విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం చదవడం అంటే, స్థితికారకుడిని మననం చేయడమే.

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం చదవడం అంటే, స్థితికారకుడిని మననం చేయడమే. పుస్తకపఠనం అంటే, మనసు ఏకాగ్రతతో పుస్తకంలోని విషయంతో మమేకం కావడమే. కాబట్టి విష్ణుపురాణం చదవడం అంటే, విష్ణు స్వరూపమును మనసులో పటిష్టం చేయడమే.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

సృష్టి – స్థితి – లయం మూడు స్థితులు ప్రకృతిలో నిరంతరాయంగా జరిగే ప్రక్రియగా చెబుతారు. సృష్టికి అధిదేవతగా బ్రహ్మను, స్థితికారకుడుగా విష్ణుస్వరూపమును, లయకారకుడుగా పరమశివుడిని చెబుతారు.

త్రిమూర్తుల అనుగ్రహంతోనే మన జననం జరిగితే, మన స్థితికి మన చేసుకునే కర్మ కారణంగా ఉంటుందని అంటారు. స్థితిని రక్షించే విష్ణు స్వరూపమును ఆరాధించడం వలన, మన కర్మనుండి మనకు రక్షణ ఏర్పడుతుందని అంటారు.

జన్మించినది మన చేతుల్లో లేదు. స్థితి మనకు తెలియబడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో మనం మంచి పనులే చేస్తూ, స్థితిని కాపాడుకుంటూ ఉంటే, జీవితాంతంలో లభించే లయం సులభంగా ఉంటుందని అంటారు.

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం చదవడం అంటే, స్థితికారకుడిని మననం చేయడమే.

విష్ణు స్వరూపముగా శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటారు. శ్రీమహావిష్ణువు స్థితిని రక్షించడానికి అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. ఎప్పడైతే ధర్మమును హాని కలిగి, అధర్మము విచ్చలవిడిగా ప్రకృతిలో తాండవం చేస్తూ ఉంటుందో… అప్పుడు అధర్మపరులను శిక్షించడానికి, ధర్మపరులను రక్షించడానికి స్థితికారకుడు శ్రీమహావిష్ణువు అవతారం స్వీకరిస్తూ ఉంటాడు. అవతారం ప్రయోజనం సిద్దించగానే ప్రకృతి నుండి పరమాత్మ తన స్థితి స్వరూపమునకు చేరతాడని శాస్త్రాలు చెబుతాయి.

ఇలా శ్రీమహావిష్ణు అవతారములు స్వీకరించి, ఆ అవతారములను గూర్చి బ్రహ్మాది దేవతల చేత కీర్తిపంపబడడం జరుగుతుంది. అటుపై అవతార ప్రాశస్థ్యం గురించి మునులు ద్వారా మనకు గ్రంధస్తం చేయబడి ఉంటుంది. అలా మనకు శ్రీమహావిష్ణువు గురించి అవతారములు గురించి మనకు భాగవతంలో చెప్పబడి ఉంటుంది. ఇంకా విష్ణుపురాణములో విష్ణువు గురించి వశిష్ఠ మహర్షి పుత్రుడు శక్తి మహర్షి, ఆయన కుమారుడు పరాశర మహర్షి...

సందేహం ఇది మనిషి మనసులో మెదిలితే, ఆ మనిషిని మనసును ఒక్క కుదుపు కుదుపుతుంది. ఎటువంటి సందేహం కలిగితే, అటువంటి ప్రభావమునకు మనిషి గురయ్యేవరకు మనసు ఊరుకోదు. కాబట్టి మనసుకు సందేహాలు వలదని చెబుతారు. అయినను సందేహాలు వస్తూనే ఉంటాయి. మనకు పురాణ పుస్తకాలు చదివితే అర్ధం అయ్యేది ఒక్కటే. అదేమిటంటే ఆకాలంలో సందేహాలు వస్తే, అది దైవం గురించి మాత్రమే. అలా దైవం గురించి సందేహాం రావడం వలన, ఆ దైవం గురించి మనకు వారికి తెలియబడుతూ వారి జీవితాలు ధన్యమయ్యేవిగా పుస్తకాలు మనకు బోధిస్తాయి. వారి సందేహ నివృత్తి ఫలితమే మనకు పురాణ పుస్తకాలుగా ఉంటున్నాయి. ధన్యవాదాలు తెలుపుకుందాం మనం మన పూర్వులకు, పూర్వకాలంలో పురాణ మూర్తుల గురించే సందేహించి, మనకు అనేక పురాణ పుస్తకాలు రావడానికి కారణం అయ్యినందుకు….

పరాశర మహర్షి ప్రవచించిన ప్రవచనమే విష్ణుపురాణముగా మనకు గలదని చెబుతారు. మైత్రేయ మునిపుంగవునికి ‘ఇంద్రాది దేవతలకు ప్రభువు ఎవరు? జ్ఙానప్రదాత, వేదమయుడు, భువననిర్మాత, సమస్త లోకాలకు ఆధారభూతుడెవరు?’ లాంటి సందేహాలు కలిగాయి. ఇలాంటి సందేహాలను పరాశర మహర్షి ముందు మైత్రేయ ముని ఉంచడంతో… పరాశర మహర్షి, మైత్రేయునికి విష్ణు పురాణమును ప్రవచించినట్టుగా ఈ పుస్తకం చెబుతుంది.

శ్రీ మహా విష్ణువును గురించి తెలియజేసే పరాశర మహర్షి ప్రవచనము పుస్తకరూపంలో ఉంది. పిడిఎఫ్ రూపంలో మనకు తెలుగులోనే ఆన్ లైన్లో అందుబాటులో ఉంది. విష్ణు పురాణము తెలుగు పుస్తకం మీ చరవాణిలో ఉచితముగా చదవడానికి ఈ క్రింది బటన్ టచ్ లేక క్లిక్ చేయండి.

తెలుగురీడ్స్.కామ్ లో ఇంకా ఇతర పోస్టులు చదవడానికి ఈ క్రింది బటన్లను తాకండి లేక క్లిక్ చేయండి…..