అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన ఫలితం పొందనట్టు. అయితే బుక్ రీడింగ్ వలన ఆ బుక్ లో ఉన్న అంశంతో మనసు తాదాత్మకం చెందుతుంది. కానీ ఆ బుక్ విషయం మన జీవనతీరుకు దగ్గరగా లేకపోతే, మన జీవితంలో కొత్త విషయం చేరుతుంది. అయితే అలా చేరిన కొత్త విషయం జీవనలక్ష్యం చేరేదిగా ఉండాలంటారు.

ఏదైనా బుక్ రీడ్ చేసిన తర్వాత ఆబుక్ లోని అంశం మనలో మరో ఆలోచనలు మనకు కలిగిస్తాయి. ఏదైనా తెలుగు నవలను రీడ్ చేస్తే, ఆ నవలలోని పాత్రలు మన మనసులో ఊహించబడతాయి. ఆ నవలను ఎంతబాగా చదివి ఉంటే, అందులోని పాత్రలు అంత బలంగా మన మనసులో పాతుకుపోతాయి. ఇలానే ఇతర బుక్స్ రీడ్ చేస్తే, ఇతర అంశములు మనిషి మనసులోకి చేరతాయి. మనసుకు ఏమిస్తే, వాటిని మననం చేసి మనసు గుర్తుపెట్టుకుంటుంది, మరలా గుర్తకు తెస్తుంది.

ఎటువంటి బుక్స్ ఎక్కువగా చదివితే అటువంటి ఊహాశక్తి మనసులో

అక్షరజ్ఙానం ఉన్నవారు ఒక వయస్సుకు వచ్చే సమయానికి ఎన్నో కొన్ని తెలుగుబుక్స్ రీడ్ చేయడం జరిగి ఉండవచ్చును. భుక్తికోసం ఆదాయమార్గములను తెచ్చే విద్యలో బుక్స్ చదివి ఉండవచ్చును. ఇంకా యవ్యనంలో కోరికలను రెచ్చగొట్టే తెలుగుబుక్స్ చదివి ఉండవచ్చును. లేదా ఊహాత్మక శక్తిని పెంచే ఊహాత్మక సంఘటనలను అక్షరరూపంలో తెలియజేసే బుక్స్ చదివి ఉండవచ్చును. ఎటువంటి బుక్స్ ఎక్కువగా చదివితే అటువంటి ఊహాశక్తి మనసులో పెరుగుతుందంటారు. కానీ సమాజంలో ఎన్నో అంశములతో ముడిపడి ఉండి, మనచుట్టూ వివిధ రకాల మనస్తత్వాలతో వ్యక్తులు ఉంటారు. వారితో స్నేహాభావం వలన వారి వారి ద్వారా మన మనసులోకి మరిన్ని విషయాలు చేరవచ్చును.

ఇలా ఒక వ్యక్తి కొన్ని విషయాలో స్వతహా మనసులోకి తెచ్చుకుంటే, కొన్ని విషయాలు చుట్టుప్రక్కల వారి ద్వారానో… లేక సహవాసంతోనో కొత్త విషయాలు చేరతాయి. మంచి విషయాలు చేరితే, మంచి పరివర్తన ఉంటుంది. జీవితం మంచి చెడుల కలయిక కాబట్టి మంచి చెడులు సమజంలో కనబడుతూనే ఉంటాయి. సంఘజీవిగా మంచిగానో, చెడుగానో మనిషి ప్రభావితం అవుతూ ఉంటాడు. అయితే వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మూలం తనకు తానుగా ఏర్పరచుకునే విషయాలే అంటారు. కానీ వాటిని గుర్తెరగకుండా తన సమస్యలకు కారణం ఇతరులుగానో లేక ఇతరులతో పోల్చుకునేవిధంగానో వ్యక్తి ఆలోచనలు సాగవచ్చని అంటారు.

అనేక ఆలోచనలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పోరాటం చేసే వ్యక్తికి మానసిక పరివర్తన అవసరం అయితే మాత్రం మంచి విషయాలతో కూడిన బుక్స్ చదవడం అవసరం అంటారు. అయితే అనేక విషయాలతో కూడి ఉండే మనసు ఏదో ఒక బుక్ రీడింగుతోనే మార్పును పొందకపోవచ్చును. అనేక బుక్స్ రీడ్ చేయడంతో మార్పుకు మనసు మరలవచ్చును. అయితే అంతర్గత ఆలోచనను కలిగి ఉండే ఒక్కొక్కరికి ఏదైన ఒక మంచి బుక్ మంచి మార్పును వెంటనే కలుగజేయవచ్చును. కానీ అనేక బుక్స్ సారం గురువుల మాటలలో లభిస్తే, ఆ మాటలే మనసులో మార్పును తీసుకువస్తాయి. గురి కుదిరితే గురువుల మాటలు మనసులో బలంగా పాతుకుపోతాయి అంటారు.

సద్గురు మాటలు వినడంతో మనసు మొదటగా శాంతిని పొందడం ప్రారంభిస్తుంది. శాంతించిన మనసు మరింత పదునుగా ఆలోచన చేయగలుగుతందంటారు. మనసుకు మనసే బలమంటారు. మనసుకు మనసే బలహీనమంటారు. అటువంటి మనసు యొక్క బలాలు – బలహీనతలు గుర్తెరగడానికి గురువుల మాటలే మంత్రాలంటారు. మాటలు వినడానికి, గురువును చూస్తూ సద్గురువు మాటలను వినడానికి సద్గురు తెలుగు యూట్యూబ్ చానల్ మనకు ఉంది. సద్గురు మాటలను మనసు గ్రహించగలిగితే, ఆ మాటలతో మనసు ఆలోచనను పొందితే, వ్యక్తిలో కొత్తదనం కలుగుతుంది. ముఖ్యంగా జీవిత పరమార్ధం అవగతమవుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్