే పాపులర్ అయ్యిందంటే, అందులోని అంశం సరికొత్త అంశం అయి ఉంటుంది. వెంటనే దానికనుగుణంగా మరొక ఛానల్ లేదా మరొక బ్లాగు స్టార్ట్ అయితే పోటీ పెరుగుతుంది. సులభంగా ప్రారంభం అయింది కదా అని మొదట ప్రారంభించినవారు నిర్లక్ష్యంగా ఉంటే, తర్వాతి వచ్చిన ఛానల్ లేదా బ్లాగు మరింత విజయవంతం అవుతుంది. సులభంగా ప్రారంభం అయినా ఆదాయం ఆగుతుంది. అదే కష్టంతో ఆదాయం ఆరంభించి ఉంటే, నిర్లక్ష్యానికి తావుండదు. ఎక్కువకాలం ఆదాయం నిలబడుతుందని అంటారు.
డబ్బులు సులభంగా సంపాదించినా డబ్బే… కష్టంగా సంపాదించినా డబ్బే… డబ్బు మన అవసరాలను తీర్చుతుంది. అయితే నిర్లక్ష్యం లేకుండా ఉండాలంటే, ఆరంభం సులభంగా కన్నా కష్టంగా ఉంటే, దీర్ఘకాలంలో జాగ్రత్తగా ఉంటారని, సులభంగా వచ్చేవి, నిలబడవు అంటారు.
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? ప్రశ్న అవసరమే అయితే అందుకు తగినంత అవగాహన చాలా అవసరం. ఎంపిక చేసుకునే రంగం, అందుకు సంబంధించిన సమస్యలు. దీర్ఘకాలం ఎలా రన్ చేయాలి? ముందుగా ఆదాయం లేకుండా, కాలం ఖర్చు చేయాలి అనే విషయం గమనించాలి.
డబ్బులు సంపాదించే పెట్టే మార్గంలో బ్లాగ్ సృష్టించడానికి ఈ క్రింది కొన్ని ఆలోచనలు ఉపయోగపడవచ్చును.
- రెజ్యూమ్ ఫార్మట్స్ మరియు రెజ్యూమ్ రైటింగ్ టిప్స్ గురించిన బ్లాగు.
- యూట్యూబ్ ఛానల్ టిప్స్, ఛానల్ కస్టమైజేషన్, ఛానల్ ఎస్ఇఓ
- బ్లాగ్ సృష్టించడం, బ్లాగు కంటెంట్, బ్లాగు పోస్టుల ఫార్మట్, బ్లాగ్ థీమ్స్, బ్లాగు హోస్టింగ్ ఆఫర్స్, బ్లాగ్ ఎస్ఇఓ, బ్లాగ్ బ్యాక్ లింకింగ్ బ్లాగుకి సంబంధించిన విషయాలలో ఆదాయం ప్రారంభం అయితే, అది ఎక్కువ కాలం డబ్బులు సంపాదించే వనరుగా మారగలదని అంటారు.
- సూచనలు అందించే బ్లాగ్ లేదా వెబ్ సైట్…
- ప్రణాళికలు అందించే బ్లాగ్ లేదా వెబ్ సైట్
- ఉద్యోగ సమాచారం, ఉద్యోగ నియమాకాలు, ఉద్యోగ ఉపాధి అవకాశల గురించిన బ్లాగ్
- వ్యక్తిగత కధలు, వ్యక్తిగత ఆలోచనల గురించి ఆకట్టుకునే బ్లాగ్ పోస్టులు.
- సమస్యలు వాటికి పరిష్కారాలు
- ఎక్కువగా లేదా కామన్ గా పుట్టే ప్రశ్నలు వాటికి సరైన సమాధానాలు
- ప్రయాణాలు, ప్రయాణ ప్రదేశాలు, ప్రయాణంలో జాగ్రత్తలు, ప్రయాణపు ప్రణాలికలు
- వెబ్ సైటుల జాబితా, వర్గాల వారీగా బ్లాగుల జాబితా…
- కార్యాచరణకు సంబంధించిన విషయాలు
- టెక్నాలజీ…. పెద్ద విషయం, కొత్త విషయం, నవీకరణ విషయం.
- ప్రసిద్ద వ్యక్తుల గురించి వెబ్ సైట్ లేదా బ్లాగ్
- స్టడీకి సంబంధించిన విషయాలు, సబ్జెక్టుపరమైన విషయాలలో వివరణలు
- దేని గురించైనా సమర్ధవంతమైన విశ్లేషణలతో బ్లాగు
- ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సమాచారం
- రాజకీయాలు, సినిమాలు, ఆటలు, న్యూస్
ఆలోచనలు ఆచరణ పెడితే డబ్బులు సంపాదనకు మంచి మార్గం లభించగలదు
- ఏదైనా ఒక రంగంలో ప్రారంభపు దశలో ఉపదేశాలు. ఉదాహరణకు బ్లాగింగ్ చేయడంలో ప్రధమంగా చేయవలసిన పనులు, ప్రధమంగా ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలు.
- గ్రీటింగ్స్ తెలియజేయడం గురించి వివరాణత్మక విషయాలు
- వ్యాపార సమాచారం, డబ్బుల ఆదాయం మరియు ఆదా చేసే విషయాలలో…
- ప్రత్యేక ఆఫర్స్ తెలియజేసే సమాచారం అందించడం.
- ఆన్ లైన్ లో లభించే పరికరాలు, సాధనములు గురించి బ్లాగింగ్ చేయండి. వర్డ్ టు పిడిఎఫ్, ఇమేజ్ టు పిడిఎఫ్ ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. అలా ఉండే వివిధ రకాల టూల్స్ అన్ని రంగాలలోనూ ఉచితంగా కూడా లభిస్తాయి. అలాంటి వాటిని తెలియజేస్తూ, వాటి లింకులను ప్రొవైడ్ చేయడం.
- జాతకం, మరియు రాశిఫలాలు… భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే తపన అందరికీ ఉంటుంది. గ్రహ కదలిలకు వ్యక్తుల స్వభావంపై ప్రభావం చూపుతూ ఉంటాయి… కాబట్టి రాశిఫలాల గురించి సరైన సమాచారం లభిస్తుంటే, వీక్షకులకు మీ వెబ్ సైట్ మరింత చేరువ కాగలదు.
- యోగాభ్యాసం, యోగాసనాలు… ఒత్తిడితో ఆనారోగ్యం పాలయ్యేవారు అధికం అంటారు. అలాంటి ఒత్తిడి జయించే మార్గాలలో యోగ ఒక్కటి. దాని గురించి, దాని గొప్పతనం గురించి, దాని విలాసం గురించి… ఆసక్తికరంగా తెలియజేయగలిగితే… అలాంటి బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించడం సులభం అంటారు.
- మెకానిజం వివిధ విషయాలలో రిపేరింగ్ సర్వ సాదారణం. కాబట్టి… వివిధ వస్తువుల గురించి వాటి రూపకల్పన గురించి, వాటి రిపేరింగ్ గురించి బ్లాగు విజయవంతం కాగలదు. టివి మెకానిజం, ఫ్రిజ్ మెకానిజం, బ్లాగ్ మెకానిజం, ఛానల్ మెకానిజం, మోటార్ మెకానిజం…
- లా… మోసం, ద్రోహం జరుగుతున్నప్పుడు వ్యక్తి న్యాయం కోసం తపిస్తాడు. అలాంటివారికి ఎలాంటి న్యాయ సలహాలు అవసరం. ఎలాంటి సెక్షన్లు ఎలా సాయపడతాయి… అవగాహన కల్పించే బ్లాగు కూడా విజయవంతం కాగలదని అంటారు.
విద్యావిషయాల అవగాహన ఆలోచనలు కోటి రూపాయిల డబ్బు సంపాదనకు ఆలోచనలుగా మారవచ్చును.
- కళాశాలలు, కళాశాల నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్…. పది పూర్తయితే వచ్చే ఆలోచన… ఏ కళాశాలలో ఏ కోర్సులు గురించి? ఇలాంటి ప్రశ్నలకు మీబ్లాగులో సమాధానాల లభిస్తే, అది మీబ్లాగు విజయవంతం కావడంలో సాయపడగలదు.
- పుడ్… గురించి తెలియజేసే బ్లాగు. ఈ కల్తీ పుడ్ పెరుగుతున్న కాలంలో కల్తీలేని పుడ్ గురించి ఎంత నమ్మదగిన సమాచారం అందిస్తారో? మీ సమాచారం మీ బ్లాగు వీక్షకులను పెంచుతుంటే, అదే ఆదాయపు వనరుగా మారుతుంది.
- వాతావరణం
- కోడింగ్
- బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, లోన్స్
- ఉత్పత్తి
- వ్యవసాయం
- రైతుల గురించి
- చేతి వృత్తుల గురించి
- ప్రేమ
- సీరియల్స్
- కధలు
- గమనం
- సామాజిక మార్పులు
- చరిత్రతో వర్తమానం గురించి
ఫేస్ బుక్ పేజీ మరియు ఫేస్ బుక్ గ్రూపుల వలన కోటి రూపాయిలు డబ్బులు సంపాదించవచ్చా?
అవుననే అంటారు. అయితే ఎక్కువకాలం సమయం పడుతుంది. కానీ కొంత ఖర్చు చేస్తే, అది కూడా ఆదాయపు వనరుగా మారవచ్చును. ఒక విషయంలో సరైన సమాచారంతో బాటు ఆకట్టుకునే చిత్రాలతో ఫేస్ బుక్ యూజర్ల లైక్స్ సంపాదించిన పేజి మరియు దానికనుగుణంగా గ్రూప్ బాగా ప్రసిద్ది చెందితే, అప్పుడు ఫేస్ బుక్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును.
ఫేస్ బుక్ పేజి లక్షలమంది ఫాలో అవుతుంటే, దాని ద్వారా సరైన ఆదాయం పొందగలమని అంటారు. అలాగే గ్రూపులో లక్షలమంది సభ్యులు ఉండాలని అంటారు. ఎందుకంటే ఒక ప్రచార లింకుని పేజిలో కానీ గ్రూపులో కానీ పోస్ట్ చేస్తే, అది అనేకమందికి చేరితే, కొందరు చూస్తారు. కొందరు లైక్ చేస్తారు. అతి కొద్దిమంది లింక్ క్లిక్ చేస్తారు. కాబట్టి ఎంత ఎక్కువమందికి మీ అఫిలియేట్ లింకు చేరగలిగి, ఎక్కువమంది క్లిక్ చేసి, కొందరు ప్రచారపు లింక్ ద్వారా కొనుగోలు కానీ సబ్ స్క్రైబ్ కానీ జరిగితే, అప్పుడు ఆదాయం ఏర్పడుతుంది. ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి ఫేస్ బుక్ ను కూడా ఉపయోగించవచ్చును. కానీ అందుకు సమయం ఎక్కువ కావాలి. లేదా మీరు కొంత డబ్బును చెల్లించి, పేస్ బుక్ పేజి లైక్స్ పెంచుకుంటే, ఆ తర్వాత మీరు అందించే అఫిలియేట్ లింకుల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చును. కానీ కొన్ని అఫిలియేట్ లింక్స్ ఫేస్ బుక్ నిరోదిస్తుంది.
ఏది ఉత్తమ మార్గము అంటే
ఒక యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా ఉంటే,
దానికి అనుషంగికంగా యూట్యూబ్ ఛానల్ కంటెంటు వచన రూపంలో వివరించే బ్లాగు, యూట్యూబ్ వీడియోల లింకులు, బ్లాగు లింకులు షేర్ చేయడానికి ఫేస్ బుక్ పేజి, ట్విట్టర్ ఖాతా, ఇన్ స్టాగ్రామ్ ఖాతా తదితర సోషల్ మీడియా నెట్ వర్క్ కూడా ఉంటే, త్వరగా ఛానల్ ద్వారా ఆదాయం సంపాదించడానికి అవకాశాలు పెరగుతాయి.
అలాగే మీకు ఒక బ్లాగ్ ప్రధానం ఉంటే,
బ్లాగు పోస్టులను వీడియోలుగా మార్చి, ఆవీడియోలతో యూట్యూబ్ ఛానల్ మీ బ్లాగుకు మరింత మద్దతుగా మారగలదు. ఇంకా మీ బ్లాగు పోస్టుల ఉచిత ప్రచారం కోసం సోషల్ మీడియా ఖాతాలు… అంటే ఫేస్ బుక్ పేజీలు, గ్రూపులు, ట్విట్టర్, టంబ్లర్, పిఇంటరెస్ట్, ఇన్ స్టాగ్రాం, లింక్డిన్ తదితర సోషల్ మీడియా ఖాతాలు.
చివరగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి ముందుగా మనం ఎంచుకున్న మార్గమును మనం నమ్మాలి.
ఎలా డబ్బులు సంపాదించాలి? ప్రశ్న పుట్టగానే పుట్టే ఆలోచనలు పుట్టలు పుట్టలు గా ఉండవచ్చును. అందులోంచి మన పనితీరుకు తగ్గట్టుగా ఇంకా మన ఆసక్తికి అనుగుణంగా ఉండే ఆలోచనను ఎంచుకోవాలి. ఎందుకంటే, మనకు నచ్చిన పనిని మనం ఎక్కువకాలం కొనసాగిస్తాము. ఎక్కువ ఇష్టంగా చేయగలుగుతాము. కాబట్టి మన ఆసక్తికి, మనకు వచ్చిన పనికి సంబంధించిన ఆలోచనతో ముందుకు సాగడం వలన దీర్ఘకాలంలోనైనా సరైన సంపాదన ప్రారంభం కావచ్చును. ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం, మనం ఎంచుకున్న మార్గంపై మనకు నమ్మకం ఉండాలి. పట్టుదలతో కృషి చేయాలి.
తెలుసుకోవడం ఎంత ముఖ్యమో? విలువైన సమాచారం తెలుసుకోవడం అంటే ముఖ్యం. ఆలోచన చేయడం ఎంత ప్రధానమో? సాద్యమయ్యే ఆలోచనా దృక్పధంతో ఉండడం ప్రధానం. సంపాదించాలనే తాపత్రయం ఎంత అవసరమో? సంపాదన మార్గం ఎంచుకోవడం సంశయం లేకుండా ఉండడ ప్రధానం. ప్రారంభించే ముందే నిపుణలు సూచనలు, స్నేహితుల సలహాలు, పెద్దల అభిప్రాయాలు… చాలా సాయపడతాయని అంటారు.
బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో
యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!
ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి
kadhalu